ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ ఏకాదశో2ధ్యాయః
విశ్వరూప సందర్శన యోగ
అర్జున ఉవాచ
మదనుగ్రహాయపరమం గుహ్యమధ్యాత్యసంజ్ఞతమ్
యత్త్వయోక్తం వచస్తేన మోహా2యం విగతో మమ 1
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము (మోహము) తొలగిపోయినది. (1)
భవాప్యయౌహి భూతానాం శ్రుతౌ విస్తరతో మయా
త్వత్తః కమలపత్రాక్షమాహాత్మ్యమపి చావ్యయమ్ 2
ఓ కమలాక్షా! ఓ కృష్ణా! సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. (2)
ఏవమేతద్యథాత్థత్వమ్ ఆత్మానం పరమేశ్వర
ద్రష్టుమిచ్ఛామితే రూపమ్ ఐశ్వరం పురుషోత్తమ 3
ఓపరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య శక్తి బల, వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైౖశ్వర్య సంపన్నరూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహల పడుచున్నాను. (3)
మన్యసే యదితచక్యం మయాద్రష్టుమితి ప్రభో
యోగేశ్వరతతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ 4
ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. (4)
తతః స విస్మయావిష్టోహృష్టరోమా ధనంజయః
ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత 14
అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్) రూపమునకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడిరచి యిట్లు పలికెను.(14)
అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్ ఋషీంశ్చసర్వానురగాంశ్చ దివ్యాన్
15
అర్జునుడు పలికెను - ఓ దేవాదిదేవా! నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. (15)
అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో2నంతరూపమ్
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప
16
ఓ విశ్వేశ్వరా విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లచున్నది. నీవు ఆది మధ్యాంత రహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను. (16)
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్
పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్
17
హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యని వలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమై యున్నది. (17)
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్యవిశ్వస్యపరం నిధానమ్
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తాసనాతనస్త్వం పురుషో మతో మే 18
పరమ - అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. (18)
అనాదిమధ్యాంతమనంతవీర్యమ్ అనంతబాహుం శశిసూర్యనేత్రమ్
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్
19
నీవు ఆది మధ్యాంతరహితుడవు. అపరిమిత శక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్ని వలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్త మొనర్చు చున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. (19)
ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వjైుకేన దిశశ్చసర్వాః
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదంలోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ 20
ఓ మహాత్మా! దివి నుండి భువి వరకు గల అంతరిక్షము నందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములును గడగడ లాడుచున్నవి. (20)
అమీ హిత్వాంసురసంఘూ విశంతి కేచిద్భీతాఃప్రాంజలయో గృణంతి
స్వస్తీత్యుక్త్వామహర్షిసిద్ధసంఘాఃస్తువంతిత్వాంస్తుతిభిఃపుష్కలాభి: 21
ఇదిగో, ఆ దేవతలెల్లరును నీలో ప్రవేశించు చున్నారు. కొందరు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తి వచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములు తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. (21)
రుద్రాదిత్యావసవో యే చసాధ్యావిశ్వే2శ్వినౌ మరుతశ్చోషపాశ్చ
గంధర్వ యక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే 22
ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులను, సాధ్యులును, విశ్వే దేవతలును, అశ్వినీ కుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. (22)
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్
బహూదరం బహుదంప్త్రాకరాళం దృష్ట్వాలోకాఃప్రవ్యధితాస్త్రథాహమ్ 23
హే మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు (తొడ)లను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందరును భయకంపితులగు చున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. (23)
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననందీప్త విశాలనేత్రమ్
ధృష్ట్వా హిత్వాం ప్రవ్యధితాంతరాత్మాధృతిం న విందామి
శమం చవిష్ణో 24
ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది. (24)
దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవకాలానలసన్నిభాని
దిశోన జానే నలభేచ శర్మప్రసీద దేవేశ జగన్నివాస 25
ఓ జగన్నివాసా! కరాళ దంష్ట్రలతో (భయంకరములైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతి గొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్మ (25)
అమీచత్వాంధృతరాష్ట్రస్యపుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః
భీష్మోద్రోణఃసూతపుత్రస్తధాసా సహాస్మదీjైురపియోధముఖ్యైః 26
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని
కేచిద్విలగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః 27
ఇదిగో (ఇచ్చట చేరియన్న ఈ ధ ృతరాష్ట్ర పుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షము నందలి ప్రధాన యోధులు అందరును భయంకరములైన కోరలతో గూడిన నీ ముఖముల యందు అతి వేగముగా పరుగులు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందటి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గై పోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. (26-27)
యథా నదీనాం బహవో2ంబువేగాఃసముద్రమేవాభిముఖా ద్రవంతి
తధాతవామీనరలోకవీరాఃవిశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి 28
అనేకములైన నదీనదముల ప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్టులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడా జ్వలించుచున్న నీ ముఖముల యందు ప్రవేశించుచున్నారు. (28)
యథాప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః
తథైవనాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్దవేగాః 29
మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్ని వైపు అతి వేగముగా పరుగెత్తి, తమ నాశనము కొరకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందలును తమ నాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రముల యందు ప్రవేశించుచున్నారు, (29)
లేవిహ్యసేగ్రసమానఃసమంతాత్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః
తేజో2భిరాపూర్యజగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో 30
హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపుల నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. (30)
ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమో2స్తుతే దేవవరప్రసీద
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి
తవ ప్రవృత్తిమ్ 31
ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొన గోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరుగలేకున్నాను. (31)
శ్రీ భగవాన్ ఉవాచ
కాలో2స్మిలోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహప్రవృత్తః
ఋతే2పిత్వాంన భవిష్యంతి సర్వే యే2వస్థితాః ప్రత్యనీకేషుయోధాః
32
శ్రీ భగవానుడు పలికెను - నేను లోకముల నన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని యున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు. (మిగిలియుండరు) (32)
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వజిత్వాశత్రూన్ భుంక్ష్యరాజ్యం సమృద్ధమ్
మjైువైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ 33
కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము. కీర్తి గాంచుము. శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరును నా చేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. (33)
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యనపి యోధవీరాన్
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా?
యుధ్యస్వజేతాసి రణేసపత్నాన్ 34
ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రధ (సైంధవ) కర్ణాది యుద్ధ వీరులందరిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము.
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వావచనం కేశవస్యకృతాంజలిర్వేపమానఃకిరీటీ
నమస్క ృత్వాభూయ ఏవాహ కృష్ణం సగద్దదం
భీతభీతః ప్రణమ్య 35
సంజయుడు పలికెను - ఓ రాజా! శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడిరచి నమస్కరించును. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. (35)
అర్జున ఉవాచ
స్థానే హృషీకేశతవ ప్రకీర్త్యాజగత్ప్రహ్యష్యత్యనురజ్యతే చ
రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వేనమస్యంతి చ సిద్ధ సంఘాః
36
అర్జునుడు పలికెను - ఓ అంతర్యామీ! కేశవా! నీ నామ గుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధ గణముల వారెల్లరును ప్రణమిల్లుచున్నారు. (36)
కస్మాచ్చ తేననమేరన్మహాతన్గరీయసే బ్రహ్మదో2ప్యాదికర్త్రే
అనంతదేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్ తత్పరం యత్ 37
ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తjైున బ్రహ్మకే మూలకారకుడవు - కనుక వారు (సిద్ధాదులందలరును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్-అసత్‌లు నీవే. వాటికంటెను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. (37)
త్వమాదిదేవఃపురుషఃపురాణః త్వమస్య విశ్వస్వపరం నిధానమ్
వేత్తాసి వేద్యంచ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప
38
ఓ అనంతరూపా! నీవు ఆది దేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమై యున్నది. (38)
వాయుర్యమో2గ్నిర్వరుణ శ్వశాంకఃప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ
నమో నమస్తే2స్తుసహస్రకృత్వఃపునశ్చభూయో2పినమోనమస్తే 39
నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతిjైున బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు. మరల మరల నమస్కారములు. ఇంకను నమస్కారములు. (39)
నమఃపురస్తాదథ పృష్ఠతస్తే నమో2స్తుతే సర్వత ఏవ సర్వ
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషితతో2సిసర్వః 40
అనంత సామర్థ్యము గలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపుల నుండియు నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి యున్నవాడవు. అన్ని రూపములను నీవియే. (40)
సఖేతి మత్వాప్రసభం యదుక్తం హే కృష్ణ! హే యాదవ హేసఖేతి
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి
41
యచ్ఛాపహాసార్థమసత్క ృతో2సి విహార శయ్యాసన భోజనేషు
ఏకో2థవాప్యచ్యుత తత్సమక్షం తత్‌క్షామయే త్వామహమప్రమేయమ్
42
నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచే గాని, పొరపాటు వలన గాని, ఓ క ృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుతా విహార శయ్యాసన భోజనాది సమయముల యందును ఏకాంతమున గాని, అన్య సఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపరచి యుండవచ్చును. ఓ అప్రమేయ స్వరూపా! నా అపరాధముల నన్నింటిని క్షమింపుమనివేడుకొనుచున్నాను. (41-42)
యదా సత్త్వే ప్రవృద్దేతు ప్రలయం యాతి దేహభ ృత్
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే 14
సత్త్వగుణము వ ృద్ధి చెందినపుడు మనుజుడు మరణించినచో, అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొండును. (14)
రజసిప్రలయంగత్వాకర్మసంగీషు జాయతే
తథా ప్రలీనస్తమసిమూఢయోనిషు జాయతే 15
రజోగుణము వృద్ధి చెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పడు
మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచయోనులలో జన్మించు చుండును. (15)
కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలమ్
రజసస్తుఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ 16
శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుట వలన సాత్త్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు ఫలము అజ్ఞానము. (16)
సత్త్వాత్ సంజాయతేజ్ఞానం రజసో లోభఏవచ
ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ 17
సత్త్వగుణముల వలన జ్ఞానమూ, రజోగుణము వలన లోభమూ తమో గుణము వలన ప్రమాద మోహాదులూ, అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. (17)
ఊర్ధ్వం గఛ్ఛంతి సత్త్వస్థామధ్యేతిష్ఠంతి రాజసాః
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః 18
సత్త్వ గుణస్థితులు స్వర్గాది - ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన (రాజస) పురుషులు మధ్య (మానవ) లోకము నందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదుల యందు స్థితులైనవారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనులను, నరకములను పొందుదురు. (18)
నాన్యం గుణేభ్యః కర్తారం యదాద్రష్టానుపశ్యతి
గుణేభ్యశ్చపరం వేత్తి మద్భావం సో2ధిగచ్ఛతి 19
ద్రష్టమైనవాడు గుణములే గుణముల యందు వర్తించుచున్నవనియూ, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగా నున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును (19)
గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహసముద్దవాన్
జన్మమృత్యుజరాదుఃఖైకి విముక్తో2మృతమశ్ముతే 20
దేహోత్పత్తికి కారణరూపులైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా (వార్థక్య), దుఃఖములనుండి విముక్తుడై పరమానందమును పొందును. (20)
అర్జున ఉవాచ
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే 21
అర్జునుడు పలికెను - ఓ ప్రభూ! ఈ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? (21)
శ్రీ భగవాన్ ఉవాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవచ పాండవ
న ద్వేష్టి సంప్రవృత్తాని న నిపృత్తాని కాంక్షతి 22
శ్రీ భగవానుడు పలికెను ` ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్య రూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే అర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు ` అనగా వాటిని గోర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పడు వాటికై కాంక్షపడడు - అనగా ఎల్లప్పుడును ఒకే స్థితిలో నుండును. (22)
ఉదాసీనవదాసీనో గుణైౖర్యో న విచాల్యతే
గుణావర్తంత ఇత్యేవ యో2 వతిష్ఠతినేంగతే 23
త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, ఉదాసీనుని వలె (సాక్షి వలె) ఉండును. గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితి ఎన్నడును చలింపడు. (23)
సమదుఃఖసుఖఃస్వస్థః సమలోష్టాశ్మకాంచనః
తుల్యప్రియాప్రియోధీరఃతుల్యనిదాత్మసంస్తుతిః 24
త్రిగుణాతీతుడు స్సస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడిరటియందును గ్రాహ్యత్యాజ్యభావములను కలిగియుండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని, నిందాస్తులకు గాని తొణకడు. అనగా రెండిరటియందును సమస్థితిలోనే యుండును.
(24)
మానావమానయోస్తుల్యఃతుల్యోమిత్రారిపక్షయో
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః ఉచ్యతే 25
మానావమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించు వాడును, విధ్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. (25)
మాం చయో2వ్యభిచారేణ భక్తియోగేనసేవతే
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయకల్పతే 26
అనన్య (నిర్మలమైన) భక్తి యోగము ధ్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. (26)
బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ 27
ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును, అమృతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండానందమునకును నేనే ఆధారము. (27)
ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
గుణత్రయవిభాగ యోగో నామ చతుర్దశో2ధ్యాయః 14
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి