మొత్తం పేజీ వీక్షణలు

8, అక్టోబర్ 2022, శనివారం

ఓంకారేశ! భజించెదన్ మదిని నే వో కోరికల్ లేకయే

 ఓంకారేశ్వర స్తుతి


ఓంకారేశ! భజించెదన్ మదిని నే 

   వో కోరికల్ లేకయే 

శంకల్ వీడి సతంబు నీ భజనమే 

   చాలంచు మేలంచు నీ 

యంకమ్మందు వసించుటే జనికి ధ 

   న్యత్వంబు లెమ్మంచు పత్

పంకేజాతము లాశ్రయించెద నయా! 

   భక్త ప్రియా! లింగయా!


       


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి