వరగుణుండు వశిష్ఠుతో మహి
భర్త మాటలు విన్న వా
రరయగా పురమందు జెప్పిరి..
యార్య పుత్రుని తల్లి చా
ల రహి మీర బహూకరించె వి
లాస మొప్పగ.. భక్తి ల
క్ష్మి రభసంబున నర్చ జేసెను
మేలు గోరి కుమారుకున్
వశిష్ఠునితో మహిభర్త (దశరథుడు) రేపే రాముని రాజును చేస్తా నన్న సమాచారం పురమంతా పాకిపోయింది. ఆర్యపుత్రుని (రాముని) తల్లి కౌసల్య ఆ శుభవార్త అందించిన వారికి రహి (ఆనందం) మీర బహుమానము లిచ్చింది. రామచంద్రుని మేలుకోసం భక్తితో రభసముగా (వెంటనే) లక్ష్మీదేవిని పూజించింది.
(కౌసల్యా పుత్రవత్సలా.. లక్ష్మీం పర్యచర ద్దేవీం రామస్యార్థ ప్రసిద్ధయే.. అధ్యాత్మ రామాయణము బా.కాం. 2-42)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి