శ్రీ సంగమేశ్వర స్థలపురాణము (కృష్ణాపుష్కర మాహాత్మ్యము) దక్షణ పీఠభూమియందు కృష్ణానది గోదావరి కంటే ప్రాచీనమైన దని పరిశోధకుల మతము, దాని యందెన్నియో ఉపనదులు కలిసినవి. ఆ తీరమున నెన్నియో క్షేత్రములు వెలిసినవి.
తెలుగువారు రెండునదులు గలియు స్థానమును ‘‘సంగము’’ అని పిలుతురు. అది వారికి మిక్కిలి పవిత్రమైనది. సంగమ స్థానమున నదులెన్ని గూడిన ఎడల దాని మహిమ అంత ఎక్కువ. అచట స్నానము జేసిన ఎడల ఆ నదులన్నిటి యందు విడివిడిగా స్నానమాడిన ఫలము గలుగును.
ఈ స్థలపురాణము అటు వంటి ఒక ‘సంగము’ ను గురించి తెలుపును. అచట కృష్ణయందైదు నదులు గలియును. దానిలో ఒకేచోట నిన్ని నదులు గలియుటరుదు గనుక కృష్ణాతీరమున సంగమేశ్వరమునకు మిక్కిలి ప్రాధాన్యత యున్నది. ఇచట కృష్ణ కవ్వలి తీరమున నంది కొటుకూరు తాలూకాలో సంగమేశ్వర, సిద్ధేశ్వర, కపిలేశ్వరములు ఈవలి తీరమున మహబూబ్‌నగర్ జిల్లాలో మల్లేశ్వర సోమేశ్వరములున్నవి.
ఈ కృతియందు పై మాహాత్మ్యము చెప్పబడినది. ఇది యనువాదకృతి. దీని మాలమున సప్తాధ్యాయ పరిమితమైన యొక లఘు గ్రంథము. అందలి ఇతివృత్తము నదుల ప్రవేశముతో ముగియును. అనువాదకుడీ గ్రంథమున యెడనెడ నవసరమైన శ్లోకములుద్ధరించుచు సరళముగా రచించినాడు. దీనిలో మొత్తమిరువది శీర్షికలున్నవి.
వానిలో పదునారు కేవల మాహాత్మ్యములు, తక్కినవి యితరములు. ఇతరములలో కాకేతిహాసము విశ్వామిత్ర తపోభంగము అను రెండు కావ్యోచితమైన సంగతులు. వానిలో కాకేతిహాసము, అయాచితోపాఖ్యానము (పాతాళగంగాపురాణము) పేర ఇంత వరకే ప్రబంధముగా వచ్చినది. ఈ యనువాదమున కృతికర్త మూలమునకు న్యాయము చేకూర్చెను గాని ఈ వేమనకు గడచిన యుగములనాటి చరిత్రనే గాక కలియుగమునాటి చరిత్ర గూడ కొంత యున్నది.
క్రీ.శ. 988లో నిచట చిదీశ్వర పండితుడు అను నొక మహానీయుడు ఒక సత్రము నడుపుచుండెను. దానికి పశ్చిమ చాళుక్య సామంతుడైన శంకరు సుచక్ర కూటముపైకి దండెత్తి పోయి తిరుగు పయనమున వడ్డవాని సీమలోని చెన్నంపల్లె గ్రామమును దానము జేసి వెళ్ళెను. క్రీ.శ. 1032లో ఆరవ విత్రమాదిత్యని కుమారుడు తైలపుడు ఇచట చందలేశ్వరుని ప్రతిష్టించి పుస్తకమునకు విషయసూచిక కూడ ముఖ్యము.
అది లేక పోవుట గూడ యొక లోపమే గనుక మలి ముద్రణలో పూరింతురుగాక! పై ఒకటి, రెండులోపములు ప్రక్కకుంచిన స్థల విశేషములు, యుత్పత్తిమహిమలు తెలుసుకొనుటకు ఈ పుస్తకము చక్కగా నుపకరించును ఈనాడీ క్షేత్రము కృష్ణా గర్భమున కతీతమైనది కదాని స్మృతిగా వెలసిన ఈ కృతి యందరు జదువదగినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి