మొత్తం పేజీ వీక్షణలు

24, జనవరి 2023, మంగళవారం

పలుకుల తల్లి! నీ వొసగు పద్య కవిత్వ ఫల ప్రసాద మం ( గరికపూవు)

 గరికపూవు

    పలుకుల తల్లి! నీ వొసగు 

        పద్య కవిత్వ ఫల ప్రసాద మం 

    దలి మధురానుభూతి బహు

        ధా, ప్రణుతించి మదిం దలంప, వా 

    క్కులు కరువయ్యె, భావముల 

        కూర్మిని రంజిలు శబ్ద సంపదల్ 

    విలసిత రీతి నా కొసగి 

        ప్రీతిని గూర్చు గదమ్మ! భారతీ! 23 

    "ఓ భారతీమాతా! నీవు నన్ను అనుగ్రహించి ప్రసాదించుతున్న పద్యము లనబడే మధురమైన ప్రసాదము యొక్క అనుభవాత్మకమైన మహిమను వర్ణించి చెప్పా లంటే నాకు మాటలు చాలడం లేదు. మనోజ్ఞమైన భావములతో కూడుకొన్న శబ్ద సముదాయాన్ని నాకు ఎప్పటికప్పుడు ప్రసాదించుతూ సంప్రీతిని కలిగింప జేస్తుండా లని నిన్ను ప్రాధేయ పూర్వకంగా వేడుకుంటున్నాను."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి