బ్లాక్ ఫంగస్
కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు పోతోంది
ప్రాణాపాయం కూడా !
మ్యూకోర్‌మైకోసిస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్.
మట్టిలో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే బూజు ( మ్యూకోర్ ) వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
ఈ మ్యూకోర్ మట్టిలో, గాలిలో, మనుషుల చీమిడిలో కూడా ఉంటుంది.
ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.
సహజసిద్దంగా గాలిలో మ్యూకోర్ అనే ఫంగస్ ఉంటుంది.
దీనిని పీల్చినపుడు గాలిద్వారా ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది.
కరోనా నుంచి కోలుకునే సమయంలో తలెత్తే సమస్యల వలన ఆ బ్లాక్ ఫంగస్ కంటి లోపలికి ప్రవేశిస్తుంది.
ఫలితంగా కంటిచూపు కోల్పోవాల్సి వస్తుంది.
కంటిపై దాడి తర్వాత ఈ ఫంగస్ మెదడు వరకు వ్యాపిస్తుంది.
మెదడుకు ఈ ఫంగస్ చేరి బ్రెయిన్ డెడ్ అవుతుంది
కంటి చూపు మందగించడం, కండ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, ముఖం ఒకవైపు భాగం నొప్పిగా ఉండటం, తలనొప్పి, పంటి నొప్పి,
ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు, వాంతిలో రక్తం రావడం - వంటివి లక్షణాలు
నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు,
స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారు,
ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారు,
అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారు
........ వంటివారు బాధితులు
కొవిడ్-19 కారణంగా ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను తగ్గించడానికి స్టెరాయిడ్లను వాడుతున్నారు.
తీవ్ర డయాబెటిస్‌తో బాధపడుతున్న కరోనా రోగులకు కూడా ఈ స్టెరాయిడ్లను ఇస్తున్నారు.
ఈ స్టెరాయిడ్ల ప్రభావం వల్ల ఇమ్యూనిటీ తగ్గి రక్తంలో చక్కెరస్థాయులు పెరుగుతున్నాయి.
ఇలా రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది
బ్లాక్ ఫంగస్ అనేది కరోనావైరస్‌లా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదంటున్నారు
వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ సోకిన తర్వాత లక్షణాలను ముందే గుర్తించి చికిత్స ఇవ్వడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడవచ్చు. మ్యూకోర్‌మైకోసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను ఇస్తుంటారు.
15 నుంచి 21 రోజుల పాటు ఈ ఇంజెక్షన్లను ఇవ్వాలి.
రోగి బరువును బట్టి ఇవి రోజుకు 6 నుంచి 9 ఇంజెక్షన్లు కావాలి
రోగి ముక్కు నుంచి ఫంగస్‌ను తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయాలి
ఆపరేషన్ తర్వాత కూడా ఈ ఇంజెక్షన్లను కొనసాగిస్తారు.
రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చూసుకోవాలి.
స్టెరాయిడ్లను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.
యాంటీ బయాటిక్స్/యాంటీ ఫంగల్ ఔషధాలను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.
కొవిడ్ రోగుల్లో ముక్కు దిబ్బడ ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనుకోవద్దు బ్లాక్ ఫంగస్ కావచ్చు
బహిరంగ ప్రదేశాలు, దుమ్ము, ధూళి ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి ధరించాలి.
వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
పోషకాహార లోపంలేకుండా చూసుకోవాలి
ముందుజాగ్రత్తగా యాంటీ ఫంగల్ ఔషధ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి.
ఈ బ్లాక్ ఫంగస్ కు డాక్టర్లు ఆంఫోటెరిసిన్ అనే మందును రాస్తున్నారు.
దీంతో ఈ ఔషధానికి డిమాండ్ పెరిగింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి