అతుల విక్రముండ.. నంతగా నేమి గ
ర్జు పలుకంగ నాకు.. సుర విరోధి!
నుగ్గుఁ జేతు రావణుల కోటి మందిఁ జూ
డు కను మూసి తెరచెడు సమయాన..
"న మే సమా రావణ కోటయోఽధమ! రామస్య దాసోఽహ మపార విక్రమః"
(అధ్యాత్మ రామాయణము సుం.కా. 4-29)
రాక్షసాధమా! కోట్లాది రావణులు సైతం నాతో సమానులు కారు. అపార విక్రమం గలవాణ్ణి. రామునికి దాసుణ్ణి...
ఇవి రావణసభలో ఆంజనేయుని గంభీర వచనాలు. సుగ్రీవసహితంగా రాముని మట్టుపెట్టగలను.. అని రావణు డంటే హనుమ పలికిన వివి. ప్రతి రామ భక్తుడూ ఇవి గుర్తుంచుకొని ఇంత ధీమాగా వుండవలె నని సారాంశం.
దాసుడే ఇంత గొప్పవా డంటే రాముడెంత గొప్పవాడో!.. అనుకున్నా రంతా. నిజాని కతని కన్ని మాటలు చెప్పే గర్జు (అక్కర) లేదు. (రావణుని వధించి సీతను తీసుకు వెళ్ళగలడు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి