Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
31, జులై 2024, బుధవారం
30, జులై 2024, మంగళవారం
29, జులై 2024, సోమవారం
స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా - ఆనందమయ జీవితానికి చుక్కాని స్నేహం
స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా - ఆనందమయ జీవితానికి చుక్కాని స్నేహం
ఏదైనా ఒక వ్యక్తి జీవితం ఆనందంగా, సంతోషంగా సాగాలంటే అతని చుట్టూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి.
అలా ఉండాలంటే ముఖ్యంగా అతనికి చక్కటి స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండాలి.
ఒంటరి జీవితం ప్రశాంతంగా ఉండవచ్చు కానీ ఎక్కువ రోజులు ఆలా ఒంటరిగా ఉంటే మాత్రం ఎలాంటి ఆనందం, సంతోషం ఉండకపోగా విసుగు తెప్పిస్తుంది.
మన చుట్టూ సరదాగా నవ్వించే స్నేహితులు, బాధలో దగ్గరుండి ఓదార్చే బంధువులు ఉన్నప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది.
మనం ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పుడు మన చుట్టూ నిజమైన స్నేహితుడు కనీసం ఒక్కడైనా ఉండాల్సిన అవసరం ఉంది.
ఎదురుపడిన లేదా ఎంచుకున్న స్నేహితులంతా ఒకేలా ఉండరు.
కొంతమంది మన మంచి కోరితే, కొందరు పరిస్థితిని బట్టి మారిపోతారు.
స్నేహితుల్లో నిజమైన వారెవరో తెలుసుకుని వారితో బంధం కొనసాగిస్తూ ముందుకు సాగాలి.
స్నేహితులు జీవితమనే సముద్రంలో పడవలాంటి వారు.
మన జీవితం సాఫీగా స్థిరంగా, సౌకర్యంగా సాగేందుకు ఎంతో కొంత సాయం చేస్తారు.
కొంతమంది బంధువులతో పోలిస్తే స్నేహితుల దగ్గరే ఎక్కువ మంది సౌకర్యంగా ఫీలవుతారు.
స్నేహితులు కుటుంబ బంధాలకు మించిన సౌలభ్యాన్ని అందిస్తారు.
మనల్ని జడ్జ్ చేయకుండా... వ్యతిరేకించకుండా మనం ఎలా ఉన్నామో అలాగే స్వీకరిస్తారు.
కష్ట సమయాల్లో మద్దుతుగా నిలుస్తారు.
జీవితంలో ఏదేని కష్టం రాగానే... ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక స్నేహతుడు ఉంటే మనసు త్వరగా తేలికపడుతుంది.
ఒక మంచి స్నేహితుడు మనల్ని త్వరగా అర్థం చేసుకుంటాడు,
ప్రత్యేకమైన బంధాన్ని అదరువును అందిస్తాడు.
స్నేహితులను కలిగి ఉన్న వ్యక్తులు ఒంటరిగా ఉన్న వారితో పోలిస్తే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు.
మంచి స్నేహితులు ఉన్నవారికి గుండె జబ్బులు తక్కువగా వస్తాయని, రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.
ఒక మనిషి ఆయుష్షు పెరగాలంటే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వదిలేయడంతో పాటూ చక్కటి స్నేహితులని ఏర్పరుకోవాలి
28, జులై 2024, ఆదివారం
27, జులై 2024, శనివారం
26, జులై 2024, శుక్రవారం
ఓం గణానాం త్వాణపతిగ్‌ం హవామహే - శ్రీ గణపతి ప్రార్థన
శ్రీ గణపతి ప్రార్థన
ఓం గణానాం త్వాణపతిగ్‌ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్
ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ
ధీనామవిత్య్రవతు గణేశాయ నమః
సరస్వత్త్యె నమః
శ్రీ గురుభ్యోనమః
హరిః ఓం
సహా కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాయురారోగ్య : షోడశోపచారపూజ
షోడశోపచారపూజ
అస్మాకం :
సహా కుటుంబానాం
క్షేమస్థైర్య ధైర్య
విజయాయురారోగ్య
ఐశ్వర్యాభివృద్ధర్థం మమ
ధర్మార్థ కామ మోక్ష
చతుర్విధ ఫల పురుషార్థ సిద్యర్థం
ఇష్టకామ్యార్థ సిద్యర్థం
సత్సాంన సౌభాగ్య
శుభ పలవ్యాప్తర్థం
కాలే కాలే ప్రయుక్త
శ్రీకృష్ణ దేవతా
బుద్ధిశా శ్రీకృష్ణ దేవత
ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ
యావచ్చక్తి ధ్యాన
వాహనానాది
షోడశోపచారపూజం కరిష్యే
25, జులై 2024, గురువారం
చెట్టులమై వసించితిమి .... చేసిన కర్మల బంధనాలు......
చెట్టులమై వసించితిమి,
చేసిన కర్మల బంధనాలు "పుట్
పు" ట్టన తెంపివేసె సుర
పూజ్యుడు కృష్ణుడు నేడు.. మాదు లో
గు ట్టన నేదియో యెఱుగు
కోవిదుడైన కతాన.. మాకు పై
మె ట్టన జీవితంబులకు..
మే లొన గూర్చె కృపావతారుడై..
శంకర కింకరులైన కుబేరుని కొడుకులు నలకూబర మణిగ్రీవులు వెండికొండపై గంగా తరంగాల్లో తరుణులతో క్రీడిస్తుంటే నారదమహర్షి రాగా స్త్రీలు గబగబా వలువలు ధరించినారు.
మదిరాపాన మత్తులై కుబేరపుత్రులు సిగ్గు విడిచి వివస్త్రులుగానే వుండిపోయినారు.
నారదుడు వారిని సంస్కరించాలని "మీరు భూలోకంబున నర్జున తరువులై పడియుండు" డని శపించినాడు.
గోవింద చరణారవింద స్పర్శతో శాపం తొలగుతుం దన్నాడు.
(దత్తపది - చెట్టు, పుట్ట, గుట్ట, మెట్ట)
చెట్టులమై పడియుంటిమి... లోగుట్టు పెరుమాళ్ళ కెఱుక..
చెట్టులమై పడియుంటిమి..
"పు" ట్టనెలే కర్మ బంధము! "లెఱుంగును లో
గు" ట్టన పెరుమాళ్ళే! పై
మె ట్టన నెక్కించె మము సుమీ హరి కరుణన్!
యశోద రోటికి కట్టివేయగా చిన్ని కృష్ణుడా రోటిని రెండు మద్దిచెట్ల కడకు కొని పోయి వాటి నడుమ దూరి ఆవలికి వెళ్ళినాడు.
వెడల్పైన రోలక్కడే వుండిపోయింది.
దాన్ని బలంగా లాగగానే చెట్లు కూలి అందుండి కాంతి విరజిమ్మే ఇద్దరు సిద్ధులు పైకి లేచి కృష్ణుని స్తుతించి ఇలా పలికినారు.
చెట్లలాగా ఇన్నాళ్ళూ పడివుంటిమి.
మా దుష్కర్మల బంధాలు పుటపుటా తెగిపోయినవి.
"లోగుట్టు పెరుమాళ్ళ కెఱుక.." అనే లోకోక్తి నేడు యథార్థమైనది.
(చెట్లము కాబట్టి ఒకే చోట వుంటాం. శాపం తొలగేందుకు కృష్ణుని వెతుక్కుంటూ పోలేము. నోరు లేదు కాబట్టి చెప్పుకోలేము. ఆయనే కృపతో మా దరికి వచ్చి శాపం తొలగించాడు.)
మా లోగుట్టు తెలుసుకున్నాడంటే అతడు పెరుమాళ్ళే (పరమాత్ముడే).
కృష్ణానుగ్రహం అయాచితంగా లభించింది కాబట్టి మేము పై మెట్టుకు చేరుకున్నట్టే!.. అని సంతోషించినారు.
24, జులై 2024, బుధవారం
సత్త్వ గుణమునకును సర్వేశ్వరుని కృప పగలు రేలు తోడుపడును గాక! (సుజన శుభాకాంక్ష)
సత్త్వ గుణమునకును సర్వేశ్వరుని కృప
పగలు రేలు తోడుపడును గాక!
శోభకృత్తులోన సుజను లందరికిని
కలమి బలిమి శుభము కలుగు గాక! 3
సుజన శుభాకాంక్ష (శోభకృత్ సంవత్సరం ఉగాది)
అధికార మది మాకు నావశ్యకమె గాని అగునె సద్వినియోగ మనగ రాదు.....
అధికార మది మాకు నావశ్యకమె గాని
"అగునె సద్వినియోగ" మనగ రాదు..
ధన మన్నదే మాకు దండిగా కావలె
"నగునె ధర్మార్జన" మ్మనగ రాదు..
ప్రజల ఓట్లే మాకు నిజముగా కావలె
వారి సుఖము మాట పలుకరాదు..
మాట నెగ్గుట యదే మాకు కావలె గాని
పలుకులో సత్యంబు పనికిరాదు..
ఇట్టి నాయకాళి మట్టిగొట్టుకుపోవ
గట్టి నాయకాళి కావలయును
నిర్భయముగ ప్రజలు నిశ్చింతతో నుండు
రమ్యమైన దినము రావలయును. 2
శిష్టుల రక్షించి దుష్టుల శిక్షించు నధికారులే యిప్పు డవసరంబు...
శిష్టుల రక్షించి దుష్టుల శిక్షించు
నధికారులే యిప్పు డవసరంబు
దీనుల పైకెత్తు దివ్య హస్తము జూపు
నధికారులే యిప్పు డవసరంబు
మగువల ప్రాణాలు మానాలు కాపాడు
నధికారులే యిప్పు డవసరంబు
మానవత్వముతోడ మనలోన మసలెడు
నధికారులే యిప్పు డవసరంబు
అవనిలోన నట్టి యధికారులకు దైవ
బల మ దెపుడు తోడు నిలుచు గాక!
మంచివారియొక్క మంత్ర సాధనలోని
బల మ దెపుడు తోడు నిలుచు గాక! 1
శోభకృ ద్వత్సరములోన సుజనులకు శుభములు - న్యస్తాక్షరి
శోభకృ ద్వత్సరములోన సుజనులకు శు
భములు, జయములు,సుఖములు నమరనీ! ప్ర
కృతి యుపద్రవములు లేని గతి నమరని!
తులఁ గనగ లేని రోగాలు తొలగి పోని!
(విద్వద్గద్వాల కవనవేదిక - న్యస్తాక్షరి - శో..భ..కృ..తు.. పాదాదులలో)