మొత్తం పేజీ వీక్షణలు

25, జులై 2024, గురువారం

చెట్టులమై పడియుంటిమి... లోగుట్టు పెరుమాళ్ళ కెఱుక..

చెట్టులమై పడియుంటిమి..

"పు" ట్టనెలే కర్మ బంధము! "లెఱుంగును లో

గు" ట్టన పెరుమాళ్ళే! పై

మె ట్టన నెక్కించె మము సుమీ హరి కరుణన్!


యశోద రోటికి కట్టివేయగా చిన్ని కృష్ణుడా రోటిని రెండు మద్దిచెట్ల కడకు కొని పోయి వాటి నడుమ దూరి ఆవలికి  వెళ్ళినాడు.

వెడల్పైన రోలక్కడే వుండిపోయింది.

దాన్ని బలంగా లాగగానే చెట్లు కూలి అందుండి కాంతి విరజిమ్మే ఇద్దరు సిద్ధులు పైకి లేచి కృష్ణుని స్తుతించి ఇలా పలికినారు.

చెట్లలాగా ఇన్నాళ్ళూ పడివుంటిమి.

మా దుష్కర్మల బంధాలు పుటపుటా తెగిపోయినవి.

"లోగుట్టు పెరుమాళ్ళ కెఱుక.." అనే లోకోక్తి నేడు యథార్థమైనది.

(చెట్లము కాబట్టి ఒకే చోట వుంటాం. శాపం తొలగేందుకు కృష్ణుని వెతుక్కుంటూ పోలేము. నోరు లేదు కాబట్టి చెప్పుకోలేము. ఆయనే కృపతో మా దరికి వచ్చి శాపం తొలగించాడు.)

మా లోగుట్టు తెలుసుకున్నాడంటే అతడు పెరుమాళ్ళే (పరమాత్ముడే).

కృష్ణానుగ్రహం అయాచితంగా లభించింది కాబట్టి మేము పై మెట్టుకు చేరుకున్నట్టే!.. అని సంతోషించినారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి