చెట్టులమై వసించితిమి,
చేసిన కర్మల బంధనాలు "పుట్
పు" ట్టన తెంపివేసె సుర
పూజ్యుడు కృష్ణుడు నేడు.. మాదు లో
గు ట్టన నేదియో యెఱుగు
కోవిదుడైన కతాన.. మాకు పై
మె ట్టన జీవితంబులకు..
మే లొన గూర్చె కృపావతారుడై..
శంకర కింకరులైన కుబేరుని కొడుకులు నలకూబర మణిగ్రీవులు వెండికొండపై గంగా తరంగాల్లో తరుణులతో క్రీడిస్తుంటే నారదమహర్షి రాగా స్త్రీలు గబగబా వలువలు ధరించినారు.
మదిరాపాన మత్తులై కుబేరపుత్రులు సిగ్గు విడిచి వివస్త్రులుగానే వుండిపోయినారు.
నారదుడు వారిని సంస్కరించాలని "మీరు భూలోకంబున నర్జున తరువులై పడియుండు" డని శపించినాడు.
గోవింద చరణారవింద స్పర్శతో శాపం తొలగుతుం దన్నాడు.
(దత్తపది - చెట్టు, పుట్ట, గుట్ట, మెట్ట)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి