లేబర్ ఇన్సురెన్సు పాలసీ వివరాలు
లేబర్ ఇన్సూరెన్సు పథకం అర్హతలు
లేబర్ ఇన్సురెన్సు వల్ల కలిగే ప్రయోజనాలు
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఓట్లేసిన ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి.
అలాంటి సంక్షేమ పథకాల్లో లేబర్ ఇన్సూరెన్స్ పథకం కూడా ఒకటి.
ఈ లేబర్ ఇన్సూరెన్స్ పథకం కార్మికుల కోసమే కాకుండా సంవత్సరాదాయం తక్కువ ఉన్నవారందరికి ఉపయోగపడుతుంది
కూలీలు, కార్మికులు, చిరుద్యోగులు ఈ బీమా పొందొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు తప్ప తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.
18 నుండి 55 ఏళ్ల వయస్సున్న స్త్రీ , పురుషులు ఇందుకు అర్హులు.
ఈ బీమా పొందాలంటే.. రూ. 110 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ. 22/- చొప్పున 5 సంవత్సరాలకి ఒకేసారి చెల్లించాలి.
ఐదేళ్ల వరకూ బీమా ఉంటుంది
ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకోవచ్చు.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ , బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ వస్తుంది.
ప్రమాదవశాత్తూ మరనిస్తే రూ.6,00000/- బీమా సొమ్ము వస్తుంది.
ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ ఇస్తారు.
రెండు ప్రసవాల వరకు రూ. 30,000/-రూ చొప్పున వచ్చే అవకాశం ఉంది.
ఏడాది పాలసీ తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, 100% వికలాంగులైతే 5 లక్షల పరిహారం ఉంటుంది.
పూర్తి వివరాలు మండల కార్మిక అధికారి / ఎంపీడీవో / ఎమ్మార్వోల వద్ద లభిస్తాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి