మొత్తం పేజీ వీక్షణలు

21, మే 2021, శుక్రవారం

చిరస్మరణీయుడు బహుగుణ

సుందర్‌లాల్‌ బహుగుణ

ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్‌లాల్‌ బహుగుణ (94) కరోనాతో  రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతూ 21-05-2021 న తుదిశ్వాస విడిచారు.

బహుగుణకు భార్య విమల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

పర్యావరణ పరిరక్షణను ఆయన ఒక ప్రజాఉద్యమంగా మలిచారు 

పర్యావరణవేత్తలకు ఆయన స్ఫూర్తిదాయకం 

ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలు, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటు 

బహుగుణ వంటి పర్యావరణవేత్తల స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టడం జరిగింది 

హిమాలయ ప్రాంతాల పరిరక్షణే ధ్యేయంగా.. హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా బహుగుణ అనేక ఉద్యమాలు చేపట్టారు. 

అటవీ సంరక్షణ కోసం 1970లలో మొదలైన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు. 

ఇది ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. 

అలాగే తెహ్రీ డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 

84 రోజులపాటు ఉపవాస దీక్ష చేశారు. 

ఈ ప్రాజెక్టు కారణంగా అనేక మంది నిర్వాసితులయ్యారు. 

తెహ్రీ రాజకుటుంబానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో ఆయన జైలుపాలుకావాల్సి వచ్చింది. 

హిమాలయాలలో లగ్జరీ టూరిజంను తీవ్రంగా వ్యతిరేకించారు. 

పర్యావరణరంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

16, మే 2021, ఆదివారం

కరోనా వైరస్ వ్యక్తిగత జాగ్రత్తలు

కరోనా  కేర్ 

---------------

ఉదయాన్నే ఎండలో చేరి స్వచ్చంగా  శ్వాసించండి 

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చన్నీటి  చేయండి 

ఏ పని చేసిన కాళ్ళూ చేతులూ పరిశుభ్రపరచుకోండి 

చేతుల శుభ్రతకోసం స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని వాడండి 

ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండండి 

గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. 

జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానండి 

వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాలతో  చేసే  'రసం'  వాడండి 

మూతి గోచీలు ఇంట్లో కూడా తీయకండి 

అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి.

AC Buses లో తిరగకండి.

దూర ప్రయాణాలు Trains లో చేయకండి.

జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.

తీర్ధ యాత్రలు, పెళ్లిళ్లు ... వాటికి దూరంగా ఉండండి.

సినిమా హాళ్లకు వెళ్ళకండి.

బాగా వండిన ఆహారము తినండి. 

పచ్చివి  తినడము మంచిది కాదు.

బజారు టిఫిన్స్ తినకండి 

కర్రీ పాయింట్స్ లలో దొరికే కూరలు తినకండి 

చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. 

వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.

తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.

తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి.

మిరియాల పాలు పిల్లలకు, వృద్దులకు  ఇవ్వండి. 

పసుపు పాలని త్రాగుతూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి 

పనిచేసేటప్పుడు చేతులకు gloves వాడండి.

ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం  దూరముగా ఉండి మాట్లాడండి.

బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.

పబ్బులు, బార్స్ కు వెళ్లడం మానేయండి 

లాడ్జిలలో బస చేయడం మానండి.

కాచి చల్లార్చిన నీటిని వాడండి.

విమాన ప్రయాణాలు చేయవద్దు.

వ్యక్తిగత, కుటుంబపర మరియు సామాజిక శుభ్రత పాటించాలి 

పెద్దవారు ఇమ్మ్యూనిటి పెంచుకోవడం కోసం సి విటమిన్ లభించే పళ్ళు తీసుకోవాలి 

ఎక్కువగా నీటిని త్రాగుతుండాలి

రోజూ సూర్యుని కాంతి తగిలేలా తిరగాలి

రెస్ట్ చాల అవసరం 

చేతులను ఆల్కహాల్‌ లేదా బ్లీచింగ్‌ పౌడర్లతోని శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి  మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం మంచిది 

ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడరాదు 

చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా  ప్రమాదమే 

అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. 

పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి.

కోళ్లఫారాలు, జంతుసంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు.

ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు. 

మాస్క్‌ ముందు భాగం ముట్టుకోకుండా వెనుకనుంచి తొలగించాలి.  

మాస్క్‌ను తీసిన వెంటనే డస్ట్‌బిన్‌లో పడవేయాలి

జూ పార్క్ వాటర్ ఫౌంటేన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. 

పక్కవారి కర్చీప్ లు, దుస్తులు, దుప్పట్లు  సబ్బులు, పేస్టులు వాడకండి

కొత్తవారికి లిఫ్ట్ ఇవ్వకండి

కొత్త పరిచయాలు మానండి.

బయట జనాలు వచ్చే సభలకు వెళ్లకండి

సగం ఉడికిన చికెన్ , మాంసం, గుడ్లు, చేపలు తినకూడదు. 

పండ్లు, పళ్ళ రసాలని తీసుకోవాలి. 

బాగా ఉడికిన వేడి ఆహరం తినండి.  

చల్లని వంటకాలు, నిలువ కూరలు, పచ్చళ్ళు  వాడకండి.  

తులసి రోజుకు రెండు మూడు ఆకులు నమిలాలి 

అల్లం వెల్లుల్లి ఎక్కువగా మీ కూరల్లో పచ్చడిలొ  ఉండేలా చూసుకోండి.

వంటకు కొబ్బరి నూనె వినియోగిస్తే మేలు.

ఉసిరి, బొప్పాయి, నారింజ, జామకాయ, నిమ్మకాయ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి


ప్రజల్లో కరోనా తెచ్చిన కొత్త అలవాట్లు

కరోనా మార్చిన అలవాట్లు

--------------------------------------------

జంక్‌ఫుడ్‌కు దూరం జరిగారు 

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వినియోగం తగ్గించారు 

తాజా కూరగాయలకే ప్రాధాన్యత నిస్తున్నారు 

రైస్ వినియోగం తగ్గించి ఇతర తృణ ధాన్యాల వాడకాన్ని పెంచారు 

మాసం, చికెన్, ఎగ్స్ వినియోగం పెరిగింది 

అనవసరపు షాప్పింగ్స్ మానేశారు 

మద్యపాన వినియోగం పెరిగింది 

కాస్మోటిక్స్‌ కొనుగోలు తగ్గించారు 

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. 

పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల వాడకం పెంచారు 

షాపింగ్‌ మాల్స్, సూపర్‌మార్కెట్లు, పెద్ద దుకాణాలకు వెళ్లడం మానేశారు 

దేశంలో ప్రజలు చిన్న వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు. 

కావాల్సినవి మరీ ముఖ్యమైనవి మాత్రమే కొంటున్నారు 

పొదుపు చాల వరకు పెరిగింది 

మానసిక ఆందోళన తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు 

ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ ని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకుంటున్నారు 

పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడకం చేసారు 

దూర ప్రయాణాలు మానుకుంటున్నారు

శుభకార్యాలకు దూరంగా ఉంటున్నారు 

పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు  

స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు సమయాన్ని కేటాయిస్తున్నారు 

యువకుల పోరంబోకు తిరుగుళ్ళు అసలే లేవు 


14, మే 2021, శుక్రవారం

9th class students telugu internal exam model paper periodic assessment

7th class telugu text book grammar short notes on nanardhalu

ఏం తింటే బరువు తగ్గుతారు?

దేహంలో రక్తపోటుని నియంత్రించే పొటాషియం  అలుగడ్డలో ఉంటుంది కాబట్టి ఉడికించిన ఆలూని తినాలి. ఫ్రైలు వాడరాదు 

దేహంలో కొవ్వును కరిగించే స్రావాలకు తోడ్పడే  పీచు, బీటాకెరోటికిన్  దుంపల్లో ఉంటాయి కాబట్టి -వాటిని తినాలి 

పీచు, స్వల్ప క్యాలరీలు గల ఆకుకూరలు తినాలి 

విటమిన్ సి , కె , కెరటినాయిడ్స్ , యాంటి ఆక్సిడెంట్స్, పీచు కలిగి ఉండి కొవ్వులేని బీన్స్ తినాలి 

పొట్టలో జాం అయిన కొవ్వును కరిగించే సి విటమిన్ కల్గిన పళ్ళని తినాలి 

క్యాలీఫ్లవర్ లో లభించే ఉపయోగకర పోషకాలు దేహానికి మేలు చేస్తాయి

శరీరానికి సరిపడా నీటిని తాగుతుంటే దేహంలో కొవ్వు నిల్వలు కరిగిపోతాయి 






13, మే 2021, గురువారం

బ్లాక్ ఫంగ‌స్ మహమ్మారి

బ్లాక్ ఫంగ‌స్

క‌రోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ ఇన్‌ఫెక్ష‌న్  కేసులు పెరిగిపోతున్నాయి. 

ఈ ఫంగ‌స్ కార‌ణంగా క‌రోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు పోతోంది 

ప్రాణాపాయం కూడా !

మ్యూకోర్‌మైకోసిస్ అనేది ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్‌. 

మ‌ట్టిలో, కుళ్లిపోతున్న పండ్లు, కూర‌గాయ‌ల్లో క‌నిపించే బూజు ( మ్యూకోర్ ) వ‌ల్ల ఈ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంది. 

ఈ మ్యూకోర్ మ‌ట్టిలో, గాలిలో, మ‌నుషుల చీమిడిలో కూడా ఉంటుంది. 

ఇది సైన‌స్‌, మెద‌డు, ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం చూపిస్తుంది.

స‌హ‌జ‌సిద్దంగా గాలిలో మ్యూకోర్ అనే ఫంగ‌స్ ఉంటుంది. 

దీనిని పీల్చిన‌పుడు గాలిద్వారా ఈ ఫంగ‌స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. 

క‌రోనా నుంచి కోలుకునే స‌మ‌యంలో త‌లెత్తే స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆ బ్లాక్ ఫంగ‌స్ కంటి లోప‌లికి ప్ర‌వేశిస్తుంది. 

ఫ‌లితంగా కంటిచూపు కోల్పోవాల్సి వ‌స్తుంది. 

కంటిపై దాడి త‌ర్వాత‌ ఈ ఫంగ‌స్ మెద‌డు వ‌ర‌కు వ్యాపిస్తుంది. 

మెద‌డుకు ఈ ఫంగ‌స్ చేరి బ్రెయిన్ డెడ్ అవుతుంది 

కంటి చూపు మంద‌గించ‌డం, కండ్లు, ముక్కు చుట్టూ ఎర్ర‌బ‌డ‌టం, ముఖం ఒక‌వైపు భాగం నొప్పిగా ఉండ‌టం, త‌ల‌నొప్పి, పంటి నొప్పి,

ఛాతి నొప్పి, శ్వాస స‌మ‌స్య‌లు, వాంతిలో ర‌క్తం రావ‌డం - వంటివి లక్షణాలు 

నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు,

స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారు,

ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారు,

అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారు 

 ........ వంటివారు బాధితులు 

కొవిడ్‌-19 కార‌ణంగా ఊపిరితిత్తుల్లో వ‌చ్చే మంట‌ను త‌గ్గించ‌డానికి స్టెరాయిడ్ల‌ను వాడుతున్నారు. 

తీవ్ర డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న క‌రోనా రోగుల‌కు కూడా ఈ స్టెరాయిడ్ల‌ను ఇస్తున్నారు. 

ఈ స్టెరాయిడ్ల ప్ర‌భావం వ‌ల్ల ఇమ్యూనిటీ త‌గ్గి ర‌క్తంలో చ‌క్కెర‌స్థాయులు పెరుగుతున్నాయి. 

ఇలా రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ ఉంది 

బ్లాక్ ఫంగ‌స్ అనేది క‌రోనావైర‌స్‌లా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌దంటున్నారు 

వ్య‌క్తిలో బ్లాక్ ఫంగ‌స్ సోకిన త‌ర్వాత ల‌క్ష‌ణాలను ముందే గుర్తించి చికిత్స ఇవ్వ‌డం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడ‌వ‌చ్చు. మ్యూకోర్‌మైకోసిస్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న వారికి యాంఫోటెరిసిన్‌ బీ ఇంజెక్షన్లను ఇస్తుంటారు.

15 నుంచి 21 రోజుల పాటు ఈ ఇంజెక్ష‌న్ల‌ను ఇవ్వాలి. 

రోగి బ‌రువును బ‌ట్టి ఇవి రోజుకు 6 నుంచి 9 ఇంజెక్ష‌న్లు కావాలి

రోగి ముక్కు నుంచి ఫంగ‌స్‌ను తొల‌గించేందుకు శ‌స్త్ర చికిత్స చేయాలి 

ఆప‌రేష‌న్ త‌ర్వాత కూడా ఈ ఇంజెక్ష‌న్ల‌ను కొన‌సాగిస్తారు.

రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా చూసుకోవాలి.

స్టెరాయిడ్లను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.

యాంటీ బయాటిక్స్‌/యాంటీ ఫంగల్‌ ఔషధాలను సరైన సమయంలో సరైన మోతాదులో వేసుకోవాలి.

కొవిడ్‌ రోగుల్లో ముక్కు దిబ్బడ ఉంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ అనుకోవద్దు బ్లాక్ ఫంగ‌స్ కావచ్చు 

బ‌హిరంగ ప్ర‌దేశాలు, దుమ్ము, ధూళి ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు మాస్క్ త‌ప్ప‌నిస‌రి ధ‌రించాలి. 

వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి.

పోషకాహార లోపంలేకుండా చూసుకోవాలి

ముందుజాగ్ర‌త్త‌గా యాంటీ ఫంగ‌ల్ ఔష‌ధ ఉత్ప‌త్తిని పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి 

ప‌లు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. 

ఈ బ్లాక్ ఫంగ‌స్ కు డాక్ట‌ర్లు ఆంఫోటెరిసిన్ అనే మందును రాస్తున్నారు. 

దీంతో ఈ ఔష‌ధానికి డిమాండ్ పెరిగింది