మొత్తం పేజీ వీక్షణలు

10, ఆగస్టు 2022, బుధవారం

విడిచి రట కల్లు ముంతలు..

   విడిచి రట కల్లు ముంతలు..

   ముడిచిరి బొంత లవి.. పట్టు   పుట్టము లాయెన్..

   వడిఁ జనెఁ గుంతలములు.. వె

   ల్వడె నగిషీ పొంతలు రఘు   వర రాజ్యమునన్..

రఘువరుని (రాముని) రాజ్యంలో ప్రజలు మద్యపానం వదలివేసినారు. బొంతలు ముడిచినారు. అంటే పేదరికం పోయింది. వాటి స్థానంలో పట్టు వస్త్రాలు వచ్చినవి. (ఆర్థిక స్తోమత పెరిగింది.) కుంతలములు (నాగళ్ళు) వడిగా సాగినవి. అంటే వ్యవసాయం మెరుగుపడింది. పొంతలు (కుండలు) నగిషీలతో వెలువడసాగినవి. (కళా ప్రియత్వం పెరిగింది.)




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి