మొత్తం పేజీ వీక్షణలు

25, ఆగస్టు 2025, సోమవారం

దేవర్షి నారదుని పూర్వజన్మ వృత్తాంతం

అహస్యాం ఋషయస్సర్వే దేవర్షిర్నారధస్తదా 

అసితో దేవలో వ్యాసః స్వయం చైవబ్రవషిచే (10-13) 

ఓ కృష్ణా! నీవిట్టివాడవని సమస్తమైన ఋషులు, దేవర్షియగు నారదుడు, అసితుడు, అతని తండ్రిjైున దేవలుడు మరియు వ్యాసుడు చెప్పుఅందురు. ఇప్పుడు నీవే నాకు స్వయంగా చెబుతున్నావు అంటాడు. దీన్నిబట్టి శ్రీకృష్ణుని యొక్క తత్వం సంపూర్ణంగా తెలిసినవారిలో ఋషుల తర్వాత నారదుడే మొదటివాడని తెలుస్తుంది. కనుక అతడు దేవర్షిగా మారడానికి కారణం ఈవిధంగా ఉంది. ఇతని పూర్వజన్మ వృత్తాంతం మనకు ఆంధ్రభాగవతంలోని ప్రథమస్కంధంలో వస్తుంది.(చూ.103-128) 

మొదటి జన్మలో అతడొక బ్రాహ్మణుని యింటి దాసీ పుత్రుడు. ఒకపుడా గ్రామానికి  కొందరు యోగులు వచ్చి ఆ బ్రాహ్మణునితో ‘‘అయ్యా మేమీపర్యాయం చాతుర్మాస్యాలు మీ గ్రామంలో జరుపుకొనవలెననుకొంటున్నాం. మాకు తగిన ఏర్పాట్లు చేయండనగా’’ ఆయన వారికాగ్రామంలో గల ఆలయంలో తగిన ఏర్పాట్లు చేసినాడు. అప్పుడు వారు మాకీ నాలుగు నెలలు చేతిక్రిందికి ఒక పిల్లవానిని కూడా ఈయండి అని కోరినారు. అందుకిa బ్రాహ్మణుడు ఎవరో ఎందుకని తమయింటిపని చేసే దాసీ కుమారునే వారి సేవకు నియోగించినాడు.

ఆ పిల్లవాడిక యోగుల దగ్గరకు వచ్చినాడు. దినదినం వారి గదిని శుభ్రం చేయటం, వారేదైనా అడిగినప్పుడు తెచ్చి ఇయ్యటం, వేళకు వారు పెట్టింది తినడం, ఆ తర్వాత వారు పరస్పరం భగవంతుని లీలలు, కథలు చెప్పుకుంటూ ఉంటే వాటిని వింటూ కూర్చోవడం అతనికి అస్తమానం ఇదే పని.

సజ్జీవనం కోరే వారికి సదాహారం సత్సంగపఠనం లేదా సచ్చశ్రవనం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం చేతనే ఈ శరీరం మరియు మనస్సు రూపొందుతుంది కాబట్టి వానిపై ఆహారప్రభావం ఎంతగానో ఉంటుంది.

ప్రతి మనిషికి దేహం, మనస్సు అనే రెండూ ఉంటవి. మనస్సు అనగా తనలోని మురోమనిషి అన్నమాట. కాబట్టి మనం తినే ఆహార పానీయలు పైకి కనిపించే ఈ దేహాన్ని పోషిస్తుండగా మనం వినే విషయాలు, కనే దృశ్యాలు మన మనస్సును  పోషిస్తుంటవి. అందుచేత మనం తీసుకునే ఆహారపానీయాలు పరిశుభ్రం మరియు సాత్వికమైనవి అయి ఉండవలె. అదే విధంగా మనం చదివే విషయాలు గాని, వినే  విషయాలుగాని, చూచే దృశ్యాలు గాని మనోహరమై నీతిదాయకమై ఉండవలె. 

ఆహారం వలె దాన్ని తయారు చేసేవారి ప్రవర్తన ప్రభావం కూడా దాన్ని తినేవారిపై ఉంటుంది. ఒకప్పుడు గాంధీగారు చెరలో ఉండగా ఆయన ఆహారం కొరకు దానిలో ఉండే మరో ఖైదీనే అక్కడి చెరసాల వారే ఏర్పాటు చేసినారట.అయితే అతడు వండిన ఆహారం తిన్న మొదటినాడే గాంధీగారికి ఏవో హత్యలతో, దుర్మార్గాలతో కూడిన స్వప్నాలు కలిగి ప్రశాంతమైన నిద్ర పట్టలేదట. అందుకు మరునాడాయన నేను తీసుకున్నది సాత్వికాహారమే గదా! రాత్రి నాకిట్లా భయంకర స్వప్నాలు ఎందుకు కలిగినవని వంటకేర్పరచిన వ్యక్తిని గురించి దర్యాప్తు చేయించగా అతడొక హత్య చేసి ఆ చెరసాలలో పడినట్లు తేలింది. అప్పుడు గాంధీ గారతనిని మార్పించి మరో వంటమనిషిని ఏర్పాటు చేయించుకున్నాడట. ఇటువంటి ఆహారం యొక్క ఉదాహరణలు రామకృష్ణపరమహంస మొదలైన మహాత్ములెందరి జీవితాలలోనూ ఉన్నవి.

ఒక పర్యాయం లక్ష్మణయతీంద్రుల దగ్గరకు ఒక యిల్లాలు వచ్చి ‘‘స్వామీ నా పతి  నన్ను చాలా బాధిస్తున్నాడు. నేను భరించలేకుండా ఉన్నాను. మీరు నాకేదైనా తరుణోపాయం  చెప్పండి. లేకుంటే నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అని ప్రార్థించిందట.  అప్పుడాయన ఆమెతో ‘‘తల్లీ నీ మస్యకు ఆ శ్రీకృష్ణ నామస్మరణం తప్ప ఆత్మహత్య పరిష్కారం గాదని’’ తెలిపి ఆమెకు కృష్ణమంత్రం ఉపదేశించి ‘‘దీన్ని నీవు నీ పతికి పలహారం చస్తున్నా, అన్నం వండుతున్నా, పదార్థం చేతికి తీసుకున్నది మొదలు అవి వండి వడ్డించి అతడు తినేవరకు మనస్సులో జపిస్తూ ఉండు అని చెప్పి పంపించినాడట. 

ఆమెభర్త ఒక కాంట్రాక్టరు. ఆయన అపుడపుడు ఎనిమిది పదిదినాలు వర్కు చూడటానికి వెళ్లేవాడట. ఆదినాలలో ఇంటిలో ఏమున్నది ఏమి లేదని విచారించకుండా నిర్లక్ష్యంగా వెళూవుండేవాడట. పాపం ఆదినాలలో ఆ యిల్లాలెట్లాగో యింటిని గడుపుకునే దట. ఆ తర్వాత లక్ష్మణదేశికుల ఉపదేశంతో ఇక కృష్ణనామజపం ప్రారంభించి                        ఉదయం టిఫిన్‌కొరకు పూరీలకు పిండితీసికున్నప్పటినుండ, అన్నంకొరకు చేటలో బియ్యం పోసుకున్నప్పటినుండి, కృష్ణస్మరణం ప్రారంభించి ఆయన తిని లేచివెళ్ళేటంతవరకు, అదేవిధంగా కాఫీకలిపి ఇచ్చేటప్పుడుకూడా చేసేదట.

ఆ విధంగా రెండునెలలు జరుగగానే అప్పుడతనిలో అద్భుతమైన మార్పుజరిగి ఆమెను బాధించే బదులు ఎంతో ప్రేమగాచూడటం తాను వర్క్‌పై వెళ్ళేటప్పుడు ఇంటిలోనికి కావలసినవన్ని తెచ్చియిచ్చి వెళ్తూ ఉండటం, అంతేకాక తాను వెళ్ళినచోట ఏవైనా మంచి చీరలు కనిపించినపుడు ఆమెకొరకు తేవటంగూడ జరిగిందట. అందుచేతనే ప్రాచీనులు మన స్త్రీలకు స్నానంచేసి మడికట్టుకొని వంటచేయవలెననే నియమమేర్పరచినారు.

వంటచేసేవారివలెనే దాన్ని ఉచ్చిష్టంచేసేవారి ప్రభావంగూడ తక్కినవారిపై                    ఉంటుంది. ఉచ్చిష్టమంటే కేవలం ఎంగిలి మాత్రమేకాదు. పాత్రలో వండిన అన్నం మొదట ఎవరుతినగా యిక మిగిలిందంతా వారివారి ఉచ్చిష్టంక్రిందనే లెక్క. పెద్దవారి ఉచ్ఛిష్ఠం చిన్నవారు తినవచ్చుగాని చిన్నవారిది పెద్దవారు తినరాదు. ఇది ఉచ్చిష్ఠనియమం. అందుచేత పూర్వం అవిభక్తకుటుంబాలలో అన్నం వండినపిమ్మట దానిలో చిన్నపిల్లలకొరకు మాత్రం ఇంత వేరేపాత్రలోతీసివుంచి తక్కినదాన్ని ఆ యింటి యజమానికి వడ్డించిన పిమ్మటనే తక్కినవారు తినేవారుకాని అంతవరకు ముట్టేవారుకాదు. 

అలాగే ఆ కాలంలో వేళతప్పివచ్చిన అతిథికని వేరుగా ఒక చిన్నపాత్రలో వండి దాన్ని వాయకట్ట అలాగేవుంచి వేళమీరివచ్చినవారికి దాన్ని వడ్డించేవారుకాని, తాము తినగా మిగిలినది పెట్టకపోయేవారు. వేళమారి ఎవరూరానపుడు వారికొరకు వండిరది రాత్రికి తాముపయోగించుకునేవారు. మళ్ళీరాత్రికికూడా అంతే వారికొరకు వండిరచ వలసిందే. లేకుంటే తాము తిన్నతర్వాత వచ్చిన అతిథిóకి ఏదైనా ఫలహారం చేసిపెట్టేవారు కాని తాముతినగా మిగిలిన అన్నం పెట్టేవారుకాదు. కాని ఈనాడు మనయొక్క ఈ ప్రాచీనసంప్రదాయం పూర్తిగా అడుగంటింది.

ఇదిగాక వ్యక్తులు తిని విడిపించి ప్రత్యక్షమైన ఉచ్చిష్టమవుతుంది. అదియింకా ప్రభావశీలంగా ఉంటుంది. తెలుగుసాహిత్య విద్యార్థులెవరైనా వేటూరి ప్రభాకరశాస్త్రి గారిని ఎరుగకుండా ఉండరు. ఆయన నడివయస్సులో తీవ్రమైన అజీర్ణవ్యాధికి ఎన్ని మందులుతిన్నా గుణం కాలేదట. అన్నం ఏ మాత్రం తినలేకపోయేవాడట. ఆదశలో ఎవరో ఆయనతో మాస్టర్‌ సి.వి.వి.గారి ఉదంతంచెప్పగా వారి దర్శనార్ధమై విశాఖ పట్టణం వెళ్ళినాడట. మనం మహాత్ములదగ్గరకు వెళ్ళినపుడు ఏ నిమిత్తంగా వారిదగ్గరకు వెళ్ళినామో ! మనకుగల లోటేమిటో మనం చెప్పకుండానే వారికితెలిసిపోతుంది.

ప్రభాకరశాస్త్రి గారాయనను దర్శించి నమస్కరించగానే పలకరించి కూర్చోబెట్టి ఒకవ్యక్తిని పిలిచి బజారునుండి యిడ్లీ తెప్పించి దానిలో ఒకటి తానుతిని మిగతాది శాస్త్రిగారికి తినమని ఇచ్చినాడు. ఆయన స్వామీ నేను అజీర్ణరోగిని ఏదీ తినలేననగా పర్వాలేదు తిను అన్నాడట. ఆయన దాన్ని తీసికుని తిన్నాడట. ఇక అంతే మధ్యాహ్నం అందరితోపాటు షడ్రుచులతో తృప్తిగా భోజనంచేసినాడట. అంతవరకు కొన్ని సంవత్సరా లనుండి ఆయనను బాధిస్తున్న అజీర్ణవ్యాధి ఏమైపోయిందో తెలియదు. 

ఇక నాటినుండి ఆయన సి.వి.వి.గారికి పరమభక్తుడైపోయినాడు. కనుక ఇది మహిమకు సంబంధించిన ఒక ఉదాహరణం. చీకటిమామిడి రాఘవాచార్యులుగారు పాలమూరు జిల్లాలో ప్రసిద్ధులు. ఆయన ఈ సాధువుల ఉచ్చిష్టానికి చాలా ప్రాముఖ్యమిచ్చేవాడు. తమదగ్గరకు వచ్చిన సాధువులకు తృప్తిగా భోజనంపెట్టించి వారు తిని లేచినపిమ్మట ఆవిస్తరులలోని రెండురెండు మెతుకులు తీసుకోని అన్నంలో వేసికునేవాడట.

భగవద్రామానుజుల చరిత్రలో కార్పాసరాముని వృత్తాంతం వస్తుంది. అతడు చాలా పేదవాడు. గ్రామ గ్రామం తిరిగి యాచనతో జీవించేవాడు. ఆయన భార్య ఎంతో ఉత్తమురాలు మరియు గుణవతి, రూపవతి గూడ. ఒక పర్యాయం వారి గ్రామానికి యతిరాజులవారు వచ్చినారు. ఆమె వారికి ఆతిథ్యమీయవలెననుకున్నది. కాని భర్త యింటి దగ్గరలేడు. రామానుజుని మాత్రం ఆమె ఆతిధ్యానికి పిలిచింది. ఆయన శిష్య పరివారంతో వచ్చినాడు. ఇంటిలో సరుకులు లేవు. ఆ గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు. వాడు కామపిశాచి. ఈమెను కోరుతూ ఉండేవాడు. యిపుడామెకు సరుకులకు అతని దగ్గరకు వెళ్లక తప్పలేదు. అతని నేలాగో వొప్పించి సాదర తీసికొని యింటికి వచ్చి వంట చేసి యతి రాజులకు నివేదించిన పిమ్మట ఆ ప్రసాదం తీసికొని వెళ్లి ఆ వ్యాపారికి పెట్టింది. అపుడతడు దాన్ని తినగానే కామకల్మశమైన అతని మనస్సు సాత్వికంగా మారి పోయి తన తప్పు తెలిసికుని చెంపలు వేసికొని ఆ యిల్లాలిని గౌరవించి పూజించి పంపినాడు. కనుక ఆహార (ప్రసాద) ప్రభావాన్ని ఉచ్చిష్ట ప్రభావాన్ని గురించిన యిటువంటి వృత్తాంతాలింకా చాలా ఉన్నవి. అందువల్ల మనం ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వారితో తినకూడదు.

ఇప్పుడు నారదునికి దిన దినం రెండు పూటలా పరమ భాగవతులైన ఆ సాధువుల చే పాకం అంతేకాక అది వారి ఉచ్చిష్టం గూడ. దానికి తోడు ఆస్తమానం వారి నోట మొదలె భగవత్కథలు వినటం కాబట్టి భక్తికి ఆత్మజ్ఞానానికి ఇంత కంటే ఇంకేం కావలె.

అతని కాపదేండ్ల యీడుతోనే ఈ ప్రపంచం యొక్క సంసారం యొక్క అస్థి రత్వమంతా తెలిసి సంసారంలో తల్లి కొడుకు, అన్న, తమ్ముడు, భార్యభర్త ఎవరికి ఎవరు ఏమీ కారు. వారంతా జన్మను మాత్రమే పురస్కరించుకున్న వారు. కాని ఈ జన్మలోని తల్లిదండ్రులే మనకు పూర్వజన్మలో గూడ తల్లిదండ్రులుకారు. ఇక ముందు జన్మలో కాబోరు కాబట్టి ఇదంతా భగవంతుడాడిరచే ఒక మాయా నాటకమని తెలిసి వచ్చింది.

అతడు నిరంతరం వారి సేవలోనే ఉండి రెండు దినాలకో, మూడు దినాలకో ఒక సారి తల్లి దగ్గరకు వెళ్లేవాడు. అప్పుడామె అంతవరకు యజమాని యింటిలో ఎంతోపని చేసి అలిసి ఉన్నా తనను చూడగానే ఆ అలసటను లెక్క చేయక ‘వచ్చినావా ! నాయనా’ అని ఎంతో ప్రేమగా తల నిమురుతు వళ్లుని ముడుతూ లాలించేది.

ఒక చిన్న పిల్ల కట్టె బొమ్మను పట్టుకొని ‘నా బిడ్డ నా బిడ్డ’ అని దాన్నెంతో లాలి స్తుంటె అది చూసే పెద్ద వారికెట్లా అనిపిస్తుందో నారదునికి తన తల్లి లాలన గూడ అట్లాగే అనిపించసాగింది. ఇట్లా ఉండగా నాలుగు నెలలు పూర్తి అయి ఆ సాధువులిక అక్కడి నుండి వెళ్లుతూ నారదునికి ఆంత వరకు తమను శ్రద్ధాభక్తులతో సేవించినందులకు నారాయణమంత్రం ఉపదేశించి వెళ్ళినారు.

ఆ తర్వాత కొద్ది దినాలకే ఒకనాటి రాత్రి తల్లి యజమాని యింటిలో రాత్రివేళ ఆవును పితకటానికి వెళ్లి ఒక పామును తొక్కగా అది కరచి చనిపోయింది. అప్పుడు నారదునికి జీవునికి జననమరణాలు సహజం. వానికొరకు దుఃఖించదలచిన ఆవసరం లేదని తెలిసి పోయింది. అందువల్ల అతనికి తల్లి మరణంతో దుఃఖం కలగలేదు. తనకు గల ఆ ఒక్క మమతాను బంధం కూడ వదలిపోయిందని సంతసించి ఇంక యజమాని యిల్లు విడిచి ఒక అరణ్యానికి వెళ్లి అక్కడ ఒక సరస్సు లోని నీరు త్రాగి దాని సమీపంలో గల ఒక రాగి చెట్టు కింద తనకు సాధువులు చెప్పిన మంత్రం జపిస్తు కూర్చున్నాడు.

పసివారి మనస్సు నిష్కల్మషంగా ఉంటుంది. వారి మనస్సుపై యింకా అప్పుడే ప్రాపంచిక వాసనలు ప్రసరించవు కనుక వారి నోట మంత్రాలు తొందరగా ఫలిస్తవి. ఇటువంటి ఉదాహరణ ఒకటి మనకు పెద్ద బొట్టు ఆత్మకథలో గూడ కనిపిస్తుంది. అందుకే బ్రహ్మణులు తమ పిల్ల కాయలకు గర్భాష్టమంలోనే ఉపనయనం చేసి గాయ త్రీ మంత్రోపదేశం చేస్తారు.

నారదుడట్లా జపం చేస్తూ కూర్చోగా కొంత సేపటికే అతనికి తళుక్కుమని మెరుపు మెరిసినట్లు శ్రీమహా విష్ణువు ఒకసారి కనిపించి అంతర్థానమైనాడు. అతని రూపాన్ని  ఏసాధకుడైనా ఒకసారి చూస్తే దాన్ని విడువలేక మోహితుడై పోతాడు.

అతడు త్రేతాయుగంలో శ్రీరాముడుగా పుట్టినప్పుడు దండ కాటవిలో ఉండగా ‘ఒక పర్యాయం మహర్షులంతా ఆతని దర్శనానికి వెళ్లి చూడగానే ‘అబ్బా! ఎంత బాగున్నాడని’ ఆ రూపానికి మోహితులై పోయినారట. ఇక అతడు కృష్ణుడుగా పుట్టినప్పుడు ఒకరు కాదు అ ఇద్దరు కాదు పదారు వేల గోపకాంతలు అతని వలలోపడిపోయినారు కాబట్టి ఇప్పుడు సాధారణుడైన ఈ నారదుడెంత?

అట్లా అతనికి ఒక సారి ఆవాసం కనిపించి అంతర్ధానం కాగానే అతనికి నిరంతరం దాన్నే చూస్తుండవలెనని ఆతని దగ్గరనే ఎల్లప్పుడూ ఉండవలెనని ఆరాటం కలిగి ఈ పర్యాయం యింకా తదేక నిష్టగా ఆన్నం నీళ్లు కూడ మాని మంత్రజపం చేస్తూ సొమ్మసిల్లి పర్యాయం ఇంకా వడిపోయినాడు. అపుడతని కదృశ్యంగా నారాయణుడు ‘ఓ బాలకా! నీవు నాకొరకెందుకంతగా ఆరాటపడుతున్నావు. నీ తపస్సు యింకా పరిపక్వం కాలేదు కనుక నీకు ఈ యీ జన్మలో మళ్లీ నా దర్శనం కాదు. వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంద’ ని చెప్పినాడు.

అది విని నారదుడు ఉరడిల్ల తెప్పరిల్లి అప్పటి నుండి ఆ విధంగానే ఆ జన్మంతా తపస్సు చేసి మరుజన్మలో ఒకేసారి దేవర్షిగా బ్రహ్మమానస పుత్రుడై అవతరించి శ్వేత ద్వీపానికి వెళ్లి సాక్షాత్తుగా నారాయణునే దర్శించి నమస్కరించి అతని చేత జ్ఞానో పదేశం పొంది, అస్వామికత్యంత ప్రీతిపాత్రుడై తదనంతరం తాను పొందిన జ్ఞానాన్ని లోకానికి పంచుతూ నారదుడైనాడు. కాని అతని మొదటి పేరేదో మనకు తెలియదు.

నారం ఆడగా జ్ఞానం. ఉదుడు అనగా యిచ్చేవాడు కాబట్టి లోకాని కావిధంగా జ్ఞానం పంచేవాడు నారదుడు గాని అతడు కలహాల మారిగాదు. ఒక వేళ అవి ఎవరికైనా కలిగించినా వారిలోని గర్వం నశించి జ్ఞానోదయం అయ్యేటందుకేగాని ఊరక గాదు.

ఇంతకూ సామాన్యమైన ఒక దాసీపుత్రుడు మరుజన్మలో దేవర్షి పదవిని అందు కోవటానికి అతడు తొలి జన్మలో చేసిన ఆ నాలుగు నెలల భాగవత సేవనే కారణమనక తప్పదు. ఒకవేళ ఆనాడు తన యజమానియే అతనిని ఆ సాధువుల సేవకు వినియోగించక ఇంటి పనిలోనే ఉంచుకుని ఉంటే అతని జీవితం ఎట్లా మారేదో మనం సులభంగానే ఊహించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి