గణపతి - గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత.
గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే
ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం
పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతీకగా భావించవచ్చు. .
ఈ పాలవెల్లి అంటే పాలపుంతే !
అందులో నక్షత్రాలు వెలగపండ్లు, మొక్కజొన్నపొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లన్నీ!
ఇవన్నీ గగన తలంలోని వివిధ ఖగోళవస్తువులకు సూచన!
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ.
వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు
గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి.
అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది?
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు.
మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం.
బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం.
మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....
ఇక పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే!
పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి