మొత్తం పేజీ వీక్షణలు

29, సెప్టెంబర్ 2025, సోమవారం

వాస్తు యొక్క వాస్తవాలు - విశేషాలు

 వాస్తు యొక్క వాస్తవాలు - విశేషాలు

వస నివాసే అను ధాతువు నుండి వాస్తు శబ్ధమేర్పడిరది. తరువాత దానినుండియే వసతి బస్తి అనే పదాలు నిష్పన్నమైనవి. వసతి అంటే ఈనాడు సౌకర్యమని, బస్తి అంటే అధికమైన జనాభా గల గ్రామమని అర్ధం. జనాభా ఎక్కువై గ్రామం నగరంగా మారినపుడు వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు కుంచించుకొని పోతవి, కాబట్టి అపుడిరటికి కావలసిన దొడ్డి, మరుగుదొడ్డి, నూయి మొదలైనవన్నీ ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అందుచేత అటువంటి అన్ని సౌకర్యాలుండటాన్నే ఇపుడు మనం వసతి అంటున్నాం. ఈ వసతిని గురించి తెలిపేదానికే ‘వాస్తు’ శాస్త్రమని పేరు.

ఒక ఇంటిలో వసతులన్నీ ఉండటం వేరు, ఆ ఇంటిలో నివసించే వారికి ఆత్మశాంతి ఉండటం వేరు. వసతులు బాహ్యమైనవి కాబట్టి అవి ఇంద్రియ శ్రమను తగ్గించగలవేగాని ఆనందాన్నీయలేవు. అది ఆత్మ సంబంధి కాబట్టి వస్తుబలం కంటె వాస్తుబలంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

ఈనాడు మనం పట్టణాలలో అనేకమైన ఇండ్లు చూస్తుంటాం. అవి అన్ని హంగులలోను, రంగులలోను ఎంతో నేత్రపర్వంగా కనిపించినా, అందులో నివసించే వారు మాత్రం నిరంతరం ఏవో సమస్యలతో వేగుతూనే ఉంటారు. అందుచేత మన పూర్వులు ఇంటిలోని వస్తువుల కంటె ఇంటి వాస్తుకెక్కువ ప్రాముఖ్యమిచ్చినారు. 

వాస్తు ఒక శాస్త్రమా! నిర్జీవమైన ఇల్లు మేధావంతుడైన ఒక వ్యక్తిపై తన ప్రభావాన్ని ఎట్లా చూపుతుంది` అని ఈనాటి విజ్ఞుల భావన. కానీ ఇటీవల వచ్చిన వాస్తు రచన లనేకం ఆలయాలను, ఫ్యాక్టరీలను, మహాపురుషులు నివసించిన ఇండ్లను అధ్యయనం చేసి వాని ఉత్తానపతనాల నిర్మాణాల యొక్క వాస్తుబలమే ఒక ముఖ్య కారణమని సోదాహరణంగా చూపుతున్నారు. అందుచేత ఇపుడు గృహస్థులు తమ ఇండ్లలోని ఎడతెగని సమస్యలకు ఏదో కర్మ అని సరి పెట్టుకోక తమ ఇంటికేసి గూడ ఒకసారి చూచుకోవలసి ఉంది.

మానవునికి తన జీవితంలో అన్నిటికంటె ఘనిష్ఠ సంబంధం కలది తన నివాసమైన ఇల్లు, కనుక మొదలతడు దానిని సరిచూసుకోవలసి ఉంది. అందుకొరకు శ్రీ జి. పాండురంగారెడ్డి గారి వాస్తు - వాస్తవాలు (సంక్షిప్త సూచనలు) అనే ఈ చిన్న పుస్తకం సామాన్యులకు గూడ తెలిసే పద్ధతిలో ప్రాథమిక విషయాలన్నీ సమగ్రంగా చేర్చి వ్రాయబడిరది. కాబట్టి గృహస్థులు దీని అధ్యయనం చేత తమకు గల ఇంటి సంబంధమైన ఇబ్బందులను తొలగించుకొని సుఖశాంతులు పొందుదురని ఆశించుచున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి