ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శాసన కవులు
1. శ్రీరామపుణ్యవల్లభుడు :
. శా.శ. 604. క్రీ.శ. 682
ఇతడు పల్లెపాడు శాసనకర్త, పశ్చిమ చాళుక్య విక్రమాదిత్యుని ఆస్థాని, విగ్రహికుడైన జయననాధ మహారాజు యొక్క జామాత.
వినయాదిత్యుడు తన ద్వితీయరాజ్యవర్షంలో పాను గంటిలో దండు విడిసి క్రీ.శ. 27-4-682 నకు సరియైన వైశాఖ పూర్ణిమనాడు భారద్వాజసగోత్రుడు ప్రియంకర స్వామి మనుమడు, గోబ్దరిపుత్రుడు మరియు వేదపారగు డైన మాధవస్వామికి కృష్ణాతీరంలోని ధర్మపురికి రెండు క్రోసుల దూరానగల "పలియల" అనే గ్రామాన్ని స్వాషివ మహారాజు కోరికపై సర్వబాధా పరిహారంగా దానం చేసినాడు.
2. బిజ్జయ :
శా.శ. 910. క్రీ.శ. 988.
ఇతడు కన్నడ పండితుడు, అగస్త్యేశ్వర శాసన కర్త, శంకర సంధివిగ్రహి. శంకర సుచక్రవర్తి పంపన చక్రకోటమును పాలించే ధారావర్షుని పైకి దండెత్తి పోయి తిరిగి వస్తూ క్రీ.శ 1030 సర్వదారి భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం నాడు అ…
మరో రెండేండ్ల పిమ్మట క్రీ.శ. 1088 ఖర కార్తీక బహుళ సప్తమి ఆదివారం నాడు త్రైలోక్యమల్లుని రాణి చందలదేవి కందూరునాడులోని దొళగణ, వడ్డవాని, ఎన్నూటిలోని కంపణ, ఎత్తపి తొంబదిలోని క్షేబళియ, అనుమనిపల్లె బాడం పదకొండు సర్వబాధా పరిహారంగా యిచ్చింది.
3. కాంచన సేనపండితుడు :
చా.వి.శ. 29 శా.శ 1027 క్రీ.శ 1105.
ఇతడు కన్నడ పండితుడు. పూడూరు శాసనకర్త. పశ్చిమ చాళుక్య వంశీయుడైన త్రిభువనమల్లుని సామంతు డగు హల్లకరుసు ఆస్థానపండితుడు.
పూడూరుకు పుండ్రపురమని నామాంతరం. ఇది గద్వాలకు మొదటి రాజధాని. హల్లకరుసు అది రాజధానిగా గద్వాల ప్రాంతాన్ని పాలించినాడు. అతడు క్రీ.శ. 1105. ప్రభవ సంవత్సర అమావాస్య ఆదివారం మకర సంక్రాంతి నాడు తమ జైనమత గురువైన కనకసేన భట్టాచార్యునికి అక్కడి జినాలయనిర్వహణ నిమిత్తము కొన్ని దానాలు చేసి ఈ శాసనం వేయించినాడు.
4. సర్వాసి భట్టరు చా.వి.శా 35 శా.స 1033 క్రీ.శ.11 11
ఇతడు అలంపుర శాసనకర్త. త్రిభువనమల్లుని సామంతుడైన బిజ్జరసు ఆస్థాన పండితుడు.
బిజ్జరసు జీమూత వాహన వంశీ యుడు తగరపుర వరేశ్వరుడు. సువర్ణ గరుడ ద్వజుడు బెక్కం రాజధానిగా కొల్లాపూర్ ప్రాంతాన్ని పాలిస్తూ ఉదగార పోషణుడుగా ఉన్నాడు.
జీమూత వాహన వంశాన్ని పేర్కొనే శాసనాలు ఇది తప్ప మరోచోట లేవు.
బిజ్జరసు వ్యయ సంవత్సర ఉత్తరాయణ సంక్రాంతి సందర్భంలో తమ మహారాజుగారి నియోగాన అలంపుర స్వామికి ఆలయ ఖండ స్ఫుటిత జీర్ణోద్దారానికి, స్వామికి అంగరంగ భోగానికి గాను స్థానాధిపతియైన ధరణీంద్ర రాసి పండితునికి కొంత నీరునేల నిచ్చినాడు. ఈ శాసనం క్రీ.శ. 1110 నాటిది
5. త్రిపురాంతకుడు :
చా.వి.శ 40 క్రీ.శ 1038 క్రీ.శ. 1116.
ఇతడు పెద్ద కడుమూరి శాసనకర్త. సోమేశ్వరుని పుత్రుడు. ఈ సోమేశ్వరుడు ప్రసిద్ధ సారస్వతుడు.
త్రిపురాంతకుడు గురు బుధ శ్రీపాద పద్మాళి, మరియు కందూరు గోకర్ణ మహారాజుగారి సామంతుడైన సౌదరి బొల్లనాయయకుని ఆస్థాన విద్యాంసుడు.
కడుమూరికి కదంబపురమని నామాంతరం. సౌదరి-బొల్లనాయకుడు దాన్ని రాజధానిగా ఏలుతూ, చా.వి.శ 40. క్రీ.శ. 116 కీలక శ్రావణ అమావాస్య బుదవారం నాడు సూర్యగ్రహణ సందర్భంగా ఆచ్చటి బ్రహ్మేశ్వర దేవర ఆలయ జీర్ణోధరణకు అంగరంగ భోగానకు మల్లికార్జున, కేశవ దేవరల దీప దూప నై వేద్యాలకు, మామిండ్ల పల్లి నృసింహ దేవరకు, కొన్ని దానాలు చేసి ఈ శాసనం వేయించినాడు.
6. మయూర భట్టోపాధ్యాయుడు:
శా.శ.1098 క్రీ.శ1176
ఇతడు వెల్లంగోటి వసంతాపుర శాసనకర్త. దీన్ని పుడు పాలెక శాసన మంటున్నారు
నాగర్ కర్నూల్ తాలూకాలోని వర్ణమానపుర శా.శ. 9వ శతాబ్ది నాటికే పేరు చెందిన గ్రామము
ఈ వర్ధమానపుర బూదపుర శాసనాలనుబట్టి ఒకే కుటుం బానికి చెందిన మయూర భట్టోపాద్యాయుడు, ఈశ్వ రార్యుడు, అభినవ మయూరసూరి, ఈశ్వర భట్టోపా ధ్యాయుడు అని నలుగురు కవులు తెలుస్తున్నారు. వీరు తరణికంటివారు.
తరణికల్లు సౌర క్షేత్రం కాబట్టి యిక్కడి కవులు సూర్యోపాసకుడైన మయూరుని అభిమానించి అతని పేరును తమకు పేరుగాను, బిరుదుగాను పెట్టుకున్నారు.
మయూర డట్టోపాధ్యాయుడు సంస్కృతంలో కావ్యకర్త. మయూరుని అంతటివాడు. ఇతని శైలి అతని వలెనే ప్రౌఢమై గంభీరంగా ఉంటుంది.
గోకర్ణుడు లింగాల గ్రామాన్ని సోమశిలలోని స్వామికి దానం చేసినాడు. ఇది వనంతాపుర శాసనం పిమ్మట వచ్చిన శాసనం. శైలినిబట్టి ఇది కూడ మయూర చట్టోపాధ్యాయుడే రచించినాడనవలె.
7. ఈశ్వరార్యుడు :
శా.శ.1136. క్రీ.శ. 1214.
ఇతడు వర్ధమానపుర శాసన రచయిత.
గోన గణపిరెడ్డి తమ తండ్రి పేర బుద్ధేశ్వరుని, చక్రవర్తి పేర సహస్ర గణపతీశ్వరుని, భీమదేవ ప్రగడ తన తల్లిదంద్రుల పేర శ్రీ లక్ష్మీనరసింహ దేవర, నారాయణ దేవరలను స్వభాను మాఘ శుద్ధ దశమి నాడు, అనగా సంవత్సరం నిండే లోపల ప్రతిష్ఠ చేయించి ఆ దేవరలకు మరో మూడేండ్లకు అనగా వ్యయ సంవత్సర చైత్ర బహుళ దశమి మంగళవారం వృష సంక్రాంతి నాడు వృత్తులు పెట్టించి ఈ శాసనం వేయించినాడు.
8. అభినవ మయూర మారి:
శా.శ.1167 క్రీ.శ 1245.
ఇరిడు నాగేశ శాసన కర్త. వర్దమానపురంలోని మల్యాల గుండయ శావనానికి నాగేశ శాసనమని పేరు.
ఈ కవీశుడు ఈశ్వరార్యుని కుమారుడు. మల్యాల గుండయ గారి ఆస్థాన పండితుడు. గుండయ గారు వర్థమానపురానికి గణపిరెడ్డి పిమ్మట పదవికి వచ్చిన ప్రభువు.
వర్ధమానపురంలో వీరు వచ్చే నాటికే ప్రాచీనమైన ఒక నాగేశ్వరాలయం ఉన్నది. దాన్ని ఎవరు ప్రతిష్ఠిం చింది తెలియదు. గుండయ గారా దేవరకు ప్రాకార గోపురో పేతమైన ఆయతనం కట్టించి క్రీ.శ 1167 విశ్వావసు పుష్య అమావాస్య శుక్రవారం సూర్యగ్రహణ సంద ర్భంలో ఆ స్వామికి అంగరంగ భోగాలకుగాను పిన్నలట్టుపల్లిని సర్వనమస్యంగా సమర్పించి ఈ శాసనం చెప్పించి నాడు.
శాసనం చెప్పిన మయూరసూరికి అక్కడనే రెండు మరుతురుల నీరు నేల, రెండు మరుతురుల వెలిపొలం యిచ్చినాడు.
మయూర సూరి సంస్కృతాంధ్రాలలో అసమాన ప్రతిభ గలవాడు. పదవాక్య ప్రమాణప్రమేయ తత్వజ్ఞుడు. విచిత్ర కవిత్వ నిపుణుడు. శాసనాంతంలో ఇతడు రచిం చిన చక్రబంధంలో రెండవ వలయంలో "నాగేశ శాసనం," నాలుగవ వలయంలో "మయూర రచితం" ఏడవ వలయంలో "గు…
అక్కడ తన తల్లి పేర బాచసముద్రం, భార్య పేర కుప్ప సముద్రం అనే రెండు చెరువులు వేయించి బాచసముద్రం నుండి కుప్పసముద్రంలోనికి ఒక కాలువను త్రవ్వించి ఆ చెరువులపై వారి పేర రెండు గుడులు కూడ కట్టించినాడు.
పిమ్మట తమ మహారాజు పేర గణప సముద్రం వేయించి, శా శ.1184=క్రీ.శ. 1262 రుధిరోద్గారి శ్రావణ పూర్ణిను చంద్రగ్రహణంనాడు దాని క్రింద బ్రాహ్మణులకు క్షేత్రాలిచ్చినాడు.
అనంతరం గుండయ్యగారు బూదపురంలోనే మర ణించగా ఆయన భార్య కుప్పమ్మగారు శా.శ. 1198= క్రీ.శ. 1276 ధాత మాఘ శుద్ద దశమి గురువారంనాడు తన కుమారులతో సోదరులతో కలిసి అక్కడ గుండేశ్వర ప్రతిష్ఠ చేయించి, తన భర్త త్రవ్వించిన మూడు చెరువుల క్రింద గుండేశ్వర దేవర పూజారులకు వృత్తు లిచ్చింది.
వై మూడు సందర్భాలలో ఈశ్వరభట్టోపాధ్యా యుడు శాసనాలు రచించినాడు. వానిలో రెండవదైన గణప సముద్ర శాసనానికి శాసన వాఙ్మయంలో ఒక ప్రత్యేకత ఉంది. దానిలో ఇతడు నిర్దంత్య, నిస్తాలవ్య, నిష్కంఠ్య, నిరోష్ఠ్య, అదృతాది శబ్ద చిత్రాలు, క్రియా పదప్రాయిక, పునరుక్తవదాబాన క్రియా పదత్రయ గోపక, అక్షర ముష్టికాది వాక్య చిత్రాలు, ఆర్యాగుచ్ఛ మిధునావళ్యాది అపూర్వ వృత్తాలు రచించి, తనకుగల పాణినీయ వ్యాకరణాది పాండిత్యమును కున్నాడు. వెల్లడించుకున్నాడు
10. విష్ణునూరి : శా.శ..1216 క్రీ.శ 1295.
ఇతడు మగతల శాసనకర్త. మల్లినాథుని కుమా రుడు. అద్వయానంద కృష్ణుని శిష్యుడు.
మగతలకు "మఖస్థలి" యని సంస్కృత వ్యవ హారం. పూర్వం అక్కడ చాలా బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారందరు ఎల్లపుడు యజ్ఞాలు చేస్తుండేవారట.
ఈ పట్టణాన్ని శా.శ. 1216 లో దేవగిరి యాదవ రామ చంద్రదేవుని సామంతుడుగా స్థాణుచమూపతి పాలించి నాడు. అతడు జయ సంవత్సర పుష్య అమావాస్య ఆదివారంనాడు ఆర్థోదయ పుణ్యకాలంలో (6-1-1295) మగతల విషయంలోని గన్నెనాయకపల్లి స్వయంభూనాథు నికి జీర్ణమైపోయిన ఒక దానాన్ని పునరుద్ధరించి ఈ శాసనం చెప్పించినాడు.
శ్రీ విష్ణుసూరి శైలి ప్రౌడమై సరసంగా ఉంటుంది.
11. వంగూరి తిప్పయభట్టు :
శా. శ.1298 =క్రీ.శ.1376.
ఇతడు దేవరకొండ ప్రభువు మాదానాయని యొక్క ఉమామహేశ్వర శాసనానికి ఆజ్ఞప్తి.
మాధవనాయడు దేవరకొండ దగ్గర తన పేర మాధవ పురం కట్టించుకుని అక్కడి నుండి తెలంగాణా భాగాన్ని ఏలుతూ, శా.శ. 1298 నల సంవత్సర మాఘ మాసంలో నేటి అచ్చంపేట తాలూకాలోని ఉమామహేశ్వ రంలో ఇపుడున్న శిలామంటపం కట్టించి తమ ఆస్థాన పండితుడైన మాయిభట్టుచేత శాసనాన్ని చెప్పించినాడు. అపుడు దాన్ని చెక్కించటానికి ఉమామహేశ్వరం వచ్చిన ఈ తిప్పయభట్టు ఆశువుగా రెండు శ్లోకాలు చెప్పినాడు.
12. నృసింహాధ్వరి :
శా.శ. 1320= క్రీ.శ 1398.
ఇతడుమామహేశ్వర శాసనకర్త. నారసింహుని సుతుడు. భారతీ సంప్రదాయానికి చెందిన సదానందుని శిష్యుడు. దేచినేనివారి ఆస్థాన విద్వాంసుడు.
దేచినేనివారు పల్నాటి నుండి రుద్రదేవుని సీమకు వచ్చిన వెలమలు. వారు మొదట మున్ననూరిలో ఉన్నారు. ఇపుడీ వంశం కొండనాగులలో ఉంది.
ఈ వంశానికి చెందిన నరసమాంబ కుమారులు పురుషోత్తముడు, హనుమడు, రంగడు అనే సోదరులు శా. శ 1320 బహుధాన్య సంవత్సర నిజజ్యేష్ఠ పూర్ణిమ సోమవారంనాడు ఉమామహేశ్వరంలో పార్వతిని, నందీ శ్వరుని ప్రతిష్ఠించి ఈ శాసనం చెప్పించినారు.
ఈ శాసనంలో గూడ చక్రబంధం ఉంది. దాన్ని బట్టి నృసింహాధ్వరి చతుర్విధ కవితా నిర్వాహకుడనవలసి ఉంది.
13. చోళరాజ ఒడయరు
శా.శ.1298 తరువాత
ఇతడు ఎక్కడివాడో తెలియదు కాని ఉమామహే శ్వరంలోని మంటప స్తంబముపై ఇతనిది ఒక శ్లోకం ఉంది. ఈ మంటపం క్రీ.శ. 1376 లో నిర్మించబడింది. కాబట్టి ఇతడు 14 వ శతాబ్దంవాడు కావలె.
14. వెంకట భట్టోపాధ్యాయుడు :
శా.శ. 1390= క్రీ.శ 1468.
ఇతడు మునిపుర శాసనకర్త వేదశాస్త్రార్థతత్వ జ్ఞుడైన శోత్రియుడు. సంస్కృతాంధ్రాలలో సమాన ప్రజ్ఞ కలవాడు.
14 శతాబ్ది ప్రథమ పాదంలో రుద్రదేవుని సీమ అనబడే అమరాబాదు పీఠభూమిని మునిపురం అనబడే మున్ననూరును కేంద్రంగా చేసుకుని నంది మల్లారెడ్డి పాలించినాడు. అతడు మోటాటి శాఖకు చెందినవాడు. నడిపిట్ల గోత్రోద్భవుడు. సర్వమాంబా తిమ్మభూపతుల కుమారుడు. మీసర గండ బిరుదాంచితుడు. ఈ వంశం పేరు న యిక్కడ తప్ప మరోచోట కనిపించదు.
ఇతడు శా.శ. 1390 క్రీ.శ. 1468 కీలక మార్గ శిరంలో మున్ననూరిలో విజయగోపాలస్వామికి గర్భమందిరాంతరాళాది మండపాలు, ప్రాకారం కట్టించి. పుష్కరిణి త్రవ్వించి దీపస్తంభ మెత్తించి శాసనం చెప్పించినాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి