మొత్తం పేజీ వీక్షణలు

15, మే 2022, ఆదివారం

Telugu Bakthi Slokas - with meanings - Dashasamodhyayam - bagavadgeetha - Bhagavan srikrishna preechings

 ఓం పరమాత్మనే నమః !

అథ దశమో-ధ్యాయః

విభూతి యోగః

శ్రీ భగవాన్‌ ఉవాచ

భూయ ఏవ మహాబాహో శ ృణు మే పరమం వచః

యత్తే2హంప్రేయమాణాయ వక్ష్యామి హితకామ్యయా 1

శ్రీ భగవానుడు పలికెను - హే! మహాబాహో! నీవు నా మీద ప్రేమ గలవాడవు.కావున నీ మేలు గోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితులు, (1)

నమే విదుః సురగణాః ప్రభవంన మహరయః

అహమాదిర్షిదేవానాం మహరీణాం చ సర్వశః 2

నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని, మహర్షులు గాని తెలిసికొనజాలరు. ఏలనన, నేను అన్ని విధములుగా ఆ దేవతలకును, ఈ మహర్షులకును మూలకారణమైన వాడను. (2)

యో మామజమనాదించవేత్తిలోకమహేశ్వరమ్‌

అసమూఢఃసమర్యేషు సర్వపాపై ప్రముచ్యతే 3

నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదిjైున వానినిగను సకల లోక్ష మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండియు విముక్తుడగును. (3)

బుద్ధిర్‌ జ్ఞానసమ్మోహః క్షమా సత్యం దమః శమః

సుఖం దుఃఖం భవో2భావో భయం చా భయమేవచ 4

అహింసా సమతా తుష్టిః తపోదానం యశో2యశః

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 5

నిశ్చయాత్మకశక్తి, యధార్థ జ్ఞానము, మోహ రాహిత్యము, క్షమ, సత్యము, దమము (ఇంద్రియ నిగ్రహము), శమము (మనోనిగ్రహము), సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు, ఇవి యన్నియును నా వలననే కలుగును. (4-5)

మహర్షయః సప్తపూర్వే చత్వారోమనవస్తథా

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః 6

సప్త మహర్షులును, వారి కంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును, స్వాయంభువాది చతుర్ధశ మనువులును మొదలగు వీరందను నా భక్తులే. అందరూ నా యెడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తు నందలి సమస్త ప్రాణులును వీరి సంతానమే. (6)

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః

సో2వికంపేన యోగేన యుజ్యతేనాత్ర సంశయః 7

ఈ నాపరమైశ్వర్యరూప విభూతిని,యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఏ మాత్రమూ సందేహమే లేదు (7)

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే

ఇతి మత్వాభజంతే మాం బుధా భావసమన్వితాః 8

ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూలకారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తిశ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. (8)

మచిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్‌

కథయంతశ్చమాం నిత్యం తుష్యంతి చరమంతి చ 9

నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నా యందే రమించు చుందురు. (9)

తేషాం సతత యుక్తానాం భజతాంప్రీతిపూర్వకమ్‌

దదామి బుద్దియోగంతం యేనమాముపయాంతితే 10

అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నా యందే లగ్నమనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నేభజించువారికి నేను బుద్ధి యోగమును అనగా తత్త్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. (10)

తేషామేవాను కం పార్ధమ్‌ అహమజ్ఞానజం తమః

నాశయామ్యాత్మ భావస్థోజ్ఞానదీపేన భాస్వతా 11

ఓ అర్జునా! వారి యంతఃకరణముల యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞాన రూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. (11)

అర్జున ఉవాచ:

పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్‌

పరుషం శాశ్వతం దివ్యమ్‌ ఆదిదేవమజం విభుమ్‌ 12

ఆహుస్త్వామ్‌ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా

అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే 13

అర్జునుడు పలికెను - నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు, స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగనే తెలుపు చున్నావు. (12-13)

సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసికేశవ

నహితే భగవన్‌ వ్యక్తిం విదుర్దేవా న దానవాః 14

ఓ కేశవా! నీవు చెప్పనది అంతయును సత్యమే. హే భగవాన్‌! నీ లీలా మయ స్వరూపమును దేవతలు గాని, దానవులు గాని తెలిసికొనజాలరు. (14)

స్వయమేవాత్మనాత్మానంవేత్తత్వం పురుషోత్తమ

భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే 15

ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేశా! ఓ దేవాదిదేవా! ఓ జగనాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎరుగుదువు (15)

వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత విభూతయః

యాభిర్విభూతిభిర్లోకాన్‌ ఇమాంస్త్వం వ్యాప్తతిష్ఠసి 16

సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెల్పుటకు నీవే సమర్థుడవు (16)

కథం విద్యామహం యోగిన్త్వాంసదా పరిచింతయన్‌ 

కేషుకేషు చ భావేషు చింత్యో2సి భగవన్మయా 17

ఓ యోగీశ్వరా! నిరంతరము చింతన చేయుచూ నిన్ను ఏవిధముగా తెలిసి

కొనగలను? హే భగవన్‌ ఏయే భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? (17)

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన

భూయః కథయ తృప్తిర్హిశృణ్వతో నాస్తిమే2మృతమ్‌ 18

ఓ జనార్దనా! నీ యోగశక్తిని గూర్చియూ, నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన, నీ అమృత మయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. (18)

శ్రీ భగవాన్‌ ఉవాచ:

హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్యమే 19

శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి (వ్యాప్తికి) అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. (19)

అహమాత్మగుడాకేశ సర్వభూతాశయస్థితః

అహమాదిశ్చ మధ్యం చభూతానామంత ఏవ చ 20

ఓ అర్జునా! సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల (ప్రాణుల) ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే. (ప్రాణుల యొక్క సృష్టిస్థితిలయములకు కారణము నేనే) (20)

ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్‌

మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ 21

అదితియొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విషు?వును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని ‘తేజమును నేను. నక్షత్రాధిపతిjైున చంద్రుడను నేను, (21)

వేదానాం సామవేదో2స్మిదేవానామస్కివాసవః

ఇంద్రియాణాం మనశ్చాస్మిభూతానామస్మిచేతనా 22

వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును (ప్రాణశక్తిని) నేను. (22)

రుద్రాణాం శంకరశాస్మివిత్తేశో యక్షరక్షసామ్‌

వసూనాం పావకశ్చాస్మిమేరుః శిఖరిణామహమ్‌   23

ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. యక్షరాక్షసులలో ధనాధిపతిjైున కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమును నేను. (23)

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ధ బృహస్పతిమ్‌

సేనానీనామహం స్కందః సరసామస్మిసాగరః 24

పార్ధా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను. (24)

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్‌

యజ్ఞానాం జపయజ్ఞో2స్మిస్థావరాణాం హిమాలయః 25

మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును యజ్ఞముల యందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. (25)

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః

గంధర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః 26

వృక్షములలో నేను అశ్వత్థమును (రావిచెట్టును) దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలమునిని. (26)

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్‌

ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్‌ 27

అశ్వములలో పాల సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రజగములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను. (27)

128 -

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మికామధుక్‌ 

ప్రజనశ్చాస్మికందర్పఃసర్పాణామస్మివాసుకిః 28

ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడి ఆవులలో కామధేనువును నేను. శాస్త్ర విహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములలో వాసుకిని నేను. (28)

అనంతశ్చాస్మినాగానాం వరుణో యాదసామహమ్‌

పితృణామర్యమా చాస్మియమఃసంయమతా మహమ్‌ 29

నాగజాతివారిలో ఆదిశేషుడ (అనంతుడ)ను నేను. జలచరములకు అధిపతిjైున వరుణుడను నేను. పితరులలో అర్యముడను (పితృగణప్రభువును) నేను శాసకులతో యమధర్మరాజును నేను. (29)

ప్రహ్లాదశ్చాస్మిదైత్యానాంకాలఃకలయతామహమ్‌

మృగాణాంచమృగేంద్రో2హం వైనతేయశ్చపక్షిణామ్‌ 30

దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులలో) నేను కాలమును మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే (30)

పవనఃపవతామస్మిరామః శస్త్రభృతామహమ్‌

రaషాణాం మకరశ్చాస్మిస్రోతసామస్మిజాహ్నవీ 31

పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను. శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. (31)

సర్గాణామాదిరంతశ్చమధ్యం చైవాహమర్జున

అధ్యాత్మవిద్యావిద్యానాం వాదఃప్రవదతామహమ్‌ 32

ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను. (సృష్టి స్థితి లయ కారకుడను నేనే) విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను. పరస్పర వాద వివాదములలో తత్త్వ నిర్ణయమునకై చేయు ‘వాదము’ను నేను. (32)

అక్షరాణామకారో2స్మిద్వంద్వఃసామాసికస్య చ

అహమేవాక్షయఃకాలోధాతాహం విశ్వతోముఖః 33

అక్షరములలో ‘అ’కారమును నేను. సమాసములలో ‘ద్వంద్వ’ సమాసమును నేను. అక్షయ కాలము అనగా మహాకాలమును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్‌ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.(88)

మృత్యుః సర్వహరశ్చాహమ్‌ ఉద్భవశ్చభవిష్యతామ్‌

కీర్తిః శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా 34

అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల  ఉత్పత్తి హేతువనఅును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందను నేనే. (34)

బృహత్పామతథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌

మాసానాం మార్గశీర్షో2హమ్‌ ఋతూనాం కుసుమాకరః 35

గానము చేయుటకు అనువైన శ్రుతులలో బృహతామమును నేను. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను. మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే (35)

ద్యూతం చలయతామస్మితేజస్తేజస్వినామహమ్‌

జయో2స్మి వ్యవసాయో2స్మిసత్త్వం సత్త్వవతామహమ్‌ 36

వంచకులలో జూదమును నేనే. ప్రభావశాలురలోని ప్రభావమునునేను. విజేతలలో జయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్త్విక పురుషులలో సాత్త్విక భావమును నేనే. (36)

వృష్ణీనాం వాసుదేవో2స్మిపాండవానాం ధనంజయః

మునీనామప్యహం వ్యాసఃకవీనామశనా కవిః 37

వృష్టి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడనునేను. కవులలో శుక్రాచార్యుడను నేనే.

దండోదమయతామస్మినీతిరసిజిగీషతామ్‌

మౌనం చైవాస్మిగుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్‌ 38

శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చ కలవారి నీతిని నేనే. గోప్య విషయరక్షణమున ‘మౌనము’ ను నేను. జ్ఞానుల యొక్క తత్త్వజ్ఞానమును నేనే. (38)

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున

న తదస్తి వినాయత్స్యాత్మయా భూతం చరాచరమ్‌ 39

ఓ అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచరప్రాణి యేదియును లేదు. (39)

నాంతో2 స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప

ఏషతూద్దేశతఃప్రోక్తోవిభూతేర్విస్తరోమయా 40

ఓ పరంతపా! నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్త ృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. (40)

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా

తత్తదేవావగచ్ఛత్వం మమతేజో2ంశసంభవమ్‌ 41

విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సు యొక్కఅంశము నుండియే కలిగినదిగా తెలిసికొనుము. (41)

అథవా బహునైతేన కిం జ్ఞాతేనతవార్డున

విష్టభ్యాహమిదం కృత్స్నమ్‌ ఏకాంశేన స్థితో జగత్‌ 42

అథవా! ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను.

ఓం తత్పదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

విభూతి యోగో నామ దశమో2ధ్యాయః 10

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి