దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన క్లస్టర్ విధానాన్ని విద్యాశాఖలో ప్రవేశపెట్టింది
తొలిసారిగా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం పది అటానమస్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని అటానమస్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు వస్తాయి
ఇందులో ఏదైనా ఒక కళాశాలలో చేరిన విద్యార్థి వేరొక కళాశాలలో చేరే అవకాశం చిక్కుతుంది.
విద్యార్థులు తాను చేరిన కళాశాలలో ఏదైనా సరైన సదుపాయాలు లేకపోతే అన్నీ సదుపాయాలు ఉన్న మరో కళశాలకు మారే అవకాశాన్ని ఈ క్లస్టర్ విధానం కల్పిస్తుంది.
ఈ సదుపాయం ఏదైనా ఒక సెమిస్టర్ లేదా పూర్తి మూడేళ్లకు సద్వినియోగం చేసుకోవచ్చు. కళాశాలల్లో ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది.
కస్టర్లు.. అందులోని కళాశాలలు
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల: ఖైరతాబాద్, కూకట్పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ డిగ్రీ కళాశాలలు.
నయాపూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల: నారాయణగూడ, చేవెళ్ల, రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, పరిగి, మహేశ్వరం డిగ్రీ కళాశాలలు.
నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల: చంచల్గూడ, ఫలక్నుమా, హుస్సేనీ ఆలం, గోల్కొండ డిగ్రీ కళాశాలలు.
విద్యానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల: సీతాఫలముండి, మల్కాజిగిరి, ఉప్పల్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలలు.
సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల: సంగారెడ్డి, సదాశివపేట్, జోగిపేట, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, నర్సాపూర్ డిగ్రీ కళాశాలలు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల: మెదక్, సిద్దిపేట (మహిళా), గజ్వేల్, గజ్వేల్ (మహిళా), దుబ్బాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి