మొత్తం పేజీ వీక్షణలు

16, మే 2021, ఆదివారం

కరోనా వైరస్ వ్యక్తిగత జాగ్రత్తలు

కరోనా  కేర్ 

---------------

ఉదయాన్నే ఎండలో చేరి స్వచ్చంగా  శ్వాసించండి 

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చన్నీటి  చేయండి 

ఏ పని చేసిన కాళ్ళూ చేతులూ పరిశుభ్రపరచుకోండి 

చేతుల శుభ్రతకోసం స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని వాడండి 

ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండండి 

గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. 

జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానండి 

వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాలతో  చేసే  'రసం'  వాడండి 

మూతి గోచీలు ఇంట్లో కూడా తీయకండి 

అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి.

AC Buses లో తిరగకండి.

దూర ప్రయాణాలు Trains లో చేయకండి.

జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.

తీర్ధ యాత్రలు, పెళ్లిళ్లు ... వాటికి దూరంగా ఉండండి.

సినిమా హాళ్లకు వెళ్ళకండి.

బాగా వండిన ఆహారము తినండి. 

పచ్చివి  తినడము మంచిది కాదు.

బజారు టిఫిన్స్ తినకండి 

కర్రీ పాయింట్స్ లలో దొరికే కూరలు తినకండి 

చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. 

వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.

తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.

తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి.

మిరియాల పాలు పిల్లలకు, వృద్దులకు  ఇవ్వండి. 

పసుపు పాలని త్రాగుతూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి 

పనిచేసేటప్పుడు చేతులకు gloves వాడండి.

ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం  దూరముగా ఉండి మాట్లాడండి.

బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.

పబ్బులు, బార్స్ కు వెళ్లడం మానేయండి 

లాడ్జిలలో బస చేయడం మానండి.

కాచి చల్లార్చిన నీటిని వాడండి.

విమాన ప్రయాణాలు చేయవద్దు.

వ్యక్తిగత, కుటుంబపర మరియు సామాజిక శుభ్రత పాటించాలి 

పెద్దవారు ఇమ్మ్యూనిటి పెంచుకోవడం కోసం సి విటమిన్ లభించే పళ్ళు తీసుకోవాలి 

ఎక్కువగా నీటిని త్రాగుతుండాలి

రోజూ సూర్యుని కాంతి తగిలేలా తిరగాలి

రెస్ట్ చాల అవసరం 

చేతులను ఆల్కహాల్‌ లేదా బ్లీచింగ్‌ పౌడర్లతోని శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి  మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం మంచిది 

ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడరాదు 

చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా  ప్రమాదమే 

అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. 

పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి.

కోళ్లఫారాలు, జంతుసంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు.

ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు. 

మాస్క్‌ ముందు భాగం ముట్టుకోకుండా వెనుకనుంచి తొలగించాలి.  

మాస్క్‌ను తీసిన వెంటనే డస్ట్‌బిన్‌లో పడవేయాలి

జూ పార్క్ వాటర్ ఫౌంటేన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. 

పక్కవారి కర్చీప్ లు, దుస్తులు, దుప్పట్లు  సబ్బులు, పేస్టులు వాడకండి

కొత్తవారికి లిఫ్ట్ ఇవ్వకండి

కొత్త పరిచయాలు మానండి.

బయట జనాలు వచ్చే సభలకు వెళ్లకండి

సగం ఉడికిన చికెన్ , మాంసం, గుడ్లు, చేపలు తినకూడదు. 

పండ్లు, పళ్ళ రసాలని తీసుకోవాలి. 

బాగా ఉడికిన వేడి ఆహరం తినండి.  

చల్లని వంటకాలు, నిలువ కూరలు, పచ్చళ్ళు  వాడకండి.  

తులసి రోజుకు రెండు మూడు ఆకులు నమిలాలి 

అల్లం వెల్లుల్లి ఎక్కువగా మీ కూరల్లో పచ్చడిలొ  ఉండేలా చూసుకోండి.

వంటకు కొబ్బరి నూనె వినియోగిస్తే మేలు.

ఉసిరి, బొప్పాయి, నారింజ, జామకాయ, నిమ్మకాయ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి