Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
31, ఆగస్టు 2022, బుధవారం
తోడ బుట్టినట్టి తోబుట్టువులకును
తోడ బుట్టినట్టి తోబుట్టువులకును
"రాఖి"గట్ట గలరు రమణులంత
"రక్ష బంధనంబు" రమణీయ పర్వము
భరత జాతి కిలను భవ్యముగను!
పుట్టినట్టి రోజు పుడమిపై "శ్రీకృష్ణ"
పుట్టినట్టి రోజు పుడమిపై "శ్రీకృష్ణ"
జగము జరుపుకొనును జన్మవేడ్క
ధర్మముద్ధరించ ధరణిపై దిగివచ్చి
మంచి నాయకుడిగ మమ్ముబ్రోవు!
వరములీయుమయ్య వరసిద్ధి గణపతి
వరములీయుమయ్య వరసిద్ధి గణపతి
మంచి బుద్ధినొసగు మాకు నీవు
మానవత్వ గుణము మరుగైన మాయందు
మరల మేలుగొలిపి మార్పుదెమ్ము!
విఘ్నపతివి నీవు విఘ్నము లేకుండ
విఘ్నపతివి నీవు విఘ్నము లేకుండ
పనులు జరుగునట్లు ఫలితమివ్వు
పార్వతమ్మ పుత్ర పరమేశనందనా
వినుతి జేతుమయ్య విఘ్నరాజ!
అరటిపండు, నామ్రఫలము నమరు కుడి కరంబులన్
అరటిపండు, నామ్రఫలము
నమరు కుడి కరంబులన్
చెరుకు గడయు, పనసపండు
చేరు నెడమ చేతులన్
పరగ తొండమందు వెలగ
పండొ, కుడుమొ పట్టుచున్
తిరుగునట్టి బాల గణప
తీ! ప్రభూ! గణేశ్వరా!
30, ఆగస్టు 2022, మంగళవారం
29, ఆగస్టు 2022, సోమవారం
28, ఆగస్టు 2022, ఆదివారం
27, ఆగస్టు 2022, శనివారం
26, ఆగస్టు 2022, శుక్రవారం
25, ఆగస్టు 2022, గురువారం
24, ఆగస్టు 2022, బుధవారం
విశ్వకర్మ విలాసము
విశ్వంద్య, సృష్టికర్త, విశ్వేశ్వరాయ, విశ్వరూపాయ, విశ్వాత్మనే, స్వయంజ్యోతిస్వరూపాయ, శ్రీ విశ్వకర్మ ప్రభో నమో నమః:.శ్రీ గురు వీరబ్రహ్మణే నమః:.
"సర్వే జనా: సుఖినో భవన్తు.
అందరూ క్షేమంగా ఉండుగాక" అనే అద్భుతమైన ఆలోచన ప్రతిఒక్కరికీ మార్గదర్శి.
ప్రపంచానికి విశ్వబ్రాహ్మణుల సహకారం ఎంతో విలువైనది.
విశ్వకర్మలు అంటే సూర్యకిరణాల వలె ప్రకాశించే వారు.
చీకటిలోనూ వెలుగునిచ్చే చైతన్య స్వరూపం కలవారు.
అందరి మేలు కోరే వారు విశ్వకర్మలు.
కుల, మతాలకు అతీతంగా అందరికీ సేవ చేయాలనే భావన కలిగి ఉంటారు.
"విశ్వకర్మ విలాసము" పుస్తకంలో విశ్వకర్మ పురాణాల మూలం, విశ్వకర్మ వంశం, ప్రాచీన సమాజం, విశ్వజనీనత, విశ్వకర్మ సంస్కృతి, విశ్వకర్మ వివిధ వర్గాలకు చేసిన సేవ, శిల్ప శాస్త్రం, విశ్వబ్రాహ్మణుల కర్తవ్యాలను వివరించే ప్రయత్నం జరిగింది.
శ్రీ ఒక్కంద శంకరయ్య ఆచార్యజీ గారు సమాజం పట్ల ఉన్న శ్రద్ధతో "విశ్వకర్మ విలాసము" అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లోకి చేర్చి, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, తనకు మరియు తన కుటుంబానికి మంచి జరగాలని శ్రీ గురు వీరబ్రహ్మేంద్రుడిని ప్రార్థించారు.
ఆరోగ్యం మరియు సమాజానికి మరింత సేవ చేయాలని స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తాము.
విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ వారి పరిచయాన్ని మరియు సందేశాలను ఆశీర్వదిస్తాడు.
ప్రపంచంలోని అన్ని దేశాలలోని అన్ని వర్గాలకు స్వంత భాషలను కలిగి ఉండండి మరియు తద్వారా ప్రపంచం మొత్తానికి ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలని ప్రార్ధన
23, ఆగస్టు 2022, మంగళవారం
22, ఆగస్టు 2022, సోమవారం
21, ఆగస్టు 2022, ఆదివారం
20, ఆగస్టు 2022, శనివారం
19, ఆగస్టు 2022, శుక్రవారం
పిల్లనగ్రోవిని బట్టిన పిల్ల డొకడు - కృష్ణ జన్మాష్టమి
పిల్లనగ్రోవిని బట్టిన
పిల్ల డొకడు రేపుమాపు ప్రేమగ నా యీ
యుల్లమునందున నేదో
యల్లరిఁ గావించుచుండె నది యేమొ కదా!
17, ఆగస్టు 2022, బుధవారం
వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..
వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..
వైనతేయ నిభ వరిష్ఠుడైన హనుమ..
ఎవరు ద్రవిణమునం దాశ యెరుగ? రొకడు
దక్క..నాకలిం గమలాప్తు దాకు హనుమ..
ఆంజనేయుడు వశి. (ఇంద్రియాలను వశమునం దుంచుకున్నవాడు). వైనతేయుని (గరుత్మంతుని) వంటి వరిష్ఠుడు (శ్రేష్ఠుడు). అనంతమైన సముద్రాన్ని లంఘించగలిగినాడు. లంకలో ప్రవేశించ గలిగినాడు. జానకి జాడ కనుక్కో గలిగినాడు. తన ప్రతాపాన్ని చూపగలిగినాడు. తిరిగి రాగలిగినాడు. ఇవన్నీ ఎవ్వడూ చేయలేని పనులే! పైగా నిష్కామంగా చేశాడు.
ద్రవిణము (ధనము)నం దాశ ఎవ రెరుగరు? ఆకలితో కమలాప్తుని (సూర్యుని) తాక బోయే హనుమ ఒక్కడు తప్ప.
బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగ బోయాడు హనుమ.
(పదాలు అన్యార్థంలో ప్రయోగించ బడినవి.)
15, ఆగస్టు 2022, సోమవారం
11, ఆగస్టు 2022, గురువారం
తెలిసినది చెప్పు టది యొప్పు.. తెలుపకున్న
తెలిసినది చెప్పు టది యొప్పు.. తెలుపకున్న
చెరువుకొనుచున్న జడ నున్న విరుల యాన..
ఊరకుంట మ రేలనే! ఓ ప్రియ సఖి!
చెప్పవే! సత్వరం బా విశేష మేమొ!
రామచంద్రాభిషేచనం..
శ్వో భవిష్యతి తే నాద్య సర్వతోఽలంకృతం పురం
(అధ్యాత్మ రామాయణము అయోధ్యా కాండము 2-50,51)
(శ్రీ రాముని పట్టాభిషేకము రేపు జరుగుతుంది. అందుకే నగరమంతా అలంకరించబడింది.) అన్న మాటలు వినగానే మంథర కైకేయి మందిరానికి వెంటనే వెళ్ళింది.
"ఒక గొప్ప విశేషం జరుగబోతోంది." అని ఉపక్రమించింది. ఎలా చెప్పాలో తోచలేదు. నాన్చుతున్నది. అప్పుడు జడలో పూవులు చెరువు (తురుము) కుంటున్న కైక ఉత్సుకతతో ఇలా అడిగింది.
చెరువు = పూలు మొదలైనవి కొప్పున దూర్చు.. గ్రుచ్చు
10, ఆగస్టు 2022, బుధవారం
మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ
మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ
క్తి.. దశకంఠు డిటులఁ దీరిపోడు..
కడుపులోని యమృత కలశమ్ము భేదించి,
ముదము నిమ్మ లోకమునకు రామ!
రాముడు రావణునితో యుద్ధం చేస్తున్నాడు. ఖండితములైన రావణుని తలలు మళ్ళీ మొలుస్తున్నాయి. అలసిపోయినాడు. విభీషణు డిలా అన్నాడు.
"రామా! అన్నిటికీ మూలమైన ఉత్తమ ధర్మాన్ని (యద్ధ ధర్మాన్ని కలుపుకొని) పాలించేవాడా! ఒక సూక్తి (మంచిమాట) చెబుతా.. విను. (వినాల్సిందే! తప్పదు.) దశకంఠు డీ విధంగా తీరిపోడు (చనిపోడు). అతని పొట్టలో అమృత కలశం వుంది. దాన్ని భేదించు. లోకానికి సంతోషం ప్రసాదించు."
రాముడు యుద్ధ ధర్మం పాటించేవాడు కాబట్టి నేరుగా రావణుని పొట్టపై అస్త్ర ప్రయోగం చెయ్యడు. చేయకపోతే ఎంతసేపైనా యుద్ధం యిట్లాగే కొనసాగుంది. అన్నిటికీ మూలం, శ్రేష్ఠం ధర్మం కాబట్టి దాన్ని గెలిపించాలని.. "మౌలిక వర ధర్మ పాలా!" అని సంబోధించినాడు విభీషణుడు.
విడిచి రట కల్లు ముంతలు..
విడిచి రట కల్లు ముంతలు..
ముడిచిరి బొంత లవి.. పట్టు పుట్టము లాయెన్..
వడిఁ జనెఁ గుంతలములు.. వె
ల్వడె నగిషీ పొంతలు రఘు వర రాజ్యమునన్..
రఘువరుని (రాముని) రాజ్యంలో ప్రజలు మద్యపానం వదలివేసినారు. బొంతలు ముడిచినారు. అంటే పేదరికం పోయింది. వాటి స్థానంలో పట్టు వస్త్రాలు వచ్చినవి. (ఆర్థిక స్తోమత పెరిగింది.) కుంతలములు (నాగళ్ళు) వడిగా సాగినవి. అంటే వ్యవసాయం మెరుగుపడింది. పొంతలు (కుండలు) నగిషీలతో వెలువడసాగినవి. (కళా ప్రియత్వం పెరిగింది.)
6, ఆగస్టు 2022, శనివారం
4, ఆగస్టు 2022, గురువారం
తండ్రీ! నీ దయతో నిక గుండ్రాతిని గా.. నహల్యఁ.. గుందితి నిందన్
"తండ్రీ! నీ దయతో నిక
గుండ్రాతిని గా.. నహల్యఁ.. గుందితి నిందన్
వేండ్రముతో.." నని పలికెను..
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్..
రాముని పాద ధూళి సోకి రాయిగా పడివున్న అహల్య శాపం తొలగింది.
చతుర్భుజం శంఖచక్ర గదా పంకజ ధారిణమ్
ధనుర్బాణధరం రామం లక్ష్మణేన సమన్వితం 38
లక్ష్మణునితో కూడిన రాముడు శ్రీ మన్నారాయణునిగా దర్శన మీయగా ఆమె ఇలా పలికింది.
"అహో కృతా ర్థాస్మి జగన్నివాస! తే
పాదాబ్జ సంలగ్న రజః కణా నహమ్"
జగన్నివాసా! నీ పాదపద్మాల ధూళి కణం తాకి నేను ధన్యురాల నైనాను.
(అధ్యాత్మ రామాయణం బా.కాం. 5-43)
"తండ్రీ! నీ కరుణతో ఇక నేను గుండ్రాతిని కాను. అహల్యను. నిందవలన ఇన్నాళ్ళూ ఎంతో వేండ్రముతో (తాపంతో) కుందినాను."
అలా చిత్రంగా గుండ్రాయి వనితగా మారి అందరూ చూస్తుండగా గునగునా నడిచివెళ్ళింది.
చిగురుకొను నాస మారుతిన్ జేరదీసి
చిగురుకొను నాస మారుతిన్ జేరదీసి
క్రోడమున హత్తుకొనెను రఘు ప్రవరుడు
డయనమున నేగి రయమున లంకఁ జేరి
ముదిత సీతను గనుగొన్న ముఖ్యు డనుచు
సీతాన్వేషణం సఫలీకృతమయిం దని తెలుసుకొన్న రాముడు ఆంజనేయుని తన క్రోడమునకు (హృదయమునకు) హత్తుకొన్నాడు. డయనంతో (పక్షిలాగా రెక్కకదలనీక ఆకసంలో ఎగరి) లంక జేరి సీతను కనుక్కోగలిగినా డని. ~~~~~~~~~
(గోపీనాథ రామాయణము.. యు.కాం.12)
అని రాముడు హనుమను కౌగలించుకున్నా డట!
క్రోడము = రొమ్ము
డయనము = పక్షిగతి, రెక్కకదలనీక ఎగరడం.
3, ఆగస్టు 2022, బుధవారం
2, ఆగస్టు 2022, మంగళవారం
1, ఆగస్టు 2022, సోమవారం
వందవ యవధానంబును
వందవ యవధానంబును
పొందుగ గావించినారు పొరబడకుండన్..
ముందర శతావధానము
సుందరముగఁ జేయగలరు సూరులు మెచ్చన్