మొత్తం పేజీ వీక్షణలు

27, జులై 2025, ఆదివారం

ఇంజనీర్ నుండి నటుడిగా మారిన బాలయ్య

ఇంజనీర్ నుండి నటుడిగా మారిన వ్యక్తి

(మిస్టర్ బాలయ్య కళాత్మకత)

వినోద పరిశ్రమ యొక్క విశాలమైన రాజ్యంలో, ప్రతిభ వివిధ రూపాలను తీసుకుంటుంది మరియు లెక్కలేనన్ని ముఖాల ద్వారా కథలు విప్పుతుంది, నిజమైన ఇతిహాసాలుగా నిలిచే కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారిలో, అసాధారణ వ్యక్తిత్వం కలిగిన మిస్టర్ మన్నవ బాలయ్య తనదైన మార్గాన్ని ఏర్పరచుకుని తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. ఈ పుస్తకం అతని జీవితం, ఇంజనీర్ నుండి నటుడిగా ఆయన చేసిన అద్భుతమైన ప్రయాణం మరియు సినిమా ప్రపంచానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి ఒక వేడుక.

మిస్టర్ బాలయ్య కథ వాస్తవికతలోకి మారుతున్న రీల్ లాంటిది, చాలా మంది కలలు మరియు ఆకాంక్షలతో ప్రతిధ్వనించే కథ. ఇంజనీరింగ్‌లో దృఢమైన పునాదితో, తర్కం మరియు ఖచ్చితత్వంలో రాణించే మనస్సు ఆయనకు ఉంది. అయినప్పటికీ, విధి అతనికి వేరే ప్రణాళికను కలిగి ఉంది, ఎందుకంటే వెండితెర ఆకర్షణ ఒక తిరుగులేని శక్తితో ఆహ్వానించింది. సాహసోపేతమైన మరియు సాహసోపేతమైన చర్యలో, అతను ఇంజనీరింగ్ ప్రపంచాన్ని విడిచిపెట్టి నటనలో కెరీర్‌ను ప్రారంభించాడు, ఇంతటి నాటకీయ పరివర్తనను చేసిన అరుదైన నటులలో ఒకడు అయ్యాడు. 

ఈ అద్భుతమైన పరివర్తన కొంతమంది ప్రముఖ హాలీవుడ్ నటులను గుర్తుకు తెస్తుంది, వారు నటనా రంగాన్ని జయించడానికి తమ ప్రారంభ రంగాలకు మించి సాహసించారు. దిగ్గజ నటుడు దివంగత హీత్ లెడ్జర్‌తో మిస్టర్ బాలయ్య ప్రయాణానికి సమాంతరంగా కనిపించకుండా ఉండలేరు. ఇద్దరూ తమ తమ రంగాలపై లోతైన మక్కువను కలిగి ఉండి, ఊహించని విధంగా నటనా మార్గంలోకి మళ్లారు. మిస్టర్ బాలయ్య మాదిరిగానే, హీత్ లెడ్జర్ కూడా తన కళలో నిజమైన నిజాయితీని కలిగి ఉన్నాడు, తన ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో పరిశ్రమపై చెరగని ముద్ర వేశాడు.

మిస్టర్ బాలయ్య మాదిరిగానే, హాలీవుడ్‌లో నిబంధనలను ధిక్కరించి, పూర్తిగా భిన్నమైన విద్యా నేపథ్యం ఉన్నప్పటికీ నటనలో కెరీర్‌ను కొనసాగించిన కొంతమంది నటులు ఉన్నారు. అలాంటి వారిలో లెజెండరీ జేమ్స్ స్టీవర్ట్ ఒకరు, అతను నటుడిగా మారడానికి ముందు ఆర్కిటెక్చర్‌ను అభ్యసించాడు. అదేవిధంగా, విద్య ద్వారా ఇంజనీర్ అయిన మిస్టర్ బాలయ్య నటన పట్ల తనకున్న మక్కువను కొనసాగించాలని ఎంచుకున్నాడు మరియు మిగిలిన వారు, వారు చెప్పినట్లుగా, చరిత్ర.

బాలయ్యను నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన నైపుణ్యం పట్ల ఆయన నిజాయితీ మరియు అంకితభావం. ఆయన 350 కి పైగా చిత్రాలలో నటించారు, అనేక చిత్రాలకు స్క్రిప్ట్ రాశారు మరియు తన సొంత బ్యానర్‌లో ఆరు చిత్రాలను నిర్మించారు. ఆయన మృదుస్వభావి మరియు విస్తృత శ్రేణి పాత్రలను సులభంగా చిత్రీకరించగల సామర్థ్యం ఆయన అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.

డాక్టర్ కాంపల్లె రవిచంద్రన్, శ్రీ బాలయ్య నటనా సూక్ష్మ నైపుణ్యాల పొరలను వెలికితీసే ప్రతిష్టాత్మక ప్రయత్నాన్ని ప్రారంభించారు. శ్రీ బాలయ్య నటనా శైలిని విడదీసి, అర్థం చేసుకోవడానికి మరియు అభినందించడానికి సులభమైన రీతిలో ప్రదర్శించడంలో ఆయన అద్భుతమైన పని చేశారు. ఈ పుస్తకంలోని పేజీలను మనం లోతుగా పరిశీలిస్తే, శ్రీ బాలయ్య నటనా ప్రపంచంలోకి మనం తీసుకెళ్లబడతాము మరియు ఆయనను నిజంగా అద్భుతమైన నటుడిగా మార్చే సూక్ష్మ నైపుణ్యాలను మనం అభినందిస్తాము.

ఇది తెర సరిహద్దులను దాటిన భావోద్వేగాలను రేకెత్తిస్తూ, పాత్రలకు ప్రాణం పోసిన కళాకారుడికి నివాళి. ఈ పేజీలలో, పాఠకులు శ్రీ బాలయ్యను ఒక అద్భుతమైన శక్తిగా మార్చిన సంక్లిష్టమైన వివరాలు, సూక్ష్మబేధాలు మరియు అయస్కాంత ఉనికిని కనుగొంటారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నిజమైన రత్నం అయిన శ్రీ బాలయ్య నటనా సూక్ష్మ నైపుణ్యాలపై ఈ అంతర్దృష్టిగల పుస్తకానికి ముందుమాట రాయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. డాక్టర్ కాంపల్లె రచన శ్రీ బాలయ్య అంకితభావం మరియు మృదుభాషి ప్రవర్తన అప్రయత్నంగా తెరపైకి అనువదించబడిందని స్పష్టమవుతోంది. ఆయన నటనా కళ పట్ల ఆయన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయి, క్రమశిక్షణ గల మనస్సు యొక్క శక్తిని మరియు కరుణా హృదయం యొక్క లోతును ప్రదర్శిస్తాయి. ఆయనలో మూర్తీభవించిన ఈ నిజాయితీ మరియు వినయం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా సరిహద్దులు మరియు సంస్కృతులకు అతీతంగా ప్రతిధ్వనించే లక్షణాలు. శ్రీ బాలయ్య కృషి యొక్క సమగ్ర అన్వేషణ , సహాయ నటుడిగా ఆయన బహుముఖ ప్రజ్ఞ, ఆయన అసాధారణ స్క్రీన్ రైటింగ్ నైపుణ్యాలు మరియు సినీ నిర్మాతగా ఆయన ప్రతిభ వ్యక్తి యొక్క అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనం. 

-

25, జులై 2025, శుక్రవారం

బెడ్ రూం కొలతలు lakshmideviidol #hinduvastu #vasturemedies #bakthi #devo...

గొల్లపల్లి వేంకటదాసు

గొల్లపల్లి వేంకటదాసు
కేశంపేట కుత్తరంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గుట్ట ఉంది. దానికి ‘బొల్లిగట్టు’ అని పేరు. ఆ గట్టుపై తిరుమలయ్య అనే దైవం ఉన్నాడు. అతడు ప్రాచీనుడే. పాపిశెట్టి శ్రీరాములు ఇతనిని తన శతకంలో స్మరించినాడు. కాని ఈ దైవాన్ని పెద్దగా పట్టించుకున్న వారులేరు. ఈ గుట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో జూపల్లి బాలయ్య అనే భూస్వామి ఉన్నాడు. ఆయన భార్య నారమ్మ వీరి భూములు బొల్లిగట్టు క్రింద ఉన్నవి. 

బాలయ్యకు వెంకట్రావు, ధర్మారావు, కృష్ణారావు, బాల కూర్మారావు అని నలుగురు కుమారులు బుచ్చమ్మ అనే కూతురు కలిగింది. వీరిలో పెద్దవాడైన వేంకటరావుగారే ఈ వెంకటదాసు. 

దైవం ఎప్పుడు ఎవరిని ఎట్లా తనవైపు ఆకర్షించు ఉంటాడో చెప్పలేము. వేంకటదాసు బాల్యంలో తమ పశువులను బొల్లిగట్టు క్రిందనే మేపుతుండేవాడు. దానిపై రెండు గుండ్లు ఒకదానికొకటి ఆనుకొని చిన్న గుడివలె నిలిచినవి. దానిలో పలగల ఒక రాతికి నామాలు పెట్టి ప్రజలు తిరుమలయ్య అన్నారు. 

ఒక పర్యాయం వేంకటదాసు పశువులు మేపుతూ ఆలవోకగా ఆ గుట్టకేసి చూసినాడు. అపుడత నికి ఆగుట్టపైగల గుండ్లపై అతనికి శంఖచక్రాలతో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఇది అతనికి అనుకోని సంఘటన.

దానితో అతడు ఆచుట్టు ప్రక్కల తనవలెనే పశువులను మేపుతున్న బాలురను పిలుచుకొని ఒరేయ్‌ ఆ గుట్టకేసి చూడండిరా దానిపై వేంకటేశ్వరుడున్నాడు. నాకు కనిపించినాడు అని వారితో చెప్పి తాను రెండు చిన్నచిన్నరాళ్లు తీసుకొని వానినే తాళాలుగా చేసికొని హరేరామ హరేరామ హరేకృష్ణ హరే కృష్ణ అని పాట చెబుతూ వారితో భజన చేయటం ప్రారంభించినాడు.

ప్రతిదినం నాటినుండి పశువుల తోలుకొని రాగానే అతడొకసారి ఆ గుట్టకసి చూసేవాడు. అతనికి దివ్యదర్శనం జరిగేది. దానితో   అతడు తోడి పిల్లలు రాకున్నా రెండు రాళ్లు తీసుకొని తాళాలు వాయించుకొంటు దినం కొంతసేపు భజన చేయటం అతని నిత్య కృత్యమై హృదయంలో భక్తి బీజం అంకురించింది.

అట్లా ఉండగా ఒకప్పటి వేసవిలో పిల్లలందరూ కూడి ఒక మామిడితోటకు కాయలకోసరం చెట్లెక్కినారు. అప్పుడు వెంకటదాసు చెట్టుపైనుండిపడి ఒకచేయి విరిగింది. కట్టుకట్టినారు మూడు దినాలు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో శ్రీరాముడు కనిపించి ‘ఏం చేయి విరిగింది ఇంక భజన ఎట్లా చేయవలెనని చింతిస్తున్నావా! భయపడనవసరంలేదు. నీ చేయి ఎప్పటి వలె బాగుపడుతుంది’ అని చెప్పినాడు.

తెల్లవారిన పిమ్మట వెంకటదాసు ఆ స్వప్నం తల్లికి చెప్పినాడు. ఆమె శ్రీరామునికి దండం పెట్టింది. అతడు చెప్పినట్లు వేంకటదాసు చేయి ఎప్పటివలె బాగు పడిరది.

తర్వాత దినదినం వేంకటదాసులో భక్తి పెరుగుతూ అతడు పరధ్యానంగా ఉండసాగినాడు. అదిచూచి తల్లిదండ్రి పెళ్ళిచేస్తే వీని ధ్యాస మారుతుందని సూరమ్మ అనే ఒక కన్యను తెచ్చి వివాహం చేసినారు. అయినా అది భక్తి జీవితానికి ఏమీ ఆటంకం కాలేదు. 

అతనికి ఇక ఒక గురువును వెదుకుకోవలెననే సంకల్పం కలిగింది.
అప్పటికి ఉప్పరపల్లెకృష్ణదాసు పేరు చెందినాడు. అతడు షోలీపురం నరసింహ యోగి శిష్యుడు. మనిషి పొట్టిగా కుదిమట్టసంగా ఉండి పొడవాటి గడ్డంతో ఉండేవాడు, బ్రహ్మచారి.

వెంకటదాసు అతని దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి తనను శిష్యునిగా గ్రహించవలసినదని కోరినాడు. అది విని అతను సరే నేను మంత్రోపదేశం చేస్తాను గాని దాన్ని నీవు నిష్టతో అక్షర లక్ష జపించగలవా అని అడినాడు. అది విని వెంకటదాసు మంత్రాన్ని అక్షర లక్ష జపించెవలెనా! లక్ష్యశుద్ధిగా జపించవలెనా అని అడిగినాడు.

ఆ మాట వినగానే కృష్ణదాసుకు అతడు తనకు తగిన శిష్యుడనిపించింది. అతనిని వెంటనే శిష్యునిగా అంగీకరించి తారకముపదేశించినాడు. దానితో అతడి ల్లు విడిచి బొల్లిగట్టుపైననే నివాసం పెట్టినాడు. భక్తులు వచ్చి భజన చేయసాగినారు.

రేమద్దులలో కందూరప్ప సమాధి అయిపోయినాడు. అక్కడ కాళప్పకు తగిన సహవాసం లేకుండ అయింది. ఆయనకు వెంకటదాసు సంగతి తెలిసింది. దానితో అతడు వెంకటదాసును కొంతకాలం ఆశ్రయించినాడు.

వేంకటదాసుకు ఆ గుట్టపైననే ఒక ఆశ్రమం ఏర్పాటుచేయవలెనని ఉండేది. దానిపైగల గుహ చాలా చిన్నది. కాళప్ప అది చూచి వెంకటదాసు దగ్గరకు వచ్చే భక్తులను పట్టుకొని ఆ గుహను విస్తరించవలెనని తలచి వారితో పని ప్రారంభించి క్రమంగా ఆ గుహను ఆరడుగుల వెడల్పు పది అడుగుల పొడవు గలదానిగా త్రవ్వించి ఒక ద్వారం ఎత్తి దానికి గుహాలయం రూపమిచ్చినాడు.

గుట్టపై జరిగిన ఈ మరమ్మత్తు చూసి తురుక దిన్నెలక్ష్మారాయుడు క్రింద ఒక కొలను త్రవ్వించాడు.
వెంకటదాసుకు సంసార జీవితంలో కౌసల్య గోపెమ్మ చంద్రయ్య, విజయలక్ష్మి, శివలీల అని అయిదుగురు సంతానం కలిగినారు. కాని ఆయన సంసారబంధంలో చిక్కలేదు. దాని కతీతంగానే ఉండి రానురాను బొల్లిగట్టు నెక్కడం వీలుగాక ఆ గుట్ట క్రిందనే ఆయన ఆశ్రమం ఏర్పాటు చేసుకొనవలెననే సంకల్పం కలిగి వైకుంఠాశ్రమం పేర అక్కడ ఒక ఆశ్రమం ఏర్పరచుకొని మొదట ఒక ధ్యానమందిరం నిర్మించుకున్నాడు.

బాల్యంలో వెంకటదాసు చీరికపల్లి నుంచి నరసయ్యగారి దగ్గర కొంతకాలం వీధిబడిలో చదివినాడు. ఆనాటి వీధిబడి చదువు గట్టిది. దానిలో శతకాలు బాగా చదివినాడు కాబట్టి పద్యధాటి ఉండేది. ఆ ధాటితో వైకుంఠాశ్రమంలో కొన్ని కీర్తనలు చెప్పినాడట. అవి ఆయన శిష్యుల నోళ్లలోనే ఉండిపోయినవి.

వెంకటదాసు వైకుంఠాశ్రమం స్థాపించిన తర్వాత గొల్లపల్లిలోనే ఉన్న వేంకటదాసు మేనమామ ఒకాయన కాశీయాత్ర చేసి అక్కడినుండి ఒక శివలింగాన్ని తెచ్చి అతనికిచ్చినాడు. ఆయన దానికి పానవట్టం చేయించి తన ఆశ్రమంలో ప్రతిష్టించుకోగా కేశంపేట జగన్నాథరావుగారి భార్య అది చూచి ఒక పార్వతీదేవి ప్రతిమను చేయించి ఇచ్చింది.

ఆ విధంగా అక్కడ ఇపుడు శివాలయం, పార్వతీ ఆలయం, గణపతి ఆలయం, ఆయన ధ్యానమందిరం వెంకటదాసు ఇపుడు గతించినాడు. కాబట్టి అతని సమాధి మందిరము ఒక్కొక్కటిగా వెలసి ఇపుడొక ఆలయ సముదాయంగా రూపొందింది.

భక్తులాయన కిపుడు శిలాప్రతిమను కూడ చేయించినారు. వెంకటదాసు నరసింహయోగివలె ఏ మహిమలు చూపకున్నా అచ్చమైన భక్తిమార్గంలో నిలిచి  గురువు అనిపించుకున్నాడు. ఆయనకు గూడ ఎందరో శిష్యులేర్పడినారు. ఆయన అనంతరం వైకుంఠాశ్రమాన్నిపుడు కొల్లాపురం నివాసి కృష్ణవేణమ్మగారు నిర్వహిస్తుంది. ఇది చక్కగా పూలచెట్లతో నెమళ్లు మొదలైన పెంపుడు ప్రాణులతో అచ్చమైన ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తుంది.

Gas Cylinder Colors #decoding gas cylinders #lpggas #nitrogengas #oxygen...

21, జులై 2025, సోమవారం

దోమలు లేని దేశం ఏది #unknownfacts #interestingquestions #realfacts #true...

సంగమేశ్వర స్థలపురాణము

శ్రీ సంగమేశ్వర స్థలపురాణము (కృష్ణాపుష్కర మాహాత్మ్యము) దక్షణ పీఠభూమియందు కృష్ణానది గోదావరి కంటే ప్రాచీనమైన దని పరిశోధకుల మతము, దాని యందెన్నియో ఉపనదులు కలిసినవి. ఆ తీరమున నెన్నియో క్షేత్రములు వెలిసినవి. 

తెలుగువారు రెండునదులు గలియు స్థానమును ‘‘సంగము’’ అని పిలుతురు. అది వారికి మిక్కిలి పవిత్రమైనది. సంగమ స్థానమున నదులెన్ని గూడిన ఎడల దాని మహిమ అంత ఎక్కువ. అచట స్నానము జేసిన ఎడల ఆ నదులన్నిటి యందు విడివిడిగా స్నానమాడిన ఫలము గలుగును. 

ఈ స్థలపురాణము అటు వంటి ఒక ‘సంగము’ ను గురించి తెలుపును. అచట కృష్ణయందైదు నదులు గలియును. దానిలో ఒకేచోట నిన్ని నదులు గలియుటరుదు గనుక కృష్ణాతీరమున సంగమేశ్వరమునకు మిక్కిలి ప్రాధాన్యత యున్నది. ఇచట కృష్ణ కవ్వలి తీరమున నంది కొటుకూరు తాలూకాలో సంగమేశ్వర, సిద్ధేశ్వర, కపిలేశ్వరములు ఈవలి తీరమున మహబూబ్‌నగర్‌ జిల్లాలో మల్లేశ్వర సోమేశ్వరములున్నవి.

 ఈ కృతియందు పై మాహాత్మ్యము చెప్పబడినది. ఇది యనువాదకృతి. దీని మాలమున సప్తాధ్యాయ పరిమితమైన యొక లఘు గ్రంథము. అందలి ఇతివృత్తము నదుల ప్రవేశముతో ముగియును. అనువాదకుడీ గ్రంథమున యెడనెడ నవసరమైన శ్లోకములుద్ధరించుచు సరళముగా రచించినాడు. దీనిలో మొత్తమిరువది శీర్షికలున్నవి. 

వానిలో పదునారు కేవల మాహాత్మ్యములు, తక్కినవి యితరములు. ఇతరములలో కాకేతిహాసము విశ్వామిత్ర తపోభంగము అను రెండు కావ్యోచితమైన సంగతులు. వానిలో కాకేతిహాసము, అయాచితోపాఖ్యానము (పాతాళగంగాపురాణము) పేర ఇంత వరకే ప్రబంధముగా వచ్చినది. ఈ యనువాదమున కృతికర్త మూలమునకు న్యాయము చేకూర్చెను గాని ఈ వేమనకు గడచిన యుగములనాటి చరిత్రనే గాక కలియుగమునాటి చరిత్ర గూడ కొంత యున్నది. 

క్రీ.శ. 988లో నిచట చిదీశ్వర పండితుడు అను నొక మహానీయుడు ఒక సత్రము నడుపుచుండెను. దానికి పశ్చిమ చాళుక్య సామంతుడైన శంకరు సుచక్ర కూటముపైకి దండెత్తి పోయి తిరుగు పయనమున వడ్డవాని సీమలోని చెన్నంపల్లె గ్రామమును దానము జేసి వెళ్ళెను. క్రీ.శ. 1032లో ఆరవ విత్రమాదిత్యని కుమారుడు తైలపుడు ఇచట చందలేశ్వరుని ప్రతిష్టించి పుస్తకమునకు విషయసూచిక కూడ ముఖ్యము. 

అది లేక పోవుట గూడ యొక లోపమే గనుక మలి ముద్రణలో పూరింతురుగాక! పై ఒకటి, రెండులోపములు ప్రక్కకుంచిన స్థల విశేషములు, యుత్పత్తిమహిమలు తెలుసుకొనుటకు ఈ పుస్తకము చక్కగా నుపకరించును ఈనాడీ క్షేత్రము కృష్ణా గర్భమున కతీతమైనది కదాని స్మృతిగా వెలసిన ఈ కృతి యందరు జదువదగినది.