Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
28, ఫిబ్రవరి 2023, మంగళవారం
27, ఫిబ్రవరి 2023, సోమవారం
26, ఫిబ్రవరి 2023, ఆదివారం
25, ఫిబ్రవరి 2023, శనివారం
24, ఫిబ్రవరి 2023, శుక్రవారం
23, ఫిబ్రవరి 2023, గురువారం
22, ఫిబ్రవరి 2023, బుధవారం
21, ఫిబ్రవరి 2023, మంగళవారం
20, ఫిబ్రవరి 2023, సోమవారం
19, ఫిబ్రవరి 2023, ఆదివారం
18, ఫిబ్రవరి 2023, శనివారం
17, ఫిబ్రవరి 2023, శుక్రవారం
16, ఫిబ్రవరి 2023, గురువారం
15, ఫిబ్రవరి 2023, బుధవారం
14, ఫిబ్రవరి 2023, మంగళవారం
ఆత "డో పంది డో" రనె హాస్యముగను దాని విని సోము "పందినా నే" ననుకొనె..
ఆత "డో పంది డో" రనె హాస్యముగను
దాని విని సోము "పందినా నే" ననుకొనె..
ఈత "డో యా" స్సని పలికె నింపుగాను.
అది వినెను రాము, "గాడిద" యని తలచెను..
అత్త గా రనింది! "కొత్త కోడల! ఒక్క గ్లాసు రైసు, మూడు గ్లాసు లన్ని..
అత్త గా రనింది! "కొత్త కోడల! ఒక్క
గ్లాసు రైసు, మూడు గ్లాసు లన్ని..
చాలు.. నీళ్ళు పోసి, చక్కగ కుక్కర్ల
వెట్టు." కోడలు కదె వేదవాక్కు..
మాటలలోనే జోకులు సూటిగ చెప్పంగ నేనె చొప్పడ వలెనా!
మాటలలోనే జోకులు
సూటిగ చెప్పంగ నేనె చొప్పడ వలెనా!
నీటుగ నింక మ రెందరొ
ఘాటుగ చెప్పగలవారు కల రెందైనన్
వ్రాసినది పద్యమే మరి! రోసెదరో! దీని చూడరో జాగ్రతగా..
వ్రాసినది పద్యమే మరి!
రోసెదరో! దీని చూడరో జాగ్రతగా..
మోసము జేయును పద్యము
"నా సమమా!" యనుచు దాపునన్ నక్కు సుమీ!
"అంగుగఁ బంచు" మనుచు ని చ్చెం గద ద్రవ్యంబు పేద చేతికి విభుడే
పేద సంబరము
"అంగుగఁ బంచు" మనుచు ని
చ్చెం గద ద్రవ్యంబు పేద చేతికి విభుడే
పొంగుచు మఖమున..నప్పుడు
బంగారమును నిరుపేద పంచె జనులకున్
దశరథ మహారాజు యాగాశ్వం విడిచి, ఏడాదికి సరయూనది కుత్తరాన అశ్వమేధం చేశాడు. ఇది మూడురోజుల యజ్ఞం. ఎందరో భుజించినారు. అన్నరాశులు గుట్టలుగా కనిపించాయి. (అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః బా.కాం.14-13)
స్థానికులేనా! దూరదూరాల నుంచీ వచ్చారు. తృప్తిగా భోంచేశారు. భోజనాలేనా! సంభావనలూ పెద్దమొత్తాలే! రాజు ఋత్విజులకు భూదానం చేస్తే వారు వద్దంటే పదిలక్షల గోవులను, పదికోట్ల బంగారాన్ని, నలభైకోట్ల వెండిని యిచ్చినాడు.
(గవాం శత సహస్రాణి దశ తేభ్యో దదౌ నృపః దశకోటీ స్సువర్ణస్య రజతస్య చతుర్గుణం 48)
చూడవచ్చిన బ్రాహ్మణులకు కోటి పైడి నాణా లిచ్చాడు.(తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటిసంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా 51)
ఒక దరిద్ర ద్విజునికి తన చేతి కంకణం యిచ్చినాడు.(దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణ ముత్తమమ్ కస్మైచి ద్యాచమానాయ దదౌ రాఘవ నందనః 52)
అలా అశ్వమేధంలో భూరి దానాలు చేసేప్పుడు ద్రవ్యం ఒకని కందించినాడు "చక్కగా పంచు" మంటూ.. ఆ నిరుపేద సంతోషంతో బంగారాన్ని పంచినాడు. (ద్రవ్యం రాజుదైనా తన చేతిమీదుగా పంచడమూ సంతోషమే కదా!)
అలా దశరథుడు ఇవ్వడమేకాదు. ఇప్పించినాడు కూడ. ఇప్పించినప్పుడు దానం చేసే వారికి కలిగే తృప్తి రెండు రకాలు. 1.రాజు గా రప్పజెప్పిన బాధ్యత నిర్వర్తిస్తున్నా మన్నది. 2. తమ చేతిమీదుగా ఇస్తున్నా మన్నది.
"ఇన్నినాళ్ళుఁ గలిసియుంటి రెట్టు" లనిన.. "ప్రేమ లేఖ" అనిన దంట ప్రేమజంట!..
"ఇన్నినాళ్ళుఁ గలిసియుంటి రెట్టు" లనిన..
"ప్రేమ లేఖ" అనిన దంట ప్రేమజంట!..
ఇపుడు విడిపోవు నుద్దేశ్య మే మి టనిన..
"ప్రేమ లేక" అనిన దంట ప్రేమజంట!..
సరదా తీరనంతవరకు ప్రేమే మహాప్రాణం.. తీరినాక అదే అల్పప్రాణం.. విడాకులకై లాయరు వద్దకు పరుగెత్తిన ప్రేమ జంట..
దేనినైనను వాయించు ధీవరుండు కాడె కన్నయ్య! వానికి కలికి మురళి
దేనినైనను వాయించు ధీవరుండు
కాడె కన్నయ్య! వానికి కలికి మురళి
యేల? కండ్లజో డది యేల? లీల కాని
దేది వానికి జెందును? వాదు లేల?
పనిమనిషి కరము బట్టిన ఘను డాయెనె కృష్ణమూర్తి! కాంత కరమ్మే
పనిమనిషి కరము బట్టిన
ఘను డాయెనె కృష్ణమూర్తి! కాంత కరమ్మే
తన వేణు వాయె! సతి
కొను మనఁ గను జోడును గయికొనునే మురళిన్!