మొత్తం పేజీ వీక్షణలు

24, జనవరి 2023, మంగళవారం

శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం.....

శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం


మొదటి పేరు చక్కనిది మహాదేవుండు 

నిలను రెండవది మహేశ్వరుండు 

పొసగ శంకరుండు మూడవ పేరౌను

పరగ నాలుగు వృషభ ధ్వజుండు  1 


ఐదు కృత్తివాసుడు.. చక్కనైన పేరు. 

ఆరు కామాంగ నాశను డనెడు పేరు.

ఏడు దేవ దేవేశుడు నింపు మెరయు

నెనిమిది మరి శ్రీకంఠుండు, మనము మురియు 2 


ఈశ్వరుడు తొమ్మిదవ పేరు శాశ్వతముగ

పార్వతీపతి.. సుఖ మిచ్చు పదవ పేరు 

రుద్రుడు పదకొండవ పేరు.. భద్ర మగును

శివుడు పదియురెం డవ పేరు.. శివ మొసగును 3 


ఈ పది రెం డగు పేరుల

నోపికగా స్మరణ చేయు నుత్తము లెల్లన్

పాపంబులు నశియింపగ

నా పరమేశ్వరుని లోక మందుదురు సుమా! 4 


శంకర ప్రియుల మనాన జననమంది

శంకర ప్రియుల కలాన సౌరు మీరి

శంకర ప్రియులకు నెల్ల సౌఖ్య మొసగు

శంకర ప్రియ నామాలు జయము గూర్చు 6 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి