Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
30, జనవరి 2023, సోమవారం
28, జనవరి 2023, శనివారం
27, జనవరి 2023, శుక్రవారం
26, జనవరి 2023, గురువారం
25, జనవరి 2023, బుధవారం
రోజులు గడచె.. చదివినారొ! మరి లేదొ!
రోజులు గడచె.. చదివినారొ! మరి లేదొ!
టంకణపు దోష మొక్కటి యింకనైన
చూపగా లేకపోయినా రోపికగను..
మీరు దోషైక దృక్కులు కారు లెండి.
24, జనవరి 2023, మంగళవారం
పలుకుల తల్లి! నీ వొసగు పద్య కవిత్వ ఫల ప్రసాద మం ( గరికపూవు)
గరికపూవు
పలుకుల తల్లి! నీ వొసగు
పద్య కవిత్వ ఫల ప్రసాద మం
దలి మధురానుభూతి బహు
ధా, ప్రణుతించి మదిం దలంప, వా
క్కులు కరువయ్యె, భావముల
కూర్మిని రంజిలు శబ్ద సంపదల్
విలసిత రీతి నా కొసగి
ప్రీతిని గూర్చు గదమ్మ! భారతీ! 23
"ఓ భారతీమాతా! నీవు నన్ను అనుగ్రహించి ప్రసాదించుతున్న పద్యము లనబడే మధురమైన ప్రసాదము యొక్క అనుభవాత్మకమైన మహిమను వర్ణించి చెప్పా లంటే నాకు మాటలు చాలడం లేదు. మనోజ్ఞమైన భావములతో కూడుకొన్న శబ్ద సముదాయాన్ని నాకు ఎప్పటికప్పుడు ప్రసాదించుతూ సంప్రీతిని కలిగింప జేస్తుండా లని నిన్ను ప్రాధేయ పూర్వకంగా వేడుకుంటున్నాను."
ఇది అనుభూతి కవిత్వము
ఇది అనుభూతి కవిత్వము
సదమల మగు చిత్త వృత్తి సాధ్యంబగు, నె
మ్మది పరతత్వము నిండిన
యదనునఁ గాకున్న సాధ్యమా! యన్యమునన్
అరయ రఘుకు లాన్వయ మూల పురుషు డినుడు ( సూర్యారాధనము)
సూర్యారాధనము
అరయ రఘుకు లాన్వయ మూల పురుషు డినుడు
మకర రాశిన్ బ్రవేశించు మంగళ కర
పర్వదినము నప్పుడు నేత్ర పర్వముగను
జరిపె రాముండు ప్రత్యేక శ్రద్ధతోడ 1
మంత్రముల పఠించి మైమరపున మించి,
పొగడికల పఠించి పులకరించి
రామ లక్ష్మణులు భరతుడు శత్రుఘ్నుండు
వెలుగు ఱేని నపుడు కొలిచినారు 2
"ఆఫీ సాఫీ సంటరు..
"ఆఫీ సాఫీ సంటరు..
ఆఫీసుల నిద్ర వోతరా యేం?" దంటే...
"సోఫానైనా లేదే!
ఓ ఫానే వుంట, దే.సి. వుండదు గదనే!"
"ఆఫీ సాఫీ సని హడావుడి చేస్తారు అక్కడ నిద్రపోతారా ఏమిటి?" అన్నది భార్య
"అక్కడ సోఫానైనా లేదు. ఒక్క ఫానే వుంటుంది. ఏ.సీ.కూడా వుండదు గదనే! (నిద్ర ఎలా పట్టుతుం దనుకున్నావ్?)" అన్నా డట భర్త.
కనీసం ఒక సోఫా, ఏ.సీ. వుంటే చాలు ఆఫీసులో సైతం హాయిగా నిద్రపోగలుగుతా డన్నమాట.. ఇప్పు డేదో కుర్చీలోనే సర్దుకుంటున్న ట్టుంది పాపం!
ఓపికగ దిద్ద వేమిర!
ఓపికగ దిద్ద వేమిర!
లా పక్కన సున్న బెట్టెరా! పత్రికలన్
రే పెట్లు పంచుదమురా!
దాపున శైలజకు పెండ్లి.. తప్పు పడెనురా!
ఉమ్మడి పాలమూరు (మహబూబునగరు) జిల్లాలో క్షేత్రములు...
తిరుమల వేంకటేశ్వరుడే ఉమ్మడి పాలమూరు (మహబూబునగరు) జిల్లాలో ఎన్నో క్షేత్రములలో వెలసినాడు.
మన్నెముకొండ:
మహబూబ్నగర్ (పాలమూరు)కు 17. కి.మీ. దూరంలో రాయచూర్ రహదారిలో నున్న క్షేత్రం. ఇది మూడు కొండలపైన ఉన్నది. స్వామి స్వయంభువు. కోనేరు కూడా ఎవరూ తవ్వకుండానే తయారయింది. పాలమూరు తిరుపతి అని దీనికి ప్రసిద్ది. లక్ష్మీ నరసింహస్వామిపై ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారులు మన్నెముకొండ హనుమద్దాసుగా రీ ప్రాంతం వారే!
కురుమూర్తి:
గద్వాల ప్రాంతంలోని వేంకటేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం గురించి ఎంతో సాహిత్యం వెలుగుచూసింది. చారు దరహాస! కురుమూర్తి శైలవాస! అనే మకుటంతో
స్వామి మీద చక్కని శతక రచన చేయడమే గాక శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారు ఈ సాహిత్యం మీద ఎంతో కృషి సల్పి శ్రీ కురుమూర్తి క్షేత్ర శతకసాహిత్యం.. అనే పేరిట వివిధకవులు రచించిన పన్నెండు శతకాల ప్రామాణికమైన సంకలనంకూడా వెలయించినారు.
దేవుని పాలెము:
ఉమ్మడి పాల మూరు జిల్లాలో రెండు పాలెము లున్నవి. ఒకటి హైదాబాద్ బెంగుళూరు రహదారిలో కొత్తకోటకు సమీపంలోని పాలెం. మరొకటి హైద్రాబాద్ నాగర్ కర్నూలుకు దారిలో బిజినాపల్లి సమీపంలోని పాలెం.
ప్రత్యేకంగా పేర్కొనవలసివస్తే మొదటిదాన్ని కొత్తకోట పాలె మని, వేంక టేశ్వరస్వామి వెలసినాడు కాబట్టి రెండవ దాన్ని దేవుని పాలె మని వ్యవహరిస్తారు. ఆలయాభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కీ.శే. సుబ్బయ్య గారు ప్రాతఃస్మరణీయులు. కీ.శే.ఇమ్మడిశెట్టి చంద్రయ్య గారు, శ్రీ కసిరెడ్డి వేంకటరెడ్డి గారు స్వామి కంకితంగా విశిష్టమైన శతకాలను రచించారు.
మొదలికల్లు:
గద్వాల ప్రాంతంలోని మొదలికల్లు స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవస్థానం. మలదకల్లు మల్దకల్లు అని కూడ పిలుస్తారు. దీనికి ఆదిశిలా క్షేత్ర మని పురాణ ప్రసిద్ధి. స్వామిని తిమ్మప్ప అనీ పిలుస్తారు.
నారద గిరి:
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి నాగర్ కర్నూలు రహదారిలో వట్టెం గ్రామం సమీపిస్తుండగా కుడి వైపు కనిపించేదే నారదగిరి.
తిరునగరి లక్ష్మణదా సనే సంకీర్తనాచార్యులు స్వామిపై 106 కీర్తనలు రచించినారు.
ఈ క్షేత్ర మహిమ గురించి "నారదగిరి" అనే పద్యకావ్యం నాచే రచింపబడి శ్రీ కపిలవాయి లింగమూర్తి గారికి అంకితం గావించబడింది.
తెల్ల రాళ్ళపల్లి:
ఇది కొల్లాపుర ప్రాంతంలోని సింగవట్నానికి సమీపంలోని క్షేత్రం. ఇప్పుడిది వనపర్తి జిల్లా కిందకు చేరింది. శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు స్వామి వారిపై ఒక శతకం రచించారు చాలా కాలం క్రితమే.
చక్ర తీర్థము:
నాగర్ కర్నూలు సమీపం లోని పెద్ద పల్లి గ్రామంలో నీటిబుగ్గ నుంచి ఉద్భవించినారు స్వామివారు. శ్రీ కపిలవాయి లింగమూర్తిగారు చాలాకాలం క్రితమే "చక్ర తీర్థ మాహాత్మ్య" మనే కావ్యాన్ని రచించినారు. ఇటీవల శ్రీ బాసా వేంకటేశ్వర్లు గా రనే కవి స్వామివారిపై ఒక శతకాన్ని రచించారు.
భారతంబున ముస్లిముల్ లే రనకుడు..
"భారతంబున ముస్లిముల్ లే రనకుడు..
సరిగ భీష్ముడే.. ఆవొ ఉస్మాను భాయి..
యనియె.." ననె రాము, సోమేమొ "యటుల పలుక
వచ్చునె! యది..ఆయుష్మాన్ భవ!" యని తెలిపె..
కపిలవాయి గురుడు కలవాడు.. కలవాడు..( గురు స్తుతి )
గురు స్తుతి
కపిలవాయి గురుడు కలవాడు.. కలవాడు..
లేనివాడు.. గురుడు లేని వాడు..
గురుడు గలుగువాడు గొప్పవా డేనాడు..
నిక్క మట్టివాడ.. నేను గూడ..
శ్రీ కపిలవాయి వంటి గురుడు ఎవని కుంటాడో అతడే (అన్నీ) ఉన్నవాడు. గురుడు లేనివా డెవడో వాడే (అన్నీ) లేనివాడు. ఏనాటికైనా గురు డున్న వాడే గొప్పవాడు. నిజానికి నేనూ అలాంటివాడినే!
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం.....
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం
మొదటి పేరు చక్కనిది మహాదేవుండు
నిలను రెండవది మహేశ్వరుండు
పొసగ శంకరుండు మూడవ పేరౌను
పరగ నాలుగు వృషభ ధ్వజుండు 1
ఐదు కృత్తివాసుడు.. చక్కనైన పేరు.
ఆరు కామాంగ నాశను డనెడు పేరు.
ఏడు దేవ దేవేశుడు నింపు మెరయు
నెనిమిది మరి శ్రీకంఠుండు, మనము మురియు 2
ఈశ్వరుడు తొమ్మిదవ పేరు శాశ్వతముగ
పార్వతీపతి.. సుఖ మిచ్చు పదవ పేరు
రుద్రుడు పదకొండవ పేరు.. భద్ర మగును
శివుడు పదియురెం డవ పేరు.. శివ మొసగును 3
ఈ పది రెం డగు పేరుల
నోపికగా స్మరణ చేయు నుత్తము లెల్లన్
పాపంబులు నశియింపగ
నా పరమేశ్వరుని లోక మందుదురు సుమా! 4
శంకర ప్రియుల మనాన జననమంది
శంకర ప్రియుల కలాన సౌరు మీరి
శంకర ప్రియులకు నెల్ల సౌఖ్య మొసగు
శంకర ప్రియ నామాలు జయము గూర్చు 6
శివ ద్వాదశ నామ స్తోత్రమ్ - ప్రథమంతు మహాదేవో....
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రమ్
ప్రథమంతు మహాదేవో..
ద్వితీయస్తు మహేశ్వరః..
తృతీయః శంకరో జ్ఞేయః..
చతుర్థో వృషభ ధ్వజః..
పంచమః కృతివాసశ్చ..
షష్ఠః కామాంగ నాశనః..
సప్తమో దేవ దేవేశః..
శ్రీకంఠ శ్చాష్టమః స్మృతః..
ఈశ్వరో నవమో జ్ఞేయః..
దశమః పార్వతీ పతిః..
రుద్ర ఏకాదశ శ్చైవ..
ద్వాదశః శివ ఉచ్యతే..
🚩ఫలశ్రుతిః
ద్వాదశైతాని నామాని
త్రిసంధ్యం యః పఠేన్నరః
ముచ్యతే సర్వ పాపేభ్యో
రుద్రలోకం స గచ్ఛతి..
చెల్లి వంటఁ జేయుచునుండఁ జేరి యక్క
చెల్లి వంటఁ జేయుచునుండఁ జేరి యక్క
"నీవు కుక్కా!"యనుచుఁ బల్కె నిక్కి యపుడు
తాను 'కుక్కనా' యనుచు బాధపడి చెల్లి
పలికె "నవు నక్క!" యని 'నక్క' పదము దొరల
ఆమ్మ పే రేమి!”టన్నచో నాత డపుడు
"ఆమ్మ పే రేమి!”టన్నచో నాత డపుడు
"బాల్ ఫ్లవరు గోల్డు మద" రని పలికినాడు
"అసలు పే రేమిటో చెప్పు" మంటి.. చెప్పె...
బంతిపూల బంగారమ్మ.. పడతి పేరు.
"వాసి గాంచె.. టెంపుల్ స్టెప్సు రైసు పీసు
మదరు..మా యమ్మ" యని పల్కె మధురముగను,
"అసలు పే రేమిటో చెప్పు మంటి".. చెప్పె...
వినగ గుడిమెట్ల నూకలమ్మ నట ఆమె.....
రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన
"రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన
అవని నాగమశాస్త్రమ్ము ననుసరించి
మించి రాళ్ళను శిల్పీకరించినపుడు
మహిత విగ్రహమ్ము లగును,మంత్ర పూత
ముగ ప్రతిష్ఠించినప్పుడు మోదమొసగు
దేవతార్చన కర్హమ్ములౌ వసుధను..
భారతీయు లీ విధముగా పలుకరాదు.
"రాళ్ళు దేవత లగుదురా గుళ్ళలోన "
రాళ్ళు వీధులలో పడివుంటాయి. ఆగమశాస్త్రా న్ననుసరించి శిల్పంగా మలచినపుడు "రాళ్ళు" అని వాటిని పిలువరాదు . "దేవతావిగ్రహాలు" నాలి. (బంగారంగా వుంటే బంగార మంటాము ఉంగరంగా తయారు చేసినప్పుడు ఉంగరం అంటాము కదా! ఇక బంగారం అనవలసిన పనిలేదు. అట్లే ఇంకా ఎన్నో ఆభరణాలు) మంత్ర పురస్సరంగా ప్రతిష్ఠింపబడినప్పుడు ఆ విగ్రహాలు దేవతార్చనకు యోగ్యము లౌతాయి.
"గుడిలో రాయి వుంది" అని ఎవరూ అనరు. అనడమే తప్పు. "విగ్రహం వుంది" అనాలి. లేదా ఆ విగ్రహం ఏ దేవునికి ప్రతీకయో ఆ దేవు డున్నాడు.. అనాలి. ఉదాహరణకు "రామాలయంలో రాముని విగ్రహం వుంది." అనైనా అనాలి. లేదా "రాము డున్నాడు.." అనైనా అనాలి. అంతే గాని "గుడిలో రాయి వుంది.." అనే మాటయే పొసగదు.
వీధిలో పడివున్న దానిని విగ్రహం అనము కదా! విగ్రహాలను ఆ యా దేవతకు ప్రతీకలుగా భావించి ఆరాధిస్తే ఆ యా దేవతలు ప్రసన్నులై కోరిన కోరికలు తీరుస్తారు. కోట్లాదిమంది కిది అనుభవమే!
ఇదంతా నిరాధారమైనది కాదు. శాస్త్ర బద్ధమైన భారతీయ సంస్కృతిలో భాగం. కాబట్టి తెలుసుకోకుండా భారతీయు లీ విధంగా పలుకరాదు... అని ఒక గురువు శిష్యునికి చెప్పినాడు.
నాన్న నాస్పత్రిలో చేర్చినార" మనుచు
నాన్న నాస్పత్రిలో చేర్చినార" మనుచు
నేదొ సందేశమును పంప నిటుల వ్రాసి
రంత "థాంక్యూ వెరీమ" చ్చటంచు, క్రింద
నేమొ వ్రాసిరి "విష్ యూ ద సే" మటంచు
తెలుగుసినిమ నటుడు తేనె మనసువాడు
తెలుగుసినిమ నటుడు తేనె మనసువాడు
రీలుహీరొ కన్న రియలు హీరొ
ప్రాణములను వీడి పరలోకమున కేగె
చివరి వందనాలు సినిమ హీరొ!
మంచి మనిషియతడు మనసున్న సినిహీరొ
మంచి మనిషియతడు మనసున్న సినిహీరొ
కష్ట నష్ట ములకు కలిసెతోడు
కొత్తవరవడులను కొనితెచ్చె సినిమాలొ
విజయ "కృష్ణ" నీకు వీడుకోలు!
ఆంగ్ల వత్సరంబు నరుదెంచు నీవేళ
ఆంగ్ల వత్సరంబు నరుదెంచు నీవేళ
అవని జనులకెల్ల హర్షమగును
అర్ధరాత్రివేళ నాటపాటలతోడ
స్వాగతంబుబలుక సకలజనులు!
కరుణ జూపగలడు కలియుగ దైవంబు
కరుణ జూపగలడు కలియుగ దైవంబు
కొత్త వత్సరాన కోర్కె దీర్చు
మంచి పనులుజేయ మనసులో దలబోసి
కార్యసిద్ధి కొరకు కదలవలయు!!
స్వాగతంబు నీకు "సంక్రాంతి" లక్ష్మివై
స్వాగతంబు నీకు "సంక్రాంతి" లక్ష్మివై
దరికిజేర రమ్ము "ధాన్యలక్ష్మి"
కరువుకాటకంబు కనిపించ కుండగ
కనికరించవమ్మ కరుణతోడ!!
పసుపు కుంకుమలతొ పశువుల పూజించు
పసుపు కుంకుమలతొ పశువుల పూజించు
"కనుమ" పర్వదినము కనుల విందు
ఊరు వాడలందు నూరేగు బండ్లతో
పల్లె జనముకదియె పండుగనగ!
16, జనవరి 2023, సోమవారం
14, జనవరి 2023, శనివారం
12, జనవరి 2023, గురువారం
9, జనవరి 2023, సోమవారం
8, జనవరి 2023, ఆదివారం
7, జనవరి 2023, శనివారం
6, జనవరి 2023, శుక్రవారం
5, జనవరి 2023, గురువారం
4, జనవరి 2023, బుధవారం
3, జనవరి 2023, మంగళవారం
2, జనవరి 2023, సోమవారం
ప్రథమ శ్రోత యగునొ! పర్యవేక్షకు డౌనొ!
ప్రథమ శ్రోత యగునొ! పర్యవేక్షకు డౌనొ!
భాగవతము నేను పలుకుచుండ
పక్కజేరినాడు పార్థసారథి చూడు
వన్నెకాడు గడుసు చిన్నవాడు