మొత్తం పేజీ వీక్షణలు

2, సెప్టెంబర్ 2020, బుధవారం

బంగారం - భారతీయుల నమ్మకాలు........

బంగారం - భారతీయుల నమ్మకాలు !

బంగారం  ఎప్పుడు ధరించాలి ?

బంగారం  ఆసక్తికర సంగతులు 

బంగారం  లాభనష్టాలు - సంప్రదాయాలు 


పుత్తడి నగలు నాభికి పైస్థానంలో ఉండాలి గాని నీచ స్థానంలో ఉండకూడదంటారు . అందు చేతనే చాలామంది కాలికి బంగారు ఆభరణాలని వాడరు 

గురువారం పుష్యమీ నక్షత్రం (గురు పుష్యామృత యోగం) వచ్చే రోజున బంగారం కొంటె మంచిది 

శుక్రవారం పూర్వాషాఢ లేదా పూర్వ ఫల్గుణీ నక్షత్రం వచ్చే రోజున బంగారం కొంటె మంచిది 

గురు హోరా, శుక్ర హోరా లలో కొంటె మంచిది. 

మిథున, మీనా, తులా, ధనుర్ వంటి లగ్నాలలో కొంటె మంచిది 

శని, అది వారాలు మంచివి కావు 

సోమవారం, బుధ, గురు, శుక్ర  వారలు మంచివి 

మంగళవారం  (కుజవారం ) కొంటె అమ్మడం కష్టతరం 

సుభ్రమణ్య స్వామి పుట్టుకకు ముందు బంగారం పుట్టిందని అంటారు కొందరు 

సుభ్రమణ్య స్వామి ప్రతిమ ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిదంటారు 

బంగారాన్ని తీసుకునేటపుడు కుడిచేత్తో తీసుకోవాలి 

శుక్రవారం నాడు బంగారాన్ని వొంటిమీదినుండి తీయకూడదు 

బంగారాన్ని ఆగ్నేయ మూలన పెట్టరాదు 

అసుర సంధ్య వేళలో బంగారాన్ని కొనరాదు 

అసుర సంధ్య వేళలో బంగారాన్ని వొంటిమీదినుండి తీయకూడదు 

రాత్రివేళల్లో బంగారాన్ని ఎవరికీ అరువు లేదా కానుకగా ఇవ్వరాదు 

బంగారాన్ని మంచపైన గాని  నేలపైన గాని ఉంచరాదు 

బంగారాన్ని   చీపురుకు గానీ మసిగుడ్డకు తాకించరాదు 

చాపని నేలపై పరచి దాని మీద పుత్తడిని ఉంచాలి 

మీ జన్మ నక్షత్రం కలిసిన రోజున స్వర్ణాన్ని కొనరాదు 

మీ జన్మ నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం కలిసిన రోజున (సంపత్తార) స్వర్ణాన్ని కొంటె మంచిది 

బుధ, గురు, శుక్ర వారాల్లో మాత్రమే స్వర్ణాభరణాలని ధరిస్తే మంచిది 

బంగారాన్ని కొన్న వెంటనే ఆవుపాలతో ముంచి తీస్తే మంచిది 

వనితలు శుక్రవారం నాడు ఆవుపాలతో ముంచిన స్వర్ణాభరణాలని ధరిస్తే మంచిది 

అరటి చెట్టు వద్ద లక్ష్మి నారాయణుల ప్రతిమను, బాధాము ఆకుని ఉంచి దానిపై నగని ఉంచి దీపారాధన చేస్తే మంచిది 

వనితలు ఆభరణాలు తీసేటప్పుడు ముందుగా చెవులవి తీశాకే చేతులవి తీయాలి 

బంగారు గాజులు  ఉన్నవారు తప్పకుండ మట్టి గాజులని కూడా ధరించాలి 

బంగారాన్ని ఎప్పుడూ కూడా డబ్బులకు దగ్గరలో దాచిపెట్ట కూడదు - 

చిన్న వెండి పెట్టెలో ఉంచి దాచాలి 

బంగారాన్ని తీసేటప్పుడు ముందుగా అరటి ఆకుపైగాని లేదా వెండి పళ్లెంలో గాని ఉంచి దాచిపెట్టాలి 

బంగారాన్ని మగవారు మంగళ గురు వారాల్లో తాకట్టు పెట్టరాదు 

పిల్లల ఒంటిపైనున్న గొలుసుల్ని అది, సోమ వారాల్లో తీయరాదు 

గురు, శుక్ర వారాల్లో మాత్రమే గుళ్లో దేవుళ్ళకి ఆభరణాలని ఇవ్వాలి 

రాగిపాత్రలో నీరు పోసి అందులో బంగారు నగని ఉంచి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే అభీష్ట సిద్ది లభిస్తుంది 

జాతక నవ గ్రహదోషాలు పోవాలంటే జన్మనక్షత్రం రోజున జీవ నదీ తీరంలో  బ్రాహ్మణుడికి బంగారం దానంగా ఇవ్వాలి 

నల్ల గుర్రంకి వాడిన గుర్రపునాడాని లక్ష్మి పాదాల  చెంత నుంచి నాడాకి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి, పూలతో పూజించి  గుమ్మానికి కడితే ఆ ఇంట్లో బంగారం వృద్ధి పొందుతుంది 

మంగళ , శుక్ర వారాల్లో 21 గురువింద గింజల్ని ఎర్రటి బట్టలో కట్టి ఈశాన్యమూలన ఉంచి పచ్చని పూలతో  పూజించి  నైవేద్యం పెట్టి ఆమూటని బీరువాలో, గళ్ళ పెట్టెలో  పెడితే ఇంట్లోకి బంగారం, సంపద ప్రవేశిస్తాయి 

మగవారికి కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే  కష్టాలు వస్తాయని నమ్ముతారు 

దొరికినట్లు కల వస్తే సమోటా తరిగిపోతుందని భావిస్తారు 

ధరించినట్లు కల వస్తే అది రోగానికి సూచనగా భావిస్తారు 

బంగారు పట్టీలు (పాయల్) వేసుకున్నట్లు కల వస్తే అవమానం, నిందలు పడే దానికి  సూచికగా భావిస్తారు 

ఆడవారికి కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే  కష్టాలు వస్తాయని నమ్ముతారు 

దొరికినట్లు కల వస్తే మంచి లాభం కలుగుతుందని నమ్ముతారు 

ధరించినట్లు కల వస్తే అది సుఖానికి, లాభముకు సంతాన ప్రాప్తికి సూచనగా భావిస్తారు 

బంగారు పట్టీలు (పాయల్) వేసుకున్నట్లు కల వస్తే ధనప్రాప్తికి సూచికగా భావిస్తారు 

బంగారం అనేది గురుడికి సంబంధించిన లోహం - ఈ లోహాన్ని ధరించే వారికి గురుబలం అధికంగా ఉంటుంది 

ఆభరణాలలో దుద్దులు, ముక్కు పుడకలు, మాటీలు, లోలకులు, హారాలు, గాజులు, కమ్మలు, వంకులు, చంప స్వరాలు, ఉంగరాలు, అరవంకి, నెక్లెస్, వడ్డాణం, పాపిడి బొట్టు, చైన్, నాగరం , చామంతి పువ్వు, సూర్యుడు, చంద్రుడు, జడ కుచ్చులు  వనితలకు వాడుకలో ఉన్నవి 

మగవారు  సైతం దండె కడియాలు, సింహ తలాటాలు, చెవి కుండలాలు (మకర కుండలాలు), గండ పెండేరాలు, బంగారు మొలత్రాడు, సువర్ణ యజ్నోపవీతం,  ఉంగరాలు, కిరీటాలు, కలికితురాయి ... మున్నగు ఆభరణాలను ధరించేవారు 

పెళ్లిళ్లలో వధువుకు ముక్కుపుడక, అడ్డబాస, నత్తు వంటి వాటిని పెట్టనిదే కన్యాదాన ఫలితం ఉండదని చెబుతారు

ముక్కుపుడక వనితలనుండి వెలువడే చెడు వాయువులని శుద్ధి చేసి వరుడికి ఆయుక్షీణత నుండి రక్షిస్తుందని చెబుతారు 

చెవి కుండలాలు, దుద్దులు ధరించడం వల్ల చెవిలో ఉండే జ్ఞాన నాడులు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది 

పూర్వీకులు గ్రహాల అనుగ్రహం కోసం , ఆరోగ్యం కోసం నగలను ధరించేవారు

ఆదివారం మొదలు శనివారం వరకు రోజుకు ఒక్కో రకమైన ఆభరణాలని ధరించేవారు  - అవే ఏడువారాల నగలు 

కంఠ హారాలు, గాజులు, కమ్మలు, పాపిట బిళ్ళ, ముక్కు పిడకలు, వంకీలు, ఉంగరాలు వంటి ఏడువారాల నగలని వేసుకునేవారు 

ఆదివారం రోజున (సూర్యుడు) కెంపులతో చేసిన నగలను ధరిస్తే మంచిది 

సోమవారం (చంద్రుడు) రోజున ముత్యాల ఆభరణాలని ధరిస్తే మంచిది 

మంగళవారం రోజున (కుజుడు) పగడపు నగలను ధరించాలి 

బుదవారం రోజున (బుధుడు) పచ్చలను పొదిగిన నగలను వేసుకోవాలి 

గురువారం రోజున (బృహస్పతి) కనక పుష్యరాగంతో చేసిన వాటిని ధరిస్తే మేలు జరుగుతుంది 

శుక్రవారం నాడు (శుక్రుడు) వజ్రాలని పొదిగిన వాటిని ధరిస్తే మంచిది 

శనివారం రోజున (శని) నీలాలతో పొదిగిన ఆభరణాలు ధరిస్తే మంచిది 

వనితలు నవరత్నాలని కలిగిన నగలను ధరించడం వల్ల శుభం కలుగుతుంది 

ఏడువారాల నగలను ధరించే పద్ధతులకు సంపదలు, ఆరోగ్య సిద్ది కలుగుతాయని విశ్వసిస్తారు 

ఏడువారాల నగలు సంపద, ఆరోగ్యం, వైభవం, తేజస్సు, గ్రహబలం (గురుబలం), ధైర్యం, సాహసం, ఉత్సాహం, ఆకర్షణ  శక్తి, అందం, ఆనందం పెంచి, గ్రహ దోషాలని తొలగించడంలో సహకరిస్తాయి  


19, ఆగస్టు 2020, బుధవారం

బంగారం ఎందుకు విలువైనది ?

బంగారం ఎలా వస్తుంది ?

బంగారం కృత్రిమంగా ఎలా  తయారు చేస్తారు ?

బంగారం ఆసక్తికర సంగతులు 

బంగారు నగలని ఎలా  తయారు చేస్తారు ?

బంగారం నాణ్యతని ఎలా కొలుస్తారు ?

-----------------------------------------------------------------------------------------------------------------------------


ఇది అత్యంత స్థిరమైన లోహం 

రసాయన చర్యల్లో చురుకుదనం తక్కువ 

బంగారం భూమిలో లోతైన గనుల్లో నేరుగా మూలకం రూపంలో లభిస్తుంది 

ఇది ఒక దేశపు ఆర్ధిక స్థితిని నిర్ణయిస్తుంది 

ఎక్కువ బంగారం నిలువలున్న దేశమే సంపన్న దేశంగా చెలామణి అవుతుంది 

పూర్వం కొన్ని రాళ్ళని ఇనుము, సీసం వంటి లోహాలతో తాకిస్తే అవి పుత్తడిగా మారతాయని విశ్వసించేవారు 

పూర్వ కాలంలో లోహాలని బంగారంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసారు. 

కొంతమంది ఇందుకోసం తమ జీవితాలనే పణంగా పెట్టినట్లు తెలుస్తోంది. 

యోగి వేమన కూడా బంగారం తయారీకి ప్రయత్నించాడని చెబుతుంటారు. 

గతంలో రాణులు రాజులూ సైతం ఈ ప్రయత్నానికెంతో ప్రోత్సహించారు కూడా.. 

గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, మెసపటేమియా లో కూడా ఇందుకోసం ప్రయత్నించారు - అనేక పుస్తకాలూ కూడా వ్రాసారు 

ఇంగ్లండ్లో మొదటి ఎలిజబెత్ బంగారం తయారుకి అధికారికంగా ప్రయత్నించి విఫలమైంది 

22వ పొప్ జాన్ కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు 

బంగారం తయారీ పద్ధతులని రహస్యంగా ఉంచి గ్రంథాల్లో కోడ్ భాషలో వ్రాసేవారు 

న్యూక్లియర్ ఫ్యూషన్ పద్ధతిలో లోహాలనుంచి బంగారాన్ని తయారు చేయవచ్చు 

పూర్వం బంగారాన్ని తయారు చేయడానికి ఇనుము, ఆమ్లం- మరొక లోహాన్ని వాడేవారు - ఈ క్రమంలో విషవాయువులు పుట్టి అనారోగ్యానికి గురయ్యేవారు. 

కొలిమినుండి బయటికి తీసిన ముడిసరుకుకి పొటాషియం నైట్రేట్ ని  కలిపేవారు 

రసవాదంలో ఉమ్మెతాకుని తీసుకుని బంగా దంచుకొని అందులో పాదరసాన్ని వేసి బాగా ఆరు గంటలపాటు నూరితే పాదరసం గట్టిపడి బంగారంగా తయారవుతుందని నమ్ముతారు కొందరు.. 

న్యూటన్ కూడా బంగారం తయారీ కోసం ప్రయత్నించాడని వినికిడి 

పరుసవేది అనేది నీచ లోహాలని బంగారు లోహాలుగా మార్చే విద్య 

ఆచార్య నాగార్జునుడు ఆల్కెమి (పరుసవేది) విద్యద్వారా పాదరసం, సీసం లోహాలనుండి బంగారాన్ని తయారు చేసాడని నమ్ముతారు

నాగార్జునుడు వ్రాసిన రస రత్నాకరం , రసేంద్ర మంగళ్ గ్రంధాల్లో స్పర్శవేది విద్యగురించి చెప్పాడంటారు 

బంగారం ఆటామిక్ నెంబర్ 79, మెర్క్యూరీ నెంబర్ 80. 

రూథర్ ఫర్డ్ ఒక మూలకాన్ని వేరొక మూలకంగా మార్చవచ్చని (మూలకాల కృత్రిమ పరివర్తనం) నిరూపించాడు 

టోకియోలోని ఇంపీరియల్ యూనివర్సిటీ లోని హాంటారో 1924 మార్చిలో అణువిద్యుత్ ఉపయోగించి బంగారాన్ని తయారు చేయడంలో విజయం సాధించాడు 

4 గంటలపాటు 1,50,000 వోల్టుల విద్యుత్తును పారఫిన్  ఆయిల్ డై ఎలక్ట్రిక్ లేయర్ పై పంపి  పాదరసం నుండి 1 ప్రోటాన్ ను తొలగించడం ద్వారా బంగారాన్ని తయారు చేయ గలిగాడు 

రష్యన్ శాస్త్రవేత్తలు 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద రాగిని వేడిచేసి గోల్డ్ గామార్చి  ఒక మూలకం నుండి వేరొక మూలకాన్ని తయారు చేయవచ్చని నిరూపించారు 

నక్షత్రంలో జరిగే కేంద్రక సంలీన చర్య కారణంగా భూమి మీదికి బంగారు ఖనిజం చేరి ఉంటుందని చెబుతారు 

భూమి మీదికి చేరే ఉల్కలు బంగారాన్ని భూమి మీదకి చేరవేసి ఉంటాయని కూడా చెబుతారు 

బంగారం అనేది ఒక కెమికల్ ఎలిమెంట్ 

లాటిన్ పదమైన ఆరం అనే పదం ఈ మూలకానిది 

దీని ఆటామిక్ నెంబర్ 79 (కేంద్రకంలో 79 ప్రొటాన్సు ఉంటాయి)

సూర్యుడు, భూమి, ఏర్పడక ముందే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే పుత్తడి ఏర్పడింది 

గోల్డ్ తయారీకి చాల వేడిమి మరియు ఉష్ణోగ్రత కావాలి 

సూపర్ నోవా (నక్షత్రం పేలినపుడు) జరిగినపుడు లేదా 2 న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకోట్టినపుడు సూర్యుడి మధ్యభాగంలో వేడి కన్నా 6000 రెట్లు విడుదలయినపుడు హైడ్రోజెన్, హీలియం వంటి మూలకాలు కలిసి ఎక్కువ సాంద్రత గల బంగారు మూలకాలు ఏర్పడతాయి 

బంగారు నిల్వలు భూమధ్యబాగంలో మరియు ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతున పేరుకుపోయాయి 

ఒక మెట్రిక్ టన్ను గోల్డ్ మైన్ నుండి కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే లభిస్తుంది 

1660 లో హెన్నింగ్ బ్రాండ్ అనే అల్కమిస్ట్ మనుషుల యూరిన్ లో బంగారం కరిగి ఉందని నమ్మేవాడు - 5,600 యూరిన్ ని సేకరించి వేడిచేస్తే బంగారానికి బదులు భాస్వరం (పాస్పరస్ ) వచ్చినందుకు ఎంతో విచారించాడు 

రోమన్లు, గ్రీకులు, పర్షియన్లు పుత్తడి నాణేలని కరెన్సీగా వాడేవారు 

పీరియాడిక్ టేబుల్ లో ఉన్న అన్ని మూలకాల కన్నా గోల్డ్ కి సాగె గుణం చాలా ఎక్కువ 

1 ఔన్సు  బంగారం = 28 గ్రాముల బంగారం 

1 ఔన్సు బంగారంతో 100 చదరపు అడుగుల పలక  తయారవుతుంది 

1 ఔన్సు బంగారంతో 80 కిలోమీటర్ల పొడవు తీగెని చేయవచ్చు 

బంగారంలో అధికమైన సాగె గుణాన్ని తగ్గించడానికి బంగారంలో జింక్, కాపర్, సిల్వర్, ప్లాటినం వంటి ఇతర లోహాలని కలుపుతారు 

24కే గోల్డ్ = 100% గోల్డ్ 

22కే గోల్డ్ = 91.6% గోల్డ్ 

18కే గోల్డ్ = 75% గోల్డ్ 

14కే గోల్డ్ = 58.3% గోల్డ్ 

12కే గోల్డ్ = 50% గోల్డ్ 

10కే గోల్డ్ = 41.6% గోల్డ్ 

09కే గోల్డ్ = 37.8% గోల్డ్ 

మనకు 75% గోల్డ్ మైనింగ్ ద్వారా వస్తే 25% రీసైక్లింగ్ ద్వారా వస్తుంది 

50% గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుండే వస్తుంది

కర్ణాటక, జార్ఖండ్ లో బంగారు గనులున్నాయి 

ప్రపంచంలోని  దాదాపు 11% (24000 టన్నులు ) బంగారం ఇండియా లో ఉంది 

1925 లో తులం బంగారం రూ.  18/- ఉండేది 

నకిలీ బంగారం ఐరన్ పైరైడ్ తో తయారు చేస్తారు 

శాటిలైట్స్ లోపలి భాగాల్లో గోల్డ్ కోటింగ్ చేస్తారు

కాన్సర్ కి వాడే మందులలో గోల్డ్ ని వాడతారు  

ఇప్పటి వరకు 1,90,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు 

ఇంకా 57,000 టన్నులు మాత్రమే ఉంది 

భూమి మధ్య భాగంలో మాత్రం ఇంకా నిల్వలు ఉన్నాయి 

సముద్రంలో 2,00,00,000 టన్నుల నిల్వలు ఉన్నాయి 

నాసా వారు మన సోలార్ సిస్టం లో ఒక  ఆస్టెరాయిడ్ మీద 2,000 కోట్ల టన్నుల బంగారమున్నట్లు గుర్తించారు 

కంప్యూటర్, సెల్ ఫోన్, ప్రోసెసింగ్ చిప్ లలో వాడుతారు 

24 క్యారెట్ల బంగారాన్ని పై పూతలకు  కానీ నగల తయారీకి కాదు 

1. గోల్డ్ + 1. కాపర్  =  బైనరీ అల్లోయ్ =  రెడ్డీస్ యెల్లో 

1. గోల్డ్ + 1. కాపర్+1. సిల్వర్   = ట్రైనరీ అల్లోయ్ =  యెల్లో 

అతికించే సోల్డర్  పద్దతులను బట్టి నగల తయారీలో సాంప్రదాయ పద్ధతి (సాఫ్ట్ సోల్డర్) , హాల్ మార్క్ పద్ధతి(కారటేజ్), కేడీఎం పద్ధతి (కాడ్మియం సోల్డర్ ) ఉంటాయి 

సాంప్రదాయ పద్ధతి లో బంగారు తరుగుదల ఎక్కువగా ఉంటుంది 

కేడీఎం పద్ధతి లో తరుగుదల ఉండదు .. స్కిన్ టచ్ స్వచ్ఛత,  మీటింగ్ టచ్ స్వచ్ఛత ఒకే లాగున ఉంటుంది - అయితే ఈ అతుకు విధానంలో స్వర్ణకారుడికి కాడ్మియం బస్మం కావడం మూలాన అనారోగ్యం కలుగుతుంది 

హాల్ మార్క్ పద్ధతిలో జింక్ తో అతుకు (8.4%.) ఉంటుంది - స్కిన్ టచ్ స్వచ్ఛత,  మీటింగ్ టచ్ స్వచ్ఛత ఒకే లాగున ఉంటుంది 

పుత్తడి ఆభరణాల పైన 5 ముద్రలు ఉంటాయి 

1 బిస్ స్టాండర్ మార్క్ సింబల్ 

2 ప్యూరిటీ fineness గ్రేడ్ 

3. నగ తయారీ సెంటర్ మార్క్ 

4. నగ తయారీ  ఇయర్ ముద్ర 

5. జవెల్లరీ ఐడెంటిఫికేషన్ మార్క్ 

నగలు ఆర్డర్ ఇచ్చి చేసుకునేటపుడు వాడే సూత్రం 

24.కె గోల్డ్ బరువు x 1000 (డివైడెడ్ బై )

/ (24.కె గోల్డ్ బరువు) + (24.కె గోల్డ్ బరువు) x 0. 091)

= 916

ఉదాహరణకి 30 గ్రామ్స్ 2. 73 అల్లోయ్ కలపాల్సి ఉంటుంది 

మొత్తం బరువు 32. 73 వస్తుంది (22. కె 916 గోల్డ్ )

మామూలుగా నగ  నాణ్యతని టెస్ట్ చేయడానికి గీటురాయి టెస్ట్ ఉపయోగిస్తారు 

సాంప్రదాయ పద్దతిలో చేసిన నగ  నాణ్యతని టెస్ట్ చేయడానికి ఆసిడ్ టెస్ట్ ఉపయోగిస్తారు 

కేడీఎం పద్దతిలో చేసిన నగ  నాణ్యతని టెస్ట్ చేయడానికి  ఎలక్ట్రానిక్  మెషిన్ టెస్ట్  ఉపయోగిస్తారు  

నగలని తూచడానికి వెయింగ్ మెషిన్ లు , క్యారెట్ వెయింగ్ మెషిన్ ఉంటాయి 

916 ప్యూరిటీ గోల్డ్ కి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS ) హాల్ మార్కు   ఇస్తారు 

డైమండ్ నగలకు సాధారణంగా 916 కె స్వచ్ఛత ఉండదు - 18కె ఉండే అవకాశం ఉంది 

అమెరికాలో పసిడి నిల్వల వాటా 79% (8133. టన్నులు ) అయితే  చైనాలో 1948. 3 టన్నులు. 

1వ స్తానం = అమెరికా, 

2వ స్తానం = జర్మనీ, 

3వ స్తానం = ఇటలీ, 

4వ స్తానం = ఫ్రాన్స్ 

5వ స్తానం = రష్యా, 

6వ స్తానం = చైనా, 

7వ స్తానం = స్విట్జర్లాండ్ 

8వ స్తానం = జపాన్,  

9వ స్తానం = భారత్, 


17, ఆగస్టు 2020, సోమవారం

లేబర్ ఇన్సురెన్సు పాలసీ

లేబర్ ఇన్సురెన్సు పాలసీ వివరాలు

లేబర్ ఇన్సూరెన్సు పథకం అర్హతలు

లేబర్ ఇన్సురెన్సు వల్ల కలిగే ప్రయోజనాలు


రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఓట్లేసిన ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. 

అలాంటి సంక్షేమ పథకాల్లో లేబర్ ఇన్సూరెన్స్ పథకం కూడా ఒకటి. 

ఈ లేబర్ ఇన్సూరెన్స్ పథకం కార్మికుల కోసమే కాకుండా సంవత్సరాదాయం తక్కువ ఉన్నవారందరికి ఉపయోగపడుతుంది 

కూలీలు, కార్మికులు, చిరుద్యోగులు ఈ బీమా పొందొచ్చు. 

ప్రభుత్వ ఉద్యోగులు తప్ప తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. 

18 నుండి 55 ఏళ్ల వయస్సున్న స్త్రీ , పురుషులు ఇందుకు అర్హులు.

ఈ బీమా పొందాలంటే.. రూ. 110 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఏడాదికి రూ. 22/- చొప్పున 5 సంవత్సరాలకి ఒకేసారి చెల్లించాలి. 

ఐదేళ్ల వరకూ బీమా ఉంటుంది 

ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకోవచ్చు. 

రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ , బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ వస్తుంది. 

ప్రమాదవశాత్తూ మరనిస్తే రూ.6,00000/- బీమా సొమ్ము వస్తుంది. 

ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ ఇస్తారు.

రెండు ప్రసవాల వరకు రూ.  30,000/-రూ చొప్పున వచ్చే అవకాశం ఉంది.

ఏడాది పాలసీ తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, 100% వికలాంగులైతే 5 లక్షల పరిహారం ఉంటుంది. 

పూర్తి  వివరాలు మండల కార్మిక అధికారి / ఎంపీడీవో / ఎమ్మార్వోల వద్ద లభిస్తాయి