మొత్తం పేజీ వీక్షణలు

5, అక్టోబర్ 2025, ఆదివారం

అక్టోబర్ మాసంలో జరిగిన సంఘటనలు #importanteventsinoctober #october month ...

Calendar festivals #March Calendar #2026 #Festivals 2026 #calendarhinduf...

nagar karnool cheruvu | mahabubnagar history | telanagana

నాగర్‌ కర్నూల్‌ చెఱువు 

దీనికి కేసరి సముద్రమని పేరు. దీన్ని కందసాని అనే ఆనాటి ప్రభువు గారి భోగపత్ని వేయించింది. ఆమె దీన్ని వేయించే అపుడు లెక్కల కోసమై వెల్దండ నుండి ఒక కరణం గారిని పిలిపించింది. చెఱువు తరువాత అతడిక్కడనే నిలిచిపోయినాడు. అతనికి చెఱువు వారు అని పేరేర్పడిరది. ఆ వంశంలోని చెఱువు రామారావుకు చరిత్ర అంతా హృత్కవిలెగా ఉండేది. ఆయన ఈ చెఱువును గురించి వేయేండ్ల నాటిది అనేవాడు. ఇప్పుడు మనం వేయేండ్ల పైది అనవలసి ఉంది. 

జానపదులు దీన్ని కాకతీయులు వేయించినారని నమ్ముతారు. కాని వారు వేయేండ్ల లోపలి వారేగాని పైవారు గారు. రామారావు గారి మాటలను బట్టి యిది చాళుక్యుల కాలం నాటిది. ఆ వంశంలో అరికేసరి నామాంకితులు ముగ్గురున్నారు. మనకు గడిచిన వేయేండ్లకు దగ్గర దగ్గరగా మూడవ అరికేసరి నిలుస్తాడు. కనుక ఇది అతని కాలం నాటిది అనవలె. చాళుక్యుల కాలంలో కేసరి సముద్రాలు రెండు మూడు వేయించబడినవి. 

చెఱువు వేయించే అపుడు ఆనాటి ప్రభువులు మొదట దానికట్టపై ముందు భాగంలోనే తమ యిష్ట దైవం యొక్క ప్రతిష్ఠ ప్రధానమైన తూముపై విష్ణు పాద ప్రతిష్ఠ చేసేవారు. కాకతీయులు శివ-విష్ణు-బ్రహ్మ, సూర్య గణపతి, కుమారస్వామి, సరస్వతి, సప్తమాతృకలు అనే బహుదేవతారాధకులు. పైగా వారు తమను పరిపాలితులమని చెప్పుకున్నారు. చెఱువులు వేయించే అపుడు దేవతా ప్రతిష్ఠ చేసే అపుడు అక్కడొక శాసనం తమ రాజకీయ చిహ్నంతో ప్రతిష్ఠించటం పరిపాటి. కాని యిక్కడ ఒక్క శాసనం గాని లేదా వారి రాజ లాంఛనమైన గుర్తు గాని యింతకాలం నుండి ఎక్కడా బయలు పడలేదు. అయితే ఈ చెఱువు మూడు నాలుగు తడవలు భారీగా తెగి సింహభాగమే కొట్టుకుపోయింది కాబట్టి ఆ ప్రళయంలో ఇక్కడ చెఱువు వేయించిన వారి చిహ్నం ఏదీ మిగులకుండ కొట్టుకుపోయి ఉండవచ్చు. అయినప్పటికి చెఱువు ఉత్తరం గట్టున నృసింహస్వామి దక్షిణం కొమ్మున ఈశ్వరుడు, కట్టపై మధ్యన మశమ్మ దేవత వున్నారు. ఆనాటి చెఱువు కొమ్ము శివాలయం ఈనాడు పోస్టాఫీసు వెనుక శిథిలమైపోయి అవశేషంగా మిగిలింది. చాళుక్యులు మాతృగణ పరిపాలితులు కనుక చెఱువు కట్టపై గల మశమ్మ వారి మాతృగణంలో ఒకతె అనుకోవలె. 

నేటి మైసూరు పూర్వం మహిషాసురుని రాజ్యమట. అతని తల్లి మహిషీదేవి ఇపుడు మైసూరులో చివరన కనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్క రవ్వంత ఆధారాన్ని బట్టియే అదిపుడు మనం చాళుక్యుల కాలానిని చాముండు దేవి ప్రసిద్ధం. ఆమె ఆ మహిషీ దేవికి ప్రతిరూపం. మనకు సప్తమాతృకలలో ఈ చాముండి 

ఈ చెఱువుకు కేసరి సముద్రం అని వ్యవహారం చాళుక్యుల యొక్క కేసరి సముద్రాలు వ్యక్తి వాచకాలే కాలేదు. గత శతాబ్దంలో ఎండవెట్లలో బలిజ సలేశ్వరం అనే గుమాస్తా పట్వారి ఉండేవాడు. అతనికి గూడ అతనితో మాట్లాడినాను. చెఱువు వేయి సంవత్సరాల నాటిదని అతడు గూడ అన్నాడు. ఈ చెఱువులో ఈ చెఱువు చరిత్రపై మంచి అవగాహన ఉండేది. నేను దీన్ని గుఱించి రెండుసార్లు అనుకోకుండా కలసి తిరుమలాపురం దారిన ఒక శిథిలాలయం ఉందట. దానికి శిఖేశ్వరాలయమని పేరట. ఈ విషయం నాతో సెట్టి నాగప్ప కూడ చెప్పినాడు కనుక ఈ చెఱువుకు మొదట శిఖేశ్వర సముద్రం అని పేరుండి కాలక్రమంలో కేసరి సముద్రమయిందా? అని సందేహం కలుగుతుంది. చెఱువు రామారావు మాత్రం యిది నృసింహ సాగరమే అన్నాడు. 

ఈ చెఱువుకు నాలుగు తూములున్నవి. మొదటిది నరసింహులు తూము, రెండవది మశమ్మ తూము, మూడవది బారుసావుల తూము, నాలుగవది కుక్కల తూము - ఇది దక్షిణం కొమ్మున ఉంది. 

నేనిక్కడికి 1954 జూన్లో వచ్చినాను. అప్పటికి కుక్కల తూము బాగా పోతున్నది. దాని వెనుక పెద్ద కతువ. ఆ కతువ నిండా తెల్ల తామరలు. తూము కాలువకు దక్షిణంగా మరొక మడుగు. ఆ మడుగులో తెల్ల కలువలు. శరదృతువు - వసంత ఋతువులు వచ్చినవంటే చెఱువెనుక ప్రదేశమంతా నయన మనోహరంగా ఉండేది. తామరలు కతువ నిండా విచ్చినపుడది దేవేంద్రుని దేహం వలె భాసించేది. 

గ్రామంలోని యువకులంతా రేపుమాపు స్నానాలకు తువ్వాలలు, బనీనులు ఉతుక్కోవటానికి చాలినంత అవకాశముండేది. నడియీడున నడుము నొప్పిగలవారు ప్రొద్దుననే వచ్చి ముఖం కడుక్కుని గ్రామంలోని యువకులకంతా రేవుమాపు స్నానాలకు తువ్వాలలు, బనీనులు ఉతుకుకోవటానికి స్నానం పేర తూముకడ్డంగా నిలిచేవారు. ఆ నీటి దెబ్బకు వారి నడుము నొప్పి సడలిపోతుండేది. ఆ తూము అలుగు పారినంతకాలం నాగర్‌ కర్నూల్‌ వారు నీటి ఎద్దడి ఎరుగరు. ఉభయ మధ్యలు ఆ తూము వెనుక కండ్ల వైభోగంగా ఉండేది. 

పల్లెటూళ్లలో చెఱువు కట్టలపై ఉండే దేవతలకు గూడ ఏటా ఒకసారి బోనాల పండుగ జరుపుతుంటారు. కాని మరి అదిక్కడ జరిపేవారో తెలియదు - కాని బార్సావుల ఉర్సు మాత్రం ఏటేటా తప్పక జరిగేది. ఈ బారావుల అసలు పేరు ‘బాలేషహీద్‌’. షహీద్‌ అనగా వీర మరణము చెందినవాడు. 

అల్లా ఉద్దీన్‌ తెలంగాణలోని కోటలపై దండెత్తుతూ గణపురంపై దాడి చేసి దాన్ని వశం చేసికొని బోదిర్సాబ్‌ - బాలెసాహెబ్‌ - అను ముగ్గురు ప్రతినిధులను అక్కడ ఉంచిపోయెను. అతడు వెళ్లిన పిమ్మట అంతవరకక్కడ ఉన్న గణపతిరెడ్డి వర్ధమానపురానికి వెళ్లిపోగా అతని వెన్నంటి వచ్చిన బాలేషహీద్‌ వర్ధమానపురంతో పాటు నాగర్‌ కర్నూల్‌ పై దండెత్తగా అక్కడ కేసరి సముద్రం యొక్క కట్ట వారికి రణరంగమై 

ఆ యుద్ధంలో బాసాహెబ్‌ హతమైనాడు. సమాధి చేసి మొదలొక చిన్న గుంబదు దాని ప్రక్కగా మినారు కట్టినారట. బాలేసాహెబ్‌ తోటివారివి గణపురంలో గుంబదులున్నవి. ఇక్కడ బాలేసాహెబ్‌ అక్కడ బోదిక్‌ సాహెబ్‌ వారివి మూడు ఒకే తీరుగా ఉన్నవట. అపుడు కొంతకాలానికి చెఱువు కట్టపై బాలేసాహెబ్డి కూలిపోగా అప్పటి తహశీల్దార్‌ సయ్యద్‌ ఎక్రమలీ గారు దానిని చదరం చేయించి ఒక అరుగు కట్టించినాడు. అప్పుడు కొన్ని దినాలకు ఆ దారిన దినదినం తిరుగుతున్న పకీరయ్యగౌడ్‌ చూసి ఆ అరుగుపై దర్గాను, అరుగు క్రింద ఒక గదిని కట్టించినాడు. ఆ తరువాత 1348 పసిలీలో ఇక్కడికి వచ్చిన సిరాజుల్‌ హసన్‌ అనే తహశీల్దార్‌ గారు ‘ఉలెహజ్‌’ నెల 22-23 తారీఖులలో బాలేషహీద్కు ఏటా ఉర్సు నిర్ణయించి ఆ యేడు జనాకర్షణ కొరకు గోపాలపేటలో సినిమా ఆడిస్తుండగా దానిని చెరువు రామారావు, నర్సింగరావులను పంపి బేరమాడిరచి ఇక్కడికి తెప్పించినాడు. దానితో 1948 నుండి ఆ సినిమా ఆడటం యిక యిక్కడనే స్థిరపడిపోయి ఏటా కట్టపై రెండు దినాలు ఉర్సు సాగడం మొదలయింది. 

అనంతరం 1958లో నాగర్కర్నూల్కు కరెంటు వచ్చింది. అపుడు దాన్ని శ్రీ కళావెంకట్రావు మంత్రి గారు వచ్చి ప్రారంభించినారు. గాంధీపార్కులో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత అది చూచి వి.ఎన్‌.గౌడు గారికి తమ గ్రామానికి గూడ కరెంటు తీసికోవలెనని సంకల్పం కలిగింది. 

అప్పటికే ఎమ్మెల్యేగా వి.ఎన్‌.గౌడు ఉన్నారు. వారు ఏది తలచితే అది అయ్యేది. దానితో చెఱువు కట్టకు చైతన్యం వచ్చింది. 1960లో ఎండబెట్లకు కరెంటు తీసుకోబడిరది. దాన్ని దామోదరం సంజీవయ్య గారు వచ్చి ప్రారంభించినారు. అపుడు చెఱువు యొక్క ఉత్తరం కొమ్ములోపల పెద్ద బహిరంగ సభ జరిగింది. సికింద్రాబాదు, హైదరాబాద్ల మధ్య ట్యాంక్‌ బండ్‌ వలె అవుతుంది. కట్టపై తారురోడ్డు పడుతుంది. దానికి రెండు వైపులా కరెంటు స్తంభాలు నిలుస్తవి. కట్ట యిక పగలే వెన్నెల, జగమే ఊయలగా మారిపోతుంది అనుకున్నారు. కాని గౌడు గారికి అప్పటికే నాగర్‌ కర్నూల్లో రాజభవనం వంటి గృహమున్నది కనుక ఆయనకు సొంత యింటి అవసరమంత అనిపించలేదు. దానితో ఆనాటి కల ప్రజలకు పగటికలనే కాగా యిపుడు దానికి మళ్లీ ముహూర్తం వచ్చింది. ఇట్లా యిది నాగర్‌ కర్నూలు ప్రజల యొక్క అర్ధ శతాబ్దం కంటె ఆవలినాటి కల. ఇపుడిక యిది మాన్యులు గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ మణ్ణి జనార్దనరెడ్డి గారితో సాకారమై ఫలిస్తుంది. 


30, సెప్టెంబర్ 2025, మంగళవారం

29, సెప్టెంబర్ 2025, సోమవారం

వాస్తు దృష్ట్యా ఇంట్లో ఉంచకూడనివి #వాస్తు సందేహాలు #vasturemedies #vastu...

ఏ ఆలయంలో ఎన్ని సార్లు ప్రదక్షిణాలు చేయాలి #templepradakshina #templecirc...

వాస్తు యొక్క వాస్తవాలు - విశేషాలు

 వాస్తు యొక్క వాస్తవాలు - విశేషాలు

వస నివాసే అను ధాతువు నుండి వాస్తు శబ్ధమేర్పడిరది. తరువాత దానినుండియే వసతి బస్తి అనే పదాలు నిష్పన్నమైనవి. వసతి అంటే ఈనాడు సౌకర్యమని, బస్తి అంటే అధికమైన జనాభా గల గ్రామమని అర్ధం. జనాభా ఎక్కువై గ్రామం నగరంగా మారినపుడు వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు కుంచించుకొని పోతవి, కాబట్టి అపుడిరటికి కావలసిన దొడ్డి, మరుగుదొడ్డి, నూయి మొదలైనవన్నీ ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అందుచేత అటువంటి అన్ని సౌకర్యాలుండటాన్నే ఇపుడు మనం వసతి అంటున్నాం. ఈ వసతిని గురించి తెలిపేదానికే ‘వాస్తు’ శాస్త్రమని పేరు.

ఒక ఇంటిలో వసతులన్నీ ఉండటం వేరు, ఆ ఇంటిలో నివసించే వారికి ఆత్మశాంతి ఉండటం వేరు. వసతులు బాహ్యమైనవి కాబట్టి అవి ఇంద్రియ శ్రమను తగ్గించగలవేగాని ఆనందాన్నీయలేవు. అది ఆత్మ సంబంధి కాబట్టి వస్తుబలం కంటె వాస్తుబలంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

ఈనాడు మనం పట్టణాలలో అనేకమైన ఇండ్లు చూస్తుంటాం. అవి అన్ని హంగులలోను, రంగులలోను ఎంతో నేత్రపర్వంగా కనిపించినా, అందులో నివసించే వారు మాత్రం నిరంతరం ఏవో సమస్యలతో వేగుతూనే ఉంటారు. అందుచేత మన పూర్వులు ఇంటిలోని వస్తువుల కంటె ఇంటి వాస్తుకెక్కువ ప్రాముఖ్యమిచ్చినారు. 

వాస్తు ఒక శాస్త్రమా! నిర్జీవమైన ఇల్లు మేధావంతుడైన ఒక వ్యక్తిపై తన ప్రభావాన్ని ఎట్లా చూపుతుంది` అని ఈనాటి విజ్ఞుల భావన. కానీ ఇటీవల వచ్చిన వాస్తు రచన లనేకం ఆలయాలను, ఫ్యాక్టరీలను, మహాపురుషులు నివసించిన ఇండ్లను అధ్యయనం చేసి వాని ఉత్తానపతనాల నిర్మాణాల యొక్క వాస్తుబలమే ఒక ముఖ్య కారణమని సోదాహరణంగా చూపుతున్నారు. అందుచేత ఇపుడు గృహస్థులు తమ ఇండ్లలోని ఎడతెగని సమస్యలకు ఏదో కర్మ అని సరి పెట్టుకోక తమ ఇంటికేసి గూడ ఒకసారి చూచుకోవలసి ఉంది.

మానవునికి తన జీవితంలో అన్నిటికంటె ఘనిష్ఠ సంబంధం కలది తన నివాసమైన ఇల్లు, కనుక మొదలతడు దానిని సరిచూసుకోవలసి ఉంది. అందుకొరకు శ్రీ జి. పాండురంగారెడ్డి గారి వాస్తు - వాస్తవాలు (సంక్షిప్త సూచనలు) అనే ఈ చిన్న పుస్తకం సామాన్యులకు గూడ తెలిసే పద్ధతిలో ప్రాథమిక విషయాలన్నీ సమగ్రంగా చేర్చి వ్రాయబడిరది. కాబట్టి గృహస్థులు దీని అధ్యయనం చేత తమకు గల ఇంటి సంబంధమైన ఇబ్బందులను తొలగించుకొని సుఖశాంతులు పొందుదురని ఆశించుచున్నాను

మహబూబ్ జిల్లాలోని శాసన కవులు | mahaboobnagar district poets | telangana history

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శాసన కవులు

1. శ్రీరామపుణ్యవల్లభుడు :

. శా.శ. 604. క్రీ.శ. 682

ఇతడు పల్లెపాడు శాసనకర్త, పశ్చిమ చాళుక్య విక్రమాదిత్యుని ఆస్థాని, విగ్రహికుడైన జయననాధ మహారాజు యొక్క జామాత.

వినయాదిత్యుడు తన ద్వితీయరాజ్యవర్షంలో పాను గంటిలో దండు విడిసి క్రీ.శ. 27-4-682 నకు సరియైన వైశాఖ పూర్ణిమనాడు భారద్వాజసగోత్రుడు ప్రియంకర స్వామి మనుమడు, గోబ్దరిపుత్రుడు మరియు వేదపారగు డైన మాధవస్వామికి కృష్ణాతీరంలోని ధర్మపురికి రెండు క్రోసుల దూరానగల "పలియల" అనే గ్రామాన్ని స్వాషివ మహారాజు కోరికపై సర్వబాధా పరిహారంగా దానం చేసినాడు.

2. బిజ్జయ :

శా.శ. 910. క్రీ.శ. 988.

ఇతడు కన్నడ పండితుడు, అగస్త్యేశ్వర శాసన కర్త, శంకర సంధివిగ్రహి. శంకర సుచక్రవర్తి పంపన చక్రకోటమును పాలించే ధారావర్షుని పైకి దండెత్తి పోయి తిరిగి వస్తూ క్రీ.శ  1030 సర్వదారి భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం నాడు అ…

మరో రెండేండ్ల పిమ్మట క్రీ.శ. 1088 ఖర కార్తీక బహుళ సప్తమి ఆదివారం నాడు త్రైలోక్యమల్లుని రాణి చందలదేవి కందూరునాడులోని దొళగణ, వడ్డవాని, ఎన్నూటిలోని కంపణ, ఎత్తపి తొంబదిలోని క్షేబళియ, అనుమనిపల్లె బాడం పదకొండు సర్వబాధా పరిహారంగా యిచ్చింది.


3. కాంచన సేనపండితుడు :

చా.వి.శ. 29 శా.శ 1027 క్రీ.శ 1105.

ఇతడు కన్నడ పండితుడు. పూడూరు శాసనకర్త. పశ్చిమ చాళుక్య వంశీయుడైన త్రిభువనమల్లుని సామంతు డగు హల్లకరుసు ఆస్థానపండితుడు.

పూడూరుకు పుండ్రపురమని నామాంతరం. ఇది గద్వాలకు మొదటి రాజధాని. హల్లకరుసు అది రాజధానిగా గద్వాల ప్రాంతాన్ని పాలించినాడు. అతడు క్రీ.శ. 1105. ప్రభవ సంవత్సర అమావాస్య ఆదివారం మకర సంక్రాంతి నాడు తమ జైనమత గురువైన కనకసేన భట్టాచార్యునికి అక్కడి జినాలయనిర్వహణ నిమిత్తము కొన్ని దానాలు చేసి ఈ శాసనం వేయించినాడు.

 4. సర్వాసి భట్టరు చా.వి.శా 35 శా.స 1033 క్రీ.శ.11 11

 ఇతడు అలంపుర శాసనకర్త. త్రిభువనమల్లుని సామంతుడైన బిజ్జరసు ఆస్థాన పండితుడు.

బిజ్జరసు జీమూత వాహన వంశీ యుడు తగరపుర వరేశ్వరుడు. సువర్ణ గరుడ ద్వజుడు  బెక్కం రాజధానిగా కొల్లాపూర్ ప్రాంతాన్ని పాలిస్తూ ఉదగార పోషణుడుగా ఉన్నాడు.

జీమూత వాహన వంశాన్ని పేర్కొనే శాసనాలు ఇది తప్ప మరోచోట లేవు.

బిజ్జరసు వ్యయ సంవత్సర ఉత్తరాయణ సంక్రాంతి సందర్భంలో తమ మహారాజుగారి నియోగాన అలంపుర స్వామికి ఆలయ ఖండ స్ఫుటిత జీర్ణోద్దారానికి, స్వామికి అంగరంగ భోగానికి గాను స్థానాధిపతియైన ధరణీంద్ర రాసి పండితునికి కొంత నీరునేల నిచ్చినాడు. ఈ శాసనం క్రీ.శ. 1110 నాటిది

5. త్రిపురాంతకుడు :

చా.వి.శ 40  క్రీ.శ 1038 క్రీ.శ. 1116.

ఇతడు పెద్ద కడుమూరి శాసనకర్త. సోమేశ్వరుని పుత్రుడు. ఈ సోమేశ్వరుడు ప్రసిద్ధ సారస్వతుడు.

త్రిపురాంతకుడు గురు బుధ శ్రీపాద పద్మాళి, మరియు కందూరు గోకర్ణ మహారాజుగారి సామంతుడైన సౌదరి బొల్లనాయయకుని ఆస్థాన విద్యాంసుడు.

కడుమూరికి కదంబపురమని నామాంతరం. సౌదరి-బొల్లనాయకుడు దాన్ని రాజధానిగా ఏలుతూ, చా.వి.శ 40. క్రీ.శ. 116 కీలక శ్రావణ అమావాస్య బుదవారం నాడు సూర్యగ్రహణ సందర్భంగా ఆచ్చటి బ్రహ్మేశ్వర దేవర ఆలయ జీర్ణోధరణకు అంగరంగ భోగానకు మల్లికార్జున, కేశవ దేవరల దీప దూప నై వేద్యాలకు, మామిండ్ల పల్లి నృసింహ దేవరకు, కొన్ని దానాలు చేసి ఈ శాసనం వేయించినాడు.


6. మయూర భట్టోపాధ్యాయుడు:

శా.శ.1098  క్రీ.శ1176

ఇతడు వెల్లంగోటి వసంతాపుర శాసనకర్త. దీన్ని పుడు పాలెక శాసన మంటున్నారు

నాగర్ కర్నూల్ తాలూకాలోని వర్ణమానపుర శా.శ. 9వ శతాబ్ది నాటికే పేరు చెందిన గ్రామము

ఈ వర్ధమానపుర బూదపుర శాసనాలనుబట్టి ఒకే కుటుం బానికి చెందిన మయూర భట్టోపాద్యాయుడు, ఈశ్వ రార్యుడు, అభినవ మయూరసూరి, ఈశ్వర భట్టోపా ధ్యాయుడు అని నలుగురు కవులు తెలుస్తున్నారు. వీరు తరణికంటివారు.

తరణికల్లు సౌర క్షేత్రం కాబట్టి యిక్కడి కవులు సూర్యోపాసకుడైన మయూరుని అభిమానించి అతని పేరును తమకు పేరుగాను, బిరుదుగాను పెట్టుకున్నారు.

మయూర డట్టోపాధ్యాయుడు సంస్కృతంలో కావ్యకర్త. మయూరుని అంతటివాడు. ఇతని శైలి అతని వలెనే ప్రౌఢమై గంభీరంగా ఉంటుంది.

గోకర్ణుడు లింగాల గ్రామాన్ని సోమశిలలోని స్వామికి దానం చేసినాడు. ఇది వనంతాపుర శాసనం పిమ్మట వచ్చిన శాసనం. శైలినిబట్టి ఇది కూడ మయూర చట్టోపాధ్యాయుడే రచించినాడనవలె.


7. ఈశ్వరార్యుడు :

శా.శ.1136. క్రీ.శ. 1214.

ఇతడు వర్ధమానపుర శాసన రచయిత.

గోన గణపిరెడ్డి తమ తండ్రి పేర బుద్ధేశ్వరుని, చక్రవర్తి పేర సహస్ర గణపతీశ్వరుని, భీమదేవ ప్రగడ తన తల్లిదంద్రుల పేర శ్రీ లక్ష్మీనరసింహ దేవర, నారాయణ దేవరలను స్వభాను మాఘ  శుద్ధ దశమి నాడు, అనగా సంవత్సరం నిండే లోపల ప్రతిష్ఠ చేయించి ఆ దేవరలకు మరో మూడేండ్లకు అనగా వ్యయ సంవత్సర చైత్ర బహుళ దశమి మంగళవారం వృష సంక్రాంతి నాడు వృత్తులు పెట్టించి ఈ శాసనం వేయించినాడు.

8. అభినవ మయూర మారి:

శా.శ.1167  క్రీ.శ 1245.

ఇరిడు నాగేశ శాసన కర్త. వర్దమానపురంలోని మల్యాల గుండయ శావనానికి నాగేశ శాసనమని పేరు.

ఈ కవీశుడు ఈశ్వరార్యుని కుమారుడు. మల్యాల గుండయ గారి ఆస్థాన పండితుడు. గుండయ గారు వర్థమానపురానికి గణపిరెడ్డి పిమ్మట పదవికి వచ్చిన ప్రభువు.

వర్ధమానపురంలో వీరు వచ్చే నాటికే ప్రాచీనమైన ఒక నాగేశ్వరాలయం ఉన్నది. దాన్ని ఎవరు ప్రతిష్ఠిం చింది తెలియదు. గుండయ గారా దేవరకు ప్రాకార గోపురో పేతమైన ఆయతనం కట్టించి క్రీ.శ 1167 విశ్వావసు పుష్య అమావాస్య శుక్రవారం సూర్యగ్రహణ సంద ర్భంలో ఆ స్వామికి అంగరంగ భోగాలకుగాను పిన్నలట్టుపల్లిని సర్వనమస్యంగా సమర్పించి ఈ శాసనం చెప్పించి నాడు.

శాసనం చెప్పిన మయూరసూరికి అక్కడనే రెండు మరుతురుల నీరు నేల, రెండు మరుతురుల వెలిపొలం యిచ్చినాడు.

మయూర సూరి సంస్కృతాంధ్రాలలో అసమాన ప్రతిభ గలవాడు. పదవాక్య ప్రమాణప్రమేయ తత్వజ్ఞుడు. విచిత్ర కవిత్వ నిపుణుడు. శాసనాంతంలో ఇతడు రచిం చిన చక్రబంధంలో రెండవ వలయంలో "నాగేశ శాసనం," నాలుగవ వలయంలో "మయూర రచితం" ఏడవ వలయంలో "గు…

అక్కడ తన తల్లి పేర బాచసముద్రం, భార్య పేర కుప్ప సముద్రం అనే రెండు చెరువులు వేయించి బాచసముద్రం నుండి కుప్పసముద్రంలోనికి ఒక కాలువను త్రవ్వించి ఆ చెరువులపై వారి పేర రెండు గుడులు కూడ కట్టించినాడు.

పిమ్మట తమ మహారాజు పేర గణప సముద్రం వేయించి, శా శ.1184=క్రీ.శ. 1262 రుధిరోద్గారి శ్రావణ పూర్ణిను చంద్రగ్రహణంనాడు దాని క్రింద బ్రాహ్మణులకు క్షేత్రాలిచ్చినాడు.

అనంతరం గుండయ్యగారు బూదపురంలోనే మర ణించగా ఆయన భార్య కుప్పమ్మగారు శా.శ. 1198= క్రీ.శ. 1276 ధాత మాఘ శుద్ద దశమి గురువారంనాడు తన కుమారులతో సోదరులతో కలిసి అక్కడ గుండేశ్వర ప్రతిష్ఠ చేయించి, తన భర్త త్రవ్వించిన మూడు చెరువుల క్రింద గుండేశ్వర దేవర పూజారులకు వృత్తు లిచ్చింది.

వై మూడు సందర్భాలలో ఈశ్వరభట్టోపాధ్యా యుడు శాసనాలు రచించినాడు. వానిలో రెండవదైన గణప సముద్ర శాసనానికి శాసన వాఙ్మయంలో ఒక ప్రత్యేకత ఉంది. దానిలో ఇతడు నిర్దంత్య, నిస్తాలవ్య, నిష్కంఠ్య, నిరోష్ఠ్య, అదృతాది శబ్ద చిత్రాలు, క్రియా పదప్రాయిక, పునరుక్తవదాబాన క్రియా పదత్రయ గోపక, అక్షర ముష్టికాది వాక్య చిత్రాలు, ఆర్యాగుచ్ఛ మిధునావళ్యాది అపూర్వ వృత్తాలు రచించి, తనకుగల పాణినీయ వ్యాకరణాది పాండిత్యమును కున్నాడు. వెల్లడించుకున్నాడు


10. విష్ణునూరి : శా.శ..1216 క్రీ.శ 1295.

ఇతడు మగతల శాసనకర్త. మల్లినాథుని కుమా రుడు. అద్వయానంద కృష్ణుని శిష్యుడు.

మగతలకు "మఖస్థలి" యని సంస్కృత వ్యవ హారం. పూర్వం అక్కడ చాలా బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారందరు ఎల్లపుడు యజ్ఞాలు చేస్తుండేవారట.

ఈ పట్టణాన్ని శా.శ. 1216 లో దేవగిరి యాదవ రామ చంద్రదేవుని సామంతుడుగా స్థాణుచమూపతి పాలించి నాడు. అతడు జయ సంవత్సర పుష్య అమావాస్య ఆదివారంనాడు ఆర్థోదయ పుణ్యకాలంలో (6-1-1295) మగతల విషయంలోని గన్నెనాయకపల్లి స్వయంభూనాథు నికి జీర్ణమైపోయిన ఒక దానాన్ని పునరుద్ధరించి ఈ శాసనం చెప్పించినాడు.

శ్రీ విష్ణుసూరి శైలి ప్రౌడమై సరసంగా ఉంటుంది.


11. వంగూరి తిప్పయభట్టు :

శా. శ.1298 =క్రీ.శ.1376.


ఇతడు దేవరకొండ ప్రభువు మాదానాయని యొక్క ఉమామహేశ్వర శాసనానికి ఆజ్ఞప్తి.

మాధవనాయడు దేవరకొండ దగ్గర తన పేర మాధవ పురం కట్టించుకుని అక్కడి నుండి తెలంగాణా భాగాన్ని ఏలుతూ, శా.శ. 1298 నల సంవత్సర మాఘ మాసంలో నేటి అచ్చంపేట తాలూకాలోని ఉమామహేశ్వ రంలో ఇపుడున్న శిలామంటపం కట్టించి తమ ఆస్థాన పండితుడైన మాయిభట్టుచేత శాసనాన్ని చెప్పించినాడు. అపుడు దాన్ని చెక్కించటానికి ఉమామహేశ్వరం వచ్చిన ఈ తిప్పయభట్టు ఆశువుగా రెండు శ్లోకాలు చెప్పినాడు.


12. నృసింహాధ్వరి :

శా.శ. 1320= క్రీ.శ 1398.

ఇతడుమామహేశ్వర శాసనకర్త. నారసింహుని సుతుడు. భారతీ సంప్రదాయానికి చెందిన సదానందుని శిష్యుడు. దేచినేనివారి ఆస్థాన విద్వాంసుడు.

దేచినేనివారు పల్నాటి నుండి రుద్రదేవుని సీమకు వచ్చిన వెలమలు. వారు మొదట మున్ననూరిలో ఉన్నారు. ఇపుడీ వంశం కొండనాగులలో ఉంది.

ఈ వంశానికి చెందిన నరసమాంబ కుమారులు పురుషోత్తముడు, హనుమడు, రంగడు అనే సోదరులు శా. శ 1320 బహుధాన్య సంవత్సర నిజజ్యేష్ఠ పూర్ణిమ సోమవారంనాడు ఉమామహేశ్వరంలో పార్వతిని, నందీ శ్వరుని ప్రతిష్ఠించి ఈ శాసనం చెప్పించినారు.

ఈ శాసనంలో గూడ చక్రబంధం ఉంది. దాన్ని బట్టి నృసింహాధ్వరి చతుర్విధ కవితా నిర్వాహకుడనవలసి ఉంది.


13. చోళరాజ ఒడయరు

శా.శ.1298 తరువాత 

ఇతడు ఎక్కడివాడో తెలియదు కాని ఉమామహే శ్వరంలోని మంటప స్తంబముపై ఇతనిది ఒక శ్లోకం ఉంది. ఈ మంటపం క్రీ.శ. 1376 లో నిర్మించబడింది. కాబట్టి ఇతడు 14 వ శతాబ్దంవాడు కావలె.

14. వెంకట భట్టోపాధ్యాయుడు :

శా.శ. 1390= క్రీ.శ 1468.

ఇతడు మునిపుర శాసనకర్త వేదశాస్త్రార్థతత్వ జ్ఞుడైన శోత్రియుడు. సంస్కృతాంధ్రాలలో సమాన ప్రజ్ఞ కలవాడు.

14 శతాబ్ది ప్రథమ పాదంలో రుద్రదేవుని సీమ అనబడే అమరాబాదు పీఠభూమిని మునిపురం అనబడే మున్ననూరును కేంద్రంగా చేసుకుని నంది మల్లారెడ్డి పాలించినాడు. అతడు మోటాటి శాఖకు చెందినవాడు. నడిపిట్ల గోత్రోద్భవుడు. సర్వమాంబా తిమ్మభూపతుల కుమారుడు. మీసర గండ బిరుదాంచితుడు. ఈ వంశం పేరు న యిక్కడ తప్ప మరోచోట కనిపించదు.

ఇతడు శా.శ. 1390 క్రీ.శ. 1468 కీలక మార్గ శిరంలో మున్ననూరిలో విజయగోపాలస్వామికి గర్భమందిరాంతరాళాది మండపాలు, ప్రాకారం కట్టించి. పుష్కరిణి త్రవ్వించి దీపస్తంభ మెత్తించి శాసనం చెప్పించినాడు

16, సెప్టెంబర్ 2025, మంగళవారం

8, సెప్టెంబర్ 2025, సోమవారం

దేవాలయ ప్రాంగణ పరిసరములయందు చేయకూడని విధులు

1.    దేవాలయములో భక్తులు ప్రవేశించు సమయంలో కనీసము తమకాళ్ళు, చేతులు, శుభ్రపరచుకోకుండా, హిందూ సంప్రదాయ విరుద్ధమైన వస్త్రములు, శూన్య లలాటముతో ఆలయ ప్రవేశము చేయరాదు.

2.    దేవాలయ ప్రవేశానంతరము దేవతా మూర్తులకు సంబందమైనవికాక ఇతర లౌకిక, విషయములను గ్టిగా ప్రస్తావిస్తూ ఇతర భక్తులతో మ్లాడరాదు, గోడవపడరాదు, మూర్ఖముగా వాదోపవాదములు చేస్తూ తోిభక్తులకు ఇబ్బంది కలిగించరాదు.

3.    దేవాలయ ప్రాంగణములో పరిగెత్తుకొంటు, తోపు లాడుకుంటూ, ఆలయ అంగములను భంగము కల్గించేవిధంగా ప్రవర్తిస్తూ భక్తులు ముందుకు సాగరాదు.

4.    భక్తజనుల యందు స్త్రీలు మాత్రము ఆలయ ధ్వజ స్తంభం వద్ద మాడు, పంచాంగదండక ప్రమాణమును ఆచరించాలి. నిలబడి నమస్కరించాలి.

5.    భక్తులు తడివస్త్రములలో ఆలయ ప్రవేశము చేయరాదు.

6.    దేవతామూర్తులు దర్శన సమయములో ఆయా దేవత నామములను కాక ఇతర దేవతలను గ్టిగా స్మరించుకొంటూ నేత్రములను మూసుకొని, హారతిని స్వీకరిస్తూ స్వామి వార్లను దర్శించరాదు.
 

7.    ఆలయ పరిసరములను చెత్తా చెదారముతో అపరిశుభ్ర పరచరాదు. భక్తులు ఆలయ అధికార్లు ఏర్పాటుచేసిన చెత్తకుండీలను ఉపయోగించవలెను.

8.    భక్తులు రిక్తహస్తములతో దైవ దర్శనకు వచ్చి ఆలయ ప్రాంగణములో ఫల పుష్ప వృక్షముల నుండి పూలు, పండ్లు కోసి వాిని దేవతామూర్తులకు పూజించుటకు ఆర్పించరాదు.

9.    భక్తజనులు దేవాలయమునందు ఇతరులకు నమస్కరించరాదు.

10.    దేవాలయ ప్రాంగణములో దేవతామూర్తుల గురించి కాకుండా, లౌకిక, ఆహంకారపూరితమైన వాఖ్యలు, పరదూషణాలు, ఇతరుల గురించాగాని, చెప్పు కోవడం లాింవి చేయరాదు.

11.    భక్తులుదైవ దర్శనము తరువాత హడావిడిగా దేవాలయం వదిలి వెళ్ళరాదు, దేవాలయ ప్రాంగణంలో కొద్ది సమయమైన కూర్చొని వెళ్ళాలి. మరియు పరిసర ప్రాంతంలో నిదురించరాదు. దీనివల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలిగించరాదు.
12.    భక్తులు తమకు తోచిన స్థలంలో దీపాలను వెలిగించడం వల్ల ఆలయ నిర్మాణ ఆంగముల ప్రతిష్ట దెబ్బతింటుంది. కావున ఆలయము వారు కోష్ఠ బింబములు, నవగ్రహ మండపంలందు బింబముల పాదములచెంత దీపాలను వెలిగించి ఆయా బింబముల సౌందర్యమునకు మరియు దీపముల యొక్క వేడివల్ల బింబములు విరికి పోవుటకు అవకాశము ఉన్నందున ఆయా ప్రాంతంలో దీపారాధన చేయరాదు.


13.    భక్తులు అవసరమైన వసతి గృహాలు, మూత్రశాలలు, ముఖ, ద్వారములు మొదలగునవి నిర్మాణములు ఆలయ ప్రాంగణములోపల చేపట్టరాదు. దీనివల్ల ఆలయ పరిసరములందు ఆధ్యాత్మిక శోభకు భంగము వాిల్లును.


14.    ఉప, పరివార ఆలయములను, ప్రధాన ఆలయము లను మించి ఎత్తుగా నిర్మించరాదు.

15.    దేవాలయ ప్రాంగణంలో దేవతామూర్తులను భక్తులు, తాకుటంవల్ల ఆలయములో పవిత్రతకు భంగముకల్గి దోషములు కల్గును.

దేవాలయ ప్రాంగణ పరిసరములయందు చేయదగినపనులు

 

దేహో దేవాలయో ప్రోక్త, జీవోదేవో సనాతనః ! అని అర్యోక్తి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అన్ని చెబుచున్నది.

    దేవాలయము అనగా, మన మనస్సుకు ప్రశాంతతను, ఆనందమును కల్గించు ప్రదేశము. దీనిని ప్రాసాదమని మరియు ఆలయమని పిలువబడును, ఇలాిం దేవాలయ ప్రాంగణములో, భక్తులు త్రీకరణ శుద్దిగా ఆయా దేవాలయ ప్రధాన మూర్తులు వారి పరివారములు మరియు ఆయా మూర్తులకు జరుగు అనేక ఉపచారములను తిలకిస్తూ వారి మనస్సును అచ్చటనే స్థిరంగా నిల్పి ఆత్మానందమును పొందవలెను. ఇలాిం పరిస్థితులయందు భక్తుల శాస్త్రానుసారంగా,  వస్తున్న ఆయా ఆలయ ఆచరణలను, సదాచారాలను పాించవలెను. కాబ్టి భక్తులు సహజముగా దేవాలయ ప్రాంగణములో భక్తులు ఆచరించవలసినవి లేదా ఆచరించకూడదన్న అన్ని విషయములను అనేక ఆగమ, శిల్ప గ్రంథములందు చెప్పబడినవి. వీిని ఖచ్చితముగా పాించడం వల్ల మన హైందవ సంస్క ృతి సాంప్రదాయాలు గౌరవింపబడి భవిషత్‌ తరాలవారికి పరంపరంగా అందుతాయి.

1.    దేవాలయములో భక్తులు ప్రవేశం చేయునప్పుడు స్నానమాచరించి శుభ్రమైన వస్త్రములను ధరించి, తప్పక నుదిపై తిలకము, కుంకుమ బొట్టు వారి వారి ఆచారము ప్రకారము అలంకరించుకొని దేవతా మూర్తులయొక్క దర్శనము చేసుకోవాలి.

2.    దేవాలయ ప్రవేశానంతరము ఆయా, దేవాలయ ప్రధాన మూర్తులు, నామములను, మనస్సునందు స్మరించుకొంటు దేవతమూర్తులను దర్శించాలి.

3.    దేవాలయ ప్రాంగణములో నెమ్మదిగా తిరుగుతూ ఆలయ నిర్మాణ సౌందర్యమును తిలకిస్తూ ముందుకు సాగుతూ స్వామి వారిని దర్శించుకోవాలి.

4.    భక్తజనులలో పురుషులు మాత్రమే ఆలయ ధ్వజ స్తంభమువద్ద సాష్టాంగ నమస్కారము చేయ వలయును.

5.    భక్తులు శుభ్రమైన వస్త్రంలను ధరించి ఆలయప్రవేశం చేయాలి. కేవలము ఆంగప్రదక్షణము చేయు భక్తులు మాత్రము తడివస్త్రములతో అంగప్రదక్షిణ చేయ వచ్చును.

6.    దేవతామూర్తులను దర్శించుకొను సమయములో మరియు హారతిని స్వీకరించు సమయములో ఆయా దేవతామూర్తల నామస్మరణ మనస్సుయందు చేసుకొంటు నేత్రములను తెరచి స్వామివారిని దర్శించుకోవాలి.

7.    ఆలయ పరిసరములు శుభ్రంగా ఉంచవలెను. భక్తులకు ఎక్కడైన చెత్త చెదారములు కన్పించినట్లైతే వాిని తొలగించుటకు ముందుకురావాలి.

8.    భక్తులు దైవదర్శనార్తము వచ్చు సమయములో వారి సొంతఖర్చుతో స్వామివార్లకు పూలు, పండ్లు మొ||న పూజాసామాగ్రిని తెచ్చుకొని ఆయా దేవతామూర్తులకు ఆర్పించాలి.

9.    దేవాలయ ప్రాంగణములో దేవతామూర్తులకు మాత్రమే భక్తులు నమస్కరించాలి.

10.    దేవాలయ ప్రాంగణములో భక్తులు ఆయా దేవతా మూర్తుల యొక్క పురాణములు, చరిత్రలు, ప్రవచనములు, సత్సంగాలువిం కార్యక్రమములలో కాలక్షేపము చేయాలి.

11.    భక్తులు దైవదర్శనము పిదప ఆలయ ప్రాంగణములో ఎక్కడైన కూర్చొని దైవసంబంధమైన విషయములు ప్రస్తావిస్తూ స్వల్పసమయాన్ని గడిపి అనంతరము బయటకు వెళ్ళవచ్చును.

12.    భక్తజనులు దీపారాదనకొరకు ఆలయములో అధికార్లు సూచించిన స్థలముల యందు మాత్రమే దీపాలను విలింగించాలి.


13.    దేవాలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయమునకు సంబంధించిన ఉప, పరివార, మొదలైన ఆలయ సంబంధమైన నిర్మాణాలు మాత్రమే చేప్టాలి. భక్తులకు అవసరమైన నిర్మాణాలు ఆలయ ప్రాకారం బయట చేప్టాలి.


14.    దేవాలయ ప్రాంగణములో ప్రధాన దేవాలయము ఎత్తును అనుసరించి ఉప, పరివారల ఆలయములు నిర్మించాలి. వీి ఎత్తు ప్రధాన ఆలయమును మించి ఉంచరాదు.


15.    దేవాలయ ప్రాంగణములోగల దేవతామూర్తులను భక్తులు కేవలం దర్శించుకోవాలి. వాికి తమ చేతులలో తాకకుండా వాి పవిత్రతను కాపాడాలి.

కృష్ణా పుష్కరాలు- సనాతన ధర్మావిష్కారాలు

 పూర్వం 'తుందిలుడు' అనే ధర్మనిష్ఠుడైన మహర్షి శివుని గూర్చి తపస్సుచేసి శాశ్వతంగా పరమేశ్వరునిలో ఉండేటట్లు వరం పొందాడు. శివుడు తన అష్టమూర్తులలో ఒకటైన జల రూపంలో అతనికి స్థానాన్ని యిచ్చాడు. ఆ విధంగా తుందిలుడు మూడున్నరకోట్ల పుణ్యతీర్థాలకూ ఆదికారణమై జలసామ్రాజ్యానికి సార్వభౌముడయ్యాడు. ఆ విధంగా ఆయన పుష్కరుడు అనే పేరు పొందాడు.

జగత్తులను సృష్టించానికి జలం అవసరమైన బ్రహ్మ పరమేశ్వరునిగురించి తపస్సుచేసి పుష్కరుడు తన కమండలంలో నివాసముండేటట్లు వరం పొందాడు.
ప్రాణులను ధర్మనిష్ఠులుగా బ్రతికించే ధర్మం బృహస్పతిది కనుక జీవనాధారుడైన పుష్కరుని తన ఆధీనంలో ఉంచవలసినదిగా బ్రహ్మను కోరాడు బృహస్పతి.
బ్రహ్మను విడిచివెళ్ళడం పుష్కరునికి ఇష్టంలేదు. అందువల్ల బ్రహ్మనుకూడా తనతోపాటు బృహస్పతివద్దనే ఉండమని ప్రార్థించాడు పుష్కరుడు.
అది సాధ్యం కానిది కనుక బ్రహ్మ ఒక ఏర్పాటు చేశాడు. 
గ్రహస్వరూపుడైన బృహస్పతి మేషం మొదలైన 12 రాశులలో ఏదేని రాశిలో ప్రవేశించేటప్పుడు 12 రోజులు, ఆ రాశి నుండి నిష్క్రమించేటప్పుడు 12రోజులు, సంవత్సరంలోని మిగిలిన అన్ని రోజులలోనూ మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తములకాలం (48 నిమిషాలపాటు) పుష్కరుని బృహస్పతితో ఉండమన్నాడు. ఆయా సమయాలలో తాను సమస్త దేవతలతోనూ బృహస్పతి ఉన్న రాశికి అధిష్ఠానమైన పుణ్యనదికి  వచ్చి పుష్కరునితో కలిసి ఉంానన్నాడు.
దేవగురువు బ్రహ్మస్పతి కన్యారాశిలో ప్రవేశించడంతో కృష్ణవేణీనదీమతల్లికి పుష్కరాలు వచ్చాయి. ఆగష్టు 12 నుండి 23 (2016) వరకు స్వర్ణాంధ్రప్రదేశ్‌కు పన్నెండు రోజుల తిరునాళ్ళ, పన్నెండేళ్ళ తరువాత! నిత్యప్రత్యూషంలో స్నానసమయంలో మన తెలుగువాళ్ళం స్మరించాల్సినదీ - కృతజ్ఞత తెల్పవలసినదీ గోదావరీ, కృష్ణా, పెన్నా, వంశధారా నదీమతల్లులనే కద! ఆంధ్ర జనజీవన సౌభాగ్యాలకు, అనంత వైభవాలకు మన జలవనరులే సిరులు కద! మన రాష్ట్రాన్ని 'హరితాంధ్రప్రదేశ్‌'గా ఆవిష్కరించడానికి పదునైన శీతోష్ణస్థితి, నీి పారుదల సౌకర్యం, విద్యుచ్ఛక్తి, వ్యవసాయోత్పత్తులు - అవసరం. వీిని సమకూర్చేవి జలసిరులు. నదులు.
ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకరాష్ట్రమైంది. గోదావరీ పుష్కరాలు 2015లో శోభాయమానంగా నిర్వహించ బడ్డాయి. 2016లో కృష్ణా పుష్కరాలను దేవాదాయ ధర్మాదాయశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చారిత్రాత్మకంగా నిర్వహించనుంది. 
భారతదేశంలో మొత్తం విూద మధ్యతరహానదులు 45 ఉండగా, అందులో 9 నదులు తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తున్నాయి. అందులో కృష్ణమ్మకు పేరు ప్రతిష్ఠలు ఎక్కువ. గంగా, గోదావరీ తరువాత ప్రాశస్త్యం కృష్ణమ్మదే!
సహ్యపర్వతశ్రేణుల్లో కృష్ణమ్మ ప్టుిన తావున వున్న ప్రాచీన దేవాలయంలో గోముఖం నుంచి ప్రభవించి, అసాధారణ ధారగా ప్రవహించి సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోంది కృష్ణవేణి. జనశ్రుతి ప్రకారం సహ్యాది సహ్యముని అవతారం. ఆ మహర్షి మహావిష్ణువు గురించి తపస్సుచేస్తే, విష్ణువు అశ్వత్థరూపంగా, కృష్ణుడు జలరూపంగా ప్రవహించే నదిగా వరం పొందారు. అందువల్ల అది కృష్ణానది అయినదట!
అలాగే కృష్ణానదీ ఆవిర్భావప్రదేశం నుంచి సాగర సంగమం చేసేవరకు నది భౌతికరూపం పరిశీలిస్తే, అది త్రివేణి (మూడజడలమాలిక) వలె అందంగా కన్పిస్తోంది. కనుక, ఆ నది కృష్ణవేణిగా సార్థకమైనదట! కర్ణాటక దాక మన ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర కృష్ణానదిలో సంగమిస్తుంది. ఆ తరువాత తూర్పుగా ప్రవహించి కర్నూలు దగ్గర పాదం మోపుతుంది. పులిచింతల దగ్గర కోస్తాప్రాంతంలో ప్రవేశించక పూర్వం 30 కి.విూ. దూరం పర్వత పంక్తుల గుండా తూర్పు వైపు ప్రవహిస్తోంది. ఇక విజయవాడలో పెద్దనదిగా అవతరించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ చరణసన్నిధిలో తలవంచి నమస్కరించి, ఎడమవైపుకు తిరిగి పులిగడ్డగా సాగింది. 'దివిసీమ'గా తేజరిల్లింది. విజయవాడ నుంచి 65 కి.విూ. దూరం 1.6 కి.విూ. వెడల్పుగా ప్రవహిస్తూ, కడకు కృష్ణాజిల్లా మచిలీపట్నం (బందరు) దగ్గర కృష్ణమ్మ సాగరసంగమం చేస్తోంది.
మొత్తం విూద గమనిస్తే, కృష్ణానది నిడివి సుమారు 1500 కి.విూ. అందులో మహారాష్ట్రలో సుమారు 310 కి.విూ., కర్ణాటకలో 482 కి.విూ., తెలుగు రాష్ట్రాలలో 708 కి.విూ.లు
పౌరాణిక ప్రాశస్త్యం:
కృష్ణానదీ ఆవిర్భాన్ని గురించి పెక్కు పురాణగాథ లున్నాయి. కృష్ణుడంటే గోలోకరక్షకుడు. రాధాధవుడు. మాధవుడు. రాధా-మాధవుల ప్రణయకలహానికి సంబంధించిన ఐతిహ్యం ప్రకారం సహ్యపర్వతం విూద గోలోక బృందావన చంద్రుడైన కృష్ణుడు రావిచెట్టుగా అవతరించి, తన శరీరవామభాగం నుండి రాధాంశతో జలం ప్రవహింపు చేశాడట! దానికే 'కృష్ణానది' అనే పేరు ఏర్పడిందట! 'కృష్ణ' అంటే నలుపు అనే అర్థం వుందికద. అందుకే కృష్ణానదిలోని నీరు నల్లగా వుండి నామసార్థక్యం చెందింది. ''కృష్ణా కృష్ణాంగసంభూతా జంతూనాం పాపహారిణీ' అనే ప్రశస్తి ఏర్పడింది. కృతయుగాదిని ఇలా జరిగిందని గోలోకపురాణం ప్రవచిస్తోంది.
అలాగే స్కాందపురాణం - సహ్యాద్రిఖండంలో, పద్మపురాణం- ఉత్తరఖండంలో, తైత్తరీయ సంహితలో, బ్రహ్మాండపురాణంలో కొద్ది తేడాలతో కృష్ణానదీ ఆవిర్భావ ప్రస్తావనలు కన్పిస్తాయి.
సృష్టిప్రారంభంలో శేషశయనుడై వేంచేసియున్న శ్రీమన్నారాయణుని, నాభికమలోద్భవుడైన బ్రహ్మ కలియుగంలో మానవులు తరించడానికి మార్గదర్శనం కోరాడట! దానికి శ్రీహరి సంతోషించి 'నాయనా! పరమపావన జీవనపూర్ణయైన కృష్ణానదిని సృష్టిస్తున్నాను. ఈ నదీజలాల్లో ఒక్కసారి స్నానం చేస్తే తరిస్తారు' అన్నాడట. కృష్ణమ్మను
శ్లో|| అంబ! త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం
స్వర్గారోహణసోపానం మహాపుణ్యతరంగిణీమ్‌
అధికాం సర్వహితార్థానాం కృష్ణవేణి! నమామ్యహమ్‌||  - అని ప్రార్థించాలట!
ఎన్నో ఐతిహ్యాల ప్రకారం కృష్ణానది త్రిమూర్త్యాత్మకం. త్రివేణి కృష్ణవేణి!
పరమ పవిత్రమైన యీ కృష్ణానదీ తీరంలో 60 దివ్య తీర్థాలున్నాయట!
పుష్కరం - జాతీయ సమైక్యతావిష్కరణం
పన్నెండేళ్ళకొకమారు సంభవించే జీవనదీపుష్కరాలు సమసమాజావిష్కరణాలు. సామరస్యజీవనానికీ, జాతీయ సమైక్యతాభావానికీ, సనాతన సద్ధర్మ సాధనానికీ దోహదకారులు. హిందూ ధర్మ విశ్వాసాలకు పుష్కరాలు ఆవిష్కారాలైనా, కుల, మత, వర్ణ, వర్గ, జాతి భేదాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చే 'కూర్చలు'. పుణ్యంకోసం కొందరు, పురుషార్థంకోసం మరికొందరు, వినోదంకోసం ఇంకొందరు, సామాజిక అవగాహనకోసం మరెందరో- అలాగే జిజ్ఞాసతో ఎందరెందరో పుష్కరస్నానాలు చేస్తారు. అందుకోసం వస్తారు. భారతీయసంస్కృతికి, సంప్రదాయాలకు, సదాచారాలకు, సామాజిక జీవనవికాసానికి, పుష్కరాలు ఆలవాలం! పరస్పర సహకారం, సహజీవనం, త్యాగమయ భావనం, అతిథి అభ్యాగత సత్కారం, అన్నదానాలు, వస్త్రదానాలు, పిండప్రదానాలు, స్నానసంకల్పాలు, సవిూప దేవాలయ సందర్శనాలు, బంధుమిత్ర పరస్పర అభినందనలు, తదియారాధనలు, ధర్మాచార్యుల యజ్ఞయాగవ్రతాలు. దానధర్మాలు- ఇవన్నీ కలిస్తేనే పుష్కరాలు. కోట్లరూపాయలు వెచ్చించినా సాధించజాలని జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యత పుష్కర ప్రాభవం వల్ల సులభసాధ్యాలు. సనాతన ధర్మ సంరక్షణకు, సంప్రదాయ పరిరక్షణకు భారతీయ సంస్కృతి అభివ్యక్తీకరణకు ఆచరణాకృతులు ఈనాి కృష్ణా పుష్కరాలు.
కృష్ణా పుష్కర స్నాన విధి
కృష్ణా పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడానికి నదిలో దిగినప్పుడు కృష్ణవేణిని, వినాయకుణ్ణి సూర్యభగవానుణ్ణి, బ్రహ్మసరస్వతులను, లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, పుష్కరుడిని, బృహస్పతిని, ఇంద్రుడ్ని, సప్తరుషులను, పంచభూతాలను, మీరు స్నానం చేస్తున్న క్షేత్రదైవాన్ని మీ ఇంి ఇలవేల్పును, మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా స్మరించి, అర్ఘ్యాలను సమర్పించి, కృష్ణానదికి పసుపుకుంకుమలు అర్పించాలి. దీపనీరాజనాలు సమర్పించాలి. సంకల్పపూర్వకంగా పుణ్యస్నానం ఆచరించాలి. కృష్ణా పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడం అంటే భక్తిశ్రద్ధలతో సకలపాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మూడు మునకలు వేయాలి. భార్యాభర్తలైతే వేణీస్నానం చేయాలి. అంటే భార్య కొంగును భర్త కండువాకు కట్టుకుని ఇద్దరూ ఒకేసారి మునకలు వేయాలి. భార్యాభర్తలు ఒకేసారి పుష్కరస్నానాలకు వెళ్లలేకపోయిన పక్షంలో స్త్రీలు మంగళసూత్రంపై, పురుషులు హృదయంపై చేయి పెట్టుకుని స్నానం చేయాలి. అప్పుడు భార్యభర్తలు ఒకేసారి పుణ్యస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సూతకం ఉన్నవారు సైతం పుష్కరస్నానం చేయవచ్చు.  వీలైతే బ్రాహ్మణుడి చేత పూజాక్రతువు నిర్వహించుకోవచ్చు. మీ శక్త్యనుసారం దానాదికాలు చేయాలి. పితృదేవతలకు పిండప్రదానం చేసినటైతే పుణ్యస్నానం చేయాలి. నదీ తీరాన ఉన్న క్షేత్రదర్శనం చేయాలి. పుష్కరాలకు రాలేకపోయిన బంధుమిత్రుల కోసం నదీజలాన్ని ఇంికి తీసుకెళ్లాలి.
కృష్ణానది పుష్కరాలసమయంలో చేయాల్సిన పిండప్రదానాలు
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ఆ వంశంలో గతించినవారికి సద్గతి కలుగుతుందని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం. అందుకే పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదానం తప్పక ఆచరించాలి. గతించిన వారి బంధుత్వాన్ని అనుసరించి పిండప్రదానం చేయాలి. బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పిండప్రదానం చేస్తే పితృదేవతలందరికీ సద్గతి లభించి సత్ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువ. క్రింద పేర్కొన్న బంధుత్వాల్లో ఎవరు మరణించి ఉన్నా వారందరికీ పిండప్రదానం చేయడం శాస్త్రప్రమాణం. అయితే.. తండ్రి మరణించివారు మాత్రమే పుష్కరాల సమయంలో పిండప్రదానం చేసేందుకు అర్హులనే విషయం మర్చిపోకూడదు. కృష్ణానది పుష్కరాల్లో తొమ్మిదో రోజు 2016, ఆగస్టు 20. ఆరోజున వీలుకాకపోతే, గతించిన వారి తిథిని అనుసరించి కానీ లేదా పుష్కర స్నానానికి వెళ్లినరోజున కానీ పిండప్రదానం చేయవచ్చు.
పుష్కరస్నానం ఎందుకు చేయాలి?
నిత్యస్నానానుష్ఠానాలు చేసినా చేయకపోయినా, పుష్కరస్నానం చేస్తే ఆ దోషాలు పోతాయి.
పితృకర్మలు ఎందుకు చేయాలి?
తండ్రి-తాత-పుత్రుడు=ఒక తరం
పుష్కర విధులు ఆచరించినట్లయితే ఇలాిం 7 తరాలవారు అలాగే తల్లి తరపున, తండ్రి తరపున మరణించిన వారందరు తరిస్తారు. వీరేకాక చనిపోయిన ప్రభువులు, గురువులు, మిత్రులు మొ||వారు కూడా తరిస్తారు.
జీవి మరణానంతరం ఎన్ని శ్రద్ధాలు ప్టోలి?
మాసికాలు-12 ఊనత్రయం-3 (ఊనమాసిక/ఊనషా-ణ్మాసిక/ఊనాబ్దికాలు)
త్రైపక్షికం - 1 (మూడవ పక్షంలో పెట్టేది)
మొత్తం 12+3+1=16+సాంవత్సరీకం/విమోకం=షోడశం
ఇవ్వన్నీ చేయలేకపోతే పుష్కరస్నానం, పుష్కరనదీప్రయుక్త తర్పణ, పిండప్రదానాల వల్ల ఆ దోషం పోతుంది.
ఇవన్నీ వారికోసమే కాక పితృఋణం తీర్చుకోవడానికి మనం విధిగా చేయవలసినవి.
దానాలు ఎందుకు చేయాలి?
సకల దోష నివారణార్థం
సకల శుభా-వాప్యర్థం
కుటుంబ అభ్యుదయార్థం
ఇక్కడ మనమిచ్చే దానాలు అక్కడ పితృదేవతలకు గ్రహీత ద్వారా చేరతాయట! వాళ్ళు ఏ లోకాలలో ఉన్నా! జీవించివున్న కాలంలో చేయలేకపోయిన వాికి ప్రాయశ్చిత్తార్థం వాని వారసులు చేసే దానాలవల్ల, ఆ పాపాల పరిహారం అవుతుంది.
తద్దినాలు పెట్తూనే ఉన్నాం కద! మళ్ళీ పుష్కరాలలో ఈ పిండప్రదానాలు ఎందుకు?
పుష్కరం పవిత్ర సమయం. దేవగురువు అయిన బృహస్పతి నదీజలాల్లో ప్రవేశిస్తున్న పుష్కరునితో చేరివున్నందువల్ల, పుష్కరానికి ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది.
పుష్కర సమయంలో చేసే పితృకార్యాలు పితృదేవతలకు అక్షయలోకాలను ప్రసాదిస్తాయి.
అన్నతర్పణం వల్ల ఏమి ప్రయోజనం?
. యే అగ్నిదగ్ధా యే అనగ్నిదగ్ధా మధ్యే దివః
స్వథయా మాదయంతే త్వం తాన్‌ వేత్థయ దితే
జాతవేదః స్వధయా యజ్ఞం స్వధితిం జుషన్తామ్‌ ||
అనే మంత్రం చెబుతాం.
అగ్నియందు దగ్ధమైన వారు, అలా దహనం చేయబడని వారు ఓ అగ్నీ! నీకు తెలుసును కద. నీ ద్వారా వారు ఈ అన్నమును గ్రహింతురుగాక! అని దీనికి అర్థం. (వారసులులేనివారు, లుప్తపిండోదకులు, చిరునామా లేకుండా ఎక్కడో చనిపోయిన వారు- దీనివల్ల వుద్ధరింపబడతారు)
సంవత్సర సూతకములో పుష్కరస్నానం చేయవచ్చా?
. ధర్మశ్రాద్ధం దయా శ్రాద్ధం శ్రాద్ధం చాపరపక్షకం |
ప్రథమాబ్దేపి కుర్వీత సపిండీకరణే కృతే ||
. నిత్యం నైమిత్తికం శ్రాద్ధం | తీర్థశ్రాద్ధాదికం చ యత్‌ |
సపిండీకరణాత్‌ ఊర్థ్వం | పుత్రః కుర్యాద్యథావిధి ||
అంటే పితృకార్యం జరిగిన సంవత్సరం లోపల ధర్మ, గయా, మహాలయ, నిత్య, నైమిత్తిక, తీర్థశ్రాద్ధాలను పుత్రుడు యధావిధిగా చేయవచ్చును.
వివాహమైన సంవత్సరంలోపల పుష్కరస్నానం చేయవచ్చా?
. మహాలయే గయాశ్రాద్ధే | మాతాపిత్రోః మృతే హని |
కృతోద్వాహోపి కుర్వీత పిండనిర్వాపణం సుతః ||
. పుత్రీ పుత్ర వివాహయోశ్చ పరతః షణ్మాసతో-భ్యంతరే 
పిత్రోరాబ్ధికపైతృకేషు విధివత్‌ దూర్వాక్షతైః అర్చయేత్‌ 
దధ్యన్నం బదరీఫలైశ్చ సహితం పిండాన్‌ వికీర్యాదికం
తత్‌సవ్యం, తిలత్పణం చ హి తథా దర్భాస్తిలాన్‌ వర్జయేత్‌||     - ధర్మప్రవృత్తి
తన యింట వివాహమైన యజమానికి ఆరు మాసముల లోపు నువ్వులు, దర్భలు, అపసవ్యంగా జంధ్యము నిషేధము. కానీ అక్షతలతోనూ, పెరుగు కలిపిన పిండప్రదానముతోనూ, పితృదేవతల కర్మలు ఆచరించాల్సిందే. మానకూడదు.
తండ్రి జీవించి వుండగా పుత్రునికి తిలతర్పణ విధిలేదు.
. జీవమానః పితా యస్య మాతా యది విపద్యతే | మాతుః శ్రాద్ధం సుతః కుర్యాత్‌ న కుర్యాత్‌ తిలతర్పణమ్‌||
తండ్రి జీవించివుండి, ఒకవేళ తల్లి, మరణించివుంటే, కొడుకు తల్లికి శ్రాద్ధం ప్టోలి. కాని తిల తర్పణం చేయకూడదు. తండ్రి చనిపోయినవారే పితృతర్పణం చేయాలి.
పితృకర్మలు జరపకపోతే ఏమౌతుంది?
మనిషి మరణించిన వెంటనే జీవుడు ప్రేతరూపం పొందుతాడు. దహనం నుండి సపిండీకరణం వరకు ఆచరించాల్సిన పితృకర్మలు ఆచరిస్తేనే జీవుడు ప్రేతరూపాన్ని విడువగల్గుతాడు. లేకపోతే ప్రేతగానే మిగిలిపోతాడు. ప్రేత విముక్తుడైతేనే పితృదేవతలౌతారు. ఆ తర్వాతనే వైకుంఠసమారాధాన! పరమపదోత్సవం.
(సన్యాసులకు పూర్వాశ్రమబంధాలుండవు. సంన్యాస స్వీకారం సమయంలోనే ప్రాయశ్చిత్త విధి నుంచి పిండప్రదానం వరకు శాస్త్రప్రకారం పూర్తి చేస్తారు. కాబ్టి వారికి ఇలాిం పితృకర్మలుండవు) పితృకర్మలు లేకుండా చనిపోయినవారికి పుష్కరకాలంలో చేస్తే ఆ దోషం పోతుంది. ప్రేతత్వం నుండి విముక్తులౌతారు.
స్నానవిధి
స్నాన సంకల్పం
హరిఃఓమ్‌ శ్రీ గోవింద గోవింద గోవింద శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే | ప్రథమపాదే | జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే | మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే/శ్రీరంగాత్‌ ఉత్తరదేశే గోదావరీ-కావేర్యోర్మధ్యదేశే శ్రీకృష్ణా మహానదీతీరే అస్మిన్‌ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన దుర్ముఖి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ/శ్రావణమాసే శుక్ల/బహుళ పక్షే ..............(తిథి) తిథౌ...............(వారం) వాసరే శుభనక్షత్రే/శుభయోగే/శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మహా  పర్వణి పుణ్యకాలే శ్రీమాన్‌ గోత్రః...............నామధేయః| ధర్మపత్నీ..........సమేతస్య మమ సమస్త పాపక్షయార్థం కన్యాగతే దేవగురౌ కృష్ణవేణ్యాం సార్థత్రికోి తీర్థ సహిత  పుష్కరదేవతా ప్రీత్యర్థం పుష్కరస్నానం అహం కరిష్యే || స్నాత్వా ఆచమ్య (3 సార్లు మునకలువేసి ఈ క్రిందివిధంగా ఆచమనీయం చేయాలి)
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | .........శ్రీకృష్ణాయ నమః
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా |
యః స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః ||
     (మానవుడు ఏ అవస్థలో ఉన్నప్పికిని శ్రీమహావిష్ణువును స్మరించినట్లయితే శారీరకంగాను, మానసికంగాను కూడా శుచిని పొందుతాడు. కనుక  గోవింద | గోవింద | గోవింద అంటూ నీిని తలపై చల్లుకోవలెను.)
శ్రీ గోవింద | గోవింద | గోవింద
తర్పణాదికమ్‌ - ఆచమనం
అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. మూడుసార్లు నదీతీర్థం లోపలికి పుచ్చుకోవాలి. దీనివల్ల ఆంతరం పవిత్రమౌతుంది.
ఇపుడు సప్తవ్యాహృతులతో గాయత్రీమంత్ర ధ్యానమ్‌. ఎడమ ముక్కు రంధ్రమును కుడి బ్రొటన వ్రేలుతో మూసివేసి ప్రాణాయామం చేయాలి. ''ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‌ం సత్యం | ఓం తత్స వితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్‌ ||''
''ఓం ఆపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ'' ఇప్పుడు కుడి బొటనవ్రేలును దించాలి. 'భూర్భువస్సువరోమ్‌.....'
దేవ - ఋషి - పితృ తర్పణం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ స్నానాంగత్వేన దేవ - ఋషి - పితృతర్పణం కరిష్యే (ఉంగరపు వేలితో నీిని తాకాలి)
1. తూర్పుముఖంగా: 
'బ్రహ్మాదయో యే దేవాః సపత్నికాః తాన్‌ సర్వాన్‌ దేవాన్‌ తర్పయామి' (సతీసమేతులుగా ఉన్న బ్రహ్మాది దేవతలను అందరిని తృప్తిపరచు చున్నాను.)
అని దోసిలితో తీర్థం తీసుకుని, ఎత్తి, కుడి అరచేతిమూలం నుంచి వ్రేళ్ళవిూదగా నదిలోకి విడిచిప్టోలి ఒక్కసారి.
2. ఉత్తరముఖంగా:
'కృష్ణద్వైపాయనాదయో యే ఋషయః సపత్నికాః తాన్‌ సర్వాన్‌ ఋషీన్‌ తర్పయామి | తర్పయామి|' (సతీసమేతులై ఉన్న కృష్ణద్వైపాయనుడు మొదలైన ఋషులందరిని తృప్తిపరచు చున్నాను)
అని ఇంతకుముందువలెనే దోసిలితో జలం తీసుకుని ఎత్తి, కుడి అరచేతి మూలం నుంచి వ్రేళ్ళవిూదుగా నదిలోనికి విడిచిప్టోలి. అలా రెండు సార్లు చేయాలి.
3. దక్షిణముఖంగా:
'అగ్నిష్వాత్తాదయో యే పితరః సపత్నికాః తాన్‌ సర్వాన్‌ పితౄన్‌ తర్పయామి | తర్పయామి | తర్పయామి'|| (సతీసమేతులుగా వున్న పితృ దేవతలను అందరిని తృప్తిపరచు చున్నాను.)
అని ఇంతకుముందువలెనే దోసిలితో తీర్థం తీసుకుని, ఎత్తి, కుడి బ్రొటనవేలు - చూపుడువ్రేలు మధ్యగా/ బొటనవ్రేలు విూదుగా నదిలోకి విడిచిప్టోలి. అలా 3సార్లు చేయాలి. 'శ్రీ విష్ణుర్విష్ణుర్విష్ణుః' అని శ్రీహరి స్మరణం చేయాలి.
దోసిలితో తీర్థం తీసుకుని, ఎత్తి సూర్యునికి చూపిస్తూ, ఈ క్రింది మంత్రాలు చెప్తూ, ఒక్కొక్కసారి నదిలోకి వదలాలి.
ఓం కేశవం తర్పయామి
ఓం నారాయణం తర్పయామి
ఓం మాధవం తర్పయామి
ఓం గోవిందం తర్పయామి
ఓం విష్ణుం తర్పయామి
ఓం మధుసూదనం తర్పయామి
ఓం త్రివిక్రమం తర్పయామి
ఓం వామనం తర్పయామి
ఓం శ్రీధరం తర్పయామి
ఓం హృషీకేశశం తర్పయామి
ఓం పద్మనాభం తర్పయామి
ఓం దామోదరం తర్పయామి
- - -
రెండు చేతులు ఎత్తి సూర్యభగవానునికి నమస్కరిస్తూ ఇలా ధ్యానించాలి:
1. ఋతగ్‌ం సత్యం పరంబ్రహ్మ పురుషం కృష్ణపింగళం |
ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ||
2. ధ్యేయస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||
3. శంఖచక్రగదాపాణే ద్వారకానిలయాచ్యుత |
గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతమ్‌ ||
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్‌ |
కరోమి యద్యత్‌ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
ఓం తత్సత్‌ బ్రహ్మార్పణమస్తు!
(శారీరకంగాను, వాక్కుద్వారాను, మానసికంగాను ఇంద్రియములద్వారాను, బుద్ధితోను, స్వభావసిద్ధంగాను ఏ ఏ పనులను ఆచరిస్తున్నానో వాి ఫలమును పరాత్పరుడైన శ్రీమన్నారాయణునికి సమర్పించుచున్నాను.)
కుడిచేతిలోనికి తీర్థం తీసుకుని ఇలా చెపుతూ నదిలోనికి విడవాలి.
ఏతత్‌ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!
దర్భలు, తిలలు, అక్షతలు, డబ్బులు తీసుకొని ఆత్మప్రదక్షిణం చేస్తూ ఇలా పలకాలి: (విప్రప్రణామం.)
శ్లో. సమస్తసంపత్సమవాప్తిహేతవః 
సముత్థితాపత్కులధూమకేతవః |
అపారసంసారసముద్రసేతవః
పునంతు మాం బ్రాహ్మణపాదపాంసవః ||
(సకల సంపదలను చేకూర్చునవి, సమస్తమైన ఆపదలను నశింప చేయునవి, అపారమైన సంసార సముద్రము దాటుటకు వంతెన వింవి అయిన బ్రాహ్మణ పాదరేణువులు నన్ను రక్షించుగాక)
శ్లో. ఆధివ్యాధిహరం నౄణాం మృత్యుదారిద్య్రనాశనం |
శ్రీ పుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజమ్‌ ||
(మానవులయొక్క ఆది వ్యాధులను, మృత్యువును, దారిద్య్రమును నశింపచేయునవి, సంపదలను, బలమును, కీర్తిని ప్రసాదించునవి అయిన బ్రహ్మణ చరణ కమలములకు నమస్కరించుచున్నాను)
శ్లో. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
(పరబ్రహ్మస్వరూపుడు, గోబ్రాహ్మణులకు హితమును  కలుగజేయువాడును, జగత్తునకు మేలుచేకూర్చువాడును, గోవిందుడు అయిన కృష్ణునికి నమస్కరించుచున్నాను.)
పుణ్యమూసివాయనం
పసుపు, కుంకుమ, అద్దం, దువ్వెన, చీరె, రవికెల గుడ్డ, నల్లపూసలు, లక్కజోళ్ళు, చుట్టె, మంగళసూత్రాలు, కాటుకభరిణె, కుంకుమభరిణె, చేటలు, పుష్పములు, కొబ్బరిబొండం, గుమ్మడికాయ, అరిపండ్లు, తమలపాకులు, వక్కలు, బియ్యం 6 కె.జీ. రూపాయినాణేలు, దక్షిణ అన్నీ కలిపి స్త్రీలు మరొక ముత్తయిదువకు కృష్ణవేణి నదీమ తల్లిని స్మరించి ఇవ్వడం 'మూసివాయనం' అంారు.
ఈ సమయంలో చేసే స్నాన, దాన, తీర్థ విధులు (పితృకార్యములు) విశేషఫలాన్ని అందిస్తాయి.
ఈ పన్నెండు రోజులలో చేయదగిన దానములు, పూజలు.
1వ రోజు  : బంగారము, వెండి, ధాన్యము, భూమి, హిరణ్య శ్రాద్ధము.
2వ రోజు  : గోవు, బంగారము, రత్నము, వస్త్రము, ఉప్పు.
3వ రోజు : బెల్లము, కూరగాయలు, పండ్లు, గుఱ్ఱము.
4వ రోజు  : నెయ్యి, తేనె, పానకము, నూనె, పాలు.
5వ రోజు  : ధాన్యము, బండి, దున్నపోతు, ఎద్దు, నాగలి,
6వ రోజు  : కస్తూరి, పుణుగు, జవ్వాజి, చందనము మొదలైన సుగంధ  ద్రవ్యములు, ఔషధములు.
7వ రోజు : గృహము, శయ్య (మంచము), పీట, ఊయల, విసనకర్ర.
8వ రోజు : గంధపు చెక్క, తెల్లని పూలమాల, అల్లము, కంద, పెండలము మొ||వి.
9వ రోజు : కన్యాదానం, కంబళి, తీర్థశ్రాద్ధం.
10వ రోజు  : ముత్యాలు, వెండి, పుష్పములు, లక్ష్మీనారాయణపూజ   గౌరీశంకరపూజ.
11వ రోజు  : యజ్ఞోపవీతములు, తాంబూలము, పట్టువస్త్రములు,  పుస్తకములు.
12వ రోజు  : కృష్ణవేణి నదీపూజ, థదానములు.
థదానములు :  
గోదానము, భూదానము, తిలదానము, హిరణ్య(బంగారు) దానము, ఆజ్య(నేయి)దానము, వస్త్రదానము, ధాన్యదానము, గుడ(బెల్లం)దానము, రౌప్య(వెండి)దానము, లవణ(ఉప్పు) దానము.
ఈ పన్నెండు రోజులలోనూ ఆయా దానములు చేయుటకు సాధ్యపడనివారు ఏ రోజున పుష్కరస్నానం ఆచరిస్తారో ఆ రోజు చేయవలసిన దానములను చేయవచ్చును. లేదా అవకాశమునుబ్టి పై వాిలో ఏదైనా దానమివ్వవచ్చును.
పుష్కర స్నాన ఘ్టాలు - నియమాలు
జి ఆధికారికముగా గుర్తింపు పొందిన పురోహితులు మాత్రమే పౌరోహిత్య సేవలు నిర్వహించవలెను.
జి శ్రాద్ధకర్మలు మొదలగునవి త్వరితముగా చేయవలెను.
జి క్యూ పద్ధతిని పాించవలయును.
జి అనవసర వస్తువులను చెత్త కుండీలలో వేయునట్లు చూడవలయును.
జి శ్రాద్ధ కర్మలకు, తీర్థమునకు శుభ్రమైన మంచినీరును వాడవలెను.
జి పుకార్లను/వదంతులను నమ్మరాదు.

కృష్ణా పుష్కరాలు - పుష్కర ప్రాశస్త్యం

 

కృష్ణా పుష్కరాలు - 2016

ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం కృష్ణా, గోదావరి జీవనదులతో అన్నపూర్ణగా విరాజిల్లుచున్నది. భారతదేశంలోని 12 ప్రధాన నదులకు పుష్కరాలు నిర్వహించబడును. అందులో కృష్ణా, గోదావరి నదులు దక్షిణభారతదేశంలో పేరెన్నిక గలిగిన జీవనదులు.

పుష్కరుడు అనగా 3కోట్ల 50లక్షల పుణ్యతీర్థాలకు జలరాజు, గురువు నివశించే 12 నదులను పుష్కరనదులని పేర్కొాంరు.
దేవగురుడగు బృహస్పతి పుష్కరునితో కలిసి సింహరాశిలోకి ప్రవేశించినపుడు గోదావరినదికి, కన్యారాశిలోకి ప్రవేశించినపుడు కృష్ణానదికి పుష్కరాలు సంభవించును. ఈ పుష్కరాలు ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి వచ్చును. ఈ పుష్కరకాలంలో నదీజలాలు దేవతల తేజస్సును పొంది యుాంయి. కాబ్టి ఆ సమయాలలో మానవులు పుష్కరస్నాన మాచరించి దానం, తర్పణం మొదలగు అనుష్టానాలను పితృదేవతలకు పిండప్రదానాలు చేయాలని మహర్షులు ప్రభోదించియున్నారు.
కావున పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు గోదావరి, కృష్ణా నదులలో పుణ్యస్నానములు ఆచరించి తరించుచున్నారు.
పుష్కరాల నిర్వహణ
గోదావరి పుష్కరాల సమర్థ నిర్వహణ:
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో గోదావరినదీ పుష్కరములు ది:14-7-2015 నుండి 25-7-2015 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. భక్తుల సౌకర్యార్థం  ప్రభుత్వం వారు రూ.1501.31కోట్ల నిధులతో వివిధ ఏర్పాట్లు చేయుటకు మంజూరు చేసియున్నారు.
భక్తులు పుష్కరస్నాన మాచరించడానికి తూర్పుగోదావరి జిల్లాలో (174) స్నాన ఘ్టాలను, పశ్చిమగోదావరి జిల్లాలో (95) స్నాన ఘ్టాలను రూ.113.78కోట్లతో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మొత్తం (369) పుష్కర స్నాన ఘ్టాలను అభివృద్ధి చేయడం జరిగినది. రాజమండ్రిలో అభివృద్ధి చేసిన కోిలింగాల ఘ్‌ా ఆసియాలోనే అతి పెద్ద ఘ్‌ాగా గుర్తించబడినది.
నదీతీరానవున్న 616 దేవాలయాలను రూ.49.96కోట్లతో అభివృద్ధి చేసియున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాం, ద్వారకా తిరుమల, శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం, అన్నవరం దేవస్థానాలలో రూ.116.89కోట్లతో అభివృద్ధి పనులు చేయుట జరిగినది.
(303) రహదారులను రూ.649.69కోట్లతో విస్తరణ పనులు చేపట్టుట జరిగినది. రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ.144కోట్లు కేయించుట జరిగినది.
కొవ్వూరు నర్సాపురం నిడదవోలు మున్సిపాలిీల అభివృద్ధికి రూ.96.05కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టుట జరిగినది.
పంచాయతీరాజ్‌శాఖవారు గ్రామీణ ప్రాంతములో రోడ్లు త్రాగునీి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు కోసం రూ.99.65కోట్లు ఖర్చు పెట్టుట జరిగినది.
గోదావరి పుష్కరాలలో ప్రజలు అనూహ్యంగా రాజమండ్రికి తరలిరావడంతో ఎక్కడివారు అక్కడే నిలబడిపోవడంతో గౌ|| ముఖ్యమంత్రి వర్యులవారి ఆదేశాలతో అప్పికప్పుడు ప్రత్యేక ఉచిత బస్సులను ఏర్పాటుచేసి వారి గమ్యస్థానాలకు చేర్చడమైనది. రాష్ట్ర ప్రభుత్వంవారు 300 ఉచిత బస్సులను ఏర్పాటు చేయుట జరిగినది.
రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్యపనులు ఎప్పికప్పుడు నిర్వహించుటకు అదనముగా రూ.13,000మంది పనివారలను ఏర్పాటు చేయుట జరిగినది. మున్సిపల్‌ ప్రాంతములో 2,300తాత్కాలిక మరుగుదోడ్లను గ్రామీణ ప్రాంతములో 925 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయుట జరిగినది.
యాత్రికులకు 35లక్షల ఆహారపు ప్లొాలను పంపిణీ చేయుట జరిగినది.
అలాగే యాత్రికుల ఆహ్లాదముకొరకు సాంస్క ృతిక మరియు ధార్మిక ప్రవచనాలను ఏర్పాటు చేయుట జరిగినది.
కృష్ణా పుష్కరాలు
కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలగుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వద్ద ప్రవేశించి కృష్ణాజిల్లాలోని హంసలదీవి వద్ద బంగాళఖాతంలో కలియును.
రాబోవు కృష్ణా పుష్కరాలు ది:12.8.2016 నుంచి 23.8.2016 వరకు ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలయందు నిర్వహించబడును.
కృష్ణానదీ పరివాహకప్రాంతమైన కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల యందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవారు రూ.1072.59కోట్లతో 1224 పనులకు ప్రణాళికలు తయారు చేసి మౌలిక సదుపాయాలను కల్పించుట జరుగుచున్నది.
నీిపారుదలశాఖవారు రాష్ట్రంలో రూ.216 కోట్లతో 158 స్నాన ఘ్టాల అభివృద్ధి పనులను చేపట్టడమైనది.
రోడ్లు భవనాలశాఖవారు వివిధ రోడ్ల అభివృద్ధి, క్యూలైన్ల బారికేడింగ్‌ ఏర్పాట్లకొరకు రూ.379.13 కోట్లతో 128 పనులు చేపట్టుట జరిగినది.
విజయవాడ, గుంటూరు మొదలగు మున్సిపల్‌ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిీలలో సుమారు 166కోట్లతో 186 అభివృద్ధి పనులను చేపట్టుట జరిగినది.
పంచాయతీరాజ్‌శాఖవారు గ్రామీణ ప్రాంతాలరోడ్లు అభివృద్ధి, త్రాగునీి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్ల నిమిత్తం 144కోట్లతో 184 పనులను చేపట్టుట జరిగినది.
దేవాదాయధర్మాదాయశాఖ కృష్ణానదీతీరంలో వున్న 490దేవాలయాలను రూ.37.65కోట్లతో అభివృద్ధి చేయుట జరుగుచున్నది. ప్రముఖ దేవాలయాలైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం, విజయవాడ, శ్రీ భ్రమరాంబమల్లికార్జునస్వామివార్ల దేవస్థానం, శ్రీశైలం నందు రూ.129.92కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టుట జరిగినది.
విజయవాడనందు రూ.66కోట్లతో రివర్‌ఫ్ర్‌ం అభివృద్ధి పనులు రూ.33కోట్లతో నగరసుందరీకరణపనులు చేపట్టుట జరుగచున్నది.
అలాగే గోదావరినది కృష్ణలో కలిసే సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుట జరుగుచున్నది.
ప్రకాశం బ్యారేజివద్ద ల్‌ై అండ్‌ లేజర్‌షోకి ఏర్పాటు చేయుట జరుగుచున్నది.
గుంటూరుజిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానములవారు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని 15 ఏకరాల విస్తీర్ణములో నిర్మించబోవుచున్నారు.
దుర్గాఘ్‌ా ఫ్లై ఓవర్‌ పనులను పుష్కరాలలోపులో పూర్తి చేయుటకు తగుచర్యలు తీసుకోవడం జరుగచున్నది.
విజయవాడ, గుంటూరు నగరాలో పుష్కరాల సందర్భంగా నమూనా దేవాలయాలు ఏర్పాటు చేయుట జరుగుచున్నది.
కృష్ణానదీ హారతులను పుష్కరాల సందర్భంగా ప్రవేశప్టిె ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చురుకుగా సాగుచున్నవి.
విజయవాడ దేవస్థానము నందు భక్తుల రద్దీతట్టుకొనుటకు పాతభవనాలను తొలగించి విశాల పరచుట జరుగుచున్నది.
విజయవాడనందు ఒక సిీ స్క్వేర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకొనుట జరుగుచున్నది.
రైల్వేశాఖవారు 206 ప్రత్యేక రైళ్ళు, 200 అదనపు బోగీలను ఏర్పాటు చేయుట జరుగుచున్నది.

కృష్ణాష్టమి వ్రతమహిమ - బ్రహ్మాండ పురాణాంతర్గతము

కరుశదేశమునకు చంద్రముఖుండను రాజుయుండెను. అతనికి వందమంది భార్యలు. పట్టపురాణిపేరు తారంగి. ఆ దంపతులు ధర్మనిష్ఠులు. వారిది అపురూపదాంపత్యము. తారంగి చాలా దైవభక్తిగలది. వారి అంతఃపురసవిూపమున నొక విష్ణుమందిరముగలదు. ప్రతిదినమూ అచ్చికి వెళ్ళి పరిపరి విధముల సేవచేయుట ఆమె దినచర్య, వేలకొలది దాసదాసీలున్నప్పికీ దేవాలయమును శుభ్రముచేయుట ముగ్గులు వేసి తోరణములు క్టి అలంకరించుట స్వయముగ చేసెడిది. ఒకసారి యచ్చికి శుకమునులవారు వచ్చి ఆమె విశిష్టసేవను గమనించి ఆశ్చర్యముతో ''అమ్మా ఇంతి అపూర్వ సేవ చేయుటకు కారణమేమి'' యని అడిగిరి. ఆమె భక్తితో నమస్కరించి ఇట్లనెను ''మహానుభావా మీకు తెలియనిది ఏమియున్నది. మీరు అడిగితిరి కనుక తెలిపెదను అని ''పూర్వజన్మములో నేనొక శూద్రస్త్రీని నా తండ్రి మరియు నా సోదరు నలుగురూ పరమ పాపిష్ఠులు, వారిపని వేాడుట, దొంగతనము చేయుట దారిదోపిడీ చేయుట నిత్యకృత్యము. ఒకసారి నా అన్నలు బ్రాహ్మణ యాత్రికులను చంపి వారివద్ద గల ధనమును అపహరించిరి. ఆ విషయము ఆ దేశపురాజుకు తెలిసి వారందరికి మరణదండన విధించిరి. నా తండ్రికి అదేగతి అయ్యెను. నా తల్లి ఖైదులోనే ప్రాణములు విడిచెను. రాజభటులు నన్ను మగధదేశమునకు తీసుకుపోయి సుఘోషుడు అను బ్రాహ్మణునికి అమ్మివేసిరి అతని పత్ని చాలా స్నేహశీలి వారిద్దరి రక్షణలో నేను సుఖముగా పెద్దదాని నైతిని. ఒకసారి ఆ విప్రపత్ని శ్రీకృష్ణాష్టమి వ్రతము యొక్క మహిమను తెలిపెను. ఆమె దానిని ఆచరింపమని ప్రేరణచేసి అట్లు ఆచరించుట వలన మూడవ జన్మలో మహారాణి వగుదువని చెప్పెను. అట్లే నేను ఆ వ్రతము యొక్క విధి విధానములు చేప్పెను. అట్లే నేను ఆ వ్రతము ఆచరించితిని. ఆ రోజు పూర్ణ ఉపవాసముచేసి మర్నాడు ప్రాతఃకాలమున పారణచేసితిని. కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు మృతి చెందెను. అతని భార్య సహగమనము చేసెను. కొంతకాలమునకు విషజ్వరము సోకి నేను మృతిచెందితిని.

దేహమును వదలివేసిన వెంటనే విష్ణుదూతలు నలుగురు వచ్చి విమానమునందు నన్ను కూర్చుండబ్టెి విష్ణులోకమునకు తీసుకొని వచ్చిరి. దానియందు ప్రవేశము దొరకలేదు. అశరీరవాణి ''నీకుదినలో ప్రవేశించుటకు కాలమాసన్నమవలేదు'' అని నుడివెను. అచటనుంచి ఇంద్ర లోకమునకు యచట నుంచి యమలోకునకు తీసుకొనివచ్చిరి. యముడు నన్నాదరించి అనుగ్రహించిరి. ఆ సమయమునకు అచ్చటకు యమదూతలు ఆగమించి ''ప్రభూ విూ ఆజ్ఞప్రకారము ఇప్పుడు మగధదేశమునందు పరమపాపియైన బ్రాహ్మణుని తీసుకొని వచ్చుటకు వెళ్ళితిమి. కానీ ఆశ్చర్యకరమైన విషయము. మేము అతని కంఠమునకు వేసిన పాశము తెగిపోయె, ఎత్తిన దండము విరిగిపోయె, చాపిన చెయ్యి అట్లే యుండిపోయె. అతడి వేడి యూపిరి మమల్ని కాల్చుటకు సిద్ధమయినది. భీతులైన మేము తిరిగి వచ్చితిమి.'' అనిరి. చిత్రగుప్తుడు యముని యాజ్ఞతో ఆ రహస్యమును చెప్ప మొదలుపెట్టెను. ''అతనొక పరమపాపి. కానీ శ్రీకృష్ణాష్టమి వ్రతమును ఆచరించిన ఈ తారంగికి ఆశ్రయమిచ్చిన ఫలితముగా అంతిగొప్పదనము నొందెను. అతనిని గౌరవముతో తీసుకొని రమ్మని యాజ్ఞపించిరి. అతనిని పిలుచుకొని వచ్చిన తరువాత అతనికి సన్మార్గము నుపదేశించిరి. అతనిని పిలుచుకొనివచ్చిన తరువాత అతనికి సన్మార్గమునుపదేశించిరి. యమదేవుడు తారంగితో ''ఇతడు కరూశదేశమునకు రాజుగా పుట్టును నీవు యతని పత్నిగా మహారాణి వగుదువు. శ్రీకృష్ణాష్టమివ్రతము ఆచరించి నీవు మహారాణి వగుదువని నీ యజమానురాలు చెప్పును. ఆ కోరిక నీ మనసులో యుండుటచేత నీకు వైకుంఠములో తలుపులు తెరచుకోలేదు. నీ అగ్నీలు నరక వాసముననుభవించి హీనయోనులందు జన్మించి ఇప్పుడు మరల వేటగాండ్రుగా ప్టుిరి. నా తల్లిదండ్రులు అడవి పందులుగా జన్మించిరి. నీ వలన వారందరు ఉద్ధారమవవలెనని యమదేవుడు తెలిపిరి. ఇది యంతయు జ్ఞాపకముండునట్లుగా వరమిచ్చిరి.
అదే నేను ఇప్పుడు జన్మించితిని. నాకు ఏడవ సంవత్సరములో పూర్వజన్మ స్మృతి లభించెను.
అప్పుడు ఆ నలుగురు వేటగాళ్ళు రెండు అడవి పందులను వేాడుటను చూసితిని. ఆ వేటగాళ్ళు నా అన్నలు అడవి పందులు నా తల్లిదండ్రులు నన్ను చూసిన వెంటనే వారికి జ్ఞానోదయమయి సద్గతి కలిగినది. నేను ''నారాయణ'' మంత్రముతో అభిమంత్రించిన జలములను ఆ పందులపై ప్రోక్షించితిని. అవి పాపవిముక్తులై వైకుంఠమునకు వెళ్ళినవి. కౌసల దేశమునకు రాజకుమారిగానున్న నేను కరూశదేశమునకు మహారాణినయ్యాను. ఇదంతా ''శ్రీకృష్ణజన్మాష్టమీ'' వ్రతము యొక్క ఫలము. అందుకొరకే శ్రీహరిని ఇంతి భక్తితో ఆరాధించు చున్నాను. ఇక ముందు నేను విష్ణులోకమును వెళ్ళుదును. శుకముని ఆశీర్వదించి వెళ్ళి పరిక్షిత్తు రాజు పుత్రుడయిన జనమేజయునకు ఆ వ్రతమునుపదేశించి ఉద్దరించిరి.


భవస్వరూపము - భవమూర్తి

 జలసంబంధమైన విభూతులన్ని మూర్తివంతం అయితే, అంటే ఒక రూపాన్ని దాల్చి నిలబడితే అదే శంకరునికి భవస్వరూపము అని పేరు. ఆ భవుడు అనేపేరుతో వుండే వుండే పరమశివుడు ఈ లోకంలో వుండే సమస్త జీవరాశుల ప్రాణములు నిలబడడానికి కారణమవుతాడు. లింగపురాణం చేస్తూ వ్యాసభగవానుడు ఈ భవస్వరూపం గురించి ఒక మాట అంాడు 'సంజీవనం సమస్తస్య జగతస్‌ సలిలాత్మిక భవ ఇత్యుచతే మూర్తిర్‌ భవస్య పరమాత్మనః' ఈ సమస్తమైనటువిం ప్రాణికోి దేనివలన బ్రతుకుతుందో, యదార్ధమునకు ఈ ప్రాణికోి అంతాకూడా దేనివలన ఉత్పత్తి అవుతుందో దానికి ప్రధానమైన కారణమేమి అంటే నీరు. ఆ నీరు లేకపోతే ప్రాణికోి నిలబడదు. వేదంలో ఒక మాట చెబుతారు ''ఆపోవా ఇదంగం బ్రహ్మ ఆపోవా ఇదంగం సర్వం'' అసలు నీిని మించినటువింది ఇంకొకిలేదు. అసలు సర్వము నీరే. అందుకే 'అమృతంవా ఆపః' నీరు అమృతంతో సమానం. అమృతంతో సమానమైన నీరు ప్రాణములను నిలబెట్టడానికి కారణం అవుతుంది. ఇప్పికి లోకంలో చూస్తుాంరు ఎవరైనా మూర్ఛపోయారనుకోండి వాళ్లదగ్గరకి తీసుకెల్లి ఆపిల్‌పండు, అరిపండు ఇస్తే వాళ్లు లేవడం సంబవంకాదు. వాళ్లమొకంమీద కాసిన్ని నీళ్లు చిలకరించి, వారి తలను నీితో తడిపితే చల్లి నీితో తుడిస్తే వారు తిరిగి చైతన్యాన్ని పొందుతారు. అంటే శరీరంలోంచి ఉద్గమిస్తున్న ప్రాణములు మళ్లీ శరీరంలోకి ప్రవేశించడానికి కూడా కారణమైనది ఏది అంటే నీరు. అనాదిగా ఋషులు ఈ నీియొక్క వైభవాన్ని అంతగా ప్రస్తుతి చేశారు. కాని మనకి సనాతనధర్మంలో గొప్పతనం ఎక్కడ వుంది అంటే  అది కేవలంగా పంచభూతాల్లో నీియొక్క వైభవంగా కోనియాడం, ఆ నీియొక్క విభూతి ఏదైతే వుందో, ఆ నీియందు బ్రతికించగలిగినటువిం గుణం ఏదైతె వుందో ఆ గుణం భగవంతునియొక్క విభూతి, ఆయనయొక్క అనుగ్రహం ఒక రూపాన్ని తీసుకొని అక్కడ నిలబడితే అది నీరుగా మారింది అని. అందుకని శివుని భవుడు అని పిలుస్తారు. ఆ భవుని భార్య భవాని, ఆ నీికి ఆ శక్తి కలిగి వుండటమే భవానిరూపంగా కలిగి వుంటుంది.   అందుకే పరమశివుడు భవుడుగా వున్నాడు. జలములకు అధిష్ఠానుడై యున్నాడు అనడానికి క్షేత్రం జంబుకేశ్వరంలో  జలలింగం, తిరువానకోయిలర్‌ అంటుారు ద్రవిడదేశంలో, ఇప్పికూడా దేవాలయంలో శివలింగం దగ్గర నీరు వూరుతూనే ఉంటుంది. స్థలవృక్షం నేరేడుచెట్టు, చిత్రం ఏమిటంటే ఒకానొకప్పుడు ఆ చెట్టు క్షీణించిపోయి క్రమక్రమంగా మరణించడానికి అది సిద్ధపడిపోయింది ఏదో ఒక చిగురు మిగులి, నిట్టనిలువున ఎండిపోతున్న సమయంలో  కంచికామకోి పీఠాధిపత్యం వహించినటువిం మహాపురుషులు అపర శివావతారులు చంథ్రేఖరేంద్ర మహాసరస్వతీవారు ఆ క్షేత్ర దర్శనానికి వెళ్లారు. వెలితే ఈ స్థలంవృక్షం నిలువునా ఎండిపోతుంది.  ఇది మళ్లీ జీవించడానికి ఏంచెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రాద్యాయం పారాయణ చేయండి అని అన్నారు. ఆ చెట్టుదగ్గర కూర్చుని రుద్రం పారాయణచేస్తే మళ్లీ ఆ చెట్టు చిగుర్చి యథా వైభవాన్ని పొందింది. ఆ లింగం దగ్గర ఇప్పికీ నీరు వూరుతూ ఉంటుంది. ఆ వూరినటువిం నీిని ఎవ్వరిమీద చల్లరు, ఎవ్వరికీ తీర్థంగా ఇవ్వరు, ఇప్పికపుడు ఆ నీరు తీర్చి ప్రక్కన పోసెస్తూ ఉంారు. ఆ నీరు ఎక్కడనుండి వచ్చింది దానికి అంటే సమాధానం ఏమీ ఉండదు. ఈ సమస్తమైనటువిం జలరాశిగా వుండి లోకములను బ్రతికించేటటువిం లక్షణము కలిగివున్నవాడు ఎవడో ఆయనే శంకరుడు. నిజానికి శరీరాలు బ్రతకడం ఒకటేకాదు. శరీరములు పోషింపబడడం ఒక్కటేకాదు. ధర్మం దేనిని ఆశ్రయించి వుంటుంది అంటే నీిని ఆశ్రయించి ఉంటుంది. నీరు లేకుంటే ఉత్తరక్షణం పోయేదేది అంటే ధర్మం. ఎందుచేత  ధర్మమునకు నీికి అంతదగ్గరి సంబంధం ఉంటుంది అంటే శౌచము సిద్ధించాలి అంటే నీరుబినా మార్గం ఉండదు. నేను ఈ ప్రవచనానికి రావాలంటే ప్రవచనానికి ముందు సంధ్యావందనం చేసి రావాలి, సంధ్యావందనం చేయాలి అంటే నాకు శౌచం ఎలా సిద్ధిస్తుంది స్నానం చేస్తే, స్నానం చేయాలి అంటే నాకు ఉపకరణం నీరే. ఒకవేళ నేను స్నానం చేసి కూర్చున దేనితో అర్ఘ్యం ఇవ్వాలి, నీితోనే అర్ఘ ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇవ్వకుండా, అసలు సంధ్యావందనమే చేయ్యకుండా ఇక్కడ ప్రవచనానికి రావడం కన్నా అనవసరమైన విషయం ఇక్కొకి వుండదు.  ఆ సంధ్యావందనానికి ప్రాణం ఎక్కడ ఉంది అంటే నీితోనే ఉంది. ఆ నీరు లేకపోతే ధర్మం నిర్వర్తించడానికి ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించాలో ఆ కార్యక్రమం నిర్వహించడానికి కావలసినటువిం స్థితి ఏర్పడదు. పైగా నీరు దొరకలేదనుకొండి ఇక ఐశ్వర్యసంబంధం ఉండదు లోకానికి. ఒక వూరు ఉందనుకోండి ఆ వూర్లో ఎంతైత మేడలు కట్టుకున్నవాళ్లు వుండనివ్వండి, ఎంతి ఐశ్వర్యవంతుడు వుండనివ్వండి, కుటుంబంలో ఎంతమంది సభ్యులు వుండనివ్వండి, ఎంత బంగారం ఉండనివ్వండి, ఎన్ని పశువులు ఉండనివ్వండి నీరు దొరకడం మానేసింది అనుకోండి ఆ వూరు వూరంతా విడిచిపెట్టేసి వున్న ద్రవ్యాన్ని, బంగారాన్ని పట్టుకొని వెళ్లిపోతారు. చిట్టచివరికి నాలుగుకాళ్లతో వుండే పశువులు ఏవి అయితే వుాంయో వాిని వెంట తీసుకెళ్లక వదిలిప్టిె వెళ్లిపోతారు. ఊళ్లు, ఊళ్లు ఎందుకు ఖాళీ అవుతాయి అంటే నీరు దొరకకపోతే ఖాళీ అయిపోతాయి. నీిరూపంలో వుండి పరమాత్మ లోకాలన్నింని కూడా అనుగ్రహిస్తుాండు. అటువిం నీరు అసలు లేకుంటే ఈ ప్రపంచం నీలబడదు. ఆ నీిరూపంలో ఉండి బ్రతికించేటటువిం లక్షణం నీియందు వుండేటట్లుగా చేసినవారు ఎవరో, ఆయన శివుడు. అందుకే నీిరూపంలో ఆయన వున్నపుడు ఆయన్ని భవుడు అని పిలుస్తారు. ఇటువిం నీి గురించి మ్లాడుతూ వేదం ఒకమాట అంటుంది ''హిరణ్యవర్ణాసుచయః భావాకాయ సుజాతః   కశ్యపూయాస్విద్రహః అగ్నిర్భ్యాగర్భందగిరివిరూపాస్థాన ఆపశాన షోనభవంతు'' బంగారు రంగు కలిగినటువిందై  ఈ నీరు ఇంద్రుడికి మాతృ స్థానియములు అయి వున్నవి. వేదంలో ఉన్నటువిం ఇంద్రుడువేరు పురాణంలో  వుండేటటువిం ఇంద్రుడు వేరు. పురాణంలో వుండేటటువిం ఇంద్రుడు దేవతలకి అధిపతి. పురాణంలో  వుండేటటువిం ఇంద్రుడి తత్త్వము కర్మసిద్ధాంతాన్ని బలపరుస్తూ ఉంటుంది.  మీరు ఎప్పుడైన కొంచెం జాగ్రత్తగా గమనిస్తే  ఎవరైన పరమనిష్టతో తపస్సు చేస్తున్నవాళ్లు ఉంటే వాళ్ల తపస్సు భగ్నం పరచడానికి ప్రయత్నం చేసేవారు ఎవరు అంటే ఇంద్రుడు భగ్నం చేస్తుాండు. ఏదో దేవలోకం నుంచి దేవవేశ్యలని పంపించడం, ఋతువుకు అధిపతి అయినటువింవాడిని పిలవడం, కోకిల పాట పాడించడం, ఆయనయొక్క తపోభంగం చేయించడం చేయిస్తూ ఉంాడు. మీరు బాహ్యంలో ఆలోచనచేస్తే ఎందుకు ఇంద్రుడు ఇటువిం కార్యాలు చేస్తుాండు అని అనుమానం వస్తుంది. నూరు క్రతువులు చేసినవాడు ఇంద్రుడు అవుతాడు. అందుకని నూరు క్రతువులు చేయకుండా చేస్తూ వుాండు అని లోకంలో ఒకమాట. కానీ నూరు క్రతువులు చేయకుండా ఏ డెభైయో చేసేస్తే  దగ్గరపడిపోతున్నాడని పాడుచేయవచ్చు. కాని మొది యజ్ఞం మొదలు ప్టిెనా పాడుచేస్తాడు ఆయన. ఎందుకలా? ఏమి, ఎందుకు ఆయనకు అటువిం దుర్భుద్ధి అంటే దాని తత్త్వాన్ని పరిశీలించకుండా కుండా తొందరపడకూడదు. భక్తితో కూడిన కర్మాచరణముయొక్క చరమ ప్రయోజనము ఏమిటంటే జ్ఞానావిశ్కరణ.  అలా భక్తితో కర్మచేసుకుంటు వెళ్లిపోతున్నాడు అనుకోండి. దానివల్ల అడిగితే పుణ్యం అడగాలి. పుణ్యం అడిగితే గొడవలేదు. పుణ్యం అడిగితే అది అనుభవించడానికి ఏదో ఒక జన్మ ఎత్తుతాడు అందులో దానిని సుఖంగా అనుభవిస్తాడు. కాని నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు మీరు విహిత కర్మగా ఈశ్వరప్రీతికొరకు చేస్తునట్లయితే, అది చేసుకొని వెళ్లిపోతున్నట్లయితే అది చిత్తశుద్దికి కారకం అవుతుంది. చిత్తశుద్ధి పాత్రత, ఒకసారి ఆ పాత్రత ఏర్పడితే భగవంతుడు భక్తితో కూడినటువిం నిష్కామ కర్మచేత ప్రీతిచెంది ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే ఒకసారి అన్నం వండడానికి బియ్యం కడిగి, నీళ్ళలో బియ్యంపోసి అగ్నిహోత్రంమీద బియ్యం ప్టిెన తర్వాత అన్నిబియ్యపు గింజలు మెతుకులు అయిపోతాయి అంతేగాని మళ్లీ అనుమానం వచ్చి అన్ని బియ్యపుగింజలు మెతుకులు అయ్యాయ అని చూడక్కరలేదు, అన్నీ మెతుకులు అవుతాయి. అన్ని బియ్యపుగింజలు మెతుకులు ఎలా అయ్యాయో అలా భక్తితో కూడి చేసినటువిం కర్మాచరణంవల్ల ఈశ్వరుడియొక్క అనుగ్రహంచేత పాత్రతను పొంది ఆ పాత్రత వలన పరమేశ్వరుడు కాక్షించిన జ్ఞానముచేత ఇక్కడే ఆ క్షణంలోనే ఆయన మక్తుడు అవుతాడు. అంటే నేను శరీరంకాదు అనేటువిం జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తే అప్పుడు అతడు జీవన్ముక్తుడైనాడు అంారు. జీవన్ముక్తుడైపోయిన వ్యక్తికి విధి, నిషేధములు ఉండవు. విధి అంటే ఇది చెయ్యాలి అనికానీ, నిషేధము అంటే ఇది చెయ్యకూడదు అని కానీ వుండదు. ఆ స్థాయికి వెళ్లిపోయిన మహాపురుషులకు ఇక అన్వయమవ్వదు. భగవాన్‌ రమణులు వున్నారనుకోండి ఆయన చాలాకాలం బట్టకట్టుకోలేదు. చుట్టూ వున్నవాళ్లు అన్నారు నీకు శరీరభ్రాంతిలేదు, చుట్టూ వున్నవాళ్ళకి వుంది. అందుకని లోకంకోసం మీరు ఒకగోచి పెట్టుకోండి అన్నారు, అలాగ అని ఆయన  ఒకగోచిపెట్టుకున్నారు. అది ఆయనకొరకుకాదు ఇది విధి బట్టకట్టుకోవాలి, ఇది విషిద్దము బట్టకట్టుకోకూడదు  అని ఆయనకేమి వుండవు, ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంారు. విధి, నిషేధము రెండింకి అతీతము. రమణులు సంధ్యావందనం చెయ్యరు. ఆయన చెయ్యలేదని నేను మానకూడదు. ఆయన ఆ స్థాయికి వెళ్లిపోయారు.   ఆయన ఎప్పుడు బ్రహ్మమునందు నమిస్తూ, బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమై పోయాడు. జ్ఞాని ఆ స్థాయిలో వుాండు. ఆయనకు విధి నిషేధాలు వుండవు. విధి, నిషేధములు ఉండవు కనుక కర్మ వుండదు. ప్రధానంగా యజ్ఞం వుండదు. యజ్ఞం లేకపోతే హవిస్సు ఉండదు. హవిస్సులేకపోతే దేవతలకు అన్నం ఉండదు. అందుకు భగ్నం చేస్తుాండు. అది ప్రధానకారణం. కర్మవైపు తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ ఇంద్రపదవి. కానీ వేదంలో చెప్పబడినటువిం ఇంథ్రబ్దం ఏదైతే ఉందో అది పురాణం చెప్పబడిన ఇంద్ర శబ్దంకాదు. రామాయణంలో తరచుగా రాముడికి ఇంథ్రబ్దం వేస్తుాంరు. అది వేదపరమైనటువింది. అంతవరకు ఎందుకు రుద్రాధ్యాయం గమనిస్తే ఒక అనువాకందగ్గరికి వచ్చేసరికి ఇంథ్రబ్దం అనువాకంగా తిరుగుతూ ఉంటుంది. ఆయన కేవలముగా ఆయన కేవలంగా స్థితికార శక్తితో విష్ణుపరమైన లక్షణంతో ఉంాడు. అటువిం ఇంద్రతత్త్వము కలిగినటువిం పదవి ఏది ఉందో దానికి వేదాలకు సంబంధించినటువిం ఇంద్రతత్త్వము అని పిలుస్తారు. అది పౌరాణిక ఇంద్రతత్త్వానికి, వైదిక ఇంద్రతత్త్వానికి సంబందం ఉండదు. అదిగో అలా కర్మ దాి జ్ఞానమును పొంది విధి నిషేధాలను దాిపోతాడు వ్యక్తి. దానికికూడా ప్రారంభం ఎక్కడ అంటే, అసలు ఉత్తమమైన ఒక కర్మచెయ్యాలి అంటే నీరు ఉంటే తప్ప జరుగదు. నీరులేకపోతే అసలు ఎవ్వరుకూడా ఇక యుక్తాయుక్త విచక్షణ అనే మాట ఉండదు. దీనిపట్ల ఈ గౌరవం పాించాలా, పాించకూడదా అని ఉండదు. అటువిం ఇంద్రుడు ఎవరు ఉన్నారో ఆయనకి ఈ జలములు మాతృస్థానియములు అయ్యి ఉన్నవి. అందుకే పోతనగారు భాగవతం థమస్కంధం చేస్తూ ''విశధరభయజనకునికి ............................... విశమేతలపన్‌'' అంటే ఎప్పుడు నీియందు  ఉండేటటువింవాడు, నీిని ఆశ్రయించి వుండే నారాయణ అంాముకదు, నారములు అంటే నీరు. నీిని ఆశ్రయించి వుండేవాడు అంటే లోకములన్నీ బ్రతకడానికి కారణమైనటువిం జలతత్త్వమును అధిష్టించివుండేవాడు అని విష్ణుతత్వముగా చెబితే, అటువింవాడు అయినటువింవాడికి భవుడు బ్రహ్మగారు తామరపువ్వులోంచి ప్టుినటువిం బ్రహ్మగారికి జనకుడు అయినటువిం నారాయణుడు అనే శబ్దాన్ని నీిపరంగావేసినారు పోతనగారు. కాబ్టి అటువిం ఇంద్రునికి మాతృస్థానియములు అయ్యి ఉంాయి. తల్లిస్థానంలో వున్నాయి నీళ్లు. అందుకని ''హిరణ్యవర్ణా సుచయః పాపకాయ సుజాతః'' అటువింనీరు గర్భమునందు అగ్నిహోత్రాన్ని ధరించి ఉంటుంది. బాహ్యంలోకూడా సముద్రగర్భమునందు ఎంముటుంది అంటే బడబాగ్ని ఉంటుంది. నీినుండి ఉత్పతిక్రమం చెప్పెటప్పుడు ఈ విశ్వం ఎలా వచ్చింది అనే చెప్పెక్రమంలో ''ఆకాశాత్‌ వాయుః, వాయురుగ్నిః, అగ్నిః జలః'' ఆకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము ఉత్పత్తి అయినవి అని. నీియొక్క గర్భమునందే జలముకూడా నిలబడి ఉంటుంది. అందుకే ఈ సమస్తభూతకోి నీలబడడానికి కారణమైనదేది అంటే నీరు. సమస్తభూతకోికి సౌచమును ఇచ్చేది ఏది అంటే నీరు. అటువింనీరు అందరికి కూడా పది లక్షణములను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది ఈశ్వరానుగ్రహం వస్తుంది అని వేదం చెబుతుంది. అందుకే స్నానం చెయ్యకుండా వుండరు. ఎవ్వరైనా సరే స్నానం అనేటువింది అత్యంత ప్రధానమైన కర్మ. ఆ స్నానం చేసేటప్పుడు గంగాది నదులను స్మరించకుండా లేదా కనీసంలో కనీసం దేవుని నామస్మరణలేకుండా చేసిన స్నానం కాకిస్నానం, భగవన్నామం స్మరించి గంగేచ, యమునేచైవ గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి, ................... అసలు స్నానం అంటే మర్జనం, తలమునగాలి తలమునిగితే స్నానం, అంటే దానర్ధం ఏమి? ప్రవహించే జలములలోకానీ, నిలబడినటువిం జలములు కలిగిన తాకాదులందుకానీ తలమునిగెటట్లుగా స్నానంచేస్తే దానిని స్నానము అని పిలుస్తారు. అంత అవకాశం లేనపుడు, నీరుతీసి తల్లమీంచి పోసుకుాంం. అలా స్నానంచేస్తే ఏమోస్తుంది అన్నారు. నీివలన పదిగుణములు కలుగుతాయి. పదిగుణములు ఎక్కడనుండి వస్తాయి అంటే కేవలం నీివలననే ఉత్పత్తి అవుతాయి. ఇది భారతీయ ధర్మమునందు, సనాతన ధర్మమునందు ఉన్నటువిం గొప్పదనం. అందుకే ఆయన భవుడు అయ్యాడు. జలము ఒక లింగస్వరూపం. ఒక శివస్వరూపం అయ్యింది. అందులో మీరు మొట్టమొదిది ఏది అంటే సాధూరూపంచ, సాధురూపం అంటే ఉద్రేకములన్ని అనిగిపోయి, చక్కి స్వరూపము కలుగుతుంది. ఒకవ్యక్తి నిద్రపోతే నవరంధ్రములు కూడా మలములను విడిచిపెడతాయి. నవరంధ్రములు మలమును స్రవిస్తే వాడు ఉత్తమకర్మ చేయడానికి అర్హత కోల్పోతాడు. శరీరముయొక్క తేజస్సు క్షయం అయిపోతుంది. అది దేనిచేత మళ్లీ ఉత్సాహాని పొందుతుంది అంటే స్నానంచేత పోందుతుంది. అందుకే చూడండి ఎక్కువ పర్యాయములు స్నానంచేసేటువింవారి తేజస్సు వేరేవిధంగా ఉంటుంది. స్నానమునందు శ్రద్ధలేనివారికి అటువిం కాంతి  మీకు గోచరముకాదు. అందుకే సాధురూపంచ, అసలు చక్కిరూపము కలుగుట అంటే చూడగానే ఆ ప్రశాంత వదనము అనిపించాలంటే, ఉద్వేగములు అణిగేటట్లు చేయ్యాలంటే, మలమునుండి శౌచమును కల్పించాలి అంటే దానిసాధించగలిగిన శక్తి దేనియందు నిమిడికృతమైంది అంటే ఒక జలములయందే. ఒకప్పుడు పరమశివుడికి శుక్రాచార్యులమీద కోపం వచ్చిది. కానీ ఆయన చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే బృహస్పతి ఎలా అయితే దేవగురువో, అలా శుక్రాచార్యులవారుకూడా రాక్షసులగురువు. ఇద్దరు గురువులే. నిస్పక్షపాతంగా గురువుయందు అన్వయం అయినప్పుడు ఒక విషయం కనబడుతుంది. బృహస్పతి తన కొడుకైనటువిం కచుడికి విద్యాభ్యాసం చెయించడానికి శుక్రాచార్యుల దగ్గరికి పంపించాడు. శుక్రాచార్యులదగ్గర మృతసంజీవనీ విద్యనేర్చుకొని కచుడు దేవలోకానికి ఉపకారం చేసాడు. వాళ్లమధ్య ఏవిధమైన విభేదాలు ఉండవు. బలిచక్రవర్తి విశ్వజిత్‌ యాగంచేశాడు అంటే, అంతగోప్పవాడు అయ్యాడంటే దానికి కారణం శుక్రాచార్యులవారి అనుగ్రహం. అందుకే ఏనాడు గురువుగారి అనుగ్రహం తొలగిపోతుందో, ఆనాడు పతనమైపోతాడు. అప్పివరకు వేచి చూడండి అన్నాడు బృహస్పతి. ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువురా, నీవు దానం ఇవ్వకు అన్నాడు శుక్రాచార్యులవారు ఏదైనా కానివ్వండిమాట తప్పను, నేను ఇస్తాను అన్నాడు మూడు అడుగులు ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన రాక్షస నీతి చెప్పాడు. ఏం పరవాలేదురా, నేను అలా అనలేదు అని అబద్దం చెప్పు అని అన్నాడు. నేను అనను, బ్రతకవచ్చుగాక బహువిధంబులనైన ................. నేను మాటతప్పను, దానం చేసేస్తాను అన్నాడు. నీవు నామాట తిరస్కరించావు కాబ్టి ఐశ్వర్యం ధ్వంసం అయిపోతుంది అన్నాడు శుక్రాచార్యులవారు. గురువారి కాక్షం పోయింది బలిచక్రవర్తియొక్క ఐశ్వర్యం పోయింది. బృహస్పతి ఎంతగోప్పవాడని చెప్పాలో నిష్పక్షపాతంగా రాక్షసగురువైన శుక్రాచార్యులవారుకూడా అంతేగొప్పవారు, ఇంతగొప్పవాడు అయినటువిం బృహస్పతితో తుల్యుడైనటువిం శుక్రాచార్యులవారు, బృహస్పతి సాధించిన ఏ విషయాన్ని అయినా ఆయనా సాధించగలడు. వచ్చిన ఒకే ఒకతేడా ఏమిటంటే రాక్షసులు ఆయనను ఆశ్రయించారు. దేవతలు ఈయనను ఆశ్రయించారు. దేవతలవలన లోకములకు ఉపకారము జరుగుతుంది. రాక్షసులవలన అపకారం జరుగుతుంది. అందుచేత శుక్రాచార్యులవారు దేవగురువు అయినటువిం బృహస్పతి పొందినటువిం వైభవం సాధారణంగా పొందలేదేమోగాని, బృహస్పతికన్నా శుక్రాచార్యులవారు తక్కువ అని సిద్ధాంకరించడంమాత్రం జాగ్రత్తగా బృహస్పతి మాటలను పరిశీలిస్తే అది సాధ్యంకాదన్న విషయం స్పష్టం అవుతుంది. కాబ్టి తేజోరూప్‌ సాధురూపంచ, సద్‌రూపం అంటే అన్ని ఉద్వేగములు అనిగిపోయి చక్కి రూపము చూడగానే ఏమి తేజస్సురా మహానుభావుడు అనిపిస్తుంది అంటే స్నానం ఎక్కువమార్లు చేసే అలవాటు వున్నవారికి. మనది భారతదేశం, కర్మభూమి. కర్మభూమి అయినటువిం భారతదేశంలో పుష్కలంగా లభిస్తుంది నీరు. నీికి కొదవలేదు. అన్ని జీవనదులు ప్రవహిస్తూ వుాంయి. సాధూరూపంతోపాటు తేజస్సు. కాంతిబాగా ఉద్దీపనము అవ్వాలి అంటే, కాంతి దేనిచేత పెరుగుతుంది. వర్చస్సు అంారు. కాంతి పెరగడానికి కూర్మవాయువు బాగా సంతరించుకోవడానికి మనస్సు నిశ్చలంగా వుండటం కారణం అవుతుంది. ఆ మనస్సు నిశ్చలత్వం దేనిచేత పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది. అందుకే మీరు చూడండి మనస్సు ఎక్కువ కదులుతుంది. రజోగుణ, తమోగుణములచేత కొట్టబడుతుంది. వెంటనే చల్లి నీితో స్నానము చేస్తారు ఇప్పికీ. చల్లి నీితో స్నానము చేసినందువలన రజోగుణ, తమోగుణములతో కదిలినటువిం మనస్సు స్తిమితపడుతుంది. అందుకే దానివలన తేజస్సు ఉద్దీపనం అవుతుంది. కాబ్టి కాంతిని పెంచెలక్షనం దేనికి వుంది అంటే స్నానానికి, స్నానమునకు ఉపకరణము ఏది అంటే నీరు ఒక్కటే. కాబ్టి సాధూరూపంచ, తేజో బలశ్చ. శరీరమునకు బలమును ఇచ్చేది ఏది అంటే స్నానం. అసలు స్నానం చేసి వచ్చేటప్పికి బడలికి బాగాతీరిపోయి అమ్మయ్య అనిపిస్తుంది. వేసవికాలంలో శంకరాచార్యులవారు శివానందలహరిలో చెప్పినట్లు ''సంసారోతాపభ్రమణ పరితాపోపశమనం'' అలా తిరిగి తిరిగి వచ్చినటువిం వారికి చెమటపట్టేసి వుంటే చల్లి నీితో తలమీంచి స్నానంచేసి, తేలికబట్టకట్టుకొని వచ్చి కూర్చున్నాడు అనుకోండి హమ్మయ్య అని బడలిక అంతాతీరి బలాన్ని పుంజుకుాండు. కాబ్టి బలం ఇవ్వగలిగినది ఏమి అంటే స్నానం. అంతేకాదు నదీప్రవాహానికి అభిముఖంగా నిలబడి చేసిన స్నానం గొప్ప తేజస్సుకు కారణం అయ్యి శరీరం యొక్క తేజస్సు పెరగడానికి కారణం అని వేదం నిర్ధారించింది. ''తేజో రూపంచ బలం శౌచ్చం'' అలాగే శౌచం దేనిచేత కలుగుతుంది అంటే ఒక్క స్నానము చేతమాత్రమే కలుగుతుంది. అందుకే స్నానం విషయంలో మాత్రమే మినహా ఇంపు ఇచ్చింది శాస్త్రం. ప్రతిరోజు పురుషుడు తలస్నానం చేయ్యాలి. తలమించి స్నానం చేయకుండా శాస్త్రం అంగీకరించదు. ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే అనారోగ్యం చేత గ్రసించబడితే, ఆయన బాధపడుతుంటే జ్వరపీడితం అయ్యి ఉంటే, కంఠగత స్నానం లేదా నడుము దగ్గరనుండి స్నానం లేదా కాళ్లుకడుకోవడం లేదా విభూతి చల్లుకోవడం లేదా నారాయణ నామస్మరణం చేయాలి లేదా గోవిందా, గోవిందా, గోవిందా అపవిత్రం పవిత్రోవా సర్వాస్తాంగం వివతోవ యస్మరేత్‌ పుండరీకాంక్షం బాహ్యంబతర శుచి. ఇన్ని మినహా ఇంపులు ఎందుకు ఇస్తూ వెళ్లింది అంటే స్నాన ఫలితమును కల్పించడానికి స్నానము శౌచమును ఇస్తుంది. శౌచము అంటే ఒక ఉత్తమ కర్మ చెయ్యడానికి అర్హత, ఒక్కొక్క అర్హత పొందితే తప్పా, ఒక్కొక్క కర్మ చెయ్యడం సాధ్యంకాదు. ఒకవ్యక్తి ఏమి చదువుకోవాలో అది చదువుకుంటే తప్ప ఒక ఉద్యోగానికి అర్హుడుకాడు. అలాగే స్నానంచేసివుంటే తప్ప భగవంత్‌ సంబంధమైన కర్మచెయ్యడానికి అర్హతపొంది ఉండడు. ఆ శౌచము కలగాలి అంటే స్నానము ఒక్కటే మార్గం అయ్యి ఉంటుంది. కాబ్టి శౌచం ఇచ్చినా అదే, అలాగే ఆయుశ్య 'ఆరోగ్య అలోల ముత్యం, దుస్సప్న గాతంచ తపస్య మేథా' అంటుంది వేదం. దీర్ఘాయుర్ధాయం ఎవరికి కలుగుతుంది అంటే దీర్ఘంగా స్నానంచేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో, ఎవరికి స్నానంచేసే అలవాటు రోజూ ఉంటుందో రోజూ స్నానం విధివిధానాన్ని పాించి స్నానం చేస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆరోగ్యందేనిమీద ఆధారపడి ఉంది అంటే స్నానం చెయ్యడంలో నిష్ట కలిగి, ఏదో గబగబా స్నానంచేసి రావడంకాదు. స్నానంచేసేటప్పుడు శ్రద్ధావంతుడై అందుకే నీరు శ్రద్ధా స్వరూపము అంది వేదం.

గోదావరీ నది మాహాత్మ్యము

     తీర్థభేదము తీర్థవైశిష్ట్యము తీర్థసేవన ఫలము సకల తీర్థశ్రేష్ఠత్వ విషయమును బ్రహ్మపురాణమున గౌతవిూ మాహాత్మ్యము అను రెండవ భాగమున నూా అయిదు అధ్యాయములలో విపులముగా వివరించబడినది. గౌతవిూనదిలో 92 తీర్థములు ఈ పురాణములో విపులముగా వర్ణించబడినది. గౌతవిూ మాహాత్మ్యము అనుపేరుతో విడిగా ఒక గ్రంథమునే అందించిన తెలుగురాష్ట్రప్రజలకు ఉత్తమసేవగా మారును. ఆ పని దేవాదాయధర్మాదాయశాఖనే చేయవలయును దానిలో మన గోదావరి మన గౌతమి అనుకొనే నదీమతల్లిలో ఎంతమంది మహానుభావులు మునిగితరించినారో ఎన్ని పుణ్యతీర్థములు ఎన్ని పుణ్యక్షేత్రములున్నవో తెలియునుకదా. ఈ పవిత్ర కార్యమునకు ఈ శాఖ నడుము కడుతుందని తలచు చున్నాను. అట్లు లేనినాడు ఒక్కొక్క నెల ఆరాదనలో ఒకో రెండో లేదా మూడు అధ్యాయములు ధారావాహికముగా ప్రసరించినను ఒక మూడు సంవత్సరములు ముగియును. ఆ పఠమును ప్రసాదమును అందించునని తలంచుచు ఈ వ్యాసమను అందించు చున్నాను.

    ఈ విభవము బ్రహ్మనారదసంవాద రూపమున బోధింపబడినది. అందున నారదభగవానుడు చతుర్ముఖ బ్రహ్మను తన తండ్రిని ఇట్లు ప్రశ్నించెను.
        తపసోయజ్ఞదానానాం తీర్థసేవనముత్తమమ్‌                                    ఇతిశ్రుతం మయాత్వత్తో జగద్యోనే జగత్ప్రభో                                     దైవాని ముని శార్దూల ఆసురాణ్యా ఋషాణి చ                                కి యద్భేదాని తీర్థాని కిం ఫలాని సురేశ్వర                                    సర్వేషామేవ తీర్ధానాం సర్వదాకిం విశిష్యతే.
    తపసులలో యజ్ఞం, దానములలో తీర్థములను సేవించుట ఉత్తమము అని నేను నీ నుండి వినియుింని, దైవములు ఆసురములు, ఆ ఋషములు ఇట్లు తీర్థభేదములు ఎన్ని విధములు. ఏ తీర్థములు యే యే ఫలములను ప్రసాదించును. అన్ని తీర్థహులలో విశిష్టతీర్థములు ఏవి అని నారదమహర్షి అడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పెను.
        చతుర్విధాని తీర్థాని స్వర్గే మర్త్యేరసాతలె                                    దైవాని ముని శార్దూల ఆసురాణ్యా ఋషాణిచ                                    మానుషాణి త్రిలోకేషు విఖ్యాతాని సురాది భి.
    తీర్థములు నాలుగు విధములుగానుండును. ఇవి స్వర్గమున, మర్త్యలోకమున, పాతాలమున నున్నవి. దైవములు, ఆసురములు, ఆర్షములు, మానుషములు. ఇవి మూడులోకములలో సురాదులచె ప్రసిద్ధిపొందినవి.
    మానుషతీర్థములకంటే ఆ ఋషతీర్థములు సర్వకామ ఫలప్రదములు ఆ ఋషతీర్థములకంటే ఆసుర తీర్థములు బహుపుణ్యఫలప్రదములు. ఆసుర తీర్థములకంటే దైవతీర్థములు సార్వకామికములు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలచే నిర్మించబడిన తీర్థములు దైవతీర్థములనబడును. ఆ మువ్వురిచేత ఒకటే నిర్మించబడినచో దానికన్నా శ్రేష్ఠమైనది ఇంకొకియుండదు. మూడు లోకములకు సేవించదగిన తీర్థము మానుష తీర్థము. మానవ తీర్థములలోకూడా జంబూద్వీపములోని తీర్థములు శ్రేష్ఠములు. జంబూద్వీపములోని తీర్థములకంటే భారతవర్ష తీర్థములు శ్రుతి ప్రసిద్ధములు. భారతవర్షములోనూ దండకారణ్యము సాిలేని సర్వతీర్థశ్రేష్ఠము. ఇది కర్మభూమిగాన సర్వోత్తమ తీర్థమందురు. ఇపుడు అక్కడున్న తీర్థముల నామములను సంక్షేపముగా చెప్పెదను వినుము. దైవమానుష ఆసుర భేదములతో హిమవత్‌ వింధ్య పర్వతముల మధ్య ఆరునదులున్నవి. ఇవి దైవసంభవములు. దక్షిణ సాగరవిన్ధ్యనదులమధ్యలో ఒక ఆరున్నవి. ఇట్లు ఈ 12 నదులు ప్రధానముగా కీర్తించబడినవి. ఇందు వలననే భారతవర్షము బహుపుణ్యప్రదము అని సురాసురనరులచే పూజింపబడు చున్నది. దేవతలు సైతము ఈ భూమికి వచ్చి ఆయా కర్మలను చరించి తమకు కావలసిన ఫలములను పొందెదరు. ఇట్లు అందరికి అభీష్ట ఫలములను వర్షించునదిగాన భారతమును వర్షమందురు. దైవతీర్థములను ఆసురులు ఆవరించినచో దానిని దైవాసుర తీర్థములందరు. దైవతీర్థములలో తపస్సు చేయుటకు ఋషులు నివసించిన తీర్థములు దైవార్షతీర్థములు అనబడును. తమ శ్రేయస్సునకు ముక్తికి పూజకు అభివృద్ధికి తమ ఫలభూతికి కీర్తిని పొందుటకు మానవులు చేసిన తీర్థములు మానవ తీర్థములందురు. ఇట్లు బ్రహ్మపలుకగా నారదమహర్షి ఇట్లు అడిగెను.
    బ్రహ్మ భగవానుడా. కృతయుగాదిలో తీర్థసేవకు మించిన ఇంకొక ఉపాయము అల్పాయాసముతో అభీష్టమును ప్రసాదించునదిలేదు. కావున ఆ తీర్థములలో అతిశ్రేష్ఠములైన తీర్థములను చెప్పుటకు నిన్ను మించిన శ్రేష్ఠమైన వక్త ఇంకొరులేరు. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను.
    గోదావరీ భీమరధీ తుంగభద్రా వేణికా తాపీ పయోష్ణీ. ఈ నాదులు విన్ధ్యనదికి దక్షిణమున కలవు. భాగీరధీ నర్మదా యమునా సరస్వతీ విశోకా వితస్తా ఈ నదులు హిమవత్పర్వతమును ఆశ్రయించినవి. ఈ నదులు పుణ్యతమములు. దేవతీర్థములుగా చెప్పబడుచున్నవి.
    గయుడు కోలాసురుడు. వృత్రాసురుడు త్రిపురుడు అన్ధకుడు హయశీర్షుడు లవణుడు నముచి శృంగకుడు యముడు పాతాలకేతువు మధువు పుష్కరుడు. వీరిచే ఆవరించబడిన తీర్థములు ఆసురతీర్థములనబడును. ప్రభాసుడు భార్గవుడు అగస్తి నరనారాయణులు వసిష్ఠుడు భరద్వాజుడు గౌతముడు కశ్యపుడు మనువు ఇత్యాది మునిసేవితములు. ఋషితీర్థములు అంబరీషుడు హరిశ్చన్ద్రుడు నహుషుడు శ్రీరామచంద్రుడు కురువు కనఖలుడు భరతుడు సగరుడు అశ్వయూపుడు నాచికేతువు వృషాకపి అరిందముడు ఇత్యాది మానవులు నిర్మించిన తీర్థములు మానవతీర్థములు.
    ఎవరూ త్రవ్వని తీర్థమును దైవఖాతమందురు. ఇట్లు సంక్షేపముగా నీకు తీర్థభేదమును తెలిపితిని. దీనిని తెలిసిననూ నరుడు సకల పాపవినిర్ముక్తుడగును.
    ఇట్లు బ్రహ్మ పలుకగా నారదమహర్షి మరల ఇట్లు ప్రశ్నించెను. త్రిదైవత్యతీర్థము సర్వతీర్థములకంటే ఉత్తమోత్తమమని వినియుింని. ఆ త్రిదైవత్యస్వరూపమును బేదమును విస్తరముగా చెప్పగోరుచున్నాను. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పుచున్నాడు. త్రిదైవత్యతీర్థము కనపడువరకే ఇతర తీర్థములు ఇతర పుణ్యభూములు సకల యజ్ఞాదులు వ్రతోపవాస కృచ్ఛ్రములకాంచే గంగాసేవగొప్ప ఫలమును ప్రసాదించునది. ఆయా సకల తీర్థములలో కృచ్ఛ్రకములు కనపడుచునేయుండును. ద్రవ్యము ఆత్మమాత జనకాదులు దేవతలకు శుద్ధిని కలిగింతురు. ఒక త్రిదైవత్యములేనినాడు పాపక్షయమెట్లు కలుగును? ఈ గంగ సకల నదులలో శ్రేష్ఠమైనది. స్మరించబడినను దర్శించిననూ స్పృశించిననూ సకల కాంక్షితములను సర్వనామములను ప్రసాదించునది. ఇక ఇపుడు ఈ త్రిదైవత్వము యొక్క పుట్టుకను వినుము. పదివేల సంవత్సరములకు పూర్వము  ఒక దైవకార్యము సంభవించినది. తారకాసురుడు మహాబలశాలి. నా వరముతో అతిగర్వితునిగా ఉండెను. ఆ బలీయునిచే దేవతల పరమైశ్వర్యము హరించబడినది. అంతనే దేవతలందరూ క్షీరసాగర శాయిని సకల జగత్తులకు ప్రపితామహుని శ్రీమన్నారాయణుని శరణువేడిరి. చేతులు జోడించినవాడై అనన్యమైన భక్తితో శ్రీ మహావిష్ణువుతో ఇట్లు పలికిరి. నాధా! జగత్తులను రక్షించువాడవు నీవే. దేవతలకీర్తిని పెంచువాడా సర్వేశ్వరా, జగత్కారణభూతా వేదస్వరూపా నీకు నమస్కారము. ఈ లోకములను సృజించువాడవు. అసురులను వధించువాడవు సకల జగములకు పతివి నీవే. సృష్టి స్థితి లయములకు కారణము నీవే. సకల విధములైన ఆపదలను వించినవారికి ఈ మూడు లోకములలో నీవు తప్ప ఇంకొక రక్షకుడులేడు. వుండరీకాక్షా! నీవు లేనినాడు తాపత్రయములను నివారించగలవాడింకొకడులేడు. అఖిల జగములకు తల్లివి తండ్రివి నీవే. సేవలకు సులభుడవునీవే. ఈశా ప్రసన్నుడవుకమ్ము! మహా భయముల నుండి కాపాడుము. ఈ ఆర్తిని హరించువాడు నీకంటే ఇతరుడు ఎవడున్నాడు? ఆది కర్తవైన వరాహమునీవే. మత్స్యము కూర్మము నీవే. మాకు భయము కలిగినపుడు ఇటువిం రూపభేదములను స్వీకరించి మమ్ములను రక్షించు చున్నావు. అధికారము హరించబడినది. మా భార్యలను హరించియున్నారు. మా నివాసములను హరించియున్నారు. ఇంకొక దిక్కులేని మమ్ములను ఎందుకు రక్షించలేదు. ఇట్లు దేవతలు ప్రార్థించగా శేషశాయి శ్రియః పతి ఇట్లు పలికెను. విూకేవరివలన భయము కలిగినదో దానిని చెప్పుడు. విూరు కలతను విడువుడు.
    అంతట ఆ దేవతలు శ్రియఃపతి శ్రీమన్నారాయణునితో ఆ దేవతలు తారకాసురవధను కూర్చి తెలిపిరి. భయంకరమైన రోమములు నిక్కపోరుచుకొను భయము తారకాసురునివలన సంప్రాప్తించినది. యుద్ధములో కాని తపస్సుతోకాని శాపముతోకాని ఇతని మేము వధించజాలము. పదిరోజులలోపు బాలుడు అతని  నుండి తారకాసురుడు మృత్యువును హరించును. అతడు ఇతరులవలన మృత్యువును పొందడు. కావున ఆ విషయమున  నీతిని ఏర్పరుచుడు. అపుడు నారాయణుడు ఇట్లు పలికెను. ఆ తరాకాసురుడు నా వలన కాని నా సంతానము వలనకాని దేవతలవలనకాని మరణించడు. శంకరుని వలన కలిగిన చాలాశక్తి కాలసంతానము వలన మాత్రమే తారకాసురుడు మృత్యువును పొందును. కావున దేవతలందరు ప్రయత్నించుటకు బయలుదేరారు. శంకరుని భార్యకొరకు దేవతలందరూ ప్రయత్నం చేయవలయును. అనగా దేవతలందరూ హివవత్పర్వతమును చేరిరి. అచట హిమవంతుని అతని ప్రియురాలైన మేనను చూచి వారితో ఇట్లు పలికిరి. దాక్షాయని జగన్మాత శివశక్తిగా ఉన్నది. బుద్ధప్రజ్ఞా ధృతిమేధ లజ్జ పుష్టి సరస్వతి ఇట్లు సకల లోకపావనిగా అనేక నామములతో రూపములతో నున్నది. దవేతల కార్యమును నెరవేర్చుటకు మా గర్భమున ప్రవేశించినది. జగన్మాత విూకు పుత్రికగా ప్టుినది. శంకరుని భార్యకాగలదు. మమ్ములను మిమ్ములనుకూడా రక్షించగలదు. ఆ మాటలను వినిన హిమవానుడు కూడ ఆ దేవతలను అభినందించెను. మేన కూడా చాలా ఉత్సాహము కలదై ఇట్లే అగుగాక అని పలికెను. అపుడు జగద్ధాపు గౌరిషిమవంతుని ఇంిలో ప్టుినది. ఆమె నిరంతరము శివధ్యానరతురాలు. శివప్రియ. శివపరాయణురాలు. ఆమెతో దేవతలు శంకరుని కొరకు తపము నాచరించుము అని ప్రార్థించిరి. అంతా ఆ గౌరి హిమవచ్ఛిఖరముపై శంకరుని కొరకు ఘోరమైన తపము నాచరించెను. అంతట దేవతలు మరల ఇట్లు ఆలోచించసాగిరి. ఈ శివుడు పార్వతిని ఎట్లు ధ్యానించును. శంకరుడు తననుకాని ఇతరమునికాని తలచుటలేదు. అయినపుడు మేనాసుతం ముందు పార్వతియందు చిత్తమునెట్లు నిలుపును. ఈ విషయమున నీతిని ఏర్పరచ వలయును. అపుడు మేలును పొందెదము. అంత మహామలు ఉదారబుద్ధి అయిన బృహస్పతి ఇట్లు పలికెను.
    బుద్ధిమంతుడైన మన్మథుడు కందర్వుడు పుష్పబాణములు కలవాడు శంకరుని పూల బాణములతో కొట్టవలయును. అట్లు కొట్టబడిన శివభగవానుడు పార్వతియందు మనసును నిలుపును. అపుడు హరుడు గిరిజను వివాహము చేసుకొనగలడు. జయశీలుడైన పంచబాణుని బాణములు ఎక్కడా మొక్కపోలేదు. అట్లు శంకరుడు ఆమెను వివాహము చేసుకొనినచో వారికి పుత్రుడు కలుగును. ప్టుిన పుత్రుడు తప్పక తారకాసురుని వధించగలడు. కావున మన్మథునికి సహాయము కొరకు వసంతుని శోభనకారుని పంపుడు. మనసుతో సతోషింప చేయు వానిని మన్మథునికి ఇండు. అంతట దేవతలు అట్లే కుసుమాకరుని అనగా వసంతుని మన్మథుని శివుని సన్నిధికి పంపిరి. ఆ మన్మథుడు కాళావసంతునితో ధనువును ధరించి త్వరగా రతీదేవితో కూడి సుదుష్కరమైన కార్యమును చేయుటకు వెళ్లెను. శరచాపములను ధరించి ఈశ్వరుని ముందు నిలిచెను. లోకగురువు సకల లోకములకు ప్రభువైన శంకరుడు కొట్టదగనివాడు. ఇతనిని ఇపుడు నేను కొట్టవలయును. లోకత్రయమును శయించు నా బాణములు శంకరునియందు దృఢములగునా? కావా? ఇట్లు తలచుచు బాణప్రయోగమును చేసెను. అంతట శంకరుడు కోపించి అగ్నినేత్రములతో మన్మథుని భస్మము చేసెను. ఆ గొప్ప కార్యమును చూచుటకు దేవతలందరు అక్కడికి వచ్చిరి. అపుడు అక్కడ అత్యాశ్చరకరమైనది జరిగినది. వినుము.
    దేవగణములు శంకరుని చూచి మన్మథుని చూచునంతలోనే భస్మమైన వాముని ప్రార్థించిరి. చేతులు జోడించి తారకాసరుని వలన భయము కలిగినది గిరిసుతను భార్యగా చేసుకొనుడు. అని అంతట శంకరుడు బాణముతో కొట్టబడిన మనసుకలవాడైనను, దేవతల మాటను నెరవేర్చ దలిచెను. మహానుభావులు పరుల కొరకు తమ హితాహితమును లెక్కించరుకదా! అపుడు దేవతలు శంకరుని వివాహము కొరకు అరుంధతీ వసిష్ఠులను లక్ష్మీనారాయణులను పంపిరి. అపుడు హిమవల్లోకన్నాథులకు సంబంధము కలిగినది.
    అంతట వసిష్ఠ అగస్త్య పేలస్త్య లోమశాదులు చేరియుండగా మహోత్సవ సమరోహమున శివపార్వతుల వివాహము జరిగినది. ఆ వివాహమున పార్వతి సౌందర్యమును చూచి నాకు రేతస్స్ఖలనమైన వీర్యమును చూర్ణము చేసితిని. అట్లు చూర్ణము చేయబడిన నా వీర్యమునుండి వాలఖిల్య మహర్షులు అవతరించిరి. అపుడు అక్కడ దేవతలందరు పెద్దగా హా హా కారమును చేసిరి. అపుడు సిగ్గుతోపరిభూతుడనై ఆసనము నుండిలేచి బయలు వెడలితిని. దేవతలందరూ చూచుచు ఊరకుండిరి. అట్లు వెళ్ళుచున్న నన్ను చూచి శంకరుడు నందితో ఇట్లు పలికెను. బ్రహ్మను ఇక్కడికి పిలువుము అతని పాపమును తొలగించెదను. అపరాధము చేసిన వాని విషయమున కూడా సజ్జనులు కృపామయులుకదా విషయములు విద్వాంసుని కూడా మోహింపచేయును కదా. అపుడు ఇట్లు పలికి పార్వతీసహితుడైన పరమేశ్వరుడు నామీద దయతో సకల లోకముల హితమునకై ఇట్లు చేసెను. నారదా వినుము.
    పాపులపాపములు తొలగుటకు భూమి జలములు సమర్థములు కాగలవు. ఆ భూజలముల సారసర్వస్వమును తీసుకొని పావనము చేసెదను. ఇట్లు నిశ్చయించిన శంకర భగవానుడు ఆ భూమి జలముల సారమును స్వీకరించెను. భూమిని కమండలముగా చేసి దానిల జలమునుంచి పావమానది సూక్తములచే అభిమంత్రించి త్రిజగత్పావనమైన శక్తిని దానిలో స్మరించెను. అంతట శంకరుడు నాతో ఇట్లనె నుపాకమాడలమును స్వీకరించుము.
        ఆపోవై మాతరోదేవ్యం భూమిర్మాతాతధాపరా                                    స్థిత్యుతృత్తి వినాశానాం హోతత్వముఖయోః స్థితమ్‌                                అత్రప్రతిష్ఠితో ధర్మః అత్రయజ్ఞస్సనాతన                                    అత్ర భుక్తిశ్చ ముక్తిశ్చ స్థావరం జంగమంచయత్‌                                స్మరణాన్మానసంపాపంవందనా ద్వాచికంతధా                                    స్నానపానా భిషేకాచ్చ వినశ్యత్యపికాయికమ్‌                                    ఏతదేవామృతం లోకేనైతస్మాతాృవనా పరమ్‌                                    మాయాభిమంత్రితం బ్రహ్మన్ధృహాణేమంకమండలమ్‌                                అత్రత్యం వారియః కశ్చిత్‌ స్మరేవపి పిచేదపి                                    ససర్వకామానాప్నోతి గృహాణేమం కమండలమ్‌.
    జలములు మాతృదేవులు. భూమి మరొక హార సృష్టి స్థితి లయములకు హోతుత్వము. రిెంకీ ఉన్నది ఇందులోనే ధర్మము ప్రతిష్ఠించబడినది. ఇందులోనే సనాతన యజ్ఞము ప్రతిష్ఠించబడినది. భుక్తి ముక్తి ఇందులోనే యున్నది. స్థావర జంగమములు ఇందులోనే ఉన్నవి. దీనిని స్మరించుట వలన మానస పాపము వందనము వలన వాచిక పాపము స్నాన పానాభిషేకముల వలన కాయికపాపము నశించును. లోకమున ఇదియే అమృతము. దీని కవంటే పావనమింకకొిలేదు. నేనభిమంత్రించిన ఈ కమండలమును నీవు స్వీకరించుము. దీనిలోనున్న ఈ జలమును స్మరించిననూ పానము చేసిననూ అతను అన్ని అభీష్టములను పొందును. కావున ఈ కమండలమును తీసుకొనుము. పంచభూతములలో ఆపోభూతమే మహాభివృద్ధికలది. ఆ జలములో ఇవి ఉత్కృష్టజలములు కావున ఈ కమండలమును స్వీకరించుము. ఇక్కడున్న జలము శోభనము. పుణ్యము, పావనము కూడా. కావున దీనిని స్పృశించి స్మరించి దర్శించి నీవు పాపమునుండి విముక్తుడవయ్యెదవు. ఇట్లు  ఇట్లు పలికి మహాదేవుడు నాకు కమండలమునిచ్చెను. అంతట దేవతాగణమంతయూ సంతోషముతో సురేశ్వరుని స్తుతించిరి. అక్కడ గొప్ప ఆహ్లాదవాతావరణము నెలకొనెను. జయ జయ ధ్వానములు నెలకొనెను. శివభగవానుని వివాహమున పార్వతీమాతపాద అగ్రభాగమును చూచి పాపబుద్ధితో పతితుడనైతిని. దయానిధియైన శంకరుడు స్మరించి పవిత్రమైన దానిని పుణ్యమైన కమండలమున కల గంగను స్మరించి నాకిచ్చెను. ఇట్లు చెప్పగా నారద భగవానుడు మరల ఇట్లు ప్రశ్నించెను.
    కమండలములోని జలము తమ పుణ్యమును పెంచునది మర్త్యలోకమునకు వెళ్ళిన విధానమును తెలుపుడు అని అంతట బ్రహ్మ ఇట్లు పలికెను.
    బలియనుదైత్యరాజు దేవశత్రువు. ఓటమి ఎరుగనివాడు ధర్మముతో యశస్సుతో ప్రజాసంరక్షణతో గురుభక్తితో సత్యముతో వీర్యముతో బలముతో త్యాగముతో క్షమతో మూడులోకములకు అతనికిసాి ఇంకొకరులేరు. అతని ఉన్నత సమృద్ధిని చూచి దేవతలు చింతాపరాయణులు అయిరి. వారు తమలో తాము ఇట్లు ఆలోచించుకొనసాగిరి. బలిని ఎట్లు గెలిచెదము. బలిచక్రవర్తి మూడులోకములను పాలించుచుండగా యే బాధలు లేకుండెను. శత్రువులేకుండిరి. వ్యాధులు లేవు. మానసిక చింతలులేవు. అనావృష్టిలేదు. అధర్మములేదు. నాస్తిశబ్దమే అతని రాజ్యమునలేదు. దుర్జనులులేరు. ఇది కలలోకూడా కనపడుటలేదు. అతని వైభవమును బలమును చూచిన దేవతలు విహ్వలులై శ్రీమహావిష్ణువును శరణుజొచ్చిరి. జగన్నాధా! శంఖ చక్ర గధాధరా! మేము ఆర్తులమైతిమి. నీవు మాకోసము ఆయుధములను ధరించుచున్నావు, నీవు మాకు నాధునిగా ఉన్ననూ మాకిలాిం దుఃఖమెట్లు కలుగుచున్నది. నిన్ను నమస్కరించు శిరస్సులు దైత్యుని ఎట్లు నమస్కారించవలయును. నీకై యజ్ఞములను చేసెదము. వాక్కులతో నిన్ను స్తుతించెదము. నీవే శరణుగా నున్న మేము దైత్యునికెట్లు నమస్కరించెదము. దేవతలు అందరూ నీ బలమునాశ్రయించినవారు ఇంద్రాదిదేవతలు నీవు ఇచ్చిన స్థానమును పొంది దైత్యునటెఉ్ల నమస్కరించెదము. నీవే బ్రహ్మవై సృజించెదవు. విష్ణువుగా రక్షించుచున్నావు. శంకరునిగా సంహరించుచున్నావు. అయినపుడు దైత్యునికి ఎట్లు నమస్కరింతుము.
    ఇట్లు పలికిన దేవతల మాటలను వినిన దైత్యాంతకుడు దేవతల కార్యసిద్ధికొరకు దేవతలతో ఇట్లు పలికెను. బలిదైత్యుడు కూడా నా భక్తుడే. సురాసురులచే గెలువశక్యముకానివాడు. మీరు నాచే పోషించబడువారు. అట్లే బలిదైత్యుడు కూడా నాచే పోషించదగినవాడే. కావున సంగ్రామము లేకుండగా త్రైలోక్యరాజ్యమును హరించి మంత్రోక్తిచే బలిని బంధించి విూకు విూ రాజ్యమును ప్రసాదించెదను. అంతట దేవతలు అట్లే ననిపలికి స్వర్గమునకు వెళ్ళిరి. శ్రీ మహావిష్ణువు అదితిగర్భమున ప్రవేశించెను. ఆ మహానుభావుడు అవతరించినపుడు ఉత్సవములు జరిగినవి. ఆ శ్రీహరి వామనునిగా పుట్టెను. అతనే యజ్ఞేశుడు. యజ్ఞపురుషుడు. ఇంతలో బలిచక్రవర్తి బలము కలవారిలో శ్రేష్ఠుడు ఋషిముఖ్యులతో కలిసి అశ్వమేధయాగమునకై దీక్షితుడాయెను. వేదవేదాంగములు చక్కగా తెలిసిన పురోహితుడైన శుక్రాచార్యులు ఆ యజ్ఞమును ప్రవర్తింప చేయుచుండెను. బ్రహ్మస్థానమును స్వీకరించి శుక్రాచార్యులు ఆసీనుడు కాగా దేవగంధర్వ పన్నగులు హవిర్భాగము కొరకు ఆసీనులు కాగా దానము చేయుడు. భుజించుడు, పూజించుడు. ఇది పూర్ణమైనది. మరల దీనిని పూర్ణము చేయుడు ఇట్లు పలుకు చుండగా మెల్లగా ఆ ప్రదేశమునకు సామగానము చేయుచు వానుడు వచ్చెను. ఛత్రమును కుండలములను ధరించిన వామనుడు ఆ యజ్ఞవాటమునకు వచ్చెను. ఆ యజ్ఞమును ప్రశంసించుచున్న వామనుని చూచిన శుక్రాచార్యులు బ్రహ్మరూపధరుని వామనదేవుని దైత్యసూదనుని యజ్ఞములను తపస్సులను ప్రసాదించువానిని రాక్షసులను సంహరించువానిని తెలిసి త్వరపడుచు బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. వామనాకారముతో నీ యజ్ఞశాలకు వచ్చుచున్న ఈ బ్రాహ్మణుడు ఇతను వాస్తవముగా బ్రాహ్మణుడుకాడు. ఇతడు యజ్ఞేశుడు. యజ్ఞభావనుడు. ఇతను నిన్ను యాచించుటకు వచ్చుచున్నాడు. ఇతను పరమ పురుషుడు. నాతో ఆలోచించిన తరువాతనే అతనికి నీవు దానమును చేయవలయును. ఆ మాటలను వినిన బలిచక్రవర్తి ఇట్లు పలికెను. నేను ధన్యుడనైతిని. సాక్షాత్తుగా యజ్ఞేశ్వరుడే నేనూహించకుండానే నా ఇంికి వచ్చు చున్నాడా ఇట్లు యజ్ఞేశుడే వచ్చి యాచించినచో ఇంకా ఆలోచించవలసినదేమున్నది? ఇట్లు పలికిన బలిభార్యతో కలిసి పురోహితుడైన శుక్రాచార్యులతో కలిసి అదితినందనుడు వామనుడు బ్రాహ్మణుడునున్న ప్రదేశమునకు వెళ్లెను. చేతులు జోడించి ఎందుకు వచ్చితిరి. ఏమి కావలయును అని అడిగెను. అంతట వామనుడు కూడా మూడడుగుల భూమిని నివాసమునకు ఇమ్ము ఇంత కన్నా వేరేవాిని కోరను. బలిచక్రవర్తి అట్లే అని నానారత్నవిభూషితమైన కలశమునుండి వారి ధారను విడిచివామనునకు భూమిని ఇచ్చెను. ఋషలు, ముఖ్యులు పురోహితుడైన శుక్రాచార్యులు దేవతలు అందరూ చూస్తుండగా బలిచక్రవర్తి వామనునకు భూమినిచ్చెను. భూమిని తీసుకొనుడు అని బలిచక్రవర్తి పలికినంతనే జరిగిన దానిని వినుము. అట్లే అని బలిచక్రవర్తి వామనుని చూడగా యజ్ఞపురుషుడు చంద్రాదిత్యుతిస్తనాంతాములుగా నుండునట్లు పెరిగెను. విక్రమాకారముగా పెరిగెను అనంతుడు అచ్యుతుడు లోక కర్తాజగన్మయుడు. అతనిని చూచి భర్యతో నున్న బలి ఇట్లు పలికెను. వినయముతో జగన్మాయా? నీ శక్తిమేరకు విక్రమించుము. దేవేశా. నేను సర్వభావముతో నిన్ను గెలిచితిని. బలి అట్లు పలుకుచుండగానే శుక్రాచార్యులు ఇట్లు పలికెను. రాజేన్ద్రా నేను బుద్ధితో ఆలోచించి మొదటే బాధించితిని. ఆ మాటలతోనే శ్రీహరి ఇట్లు పలికెను.
    దైత్యేశ్వరా! మహాబాహా! దైత్యరాజా. పెరుగుచున్నాను చూడుము. అపుడు బలిపెరుగుము, పెరుగుమ అనిపలికెను. అంతట శ్రీ మహావిష్ణువు కూర్మపృష్ఠమున పాదమునుంచి బలాకుజ్ఞమున పాదమునుంచెను. రెండవ పాదమును నా లోకమునుంచెను. అసురేశ్వరా, మూడవపాదమునకు స్థానములేదు. ఎక్కడ ఉంచవలయును. భూమిని ఇమ్ము! అని బలిచక్రవర్తితో పలికెను. అంతట బలిచక్రవర్తి నవ్వుచు ఇట్లు పలికెను. ఈ జగత్తును సృష్టించినవాడవు నీవే. నేను సృష్టికర్తనుకాను సురేశ్వరా? ఈ జగత్తునీ దోషము వలననే అల్పమైనది. జగన్మయా నేనేమి చేతును. అయినా కేశవా! నేనెపుడు అసత్యమును పలుకను, నన్ను సత్యవాక్యునిగా చేయుచు నావీపున నీ పాదమునుంచుము. అంతట ప్రసన్నుడైన భగవానుడు వేదస్వరూపుడు దేవపూజితుడు, నీ భక్తికి సంతోషించిని. నీకు శుభమగుగాక. వరమును కోరుకొనుము అని పలికెను.
    అంతట బలిచక్రవర్తి శ్రీమహావిష్ణువుతో నేను యాచించను. త్రివిక్రమా అనెను. అపుడు శ్రీమహావిష్ణువు తనకు తానుగా అతనికి చక్కని మనసుతో కోరిన దానిని రసాతలాధిపత్యమును భవిష్యదిన్ద్రపదవిని ఆత్మాధిపత్యమును నశించని యశస్సును ప్రసాదించెను. ఇట్లు బలిచక్రవర్తికి అన్ని ఇచ్చి పుత్రునితో భార్యతో రసాతాలమున బలిని ఉంచి త్రైలోక్యరాజ్యమును ఇంద్రునికిచ్చెను. ఇంతలో దేవతలతో అర్చించబడిన పాదము పాతాలమువరకు వెళ్లెను. నా తండ్రి అయిన ఆ మహావిష్ణువు యొక్క రెండవ పాదము నా ఇంిలోకి వచ్చిన దానిని దర్శించి ఆలోచించితిని. శ్రీ మహావిష్ణువు పాదము నా ఇంికి వచ్చినపుడు యేమి చేసిన శుభము కలుగును. అని ఆలోచించి అంతా చూచితిని. అపుడు నా కమండలమును శ్రేష్ఠమును చూచితిని, దానిలోని జలము పరమపుణ్యతమము పూర్వము త్రిపురారి ప్రసాదించెను. ఈ జలము వరము వరేణ్యము వరదము శాంతము శాంతికరము శుభము శుభప్రదము. నిత్యము భుక్తి ముక్తి ప్రదము లోకములకు మాతృస్వరూపము. అమృతము. భేషజము పవిత్రము పావనము పూజ్యము జ్యేష్ఠము శ్రేష్ఠము శుభావహము. స్మరించినంతనే లోకములను పావనము చేయునవి. ఇక దర్శించిన చెప్పవలయున     , అంతచె పవిత్రమైన ఈ జలమును నేను పవిత్రుడనై నా తండ్రికి అర్ఘ ్యముగా కల్పించెదను. ఇట్లు ఆలోచించి ఆ జలమును తీసుకొని అర్ఘ్యమును కల్పించి శ్రీ విష్ణుపాదముపైనుంచెను. అట్లు శ్రీ విష్ణుపాదమున పడిన ఆ జలము మేరుపర్వతమునందు నాలుగుగా నాలుగు దిక్కులకు ప్రవహించెను. భూమికి చెరెను. దక్షిణ భాగమున పడిన ఆ శ్రీ విష్ణుపాద జలమును శంకరుడు తన జటలుకాల శిరముతో స్వీకరించెను. పశ్చిమమున ప్రవహించిన జలము మరల కమండలమున చేరెను. ఉత్తరమున పడినది శ్రీ మహావిష్ణువు స్వీకరించెను. పూర్వమున పడిన దానిని ఋషులు దేవతలు పితృదేవతలు లోకపాలకులు శుభప్రదమైనది శ్రీ విష్ణుపాదపతతమని స్వీకరించిరి. కావున ఆ జలము సర్వశ్రేష్ఠమైనది.
    ఇక దక్షిణమున ప్రసరించిన లోకమాతచైన జలములు శ్రీ మహావిష్ణుపాదము నుండి ప్రవహించినవి బ్రహ్మణులు లోకమాతలు మహేశ్వరుడు శిరస్సుతో గ్రహించి జాజూటము నిలుపుకొనినవి శుభాదాయములు పరమపావనములు పుణ్యప్రదములు అయినవి ఆ శ్రీ విష్ణుపాదోదకమును శివుని జాజూటమున నిలిచిన వాిని స్మరించినంతనే సకల కామనలు నెరవేరును. అపుడు నారదమహర్షి ఇట్లు పలికెను.
    శంకరునిచే సృష్టించబడినవి బ్రహ్మకమండలమును చేరినవి శ్రీ మహావిష్ణువు పాదమును కడిగినవి శ్రీ శంకరభగవానుని శిరమున లంకరించినవి జలములు మర్త్యలోకమునకు అనగ భూలోకమునకేట్లు వచ్చినవో తెలుపుడు. అనగా బ్రహ్మ ఇట్లు పలికెను.
    మహేశ్వరుని జటలను చేరిన జలములు భూమికి వచ్చుటకు రెండు గాధలు చెప్పుచున్నారు. ఆ జలములను భూమిపైకి ఇద్దరు తీసుకొనివచ్చినారు. దానిలో ఒకి గౌతమ ఋషి భగవానుడు తన వ్రతగాన సమాధులతో శంకరుని పూజించి భూమిపైకి గొనితేబడినది. ఇక రెండవది బలీయుడైన క్షత్రియుడు శంకరుని ఆరాధించి భగీరధుడు భూమిపై తీసుకొని వచ్చినది రెండవ అంశము. ఇలా గంగకు రెండురూపములు ఏర్పడినవి.
    ఈ మాటలను వినిన నారదమహర్షి ఇట్లు పలికెను. మహేశ్వరుని జా జూటమునుండి ఏ కారణముచే గౌతముడు భూమిపైకి తీసుకొని వచ్చెను. అట్లే క్షత్రియుడు భగీరథుడు ఎట్లు తీసుకొని వచ్చెను అని అడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగెను. బ్రాహ్మణుడు ఎట్లు తీసుకొని వచ్చెనో క్షత్రియుడు ఎట్లు తీసుకొని వచ్చెనో దాని నంతనూ నీకు వివరముగా చెప్పెదను వినుము.
    శంకర భగవానునకు పార్వతీదేవి భార్యయైనపుడు గంగ కూడా శంకరునికి ప్రియురాలాయెను. శివభగవానుడు నాదోషమును తొలగించుటకు ఆలోచించి పార్వతితో కలిసి ఉన్న శంకరభగవానుడు దేవిని చూచి విశేషముగా రసవృత్తిలోనున్నంచున ఉత్తమ రసమును నిర్మించెను. రసిక ప్రియ స్త్రీ పావన కావున అందరికంటే గంగ అధిక ్పఇయురాలాయెను. తన శిరమున గంగ యున్నదని పార్వతి తెలియునుకాదా అనియే ఆ గంగనే ఆలోచించు చుండెను. ఆమె అనగా ఆ గంగ మరియొక కార్యసిద్ధికొరకు జామార్గమునుండి అవతరించినది అని శంకరుడు పార్వతికి చెప్పలేదు. గంగను శిరమున ధరించుటను తెలిసి పార్వతి సహించలేకపోయెను. జాజూటమున నిలిచిన గంగను మరల మరల చూచుచు అసూయతో ఈర్ష్యతో పార్వతి ఆ గంగను పంపుము పంపుము అని మాి మాికి చెప్పుచుండెను. శంకరుడు రసికుడు కావున ఉత్తమ రసరూపమైన గంగను విడిచిపెట్టలేదు. అపుడు పార్వతీదేవి దుఃఖముతో అనాధను అని పలికెను. శంకరుడు గంగను తన జటలలోనేదాచి ఉంచుటను చూచి వినాయకుని జయను కుమారస్వామిని రహస్యముగా ఇట్లు పలికెను. ఈ త్రిథేశ్వరుడు శంకరుడు కాముకుడు గంగను విడుచుటలేదు. ఆమె కూడా శంకరునికి ప్రియురాలు శంకరుడు ఆ ప్రియురాలని లిట్లు విడుచును. ఇట్లు చాలా విదాలుగా ఆలోచించి వినాయకునితో ఇట్లు పలికెను.
    దేవతలు అసురులు యకక్షులు సిద్ధులు చివరకు విూరు రాజులు ఇతరులు ప్రయత్నించినను శంకరుడు గంగను విడువడు, కావున నేను మరల హిమవత్పర్వతమునకు వెళ్ళి తపము చేసెదను. లేదా తపస్సులతో కల్మషము తొలగిన బాహ్మిణలు తపస్సు చేసి శంకరుని ప్రార్థించినచో జాజూటస్థిత గంగ భూమికిచెచునేమో అపుడు తల్లి మాటను వినిన వినయకుడు తల్లితో ఇట్లు పలికెను. సోదరుడు కుమారస్వామితో జయతో ఆలోచించి జాజూటమునుండి శంకరుడు గంగను విడుచు ఉపాయమును నిశ్చయించు ఆచరించెదము అని.
    ఇంతలో భూలోకమున 12 సంవత్సరములు ఘోరమైన అనావృష్టి భయంకరమైన కరువు యేర్పడినది. అపుడు స్థావర జంగమాత్మకమైన జగత్తు నశించుచుండెను. ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమము మాత్రము సర్వనామప్రదము పచ్చగా ఉండెను. నేను పూర్వము సృజించగోరి దేవయజన పర్వతముపై నేను యజ్ఞమును ఆచరించితిని. ఆ పర్వతము అప్పినుండి నా పేరుతో బ్రహ్మగిరిగా ప్రసిద్ధిపొందినది. గౌతమమహర్షి ఆ బ్రహ్మగిరిని ఆశ్రయించినివసించుచున్నాడు. శుభప్రదమైన బ్రహ్మిగిరిపైన నున్న అతని ఆశ్రమమున పరమపావనమున ఆధులు వ్యాధులు దుర్భిక్షము అనావృష్టి భయశోకములు దారిద్య్రములు వినరావుకూడా ఆ గౌతమహర్షి ఆశ్రమములో తప్ప ఇంకొక చోట హవ్యకవ్యమబులభించుటలేదు. కావున మరెక్కడా హోత దాత యష్టపాకుండెను, గౌతమహర్షి దానము యాగముచేసినపుడే స్వర్గమున దేవతలకు ఆహారములభించి తృప్తి కలుగుచున్నది. లేనిచోలేదు. ఇట్లు దేవలోకమున మర్త్యలోకమున ఒక్క గౌతముని పేరే వినవచ్చు చున్నది. దాత అంటే గౌతమమహర్షియే, హోత అంటే గౌతమ మహర్షియే. ఆ విషయమును వినిన నా నాశ్రమనివాసులైన మునులు గౌతమాశ్రమమునకు వచ్చుచుండిరి. అట్లు తన ఆశ్రమమునకు వచ్చిన మునులు అందరికి గౌతమ మహర్షి శిష్యునివలె పుత్రునివలె తండ్రివలె పోషకుడాయెను. యధాక్రమముగా అనురూపముగా అందరికి మునులకు శుశ్రూష చేయుచుండెను. గౌతమ మహర్షి ఆజ్ఞతో లోకమాతలైన ఓషధులు (పైరులు) అక్కడ ఆవిర్భవించెడివి. గౌతమహర్షి బ్రహ్మవిష్ణు మహేశ్వరులను ఆరాధించి నందున ఓషధులు పెట్టెడివి. మునులు భుజించు చుండెడివారు. గౌతమమహర్షి తపోబలముతో సంకల్పించుట విత్తనములు చల్లుట నారుపోయుట నాటుట పెరుగుట పండుట అప్పుడే జరుగుచుండెడిది. గౌతమహర్షి మనసులోనున్న అన్ని సిద్ధులు ఆవిర్భవించుచున్నవి.
    గౌతమహర్షి తన ఆశ్రమమునకు వచ్చిన మునులలో వినయముతో ప్రతిదినము శిష్యునివలె పుత్రునివలె దాసునివలె తమకాసేత చేయవలయును అని అడుగు చుండెడివాడు. చాలా సంవత్సరములు వారినందరిని తండ్రివలె పోషించసాగెను. ఇట్లు గౌతమ మహర్షి గొప్పఖ్యాతిని పొందెను. అపుడు వినాయకుడు తల్లిలో సోదరునితో జయతో ఇట్లు పలికెను.
    తల్లీ! దేవతల సభలో గౌతమహర్షి గానము చేయబడుచున్నాడు. దేవతలు కూడ చేయలేనిదానిని గౌతమహర్షి చేసెను అని. ఆ బ్రాహ్మణుని తపోబలము ఇంతిదని నేను వింని. ఆ మహర్షి శివజాజూటమునున్న గంగను కదలించగలడు. ఆ ఋషి తపస్సుతోకాని మరియొక దానితోకాని శంకరుని పూజించి ఆ గౌతమహర్షియె శివుని జాజూట గంగనిమ్మని శివునియాచించవచ్చును. ఇట్లు గౌతమ మహర్షి శంకర భగవానుని గంగను యాచించు నీతిని యేర్పరచవలయును. ఆ గౌతమహర్షి ప్రభావమువలన నదీశ్రేష్ఠగంగ  శంకరుని జాజూటమునుండి భూమిపై అవతరించును. ఇట్లు తల్లితో పలికిన వినాయకుడు సోదరునితో జయతో యజ్ఞోపవీతమును ధరించి బ్రహ్మచారిగా గౌతమాశ్రమమునకు వెడలెను. గౌతమాశ్రమ మరడలమున కొన్నిదినములు ఉంటూ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. ఇక్కడ మనము ఎక్కువ దినములు ఉండరాదు. మనము మన శుభకరమైన ఆశ్రమములకు వెళ్ళెదము. గౌతమ అన్నముతో పుష్టిని పొందినాము. ఇట్లు అందరూ వినాయక వాక్యముతో తమలో తామాలోచించుకొనుచు గౌతమమహర్షిని అడిగిరి. అంతట గౌతమ మహర్షి వారియందు స్నేహబుద్ధితో వారించెను.
    చేతులు జోడించి వినయముతో ఇక్కడే ఉండుడు. ముని పుంగవులారా విూ పాథుశ్రూషను చేయు చుందును. నేను పుత్రునివలె మిమ్ములను సేవించు చుండగా విూరు ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళుట ఉచితముకాదు. అందరికి ఈ ఆశ్రమమే ఉచితమని నా తలంపు కావున మునులారా ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళు తలంపుచాలును. ఇట్లు గౌతమమహర్షి మాటలను వినిన గణాధిపుడు తాను చేయవలసిన విఘ్నకృత్యమును ఆలోచించుచు బ్రాహ్మణులతో చేతులు జోడించి ఇట్లు పలికెను.
    గౌతమమహర్షి మనను తన అన్నముతో కొనినాడా మనల నెందుకు వారించుచున్నాడు. సామోపాయములో మనము మన ఆశ్రమములకు వెళ్ళజాలము. ఉపకారము చేసిన ఈ బ్రాహ్మణశ్రేష్ఠుడు దండించ దగినవాడేకాడు. కావున బుద్ధితో ఆలోచించి చేసెదను. దానిని అందరూ ఆమోదించుడు. అంతట బ్రాహ్మణులందరు అట్లే చేయుడు అనిరి. ఈ గౌతమమహర్షికి ఉపకారమునకు లోకముల హితమునుకకోరి బ్రాహ్మణులందరికి శ్రేయస్సు కలుగు విధముగా చేయుము. బ్రాహ్మణుల వాక్యమును విని గుణానురూపముగా చేసెదనని పలికి గౌతమునికి అనుకూలముగా చేసెదనని బ్రాహ్మణుల అనుమతినిపొంది తానుకూడా బ్రాహ్మణుడై బ్రాహ్మణులకు మరల మరల నమస్కరించి తల్లి అభిప్రాయమున నలిని జయతో ఇట్లు పలికెను. శుభాననో ఇతరులు తెలియకుండగా చేయుము. గోరూపమును ధరించి గౌతముని ఆశ్రమమునకు వెళ్ళుము. పైరునుభుజించి నశింప చేయుము. గౌతమమహర్షి ప్రహారము చేసిననూ హుంకారముచేసిననూ కోపముగా చూచిననూ పెద్దగా అరిచి బ్రతుకకు. మరణించకుము. అపుడు జయ గణాధిపుని అభిప్రాయములోనుండి అట్లే చేసెను. గౌతముడున్న ప్రదేశమునకు గోరూపమును ధరించి వెళ్ళెను. వరిపైరును తింటూ సంచరించుచుండెను. ఆ గోవును గౌతమమహర్షి చూచెను. వికృతముగానున్న ఆ గోవును చూచి గతమమహర్షి ఆ గోవును ఒక గడ్డిపరకతో నివారించెను. అట్లు వారించబడిన గోవు పెద్దగా అరిచి పడిపోయెను. ఆ గోవుపడగానే గొప్ప హా హా కారము జరిగెను. ఆ అరూపును విని గౌతమమహర్షి చేసిన దానిని చూచిన మహర్షులు బాధపడినవారై వినాయకుని ముందుంచుకుని ఇట్లు పలికిరి. ఇక మేము ఇపుడు నీ ఆశ్రమమున ఉండము. ఇక్కడిను రాడివెళ్ళెదము. పుత్రుని వలె పోషించితివి అని పలికితివికదా. ఆ మునుల మాటలను వినిన గౌతమ మహర్షి వెళ్ళుచున్న బ్రాహ్మిణులను చూచి వజ్రాయుధముతో కొట్టబడినవానివలె ఆ బ్రాహ్మణులముందు పడిపోయెను. అతనితో బ్రాహ్మణులు అందరు ఇట్లు పలికిరి. ఈ గోవు పడిపోయినది చూడుము, ఈ గోవు రుద్రులమాత జగత్పావని. సకల తీర్థదేవస్వరూపిణి. ఇంతి గోవువిధి బలముతో పడిపోగా ఇక మేము వెళ్ళవలయును, నీ ఆశ్రమమున ఆచరించిన వ్రతము వస్త్రమువలె జీర్ణమగును. బ్రాహ్మణోత్తమా మాకు ఇంకోధనములేదు. తపస్సే మా ధనము. అపుడు గౌతమమహర్షి ఆ బ్రాహ్మణుల ముందునిలిచి వినయముతో ఇట్లు పలికెను. విూరే మాకు శరణము. నన్నుపవిత్రుని చేయుడు. అంతట గణాధిప భగవానుడు ఇట్లు పలికెను. ఇది మరణించలేదు. అట్లే అని బ్రతికిలేదు. ఈ సందేహమున నిష్క ృతిని ఎట్లు చెప్పగలము. అనగా గౌతముడు మరల ఇట్లు పలికెను.
    గోవెపుడూ మూర్ఛపొందదు. మరణించును. ఇందులో సందేహములేదు. ఈ గోవెట్లులేచును. అట్లే ఈ కర్మకు ప్రాయశ్చిత్తమేమి చెప్పుడు దానినంతిని చేతును అనగా ఆ బ్రహ్మర్షులందరూ ఇట్లు పలికిరి. మా అందరి అనుమతితో మా అభిప్రాయమునే ఈ బుద్ధిమంతుడు చెప్పును. ఇతని మాటయే మాకు నీకు ప్రమాణముగా నుండును. ఇట్లు బ్రాహ్మణులు గౌతమహర్షి ప్రేరేపించగా విఘ్నరాజు బ్రాహ్మణ రూపముతో అందరితో ఇట్లు పలికెను. అందరి అభిప్రాయానుసారముగా నేను చెప్పుచున్నాను. నా మాటను ఇక్కడి మునులు గౌతమమహర్షికూడా ఆమోదించాలి. అవ్యక్తజన్మయైన బ్రహ్మయొక్క కమండలములోని జలము శ్రీ విష్ణుపాదమును కడిగి మహేశ్వరుని జా జూటమున నిలిచి ఉన్నది అని వినియుింమి. విూరు తపస్సుచే నియమముతో ఆ జలమునుతీసుకొనిరండు! ఆ జలముతో అభిషేకము చేసినచో ఈ గోవులేచును. అపుడు మేము ఇక్కడ ఉందుము. ఎప్పివలె ఉందుము బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇట్లు పలుకగా బ్రాహ్మణుల సభలో పుష్పవర్షము కురిసినది. జయ జయ శబ్దము మార్మోగినది.
    అంతట గౌతమమహర్షి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను. తపస్సుతో అగ్నిహోత్రుని అనుగ్రహముతో నా సంకల్పము సిద్ధించునుగాక. అంతట ఆ బ్రాహ్మణులు అట్లే అగుగాక అని ఆశీర్వదించి అన్న జలములతో సమృద్ధములైన తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి. ఆ బ్రాహ్మణులు అందరూ వెళ్ళిన తరువాత సోదరునితో ఇజయతో కలిసి గణేశుడు బాగాప్రీతి చెంది కృతకృత్యుడై తిరిగివెళ్ళెను. ఇట్లు బ్రాహ్మణులు వెళ్ళిపోగా గణేశుడు వెళ్ళగా తపస్సుతో కల్మషము తొలగిన గౌతమమహర్షి ఆ సంఘటనను ధ్యానించసాగెను. ఇదేమి? నాకు సంభవించినది? ఇట్లు చాలావిధములుగా ధ్యానించి జ్ఞానముతో అంతయూ తెలుసుకొనెను. ఇది దేవకార్యము వలన తనకు ఈ కిల్బిషము సంప్రాంప్తించినది. లోకముల ఉపకారముకొరకు శంకరుని ప్రీతికొరకు పార్వతీదేవి సంతోషముకొరకు గంగను తీసుకుని రావలయును. ఇది అంతయు శ్రేయస్కరమే. జగత్తునకు అగును, అసలు నాకు యేకిల్బిషములేదు. ఇట్లు మనస్సుతో ధ్యానించి గౌతమహర్షి చక్కగా ప్రీతి చెందెను. భార్యతో సంప్రదించుకొని ఇట్లు పలికెను. జగదీశ్వరుని త్రినేత్రుని వృషభధ్వజుని ఆరాధించి నదీశ్రేష్ఠమును తీసుకుని వచ్చెదను. గిరిపుత్రికను సంతోషింపచేసెదను. జగదంబకు సపత్ని మహేశ్వరుని జాస్థిత. ఇట్లు సంకల్పించి ముని ప్రవీరుడు గౌతమమహర్షి బ్రహ్మగిరినుండి కైలాసమునకు వెళ్ళెను. అక్కడ అధిష్ఠించియున్న ఉగ్రమైన తేజస్సుకలవానిని సురార్చితుని శంకరుని ప్రీతుని చేయుకు కైలాస శిఖరమునకు వెళ్ళి గౌతమభగవానుడు మౌనమును అవలంబించి కైలాస పర్వతొత్తమున దర్భలను పరిచి పరిశుద్ధడై కూర్చొని శంకరుని స్తుతించెను. శంకరుని స్తుతించు చుండగా పుష్పవృష్టి కురిసెను.
        ధర్మంవ్యవస్థాపయితుం విభజ్య                                        ఋవ్సామ శాస్త్రాణియజుశ్చశాఖా                                        లోకేచగాధా! స్మ ృతయ పురాణం                                        ఇత్యాదిశబ్దాత్మకతాముపైతి                                            యష్టాక్రతుర్యాన్యపిసాధనాని                                            ఋత్విక్స్వరూపంఫలదేశకాలా                                        త్వమేవ శంభో! పరమార్ధతత్త్వం                                        వదన్తియజ్ఞాంగమయంవపుస్తే.
    ఇట్లు పదకొండు శ్లోకములు శంకరస్తుతి పదకొండు శ్లోకములు అమ్మపార్వతీ స్తుతి చేసెను. ఇది అద్భుతమైన స్తుతి. పరమార్ధప్రదము. పరమ జ్ఞానప్రదము. గ్రంధవిస్తరభీతిచే ఇక్కడ ఇచ్చుటలేదు. రావలసినవారు బ్రహ్మపురాణములో ఆరవ అధ్యాయమున 4వ శ్లోకమునుండి 24వ శ్లోకము వరకు చూచుకొనవచ్చును.
    పార్వతీస్తుతిలో రెండు శ్లోకములునిచ్చుచున్నాను. యథాయధాశంభురమేయ మాయా రూపాని ధత్తెజగతోషితాయ తద్యోగయోగ్యాని తధైవధత్సే పతివ్రతాత్విత్వయి మాతరేవమ
        కార్యక్రియాకారకసాధనానాం                                        వేదోదితానామధ్లఏకికానావు                                            యత్యాధ్యముత్క ృష్టతమంప్రియంచ                                        ప్రోక్తాచసా సిద్ధి అనాదికర్తు.
ఇట్లు స్తుతించగా వృషభద్వజుడు శంకర భగవానుడు పార్వతీ సహితుడై గణేశాది గణములతో కూడా సాక్షాత్కరించి అతనితో ఇట్లు పలికెను.
    గౌతమా నీ భక్తితో స్తోత్రముతో వ్రతములతో ప్రసన్నుడనైతిని. నీకేమి ఈయవలయును. దేవతలకు కూడా దుర్లభమైనదైననూ యాచించుము. ఇట్లు జగన్మూర్తి మాటలను వినిన గౌతమమహర్షి ఆనంద బాష్పరిప్లుతాంగుడై ఇట్లు ఆలోచించెను. దైవము ధర్మము బ్రాహ్మణపూజనము లోకగతి ఎంతచిత్రము. ఇంతి దుర్లభము సులభమైనది.
        జాస్థితాంశుభాంగంగా దేహిమేత్రిథార్చిత                                    యది తుష్టోసిదేవేశ త్రయీధామనిమోస్తుతే.
    త్రిథార్చితా! వేదాధారా నీకు నమస్కారము. నీవు సంతోషించినచో నీ జాజూటముననున్న గంగను నాకు ప్రసాదించుము. అనగా శంకరుడు ఇట్లు పలికెను. మూడు లోకముల ఉపకారముకొరకు కోరినావు. ఇపుడున్న ఉపకారమునకు యాచించుము. అనగా గౌతముడు ఇట్లు పలికెను. ఈ స్తోత్రముతో నిన్ను స్తుతించు భక్తులు సర్వకామసమృద్ధి కలిగి ఉండవలయును. ఇది నా కోరిక. శంకరుడు అట్లే అగుగాక అని పరితుష్టుడై పలికెను. నా నుండి దిగులుతో ఇతర వరములను కూడా యాచించుము. అనగా గౌతమమహర్షి సంతోషముతో ఇట్లు పలికెను.
    దేవా జగన్నాథా! నీ జాజూటములో పావని లోకమాతయైన ఈ గంగను నీ ప్రియురాలిని బ్రహ్మగిరిలో విడిచిపెట్టుము. ఇది అందరికి తీర్థభూతముగా ఉంటుంది. సముద్రమును చేరువరకు తీర్థముగా నిలుచుచు ఈ తీర్థము బ్రహ్మహత్యాది పాపములను మనోవాక్కాయములతో ఆచరించిన పాపములను స్నానమాత్రముననే నశించవలయును. చంద్రసూర్య గ్రహణములలో అయనములలో విషువములలో సంక్రాంతిలో వైధృతిలో ఇతర పుణ్యతీర్థములలో కలుగు ఫలము ఈ తీర్థరాజమును స్మరించినంతనే కలుగవలయును.
        శ్లాఘ్యంకృతే తపఃప్రోక్తం                                            త్రేతాయాం యజ్ఞకర్మచ                                            ద్వాపరేయజ్ఞదానేచ                                            దానమేవకలేయుగే.
    కృతయుగములో తపస్సు, త్రేతాయుగ మహాయజ్ఞము, ద్వాపరయుగములో యజ్ఞదానములు కలియుగములో ఒక్క దానమే ఇట్లు చెప్పబడిన యుగధర్మములు దేశధర్మములు. కాలధర్మములు. దేశకాలాది సంయోగము వలన కలుగు ధర్మములు స్నానదానాది నియమములలో ఇతరత్ర ఆచరించిన పుణ్యములు ఈ తీర్థమును ఈ గాథను స్మరించినంతనే కలుగవలయును. సముద్రమును చేరు వరకు ఈ నది అనేకానేక ప్రాంతములలో ప్రవహించునో ఆయన్ని ప్రదేశములలో నీవు వెంచేసి ఉండవలయును. ఈ తీర్థమునకు థయోజనముల పరిధిలో ఉండువారికి ఆలోపలికి వచ్చువారికి మహాపాతకులైననూ వారి పితరులకు వారికి స్నానము కొరకు వచ్చువారికి స్నానమాత్రముననే ఇతర మానవులు ముక్తిని కావించుచుందురుగాక. సకల తీర్థములు ఒకప్రక్క స్వర్గమర్త్యపాతాలములోనున్నవి ఈ తీర్థమువాి అన్నికంటే విశిష్టమైనది. కావలయును. ఇట్లు పలికిన గౌతమమహర్షి మాటలను వినిన శంకర భగవానుడు తథాస్తు అని పలికెను.
        అస్యాః పరతరం తీర్థం న భూతం న భవిష్యతి                                    సత్యం సత్యం పునస్సత్యం మేదేచపరినిష్ఠితమ్‌                                    గౌతమేనయధానీతా గౌతవిూ తేనసంస్క ృతా                                    గాందదాతిచ విప్రేభ్య తతః గోదాప్రకీర్తితా                                    అవనాత్‌ పుణ్యదానాచ్చ అవరీపరికీర్తితా                                    గోదా చ అవరీచైవ తతో గోదావరీ మతా                                    సర్వేషా గౌతవిూపుణ్యా ఇత్యుక్త్వాన్తర ధీయత.
దీనికంటే గొప్పదైన తీర్థము ఇది వరకులేదు. ఇకముందు ఉండదు. ఇది ముమ్మాికి సత్యమే. వేదములో ప్రతి పాదించబడినది. గౌతమమహర్షి తీసుకొనివచ్చినాడు గాన ఇది గౌతమి అను పేరుతో ప్రసిద్ధి చెందినది. మరణించినట్లు పడియున్న గోవును మరల బ్రాహ్మణులకు ఇచ్చినందున, సకలవేవేదాంతజ్ఞానరూపమైన వాక్కును అనగా గోవును ఇచ్చినందున గోదా, అవతి, రాతి అను వ్యుత్పత్తిచే రక్షించును, ఇచ్చును అనగా అమోఘమైన పుణ్యములనిచ్చును. పాపములనుండి రక్షించును. గాన అవరీ గోదా అవరీ కలిపితే గోదావరి అనుచున్నారు. ఈ గౌతవిూనది అందరికే పుణ్యప్రదమైనది అని చెప్పి శివుడు అంతర్ధానముచెందెను.
    ఇట్లు లోకపూజితుడైన శంకర భగవానుడు అంతర్థానము కాగా ఆ శివాజ్ఞతో పరిపూర్ణమైన బలము కలిగిన గౌతమమహర్షి ఆ నదీమతల్లి ఉన్నజటను తీసుకొని దేవతలతో కలిసి బ్రహ్మగిరిని చేరెను. అంతట జటను తీసుకొని గౌతమమహర్షిరాగా అక్కడ అనగా ఆ బ్రహ్మగిరిపై పుష్పవృష్టి కురిసినది. సురేశ్వరులందరూ అచికి వచ్చిరి, మహానుభావులైన ఋషులు బ్రాహ్మణులు క్షత్రియులు జయ శబ్దముతో ఆ గౌతమమహర్షిని పూజించుచు సంతోషముకలవారైరి.
    ఇట్లు చెప్పగా నారదమహర్షి మరల బ్రహ్మను ఇట్లు అడిగెను. మహేశ్వర జా జూటమునుండి గంగను తీసుకొని బ్రహ్మగిరికి వచ్చిన గౌతమమహర్షి ఆ తరువాతయేమి చేసెను. అనగా బ్రహ్మ ఇట్లు తెలుపుచున్నాడు. ఇట్లు గౌతమమహర్షి మహేశ్వరుని జా జూటమునుండి గంగను తీసుకొని వచ్చి పరిశుద్ధుడై ఏకాగ్రమైన మనస్సుకలవాడై దేవతలచేత గిరినివాసులచే పూజించ ప్రతిష్ఠించి త్రిలోచనదేవుని స్మరించుచు చేతులు జోడించుచు ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు గంగ నుద్దేశించి ఇట్లు పలికెను.
        త్రిలోచన జోద్భూతే సర్వకామప్రదాయిని                                    క్షమస్వమాతశ్శాన్తాసి సుఖంయాహిహితంకురు.
    త్రినేత్రుని జటనుండి ఉద్భవించినదానా! సకల కామనలను ప్రసాదించుతల్లీ! క్షమించుము. శాంతించుము. సుఖముగా వెళ్ళుము. హితమును చేయుము. ఇట్లు గౌతమమహర్షి పలుకగా గంగాదేవి దివ్యరూపమును ధరించి దివ్యమాల్యాఉపావనములను ధరించి గౌతమునితో ఇట్లు పలికెను. దేవసదనమునకు వెళ్ళెదనులేదా బ్రహ్మకమండలమునకు వెళ్ళెదను. రసాతలమునకైనా వెళ్ళెదను. నీవు సత్యమును మాటలాడువానిగా ప్టుితివి. అనగా గౌతమమహర్షి ఇట్లు పలికెను. మూడులోకములకుపకారమునకై నేను యాచించితిని. శంకర భగవానుడు కూడా అట్లే ఇచ్చెను. ఆ శంకర భగవానుని సంకల్పము ఇంకొక తీరుగాకాదుకదా! ఇట్లు గౌతమమహర్షి వాక్యమును వినిన గంగ బ్రాహ్మణవాక్యము సత్యమే అని తలచెను. అపుడు గంగ తనను మూడు విభాగములుగా విభజించుకొని స్వర్గమర్త్యరసాతలములను చేరెను. స్వర్గమున నాలుగు విధములుగా ప్రవహించి మర్త్యలోకమున ఏడుగా రసాతలమున నాలుగుగా ఇట్లు పంచాదార విధములుగా అయి ప్రవహించినది. అంతట అన్ని తానే అయినది. సర్వపాపవినాశిని. సర్వకామప్రద. ఇదే వేదమున గానము చేయబడుచున్నది. మానవులు మానవుల లోకమునున్న దానికే దర్శించెదరు. రసాతలగతమున నున్నదానిని దర్శించజాలరు. స్వర్గములోనున్న దానిని చూడజాలరు. సముద్రమునకు చేరువరకు ఇది దేవమయెను. గౌతమ మహర్షి వదలగా పూర్వసాగరమునకు వెళ్ళెను. అంతట దేవతలతో ఋషులతో సేవించబడుచున్న దానిని జగత్తునకు శుభమును కలిగించబడుచున్నదానిని జగత్తునకు శుభమును కలిగించి గోదావరీమాతను మునిశ్రేష్ఠుడైన గౌతమమహర్షి ప్రదక్షిణము నాచరించెను. సురేశుడైన త్రిలోచనుని మొదట పూజించి గౌతమ మహర్షి ఉభయతీరములలో స్నానము చేసెదనని సంకల్పించెను. స్మరించినంతనే అక్కడ కరుణాసాగరుడు అక్కడ సాక్షాత్కరించెను. చెతులు జోడించి భక్తితో వంగిన వాడై త్రిలోచనుని ఇక్కడస్నానమెట్లు సిద్ధించును అని శంకరుని అడిగెను.
    దేవదేవమహేశానా? లోకములహితమును కోరి గౌతవిూ తీర్థస్నానవిధిని నాకు చక్కగా తెలుపుము అనగా మహేశ్వరుడు ఇట్లు చెప్పెను. మహర్షీ గోదావరీస్నాన విధిని సమగ్రముగా చక్కగా వినుము. మొదట నాందీముఖము నాచరించి దేహశుద్ధిని ఆచరించి బ్రాహ్మణులను భుజింపచేసి వారి ఆజ్ఞను స్వీకరించి పతితులతో మాటలాడుటను విడిచిప్టిె బ్రహ్మచర్యముతో వెళ్ళవలయును.
        యస్య హస్తౌ చపాదౌ చ మనశ్చైవసు సంయతమ్‌                                విద్యాతపశ్చకీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే.
    హస్తములు పాదములు మనస్సు విద్యా తపస్సు కీర్తి నియమబద్ధముగా నున్న వాడు తీర్థఫలమును పొందును. దుష్టభావమును విడిచిప్టిె స్వధర్మపరినిష్ఠితుడై అలసినవారికి సేవ చేయుచు యధోచితముగా అన్నదానము చేయవలయును. ఏవిూలేని సాధువులకు వస్త్రదానమును చేయవలయును. దివ్యమైన గంగా సముద్భవమైన హరి వధను వినవలయును. ఈ విధితో వెళ్ళుచు సకల తీర్థఫలమును పొందును. శంకరుడు గౌతమమహర్షితో మరియొకమాట చెప్పియున్నాడు. ద్విహస్తమాత్రముననే తీర్థములు సంభవించగలవు. సర్వకామ ప్రదుడనైన నేను అన్నిచోట్ల సన్నిహితుడనై యుందును. గంగాద్వారే ప్రియాగమున సాగరసంగమమున ఈ తీర్థములలో గౌతవిూనది భాగీరధి నరులకు మోక్షమును ప్రసాదించునది.
        నర్మదాతు సరిచ్ఛ్రేష్ఠా పర్వత్వేమర కర్కాటకే                                    యమునాసంగతా తత్ర ప్రభాసేతు సరస్వతీ                                    కృష్ణా భీమరధీచైవ తుంగభద్రాతు నారద                                    తిసృణాంసంగమోయత్ర తీత్తీర్థం ముక్తిదంనృణామ్‌                                పయోష్ణీసంగతాయత్ర తత్రత్యాతత్రముక్తిదా                                    ఇయంతు గౌతవిూ వత్సయత్రక్వాపిమమాజ్ఞయా                                సర్వేషాం సర్వదా నౄణాం స్నానాన్ముక్తిం ప్రదాస్యతి                                కించిత్కాలేపుణ్యతమా కించిత్తీర్థే సురాగమా                                    సర్వేషాం సర్వదా తీర్థం గౌతవిూనాత్ర సంశయ.
అమర కంటక పర్వతమున నర్మదా ఉత్తమనది. అక్కడే యమునా సంగమము శ్రేష్ఠము. ప్రభాసమున సరస్వతీ శ్రేష్ఠనది. కృష్ణా భీమరధీ తుంగ భద్రా ఈ మూడునదులసంగమమ ఉన్నతీర్థము ముక్తిప్రదము. పయోషీసంగమము కల తీర్థము ముక్తిప్రద. ఇక ఈ గౌతతవిూనది యెక్కడ ఉన్ననూ నా ఆజ్ఞచె అందరికి అన్ని వేళలా అన్నిచోట్ల నరులకు స్నానమాత్రమున ముక్తిప్రద. కొన్ని నదులు కొన్ని కాలములలోనే పుణ్యతమలు. కొన్ని తీర్థములు దేవతలరాకలో పుణ్యప్రదములు. అందరికీ అన్నిచోట్ల అన్నివేళలా గౌతవిూ ముక్తిప్రదా.
        షష్ఠిర్వర్ష సహస్రాణి భాగీరధ్యవగాహనీమ్‌                                    సకృద్ఘోదావరీస్నానం సింహస్థే చ బృహస్పతౌ                                    విశేషాద్రామ చరణ ప్రదానాత్‌ తీర్థసంశ్రయాత్‌                                    సింహస్థితేసురగురౌ దుర్లభాగౌతవిూనృణామ్‌                                    భాగీరధీ నర్మదా చ యమునా చ సరస్వతీ                                    ఆయాన్తి భీమర ధ్వాద్యాః స్నాతుంసింహగతేగురే                                విహాయ గౌవిూం గంగాం తీర్ధాన్యన్యానిసేవితుమ్‌                                యేయాన్తి మూఢాస్తే యాన్తి నిరయంసింహగేగురే
అరవైవేల సంవత్సరములు గంగాస్నానము బృహస్పతిసింహరాశిలో ఉన్నపుడు కూడా వరీస్నానము సమాన ఫలప్రదము. రామచరణ ప్రదానము వలన తీర్థసంశ్రయము వలన బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు గౌతవిూస్నానము దుర్లభము. భాగీరధి నర్మదా యమునా సరస్వతి భీమర ధ్యాదినదులు సింహగతగురువులో గోదావరికి వచ్చును. బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు గోదావరిని విడిచి ఇతర తీర్థములను సేవించు మూఢులు నరకమునకు వెళ్ళెదరు.
        తిస్రఃకోట్యర్థ కోీచ యోజనానాం శతద్వయే                                    తీర్థాని ముని శార్దూల సంభవిష్యంతి గౌతమి                                    ఇయం మాహేశ్వరీ గంగా గౌతవిూ వైష్ణవీతిచ                                    భ్రాష్మీగోదావరీనందా సునందావామదాయినీ                                    బ్రహ్మతేజస్సమానీతా సర్వపాపప్రణాశినీ                                    స్మరణాదేవపాపేఘహన్త్రీ మమసదా ప్రియా                                    పంచానామపి భూతానామాపః శ్రేష్ఠత్వమాగతా.
మూడుకోట్ల 50 లక్షల తీర్థములు రెండువందలయోజనాలలో గౌతవిూనదిలో సింహబృహస్పతిలో సంభవించును. ఈ గోదావరి గంగా మాహేశ్వరి గౌతవిూ వైష్ణవీ బ్రాహ్మీ గోదావరీ నర్మదా సునందాకామదాయినీ బ్రహ్మతేజస్సుతో గొనితేబడినది. సర్వపాపప్రణాశినీ గోదావరిని స్మరించినంతనే సకలపాపరాశులను నశింపచేయును. నాకు సదా ప్రీతికరురాని. అయిదు భూతములు, జలము శ్రేష్ఠతముములు. ఆ జలములలో తీర్థభూత జలము ఇంకా శ్రేష్ఠములు. కావున జలములు సర్వశ్రేష్ఠములు.
        తస్మాత్‌ భాగీరథీశ్రేష్ఠాతాభ్యోయ గౌతవిూత్వయా                                ఆనీతాస జాగంగా అస్యానాన్యచ్ఛు భావహమ్‌                                స్వర్గే భువిలిచేవాపి తిర్థేసర్మార్ధదం మునే
కావున భాగీరథి జలములలో కెల్ల శ్రేష్ఠమైనది. భాగీరథా జలములకంటే గోదావరీ జలములు శ్రేష్ఠములు. శంకరుని జాసహితముగా నీవు తీసుకొని వచ్చితివి. దానికంటే శ్రేష్ఠిమింకొకిలేదు. స్వర్గములో భూలోకమున పాతాళమున సర్వార్థద గౌతమి పుత్రా ఇట్లు గౌతమమహర్షికి శంకర భగవానుడు అంతా చెప్పెను. శంకరుడు సంతోషించి చెప్పిన దంతయు నీకు తెలిపితిని. ఇట్లు గౌతవిూగంగ అన్నికంటే అధికమైనది శ్రేష్ఠమైనది. గౌతమి ఉత్పత్తిని ప్రభావమును స్వరూపమును కూడా చెప్పితిని. ఇంకాయేమేమి వినగోరుచున్నావు. ఇది సంగ్రహముగా గోదావరి ఉత్పత్తి. గౌతమి గోదావరి వైభవము. బ్రహ్మవిష్ణుమహేశ్వరుల త్రిమూర్తుల సంకల్పములతో సకల లోకహితమును కోరి ఆత్రిమూర్తులు సకల చరాచరప్రపంచహితమునకు అవతరింపచేసినది గోదావరి ఇక ఇపుడు పుష్కర ప్రభావమును పుట్టుకను చూతము.
పుష్కర ప్రాదుర్భావము
    శౌనకాది మహామునులు సూతమహర్షిని ఇట్లు అడిగిరి.
    మహామునీ గోదావరియొక్క అద్భుతమైన చరితమును వినిపించి మమ్ములను కృతార్ధులను చేసితిరి. తమ వాక్యామృతమును జుఱ్ఱుచున్న మాకు తృప్తి కలుగుటలేదు. ఇంకా వినాలి అ తహ తహ కలుగుచున్నది. ఇక ఇపుడు పుష్కరమంటే యేమి. అది 12 సంవత్సరములకే ఒక్కసారే ఎందుకొచ్చును. దీనిలోని అంతరార్ధమేమి. ఆ విధి విధానమును కూడా వినిపింపవేడుచున్నాము అని శౌనకాది మహామునులు కోరగా సూతమహర్షి ఇట్లు చెప్పసాగెను.
    సాధార ఋరదనీిని చిల్లగింజ (ఇండుపగింజ) శుద్ధి చేయునట్లు అఖిలచరాచర జగత్తులోని జావకంటే పాపాలను తమలో కలుపుకున్న మహానదులు ఆ పాపాలను తొలగించుకొని మళ్ళీ నిర్మలములు పరిశుద్ధములు పవిత్రములు పుణ్యప్రదములుగా అగునట్లు చేయునదే పుష్కరము. పుష్కరము అంటే కమండలమునకు పేరు. పుష్కరము అంటే పద్మము. పుష్కరము అంటే యేనుగుతొండము. పుష్కరము అంటే మహాలక్ష్మి. శ్రీ మన్నారాయణునకు పుష్కరాకక్షుడు అనిపేరు. మహాలక్ష్మికి పుష్కరాసన అని పేరు. సముద్రునకు పుష్కర నిలయుడు అనిపేరు. ఇట్లు ఇన్ని అర్థములు ఆంతర్యములున్న పుష్కర శబ్దము నామము ఇక్కడ ఎలా వించుకు వ్యవహరించబడుచున్నదో చూతము.
    జీవులందరూ తమపాపాలను నదులలో వదులుచున్నారు. మరి ఆ నదులు ఎట్లు పాపాలను వదిలించు కోవాలి అను సందేహము పుష్కరుడనే ఒక బ్రాహ్మణునకు కలిగినది. ఆ నదులపాపములను తొలగించు విధానమును తెలియుటకు ఆ పుష్కరుడు శివునికై ఘోరమైన తపమును ఆచరించినాడు. ఆ శంకరుని అష్టమూర్తులలో ఒకటైన జలత్వసిద్ధికై ప్రాదేయపడినాడు. ఆ భక్తుని ఉదారమైన సంకల్పము లోకహితమును ఆకాంక్షించుట అతని ఆవేదనను అర్ధము చేసుకొని శంకరభగవానుడు ఆ పుష్కరునికి అభయమునిచ్చి భక్తునకు పుష్కరమూర్తిగా పరిణమించి సాక్షాత్కరించినాడు. అది తెలిసిన బ్రహ్మశంకరుని ప్రార్థించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ తీసుకొని ఆ పుష్కర తత్త్వాన్ని తనకమండల జలంలో నిక్షిప్తం చేసుకొనినాడు.
    ఇది ట్లు జరుగుచుండగా గౌతముని ధర్మపత్ని అయిన అహల్య పై కామవాంఛా కలుషితుడైన ఇంద్రుడు తన వాంఛను తీర్చుకొనుటకు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరకు ఒకనాడు తన మాయచే కోడిపుంజురూపమున అతని ఆశ్రమమునకువెళ్ళి బ్రాహ్మిముహూర్తమునకు ముందే సమయమైనట్లుగా కూతకూసినాడు. బ్రాహ్మముహూర్తమైనదని తలచిన గౌతమమహర్షి వాచిస్నానార్ధియై నదీప్రాంతముకు వెళ్ళెను. అంతలో ఇంద్రుడు తాను ఆ ముని రూపమును ధరించి ఆహల్యను అనుభవించెను. స్నానార్ధమై వెళ్ళిన గౌతమమహర్షి సగము దారిలోనే ఇది రాక్షసవేళకాని బ్రాహ్మీముహూర్తముకాదని తెలిసి ఇది స్నానసమయముకాదని తెలిసి వెనుకకు మళ్ళీ ఆశ్రమమునకు చేరెను. అక్కడ తన వేషములో నున్న ఇంద్రుని అతని నున్న అహల్యను చూచి కోపించెను. అహల్యా నా భార్యవై తపస్సంపన్నురాలవై పవిత్రమైన గృహస్థధర్మమును పతివ్రతాధర్మమును మరిచి పరపురుషునితో క్రీడించుచున్న నీవు అందరికీ అదృశ్యురాలవై భస్మచ్ఛన్నముగా ఉండి ఆహార నిద్రలు మాని కఠినమైన తపమునాచరించుచు పాపమును తొలగించుకొనుము అని శపించెను. అట్లే ఇంద్రుని సురపతీ! ది...డవై యుండి జ్ఞానమును వివేకమును వాస్తవమును తెలియుస్థితిని కోల్పోయి కేవలము యోనిపట్ల తహతహతో ఇంతి అకృత్యమునకు పూనుకున్నావు. అందుకే నీ శరీరమంతా ఆ యోనులమయమై పోవుగాక అని శపించెను. అహల్య అదృశ్య అయినది రావతారమున రాముని రాకతో తన శాపము తొలగిపోయినది. ఇక ఇంద్రుని శరీరమంతా యోనులు ఏర్పడినది. మూడులోకములను పాలించు ఇంద్రుడు ఈ జుగుప్సాపాపమును కఠినమైన శాపమును భరించ జాలక తన ఆచార్యుడైన బృహస్పతిని చేరినాడు బృహస్పతి ఇంద్రుని తనవెంట తీసుకొని బ్రహ్మలోకమున బ్రహ్మవద్దకు వెళ్ళెను. బ్రహ్మను పలురీతులా ప్రార్థించెను. అయినా ఇంద్రుని వైరుచ్యము తొలగలేదు. అపుడు బ్రహ్మ మందాకినివద్ద ఒకసరస్సును నిర్మించి అందులో తన కమండలములోని పుష్కరజలమును కొద్దిగా ప్రోక్షించి మహోన్ద్రని ఆ సరస్సులో స్నానము చేయించినాడు. శంకరభగవానుని సంకల్పమున యేర్పడిన గంగ శ్రీ మహావిష్ణువు పాదములను కడిగిన గంగ శంకరుడు పుష్కరమూర్తిగానున్న గంగ బ్రహ్మకమండలములోచేరిన గంగ ఇంతాదిజలము ప్రోక్షించబడిన సరమున స్నానము చేసినంచున ఇంద్రుని వికృతరూపమునశించి యధావస్థిత రూపుడాయెను. ఆకాశగంగకన్నా అత్యంత ప్రభావసమన్వితమైన ఆ పుష్కరమహిమను దేవేంద్రుడు బృహస్పతికూడా ఆశ్చర్యమునందినారు.
    సకలలోకాలు ఆశ్చర్యమును పొందించిన ఈ పుష్కర మాహాత్మ్యము ఆనోా ఆ నోా జగమంతా ప్రచారమైనది. ఆకాశగంగకన్నా పరమపావనమైన ఆ పుష్కరసమ్మెలనమునకు నదులన్ని తహతహలాడినవి. గంగా గౌతవిూనదులను ముందర నుంచుకొని బ్రహ్మవద్దకువెళ్ళి బ్రహ్మను ప్రార్థించిసాగినవి. అదే సమయమున పుష్కర మహిమను తాను దగ్గర ఉండి కనులారా చూచాడు కావున ఆ పుష్కరత్వమును తనకు పొందింప చేయమని బ్రహ్మదేవుని ప్రార్థించియున్నారు. కాని పుష్కరుడు దీనికి అంగీకరించలేదు. అయినా నదుల ప్రార్ధనను బృహస్పతి ప్రార్ధనను మన్నించిన బ్రహ్మకర్తవ్యమునకు శ్రీ మన్నారాయణుని ప్రార్థించినాడు. అంతట శ్రీహరి గురువు ఆయా రాశులలో చేరిన మొది 12 రోజులు రాశిని విడిచు చివరి పన్నెండు రోజులు బ్రహ్మనిర్ణయించిన నదులలో ఉండుమని పుష్కరుని ఆదేశించిన శ్రీహరి ఆజ్ఞ మేరకు పుష్కరుడు అందులకు అంగీకరించెను. అపుడు బ్రహ్మ శ్రీహరి ఆజ్ఞమేరకు ఇట్లు నదీ నిర్ణయము పుష్కర ప్రవేశమును ఆదేశించెను. మేషాది ద్వాథరాశులయందు సర్వశుభగ్రహమగు గురుడు సంచరించునపుడు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరకాలముగా నిర్ణయంపబడినది.
బృహస్పతి    మేషరాశిలో ప్రవేశించినపుడు    గంగా నదికి
బృహస్పతి    వృషభరాశిలో ప్రవేశించినపుడు    నర్మదా నదికి
బృహస్పతి    మిధునరాశిలో ప్రవేశించినపుడు     సరస్వతీ నదికి
బృహస్పతి    కర్కాటకరాశిలో ప్రవేశించినపుడు     యమునా నదికి
బృహస్పతి    సింహరాశిలో ప్రవేశించినపుడు     గోదావరి నదికి
బృహస్పతి    కన్యారాశిలో ప్రవేశించినపుడు     కృష్ణా నదికి
బృహస్పతి    తులారాశిలో ప్రవేశించినపుడు     కావేరీ నదికి
బృహస్పతి    వృశ్చికరాశిలో ప్రవేశించినపుడు     భీమా(తామ్రపర్ణి)నదికి
బృహస్పతి    ధనురాశిలో ప్రవేశించినపుడు     పుష్కరిణి నదికి
బృహస్పతి    మకరరాశిలో ప్రవేశించినపుడు     తుంగభద్రా నదికి
బృహస్పతి    కుంభరాశిలో ప్రవేశించినపుడు     సింధు నదికి
బృహస్పతి    విూనరాశిలో ప్రవేశించినపుడు     ప్రాణహితనదికి
ఈ విధముగా పన్నెండు నదులకు పన్నెండు రాశులలో బృహస్పతి ప్రవేశించిసంచరించునపుడు పుష్కరుడు ప్రవేశించును. ఇట్లు ఒక్కొక్కనదికి 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరము లేర్పడును. ఆయా పుష్కరమున ఆయా నదీస్నానము పూజదానధర్మములు వ్రతములు శ్రాద్ధములు తర్పణములు పిండప్రదానములు చేయుట వలన తాము పాపవిముక్తులగుటయెకాక తమ పితృదేవతలకు కూడా ఊర్ధ్వగతిని లభింపచేతురు. ఇట్లు చెప్పగా శౌనకాది మహామునులు మరల ఇట్లు అడిగిరి. సర్వజ్ఞా! నీవు చెప్పిన 12నదులలో యేనదీ పుష్కరము ఉత్కృష్టమైనది తెలుపుడు అని అడుగగా సూతమహర్షి ఇట్లు చెప్పసాగెను.
గోదావరీ పుష్కరములు
    అన్ని పుష్కరములలో గోదావరి పుష్కరము సర్వోత్క ృష్టమైనది. సమస్త నదీపుష్కరములకన్ననూ గోదావరి పుష్కరములు అతి పవిత్రము. అతిపుణ్యప్రదము. అమితశక్తిమంతము. అంతేందుకు 'గోదావరి గోదావరి గోదావరి' అని మూడు మార్లు స్మరించినచాలును. సకలపాపములు తొలగును. అట్లు గురువు సింహరాశిలో ప్రవేచగనే మూడుకోట్ల యాబది లక్షల పుణ్యతీర్థములతో పుష్కరుడు గోదావరినదిని ఆశ్రయించును. ఆనాినుండి సంవత్సరాంతము వరకు సకల తీర్థములు గోదావరిలోనే నివసించు చుండును. పుష్కరుడు మాత్రము మొది పన్నెండు దినములు చివరి పన్నెండు దినములు మాత్రమే గోదావరిలో ఉండును. అందు వలన మొది పన్నెండు దినములు ఆదిపుష్కరమని చివరి పండ్రెండు దినములు అంత్యపుష్కరములని వ్యవహరించెదరు. ఈ అంత్యపుష్కరోత్సవములు అన్ని నదులకు జరుగుచు ఒక్క గోదావరినదికి మాత్రమే అంత్యపుష్కర ఉత్సవములు జరుగును. ఈ ఆచారముతో తక్కువ నదులకు కూడా అంత్యపుష్కరములను జరుపుచున్నారుకాని వాస్తవముగా జరుపవలసినది ఒక గోదావరీనదికి మాత్రమే.
    కావున సాధారణ సమయముననే గోదావరీస్నానము సర్వార్థసిద్ధిదము సర్వకామప్రదము. సర్వపాపహరము. అయినపుడు ఇక ఈ గోదావరీపుష్కర పుణ్యకాలమున గౌతవిూస్నానము తీరమున సాగించు జపహోమ దానధర్మ తర్పణ శ్రాద్ధపిండప్రదానాదికములు కోట్లధికఫలప్రదములు. అందుకే మహామహులగు ఎంతోమంది ఋషులు గోదావరిగురించి ఇట్లు చెప్పియున్నారు.
        రేవా తీరేతపః కుర్యాత్‌                                            మరనం జాహ్నవీతవే                                            దానంకుర్యాత్‌ కురుక్షేత్రే                                            గౌతమ్యాంత్ర తామం వరమ్‌.
    రేవానదీతీరమున తపమును ఆచరించ వలయును. గంగాతీరమున మరణము కురుక్షేత్రమున దానము గౌతవిూనదీ తీరమున పుణ్యప్రదములే.
        పుష్యార్కే జన్మనక్షత్రే వ్యతీపాతే దినత్రయే                                    సకృద్నాదావరీస్నానం కులకోి సముద్ధరేత్‌.
    పుష్యవిూ నక్షత్రమున్న ఆదివారమునాడు, ప్టుినరోజునాడు జన్మతారనాడు, వ్యతీపాతులలో కాని మామూలు రోజులలో మూడు మార్లు స్నానము గోదావరినదులో చేసినచో ఊర్ధ్వగతులు  లభించును.
        యాగతి ర్ధర్మ శీలానాం మునీనామూర్ధ్వరేతసామ్‌                                సాగతిస్సర్వజంతూనాం గౌతవిూ తీరవాసినామ్‌.
    ధర్మశీలులకు నైష్ఠికబ్రహ్మచారులకు లభించే ఉత్తమ గతి గౌతవిూతీరమున నివసించు సకలప్రాణులకు లభించును.
        పంచానామపి భూతానాం అపాంశ్రేష్ఠత్వ మాగతమ్‌                                తస్మిన్‌ భాగీరథీ జ్యేష్ఠా తస్యా జ్యేష్ఠాతు గౌతవిూ                                ఆద్యాతు గౌతవిూ గంగా పశ్చాత్‌ భాగీరథస్మ ృతా                                తయోరేకతరాసేవ్యా గౌతవిూ తత్రపావనీ.
    అయిదు భూతములలో జలములు శ్రేష్ఠములు. ఆ జలములలో భాగీరధిశ్రేష్ఠ. దానికంటే శ్రేష్ఠము గౌతమి. మొదట గౌతమి గంగా తరువాత భాగీరధి. ఆ రిెంలో ఒకి సేవించాలి. వాిలో గౌతమి పావని అయినది.
    యస్మిన్‌ దినే సురగురు సింహస్థాపియుతో భవేత్‌                                తస్మింస్తు గౌతవిూస్నానం కోి జన్మాఘనాశనమ్‌.
    బృహస్పతి సింహరాశిలో ఉన్నపుడు చేయు గౌతవిూ స్నానము కోిజన్మల పాపములను నశింప చేయును. ఈ గోదావరి నదీజలము గంగానది సైతము పవిత్రము చేయును అ తెలియవలయును. అందుకే కాశీకి పోయినవారు గంగోదకమును తెచ్చి గోదావరిలో కలుపు ఆచారము కలదు. ఇట్లు కలుపుట వలన గంగానది పాపవిముక్తియగునని పండుతుల నిర్ణయము. కావున గంగనే పావనము చేయుగల నది గోదావరియని తెలియవలయును. ఒక్కమాటలో చెప్పాటలంటే గోదావరి కాన్న గొప్పనది గోదావరిపుష్కరములకంటే గొప్ప పుష్కరములు గొప్ప పుణ్యకాలము ఈ సృష్టిలోనేలేవు అని తెలియుచున్నది.
ఇది అఖండ గౌతమి
    మహారాష్ట్రలో అవతరించిన గోదావరీనది నిజామాబాద్‌ జిల్లా నుండి తెలంగాణాలో తన తొలికెరటపు కాలుమోపినది. బాసరమహాక్షేత్రంలో సరస్వతీదేవి చల్లని చూపులు తనపై ప్రసరింప చేసుకొని వేములవాడ కాళేశ్వరములలో తన సోయగాలపై శివుడు చేసే చిలిపిసైగలకు సిగ్గుపడుతూ నవ నవ సర సరసమాధురీ భావజాలములను రంగరించుకొని అగ్నిమండలమైన భద్రాచలాన్ని ఆర్ద్రతా నిలయముగాచేసి తెలుగించి ఇలవేలుపులైన సీతారాముల పవిత్రానురాగాలను పరామర్శించుచు తూర్పుకనుమలద్వారా పాపికొండలను తరిచి తరించి మైదానప్రాంతానికి వచ్చి రాజమహేన్ద్రవరము విూదుగా బంగాలాఖాతంవైపు ప్రవహించినది. అత్యన్త విశాలప్రాంతములో ప్రవహించే గోదావరి ఈ ప్రాన్తంలోనే అఖండగౌతమిగా ఆరాధనలందుకుంటున్నది. సరస్వతి చల్లని చూపులను భావుకతలను పవిత్రానురాగబంధాలను రాజమహేన్ద్రవరములోనే భద్రపరిచి ధవళేశ్వరవైపు కదిలి ఆ పై నుండి అఖండగౌతమిగా సప్తగోదావరిగా యేడుపాయలుగా చీలిపోయినది.
సప్తగోదావరులు
    తుర్యాత్రేయీ భరద్వాజా గౌతవిూ వృద్ధ గౌతవిూ                                కౌశికాచ వశిష్ఠాచ సర్పరీతి సాగరం తధా.
1.తుల్య 2.ఆత్రేయ 3.భరద్వాజ 4.గౌతమి 5.వృద్ధగౌతమి 6.కౌశిక 7.వశిష్ఠ అను యేడు గోదావరి పాయలుగా సప్తగోదావరులందురు. ఈ ఏడు గోదావరులు వివిధ క్షేత్రములను పునీతమొనరించుచు సాగి తూర్పుసముద్రమున కలియుచున్నది. నాసిక్‌లో జన్మించి అంతర్వాహినిగా ప్రవహించి త్య్రంబకమందలి గోముఖముద్వారా పునరావిర్భూతమై సముద్ర సంగమము వరకు దాదాపు వెయ్యిమైళ్ళ విస్తీర్ణముగా ప్రవహించు గోదావరి అడుగడుగునా పవిత్రమైనదే. కణకణమునా పుణ్యమును నింపినదే, నిండినదే. అందుకే ఒకటేమాట. గోదావరీ పుష్కరముల పుణ్యకాలములో ఒక్కరోజు స్నానమాడిననూ అరువదివేల సంవత్సరములు గంగలో స్నానము చేసిన ఫలము లభించునని బ్రహ్మపురాణములో విస్పష్టముగా చెప్పియున్నారు. కావున తేది:14.7.2015 నుండి వచ్చు గోదావరీపుష్కరాలలో పవిత్రమైన గోదావరీ చరితమును చదివి, చదివించి, వినిపించి గోదావరీ పుష్కర ప్రభావమును తెలిసి పదిమందికి తెలిపి తమకు అనువైన ప్రాంతమున నున్న గోదావరీనదిలో ఒక్కరోజైనా స్నానమాడి దాన ధర్మ యాగ జప తప తర్పణ శ్రాద్ధ పిండ ప్రదానాదులను కావించుకొని తాము తరించి తమకోి కులములను తరింప చేసెదరను ఆశతో
స్వస్తి. సమస్త సన్మంగళాని భవరతు