మొత్తం పేజీ వీక్షణలు

23, అక్టోబర్ 2022, ఆదివారం

తక్కువ వాడు కా డతడు, తండ్రివలెన్ దరిజేర్చి, యెంతయో

 తక్కువ వాడు కా డతడు,

        తండ్రివలెన్ దరిజేర్చి, యెంతయో

     చక్కగ తత్త్వమున్ దెలిపి,

        సారెకు సారెకు దాని మర్మముల్

     పెక్కులు విప్పి చెప్పుచును

        ప్రేమను పంచిన లింగమూర్తి మా

     కొక్కడు చాలడా గురుడు

        నుర్విని జన్మ తరింపజేయగా!..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి