మొత్తం పేజీ వీక్షణలు

24, జనవరి 2023, మంగళవారం

రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన

 "రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన


అవని నాగమశాస్త్రమ్ము ననుసరించి

మించి రాళ్ళను శిల్పీకరించినపుడు 

మహిత విగ్రహమ్ము లగును,మంత్ర పూత 

ముగ ప్రతిష్ఠించినప్పుడు మోదమొసగు

దేవతార్చన కర్హమ్ములౌ వసుధను..

భారతీయు లీ విధముగా పలుకరాదు. 

"రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన "


రాళ్ళు వీధులలో పడివుంటాయి. ఆగమశాస్త్రా న్ననుసరించి శిల్పంగా మలచినపుడు "రాళ్ళు" అని వాటిని పిలువరాదు . "దేవతావిగ్రహాలు" నాలి. (బంగారంగా వుంటే బంగార మంటాము ఉంగరంగా తయారు చేసినప్పుడు ఉంగరం అంటాము కదా! ఇక బంగారం అనవలసిన పనిలేదు. అట్లే ఇంకా ఎన్నో ఆభరణాలు) మంత్ర పురస్సరంగా ప్రతిష్ఠింపబడినప్పుడు ఆ విగ్రహాలు దేవతార్చనకు యోగ్యము లౌతాయి. 

    "గుడిలో రాయి వుంది" అని ఎవరూ అనరు. అనడమే తప్పు. "విగ్రహం వుంది" అనాలి. లేదా ఆ విగ్రహం ఏ దేవునికి ప్రతీకయో ఆ దేవు డున్నాడు.. అనాలి. ఉదాహరణకు "రామాలయంలో రాముని విగ్రహం వుంది." అనైనా అనాలి. లేదా "రాము డున్నాడు.." అనైనా అనాలి. అంతే గాని "గుడిలో రాయి వుంది.." అనే మాటయే పొసగదు.

    వీధిలో పడివున్న దానిని విగ్రహం అనము కదా! విగ్రహాలను ఆ యా దేవతకు ప్రతీకలుగా భావించి ఆరాధిస్తే ఆ యా దేవతలు ప్రసన్నులై కోరిన కోరికలు తీరుస్తారు. కోట్లాదిమంది కిది అనుభవమే!

   ఇదంతా నిరాధారమైనది కాదు. శాస్త్ర బద్ధమైన భారతీయ సంస్కృతిలో భాగం. కాబట్టి తెలుసుకోకుండా భారతీయు లీ విధంగా పలుకరాదు... అని ఒక గురువు శిష్యునికి చెప్పినాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి