బంగారం ఎలా వస్తుంది ?
బంగారం కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు ?
బంగారం ఆసక్తికర సంగతులు
బంగారు నగలని ఎలా తయారు చేస్తారు ?
బంగారం నాణ్యతని ఎలా కొలుస్తారు ?
-----------------------------------------------------------------------------------------------------------------------------
ఇది అత్యంత స్థిరమైన లోహం
రసాయన చర్యల్లో చురుకుదనం తక్కువ
బంగారం భూమిలో లోతైన గనుల్లో నేరుగా మూలకం రూపంలో లభిస్తుంది
ఇది ఒక దేశపు ఆర్ధిక స్థితిని నిర్ణయిస్తుంది
ఎక్కువ బంగారం నిలువలున్న దేశమే సంపన్న దేశంగా చెలామణి అవుతుంది
పూర్వం కొన్ని రాళ్ళని ఇనుము, సీసం వంటి లోహాలతో తాకిస్తే అవి పుత్తడిగా మారతాయని విశ్వసించేవారు
కొంతమంది ఇందుకోసం తమ జీవితాలనే పణంగా పెట్టినట్లు తెలుస్తోంది.
యోగి వేమన కూడా బంగారం తయారీకి ప్రయత్నించాడని చెబుతుంటారు.
గతంలో రాణులు రాజులూ సైతం ఈ ప్రయత్నానికెంతో ప్రోత్సహించారు కూడా..
గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, మెసపటేమియా లో కూడా ఇందుకోసం ప్రయత్నించారు - అనేక పుస్తకాలూ కూడా వ్రాసారు
ఇంగ్లండ్లో మొదటి ఎలిజబెత్ బంగారం తయారుకి అధికారికంగా ప్రయత్నించి విఫలమైంది
22వ పొప్ జాన్ కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు
బంగారం తయారీ పద్ధతులని రహస్యంగా ఉంచి గ్రంథాల్లో కోడ్ భాషలో వ్రాసేవారు
న్యూక్లియర్ ఫ్యూషన్ పద్ధతిలో లోహాలనుంచి బంగారాన్ని తయారు చేయవచ్చు
పూర్వం బంగారాన్ని తయారు చేయడానికి ఇనుము, ఆమ్లం- మరొక లోహాన్ని వాడేవారు - ఈ క్రమంలో విషవాయువులు పుట్టి అనారోగ్యానికి గురయ్యేవారు.
కొలిమినుండి బయటికి తీసిన ముడిసరుకుకి పొటాషియం నైట్రేట్ ని కలిపేవారు
రసవాదంలో ఉమ్మెతాకుని తీసుకుని బంగా దంచుకొని అందులో పాదరసాన్ని వేసి బాగా ఆరు గంటలపాటు నూరితే పాదరసం గట్టిపడి బంగారంగా తయారవుతుందని నమ్ముతారు కొందరు..
న్యూటన్ కూడా బంగారం తయారీ కోసం ప్రయత్నించాడని వినికిడి
పరుసవేది అనేది నీచ లోహాలని బంగారు లోహాలుగా మార్చే విద్య
ఆచార్య నాగార్జునుడు ఆల్కెమి (పరుసవేది) విద్యద్వారా పాదరసం, సీసం లోహాలనుండి బంగారాన్ని తయారు చేసాడని నమ్ముతారు
నాగార్జునుడు వ్రాసిన రస రత్నాకరం , రసేంద్ర మంగళ్ గ్రంధాల్లో స్పర్శవేది విద్యగురించి చెప్పాడంటారు
బంగారం ఆటామిక్ నెంబర్ 79, మెర్క్యూరీ నెంబర్ 80.
రూథర్ ఫర్డ్ ఒక మూలకాన్ని వేరొక మూలకంగా మార్చవచ్చని (మూలకాల కృత్రిమ పరివర్తనం) నిరూపించాడు
టోకియోలోని ఇంపీరియల్ యూనివర్సిటీ లోని హాంటారో 1924 మార్చిలో అణువిద్యుత్ ఉపయోగించి బంగారాన్ని తయారు చేయడంలో విజయం సాధించాడు
4 గంటలపాటు 1,50,000 వోల్టుల విద్యుత్తును పారఫిన్ ఆయిల్ డై ఎలక్ట్రిక్ లేయర్ పై పంపి పాదరసం నుండి 1 ప్రోటాన్ ను తొలగించడం ద్వారా బంగారాన్ని తయారు చేయ గలిగాడు
రష్యన్ శాస్త్రవేత్తలు 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద రాగిని వేడిచేసి గోల్డ్ గామార్చి ఒక మూలకం నుండి వేరొక మూలకాన్ని తయారు చేయవచ్చని నిరూపించారు
నక్షత్రంలో జరిగే కేంద్రక సంలీన చర్య కారణంగా భూమి మీదికి బంగారు ఖనిజం చేరి ఉంటుందని చెబుతారు
భూమి మీదికి చేరే ఉల్కలు బంగారాన్ని భూమి మీదకి చేరవేసి ఉంటాయని కూడా చెబుతారు
బంగారం అనేది ఒక కెమికల్ ఎలిమెంట్
లాటిన్ పదమైన ఆరం అనే పదం ఈ మూలకానిది
దీని ఆటామిక్ నెంబర్ 79 (కేంద్రకంలో 79 ప్రొటాన్సు ఉంటాయి)
సూర్యుడు, భూమి, ఏర్పడక ముందే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే పుత్తడి ఏర్పడింది
గోల్డ్ తయారీకి చాల వేడిమి మరియు ఉష్ణోగ్రత కావాలి
సూపర్ నోవా (నక్షత్రం పేలినపుడు) జరిగినపుడు లేదా 2 న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకోట్టినపుడు సూర్యుడి మధ్యభాగంలో వేడి కన్నా 6000 రెట్లు విడుదలయినపుడు హైడ్రోజెన్, హీలియం వంటి మూలకాలు కలిసి ఎక్కువ సాంద్రత గల బంగారు మూలకాలు ఏర్పడతాయి
బంగారు నిల్వలు భూమధ్యబాగంలో మరియు ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతున పేరుకుపోయాయి
ఒక మెట్రిక్ టన్ను గోల్డ్ మైన్ నుండి కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే లభిస్తుంది
1660 లో హెన్నింగ్ బ్రాండ్ అనే అల్కమిస్ట్ మనుషుల యూరిన్ లో బంగారం కరిగి ఉందని నమ్మేవాడు - 5,600 యూరిన్ ని సేకరించి వేడిచేస్తే బంగారానికి బదులు భాస్వరం (పాస్పరస్ ) వచ్చినందుకు ఎంతో విచారించాడు
రోమన్లు, గ్రీకులు, పర్షియన్లు పుత్తడి నాణేలని కరెన్సీగా వాడేవారు
పీరియాడిక్ టేబుల్ లో ఉన్న అన్ని మూలకాల కన్నా గోల్డ్ కి సాగె గుణం చాలా ఎక్కువ
1 ఔన్సు బంగారం = 28 గ్రాముల బంగారం
1 ఔన్సు బంగారంతో 100 చదరపు అడుగుల పలక తయారవుతుంది
1 ఔన్సు బంగారంతో 80 కిలోమీటర్ల పొడవు తీగెని చేయవచ్చు
బంగారంలో అధికమైన సాగె గుణాన్ని తగ్గించడానికి బంగారంలో జింక్, కాపర్, సిల్వర్, ప్లాటినం వంటి ఇతర లోహాలని కలుపుతారు
24కే గోల్డ్ = 100% గోల్డ్
22కే గోల్డ్ = 91.6% గోల్డ్
18కే గోల్డ్ = 75% గోల్డ్
14కే గోల్డ్ = 58.3% గోల్డ్
12కే గోల్డ్ = 50% గోల్డ్
10కే గోల్డ్ = 41.6% గోల్డ్
09కే గోల్డ్ = 37.8% గోల్డ్
మనకు 75% గోల్డ్ మైనింగ్ ద్వారా వస్తే 25% రీసైక్లింగ్ ద్వారా వస్తుంది
50% గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుండే వస్తుంది
కర్ణాటక, జార్ఖండ్ లో బంగారు గనులున్నాయి
ప్రపంచంలోని దాదాపు 11% (24000 టన్నులు ) బంగారం ఇండియా లో ఉంది
1925 లో తులం బంగారం రూ. 18/- ఉండేది
నకిలీ బంగారం ఐరన్ పైరైడ్ తో తయారు చేస్తారు
శాటిలైట్స్ లోపలి భాగాల్లో గోల్డ్ కోటింగ్ చేస్తారు
కాన్సర్ కి వాడే మందులలో గోల్డ్ ని వాడతారు
ఇప్పటి వరకు 1,90,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు
ఇంకా 57,000 టన్నులు మాత్రమే ఉంది
భూమి మధ్య భాగంలో మాత్రం ఇంకా నిల్వలు ఉన్నాయి
సముద్రంలో 2,00,00,000 టన్నుల నిల్వలు ఉన్నాయి
నాసా వారు మన సోలార్ సిస్టం లో ఒక ఆస్టెరాయిడ్ మీద 2,000 కోట్ల టన్నుల బంగారమున్నట్లు గుర్తించారు
కంప్యూటర్, సెల్ ఫోన్, ప్రోసెసింగ్ చిప్ లలో వాడుతారు
24 క్యారెట్ల బంగారాన్ని పై పూతలకు కానీ నగల తయారీకి కాదు
1. గోల్డ్ + 1. కాపర్ = బైనరీ అల్లోయ్ = రెడ్డీస్ యెల్లో
1. గోల్డ్ + 1. కాపర్+1. సిల్వర్ = ట్రైనరీ అల్లోయ్ = యెల్లో
అతికించే సోల్డర్ పద్దతులను బట్టి నగల తయారీలో సాంప్రదాయ పద్ధతి (సాఫ్ట్ సోల్డర్) , హాల్ మార్క్ పద్ధతి(కారటేజ్), కేడీఎం పద్ధతి (కాడ్మియం సోల్డర్ ) ఉంటాయి
సాంప్రదాయ పద్ధతి లో బంగారు తరుగుదల ఎక్కువగా ఉంటుంది
కేడీఎం పద్ధతి లో తరుగుదల ఉండదు .. స్కిన్ టచ్ స్వచ్ఛత, మీటింగ్ టచ్ స్వచ్ఛత ఒకే లాగున ఉంటుంది - అయితే ఈ అతుకు విధానంలో స్వర్ణకారుడికి కాడ్మియం బస్మం కావడం మూలాన అనారోగ్యం కలుగుతుంది
హాల్ మార్క్ పద్ధతిలో జింక్ తో అతుకు (8.4%.) ఉంటుంది - స్కిన్ టచ్ స్వచ్ఛత, మీటింగ్ టచ్ స్వచ్ఛత ఒకే లాగున ఉంటుంది
పుత్తడి ఆభరణాల పైన 5 ముద్రలు ఉంటాయి
1 బిస్ స్టాండర్ మార్క్ సింబల్
2 ప్యూరిటీ fineness గ్రేడ్
3. నగ తయారీ సెంటర్ మార్క్
4. నగ తయారీ ఇయర్ ముద్ర
5. జవెల్లరీ ఐడెంటిఫికేషన్ మార్క్
నగలు ఆర్డర్ ఇచ్చి చేసుకునేటపుడు వాడే సూత్రం
24.కె గోల్డ్ బరువు x 1000 (డివైడెడ్ బై )
/ (24.కె గోల్డ్ బరువు) + (24.కె గోల్డ్ బరువు) x 0. 091)
= 916
ఉదాహరణకి 30 గ్రామ్స్ 2. 73 అల్లోయ్ కలపాల్సి ఉంటుంది
మొత్తం బరువు 32. 73 వస్తుంది (22. కె 916 గోల్డ్ )
మామూలుగా నగ నాణ్యతని టెస్ట్ చేయడానికి గీటురాయి టెస్ట్ ఉపయోగిస్తారు
సాంప్రదాయ పద్దతిలో చేసిన నగ నాణ్యతని టెస్ట్ చేయడానికి ఆసిడ్ టెస్ట్ ఉపయోగిస్తారు
కేడీఎం పద్దతిలో చేసిన నగ నాణ్యతని టెస్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్ మెషిన్ టెస్ట్ ఉపయోగిస్తారు
నగలని తూచడానికి వెయింగ్ మెషిన్ లు , క్యారెట్ వెయింగ్ మెషిన్ ఉంటాయి
916 ప్యూరిటీ గోల్డ్ కి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS ) హాల్ మార్కు ఇస్తారు
డైమండ్ నగలకు సాధారణంగా 916 కె స్వచ్ఛత ఉండదు - 18కె ఉండే అవకాశం ఉంది
అమెరికాలో పసిడి నిల్వల వాటా 79% (8133. టన్నులు ) అయితే చైనాలో 1948. 3 టన్నులు.
1వ స్తానం = అమెరికా,
2వ స్తానం = జర్మనీ,
3వ స్తానం = ఇటలీ,
4వ స్తానం = ఫ్రాన్స్
5వ స్తానం = రష్యా,
6వ స్తానం = చైనా,
7వ స్తానం = స్విట్జర్లాండ్
8వ స్తానం = జపాన్,
9వ స్తానం = భారత్,