మొత్తం పేజీ వీక్షణలు

21, మే 2021, శుక్రవారం

చిరస్మరణీయుడు బహుగుణ

సుందర్‌లాల్‌ బహుగుణ

ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్‌లాల్‌ బహుగుణ (94) కరోనాతో  రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతూ 21-05-2021 న తుదిశ్వాస విడిచారు.

బహుగుణకు భార్య విమల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

పర్యావరణ పరిరక్షణను ఆయన ఒక ప్రజాఉద్యమంగా మలిచారు 

పర్యావరణవేత్తలకు ఆయన స్ఫూర్తిదాయకం 

ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలు, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటు 

బహుగుణ వంటి పర్యావరణవేత్తల స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టడం జరిగింది 

హిమాలయ ప్రాంతాల పరిరక్షణే ధ్యేయంగా.. హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా బహుగుణ అనేక ఉద్యమాలు చేపట్టారు. 

అటవీ సంరక్షణ కోసం 1970లలో మొదలైన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు. 

ఇది ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. 

అలాగే తెహ్రీ డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 

84 రోజులపాటు ఉపవాస దీక్ష చేశారు. 

ఈ ప్రాజెక్టు కారణంగా అనేక మంది నిర్వాసితులయ్యారు. 

తెహ్రీ రాజకుటుంబానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో ఆయన జైలుపాలుకావాల్సి వచ్చింది. 

హిమాలయాలలో లగ్జరీ టూరిజంను తీవ్రంగా వ్యతిరేకించారు. 

పర్యావరణరంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి