Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
30, సెప్టెంబర్ 2022, శుక్రవారం
29, సెప్టెంబర్ 2022, గురువారం
28, సెప్టెంబర్ 2022, బుధవారం
27, సెప్టెంబర్ 2022, మంగళవారం
26, సెప్టెంబర్ 2022, సోమవారం
వరగుణుండు వశిష్ఠుతో మహి భర్త మాటలు విన్న వా
వరగుణుండు వశిష్ఠుతో మహి
భర్త మాటలు విన్న వా
రరయగా పురమందు జెప్పిరి..
యార్య పుత్రుని తల్లి చా
ల రహి మీర బహూకరించె వి
లాస మొప్పగ.. భక్తి ల
క్ష్మి రభసంబున నర్చ జేసెను
మేలు గోరి కుమారుకున్
వశిష్ఠునితో మహిభర్త (దశరథుడు) రేపే రాముని రాజును చేస్తా నన్న సమాచారం పురమంతా పాకిపోయింది. ఆర్యపుత్రుని (రాముని) తల్లి కౌసల్య ఆ శుభవార్త అందించిన వారికి రహి (ఆనందం) మీర బహుమానము లిచ్చింది. రామచంద్రుని మేలుకోసం భక్తితో రభసముగా (వెంటనే) లక్ష్మీదేవిని పూజించింది.
(కౌసల్యా పుత్రవత్సలా.. లక్ష్మీం పర్యచర ద్దేవీం రామస్యార్థ ప్రసిద్ధయే.. అధ్యాత్మ రామాయణము బా.కాం. 2-42)
అతుల విక్రముండ.. నంతగా నేమి గ
అతుల విక్రముండ.. నంతగా నేమి గ
ర్జు పలుకంగ నాకు.. సుర విరోధి!
నుగ్గుఁ జేతు రావణుల కోటి మందిఁ జూ
డు కను మూసి తెరచెడు సమయాన..
"న మే సమా రావణ కోటయోఽధమ! రామస్య దాసోఽహ మపార విక్రమః"
(అధ్యాత్మ రామాయణము సుం.కా. 4-29)
రాక్షసాధమా! కోట్లాది రావణులు సైతం నాతో సమానులు కారు. అపార విక్రమం గలవాణ్ణి. రామునికి దాసుణ్ణి...
ఇవి రావణసభలో ఆంజనేయుని గంభీర వచనాలు. సుగ్రీవసహితంగా రాముని మట్టుపెట్టగలను.. అని రావణు డంటే హనుమ పలికిన వివి. ప్రతి రామ భక్తుడూ ఇవి గుర్తుంచుకొని ఇంత ధీమాగా వుండవలె నని సారాంశం.
దాసుడే ఇంత గొప్పవా డంటే రాముడెంత గొప్పవాడో!.. అనుకున్నా రంతా. నిజాని కతని కన్ని మాటలు చెప్పే గర్జు (అక్కర) లేదు. (రావణుని వధించి సీతను తీసుకు వెళ్ళగలడు.)
నేల నింగియు నేకమై నెగడు తీరు
నేల నింగియు నేకమై నెగడు తీరు
నీరులను జిమ్ము బాణాలు నిండి గ్రాల
నిప్పులను గక్కు బాణాల చొప్పు మీర
రామ రావణ రణమున రాదు గాలి
రామ రావణ మహా సంగ్రామంలో గాలి కూడా చొరబడనంతగా నేలా నింగీ ఒక్క టయ్యేలా ఒకసారి నీళ్ళను చిమ్ముతూ మరోసారి నిప్పులను కక్కుతూ వున్నాయి బాణాలు. (వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం అభిమంత్రించి వదలటం పరిపాటి కదా!)
25, సెప్టెంబర్ 2022, ఆదివారం
24, సెప్టెంబర్ 2022, శనివారం
23, సెప్టెంబర్ 2022, శుక్రవారం
22, సెప్టెంబర్ 2022, గురువారం
21, సెప్టెంబర్ 2022, బుధవారం
20, సెప్టెంబర్ 2022, మంగళవారం
19, సెప్టెంబర్ 2022, సోమవారం
అశనం గరళం ఫణీ కలాపో
అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కి మస్తి శంభో!
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి
18, సెప్టెంబర్ 2022, ఆదివారం
17, సెప్టెంబర్ 2022, శనివారం
16, సెప్టెంబర్ 2022, శుక్రవారం
మెట్టమెట్టుమీదఁ బెట్టినా డొక మెట్ట
మెట్టమెట్టుమీదఁ బెట్టినా డొక మెట్ట
గట్టుమీద నొకటి పెట్టె మెట్ట..
సీరు నొద్దఁ జదివి, శ్రీ హరి కడఁ గొల్వుఁ
జేయు చెట్టునట్టుఁ జేరి కొలుతు
సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం
సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం
సాధువృత్తాం సువర్ణాం
సద్భి స్సంస్తూయమానాం సరసగుణయుతాం
లక్షితాం లక్షణాఢ్యామ్
ఉద్యద్భూషా విశేషా ముపగత వినయాం
ద్యోతమానార్ధరేఖాం
కళ్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితా
కన్యకాం త్వం గృహాణ
15, సెప్టెంబర్ 2022, గురువారం
నేర్చుకున్న విద్య నేర్పించు వాడేర పరమ గురువు
నేర్చుకున్న విద్య నేర్పించు వాడేర
గురువుయనగ మనకుగుర్తువచ్చు
పాఠశాలయందు పాఠాలు జెప్పేటి
పంతులయ్య (మ్మ) గారె "పరమ గురువు"!
14, సెప్టెంబర్ 2022, బుధవారం
మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ
మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ
క్తి.. దశకంఠు డిటులఁ దీరిపోడు..
కడుపులోని యమృత కలశమ్ము భేదించి,
ముదము నిమ్మ లోకమునకు రామ!
రాముడు రావణునితో యుద్ధం చేస్తున్నాడు. ఖండితములైన రావణుని తలలు మళ్ళీ మొలుస్తున్నాయి. అలసిపోయినాడు. విభీషణు డిలా అన్నాడు.
"రామా! అన్నిటికీ మూలమైన ఉత్తమ ధర్మాన్ని (యద్ధ ధర్మాన్ని కలుపుకొని) పాలించేవాడా! ఒక సూక్తి (మంచిమాట) చెబుతా.. విను. (వినాల్సిందే! తప్పదు.) దశకంఠు డీ విధంగా తీరిపోడు (చనిపోడు). అతని పొట్టలో అమృత కలశం వుంది. దాన్ని భేదించు. లోకానికి సంతోషం ప్రసాదించు."
రాముడు యుద్ధ ధర్మం పాటించేవాడు కాబట్టి నేరుగా రావణుని పొట్టపై అస్త్ర ప్రయోగం చెయ్యడు. చేయకపోతే ఎంతసేపైనా యుద్ధం యిట్లాగే కొనసాగుంది. అన్నిటికీ మూలం, శ్రేష్ఠం ధర్మం కాబట్టి దాన్ని గెలిపించాలని.. "మౌలిక వర ధర్మ పాలా!" అని సంబోధించినాడు విభీషణుడు.
13, సెప్టెంబర్ 2022, మంగళవారం
భక్తి ర్మహేశ పద పుష్కర మావసంతీ
భక్తి ర్మహేశ పద పుష్కర మావసంతీ
కాదంబి నీవ కురుతే పరితోష వర్షమ్
సంపూరితో భవతి యస్య మన స్తటాకః
త జ్జన్మ సస్య మఖిలం సఫలం చ నాన్యత్
12, సెప్టెంబర్ 2022, సోమవారం
11, సెప్టెంబర్ 2022, ఆదివారం
10, సెప్టెంబర్ 2022, శనివారం
9, సెప్టెంబర్ 2022, శుక్రవారం
8, సెప్టెంబర్ 2022, గురువారం
పరగ దాడి నిమ్మ పండు దాల్చినట్టి తొండమున్,
పరగ దాడి నిమ్మ పండు
దాల్చినట్టి తొండమున్,
కరములందు కలువయు, వరి
కంకి, యక్ష మాలయున్,
స్థిరముగాను వీణ బూని
తివి వినీల మూర్తివై
యరయ నెంగిలి గణపతి య
యారె! యన గణేశ్వరా!
7, సెప్టెంబర్ 2022, బుధవారం
6, సెప్టెంబర్ 2022, మంగళవారం
5, సెప్టెంబర్ 2022, సోమవారం
దేవ దేవ! సిద్ధ గణప తీ! సువర్ణ వర్ణ! "శ్రీ
దేవ దేవ! సిద్ధ గణప
తీ! సువర్ణ వర్ణ! "శ్రీ
"దేవి"యును మరియు "సమృద్ధ
దేవి" శ్రీమతులుగ సం
"భావితుడవు. చెఱుకు గడయు,
పరశువు, విరిగుత్తియున్,
మావి పండు దాల్చి వరలు
మాన్యుడవు గణేశ్వరా!
పుస్తకంబు, నక్షమాల పొసగ యోగదండమున్
పుస్తకంబు, నక్షమాల
పొసగ యోగదండమున్
హస్తముల కమండలంబు
నమర దాల్చియుందువే!
నిస్తుల మగు చంద్రకాంతి
నిండిన ద్విజ గణపతీ!
మస్తకంబు జేర్తు పాద
మందునన్ గణేశ్వరా!
పంకజ ముఖి, దేవి ఆకు పచ్చ కాంతు లీనగా
పంకజ ముఖి, దేవి ఆకు పచ్చ కాంతు లీనగా
సంకటముల బాపు చేయి సాచి కవుగిలింపగా
నంకుశమును, పల్లు, త్రాడు నలరె మూడు చేతులన్
కంకణము లనంగ శక్తి గణపతీ! గణేశ్వరా!
అవధాన బాలభాస్కర..
అవధాన బాలభాస్కర..
ప్రవిమల బిరుదాంకితుండు, పండితవరు డీ
యవధాన విద్యయందున
ప్రవణుండై పేరు గాంచవలె నని యెంతున్
భారతదేశ సంస్కృతి వైభవం.. వేదము శాస్త్రము సంస్కృతి
వేదము శాస్త్రము సంస్కృతి
మోదంబు నొసంగును తుద ముట్ట నెరుంగం
గా దరమే భారతమున..
నే దేశమ్మైనను గురుతించగవలయున్
పుడమి సద్విద్య నేర్చి రీ పుత్రు లనుచు
పుడమి సద్విద్య నేర్చి రీ పుత్రు లనుచు
ముందు తరముల దిద్దెడు ముద్దు బిడ్డ
లనుచుఁ బరవశమును బొందె నఖిలమైన
విద్యలకుఁ దల్లి శ్రీ వాణి ప్రేమమూర్తి
ఆహ్లాదంబుగ దేవతాళి గగనం బం దుండి వీక్షింపగా
ఆహ్లాదంబుగ దేవతాళి గగనం
బం దుండి వీక్షింపగా
ప్రహ్లాదున్ బరిరక్ష సేయుటకునై
భవ్యాకృతిన్ దాల్చె.. నౌ
రా! హ్లాదంబున శౌరి.. సత్సుఖదమై
రాజిల్లుచున్ మేటిదౌ
ప్రహ్లాదంబు వరించె లోకమునకున్
భద్రమ్ముగా నెంతయున్
శ్రీ రమణీయ పద్య రస సిద్ధ కవిత్వ ఘన ప్రదీప్తితో
శ్రీ రమణీయ పద్య రస
సిద్ధ కవిత్వ ఘన ప్రదీప్తితో
సార వివేక పూర్ణ విల
స న్మతులై చరియించు వారు భా
షా రతి కల్గి దుర్గుణపు
షండము వీడగ నందు నా చయం
బారు శరణ్య మయ్యె మన
పండిత పామర కోటి కియ్యెడన్
అరయ శూల, చక్ర, ముద్గ, రాంకుశ, ధ్వ, జాంబువుల్
అరయ శూల, చక్ర, ముద్గ,
రాంకుశ, ధ్వ, జాంబువుల్
పరశు వాది యాయుధములఁ
బదియు నారుఁ బట్టుచున్
అరుణకాంతి మీరఁ బదియు
నారు భుజము లొప్పగా
మెరయు వీర గణపతి! వర
మీయరా! గణేశ్వరా!
4, సెప్టెంబర్ 2022, ఆదివారం
3, సెప్టెంబర్ 2022, శనివారం
బెల్ల మన్న మున్న పాత్ర, ప్రీతి నారికేళమున్
బెల్ల మన్న మున్న పాత్ర,
ప్రీతి నారికేళమున్
ఉల్ల మలరు నామ్ర ఫలము,
నొక్క యరటి పం డహో!
అల్ల నాల్గు చేతులందు
నలరు భక్త గణపతీ!
ఎల్ల వేళ గాచుచుండ
వే ప్రభూ! గణేశ్వరా!
2, సెప్టెంబర్ 2022, శుక్రవారం
Indian origin - CEO - భారత సంతతి - సీఈఓ - 2022
స్టార్ బక్ (కాఫీ వ్యాపార సంస్థ) = లక్ష్మణ్ నరసింహన్
గూగుల్ (ఆల్ఫాబెట్) = సుందర్ పిచ్చాయ్
మైక్రోసాఫ్ట్ = సత్య నాదెళ్ల
ట్విట్టర్ = పరాగ్ అగర్వాల్
ఫెడెక్స్ ట్రాన్స్ పోర్ట్ = రాజ్ సుబ్రమణియం
ఫ్యాషన్ ఛానల్ = లీనా నాయర్
అడోబ్ = శంతను నారాయన్
ఐబిఎం = అరవింద్ కృష్ణ
మైక్రోన్ సెమీకండక్టర్ = సంజయ్ మెహరోత్రా
పాలో ఆల్టో నెట్వర్క్ (సైబర్ సెక్యూరిటీ )= నికేష్ అరోరా
అరిస్టా నెట్వర్క్ = జయశ్రీ ఉల్లాల్
నెట్ యాప్ = జార్జ్ కురియన్
ఫ్లెక్స్ = రేవతి అద్వైతి
విమియో = అంజలి సుద్
విఎం వేర్ = రఘు రఘురామ్
నోవార్టిస్ = వసంత్ నరసింహన్
డెలాయిట్ = పునీత్ రెంజెన్
బార్క్లేస్ బ్యాంక్ = సి ఎస్ వెంకట కృష్ణన్
1, సెప్టెంబర్ 2022, గురువారం
గణపతి - గణాలకు అధిపతి - పాలవెల్లి
గణపతి - గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత.
గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే
ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం
పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతీకగా భావించవచ్చు. .
ఈ పాలవెల్లి అంటే పాలపుంతే !
అందులో నక్షత్రాలు వెలగపండ్లు, మొక్కజొన్నపొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లన్నీ!
ఇవన్నీ గగన తలంలోని వివిధ ఖగోళవస్తువులకు సూచన!
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ.
వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు
గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి.
అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది?
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు.
మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం.
బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం.
మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....
ఇక పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే!
పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.
శ్రీగణాధివ స్తోత్రమ్ - సరాగిలోకదుర్లభం విరాగిలోక పూజితం
శ్రీగణాధివ స్తోత్రమ్ (సంపత్తి సంతాన ప్రాప్తి కొరకు)
(శంకరాచార్య విరచితం)
సరాగిలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాదిమృత్యు నాశకమ్
గిరా గురుం శ్రియా హరిం జయంతి యదార్చకా
నమామి తం గణాధిపం కృపాపయఃపయోనిధిమ్
గిరీంద్రజాముఖాంబుజ ప్రమోదదానభాస్కరం
కరీంద్రవ్యక్రమానతాఘనం ఘవారణోద్యతమ్
సరీసృపేశబద్దకుక్షిమాశ్రయామి సంతతం
శరీరకాంతి నిర్జితాబ్దంబంధుబాలసంతతిమ్
శుకాదిమానివందితం గకారవాచ్యమక్షరం
ప్రకామమిష్టదాయినం సకామనమ్రపంక్తయే
చకాసనం చతురుజైర్వికాసిపద్మపూజితం
ప్రకాశితాత్మతత్త్వకం నమామ్యహం గణాధిపమ్
నరాధిపత్వదాయకం స్వరాదిలోకదాయకం.
జరాది రోగవారకం నిరాకృతాసురవ్రజమ్
కరాంబుజైర్డరసృణీన్ వికార శూన్యమానపౌః
హృదా సదా విభావితం ముదా నమామి విఘ్నపమ్
శ్రమాపనోదనక్షమం సమాహితాంతరాత్మనా
సమాధిభిః సదార్చితం క్షమానిధిం గణాధిపమ్
రమాధవాదిపూజితం యమాంతకాత్మసంభవం
శమాది షడ్గుణప్రదం నమామి తం విభూతయే
గణాధిపస్య పంచకం నృణామభీష్టదాయకం
ప్రణామపూర్వకం జనాః పఠంతి యే ముదా యుతాః
భవంతి తే విదాంపురః ప్రగీతవైభవా జనాః
చిరాయుషో ధిక శ్రియః సుసూనవో న సంశయః
శ్రీ గణేశ సూక్తమ్ - ఓం అ తూ న ఇంద్ర క్షుమస్తం చిత్రం గ్రాభం సం గృభాయ
శ్రీ గణేశ సూక్తమ్
ఓం అ తూ న ఇంద్ర క్షుమస్తం చిత్రం గ్రాభం సం గృభాయ/ మహాహస్తీ దక్షిణేన || విద్మా హి త్వా తువి కూర్మిం తువిదేష్టం తువీ మఘమ్ | తువిమాత్రమవోభి || న హిత్వా శూర దేవా న మర్తాసో దిత్సనమ్ | భీమం న గాం వారయన్డే | ఏతోనిజస్థం స్తవామేశానం వస్వః స్వరాజమ్ | న రాధసా మర్ధిషన్నః || ప్ర స్తోషదుప గాసిషచ్ఛవత్సామ గీయమానమ్ | అభిరాధసా జుగురత్ || అ నో భర దక్షిణేనాభి సవ్వేన ప్ర మృశ | ఇంద్ర మానో వసోర్నిర్భాక్ || ఉపక్రమాస్వా భర ధృషతా ధృష్ణో జనానామ్ | అదాశుష్టరస్య వేదః || ఇన్ద య ఉ ను తే అస్తి వాజో విప్రేభిః సనిత్వః | అస్మాభి : సుతం సనుహి || సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చన్ఫ్రాః/ వశైశ్చ మక్షూ జరనే గణానాం త్వా గణంపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్ | ని షు సీద గణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనామ్ | న ఋతే త్వత్రియతేకిం చనారే మహమక్రం మఘవణ్చత్ర మర్చ || అభిఖ్యానో మఘవన్నాధమానా సృభేబోధి వసుపతే సుఖీనాయ్! రణం కృధి రణకృతృత్య తూష్మాభక్తీ చిదాభజా రాయే అస్మాన్
చెరుకు, వెలగ, నేరెడు మరి చెలగగ వరి కంకులున్ - ganapathi telugu poem
చెరుకు, వెలగ, నేరెడు మరి చెలగగ వరి కంకులున్
పరగ పాశ, మంకుశంబు వరుస దంత, మోదకాల్
కరములందు మెరయ లేత కాంతి సూర్యు బోలగా
నరసికో తరుణ గణపతి! అష్ట భుజ! గణేశ్వరా!