మొత్తం పేజీ వీక్షణలు

2, అక్టోబర్ 2012, మంగళవారం

తేనెల తేటల మాటలు

తెలుగు అణిముత్యాలు


మనుష్యుల ప్రకృతి ఒకటే. వారి అలవాట్లే భిన్నమైనవి.  

పరీక్షించుకో ఆత్మ విమర్శ  చేసుకో!  గొప్ప మనిషి ఏ అభిప్రాయం మీద తన మనస్సు లగ్నం చెయ్యడు. ఏ అభిప్రాయాన్ని వ్యతిరేకించడు.  

ఆలోచనలేని అభ్యాసం కష్టాన్ని వృధా చేసుకోవడమే.  నేర్పులేని ఆలోచన గాలిలో తేలుతుంది. ఆలోచన లేకుండా నేర్చుకోవడం నష్టదాయకం.  

భవిష్యత్తు గురించి ఆలోచించి పథక రచన చేయువాని  ఇంటి ముందే సమస్యలు ప్రత్యక్షమవుతాయి.  

శిక్షణలో వర్గ విభజన మంచిది కాదు.  

నీ ఇంటిముందు మెట్లు అపరిశుభ్రంగా వుంచుకొని నీ ప్రక్కింటి పైకప్పుపై మంచు వున్నదని పిర్యాదు చేయకు.

కుటుంబాలు నిజాయితీగా వుంటే ఆ జాతి బలంగా వుంటుంది.  

జాగ్రత్తపరులు తప్పులు చెయ్యడం అరుదు.  
ఇతరులు నీకు ఏది చెప్పనవసరం లేదని అనుకుంటున్నారో నువ్వు అదే పని ఇతరులకు చెయ్యకు.  

సరిగ్గా నిర్వహించటం చేతకానివాడు బాధపడటం తప్పదు.  

సత్యాన్వేషి అయిన పండితుడు తన ఆహార్యాన్ని, ఆహారాన్ని గురించి సిగ్గుపడితే సంభాసించడానికి అతడర్హుడు  కాడు.  

అధికుడైన మనిషి మంచేదో అర్ధం చేసుకుంటాడు. అధముడు ఏది అమ్ముడవుతుందో నేర్చుకుంటాడు.  

శత్రువులోని మంచిని, మిత్రుడిలోని చెడును సమదృష్టితో చూడగలిగినవాడు  మహాత్ముడు.  మాటల యొక్క శక్తి తెలియనివాడికి మనిషి గురించి ఏమి తెలియదు.  

జీవితమంటే తెలియదు మరి మృత్యువు ఎలా తెలుస్తుంది.  నీతో సమానం కానివారితో స్నేహం చేయకు.  

యువకులను గౌరవించాలి. అతని భవిష్యత్తు మనకు సమానం అవుతుందని నువ్వెందుకు ఆలోచించావు. 


తగిలిన దెబ్బలనైనా మర్చిపోవచ్చు కాని పొందిన మేలునెప్పుడు మర్చి పోకూడదు.  

ప్రతి వస్తువులోనూ ప్రత్యేక సౌందర్యం ఉంటుంది. అయితే అందరు దానిని చూడలేరు.  


అజ్ఞానం మనస్సుకు  రాత్రి వంటిది. ఆ రాత్రిలో మనం అంధుల కన్నా అధములం. 

సత్యం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, సత్యాన్ని కనుగోన్నవాడే గొప్పవాడు.  ఉత్తమ మానవుని లక్ష్యం సత్యం.  

శిక్షణ లేని జనాలను యుద్ధానికి పంపడమంటే వాళ్ళను విసిరి వేసినట్లే. 

స్వర్గమంటే దేవునితో సంపర్కమే.  ఇష్టమైన పనిని ఎంత చేస్తున్నా అలసట తెలియదు.  

ప్రపంచములో నీకు వేరే శత్రువులు కానీ,మిత్రులు కానీ ఉండరు. 

నీ నడవడికయే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. 


ఏది తర్కమో అదే చెపుతాడు వివేకి, ఏది అధర్మమో అదే చెపుతాడు అల్పుడు.

తప్పును సరిదిద్దుకోక పోవడమంటే  మరో తప్పు చేసినట్లే. 

అవసరాలను తీర్చమని అడగని ప్రేమ ఉందా? పొదుపు చేయకుంటే వ్యధ తప్పదు.  సుదూరంలో ఏమవుతుందో ఆలోచించుకుంటే, 

నీ దగ్గరలోనే బాధలు ఉంటాయి.  పేరు సరిగా కాకుంటే భాష ఆ వస్తువుతో సరిగా అనుసానిందించపబడినట్లు కాదు. 

గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు, గ్రంథాలయాల్లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు.  

ఏ రోజు మన ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మనం వృథా చేసిన్నట్లే.  

మందు కొడితే మీలో నిజమైన మనిషి బయటికి వస్తాడు.  

నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే, ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి.

మనిషిలో ఎదుగుదల రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సిద్దమైనది.. ఇంకొకటి ప్రయత్నంతో జరిగేది. 

యుద్ధం న్యాయాన్ని , ధర్మాన్ని, సుఖసంతోషాలను ఆఖరికి మనిషిలోని  దైవత్వాన్ని కూడా చంపేస్తుంది. 

సాహసం అనే నిచ్చెన పై నుంచే మానవ ప్రయత్నాలన్నీ శిఖరాగ్రాన్ని చేరుకుంటాయి.

జీవితంలోని ఏ సమస్యా మనం పరిష్కరించుకోలేనంత కష్టమైనది కాదు. 

మనుషులు విజయాలను మాత్రమే ఇష్టపడతారు. మరైతే విజేతలను ద్వేషిస్తారెదుకో? మనలోని గొప్పదనం అనేది మనకి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంటుంది.

ఎదుటివారి  ఆత్మగౌవరవాన్ని , అభిమానాన్ని  కించపరచనంత  కాలం  నీవు  మంచివాదివి గానే చెలామణి అవుతావు. 

మీరు మీ కాలాన్ని, డబ్బుని, ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని పరాన్నభుక్కులైన మిత్రుల తేనె మాటల కోసం, స్తుతుల కోసం త్యాగం చేయకండి.

శత్రువును క్షమించు. అది అతనికి అంతకంటే బాధాకర విషయం మరొకటి వుండదు. 

ఎప్పటికప్పుడు నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.... ఇక ఆ తప్పు పునరావృతం కారాదు. 
మనుషుల మనసుల్ని పాలించే కళ ఉపన్యాసం.

సుఖ సంతోషాలు వికసించిన సుమాలు. వాటి తీపి జ్ఞాపకాలు ఎన్నటికి వాడిపోని సుమగంధాలు.

కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువుల కన్నా బరువైనవి.  అవి ఎక్కువైతే పయనం కష్టమే కదా !

అగచాట్లే  వద్దనుకుంటే ఆశలనన్నిటిని  గంగలో కలిపేయి! 

స్వార్ధంతో  నిండిన  ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం  కలిగిస్తుంది. 

ఆశావాదికి ప్రతిరోజు, ప్రతి గంటా, ప్రతి క్షనం అవకాశాలని ఆరబెడతాయి. 

జీవితంలో మీరు వేసే ప్రతి అడుగూ ఓ కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది. 

ఆత్మీయులు ఆకాశంలోని నక్షత్రాల్లాంటి వాళ్ళు.

నువ్వెంత  విజ్ఞానం  సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే అదంతా నిష్ప్రయోజనం. 


చెలిమిని మించిన కలిమి లేదు, తృప్తిని మించిన బలిమి లేదు.

ఈ ప్రపంచం, జీవాత్మ, భగవంతుడు అన్నీ ఆత్మ లోని విభిన్న దృశ్యాలు. 

ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేడమే గొప్ప విజయ రహస్యం.

కదలిక లేకుండా  గుండె బతకదు. అలజడి లేకుండా సముద్రం పలుకదు. రాపిడి లేకుంటే వజ్రం మెరవదు. ప్రతి మనిషికి కృషి ఎంతైనా అవసరం. 

మీ ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే! మీ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగా ఉండి  తీరాలి.

నీలో ఎన్ని లోపాలున్నా ఇప్పటికి, ఎప్పటికి  నిన్ను అమితంగా ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే.

అవరోధాలుగా కనిపించేవన్నీ సమర్ధులకు చక్కని అవకాశాలుగా కనిపిస్తాయి.

వేధనతో నిరాశ చెందిన ప్రేమకు, స్నేహం అనేది ఉపశమనం కలిగించే చక్కని ఔషధం.

వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే  నిజమైన కళ.

ఎదురవుతున్న పరిస్థితులను బట్టే వ్యక్తిత్వంలోని లోతులు బయట పడుతుంటాయి!

మీరు కనే కలలనేవి... రేపటి మీ ప్రశ్నలకు నేటి సమాధానాలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి