మొత్తం పేజీ వీక్షణలు

3, అక్టోబర్ 2012, బుధవారం

సూక్తి సుధారవలి

నిజ జీవిత సత్యాలు
సుభాసితాలు
ప్రాయోజిత ప్రవచనాలు


బాధ్యతలను విస్మరించనంత వరకు జీవితం పరిపూర్ణతను సాధించుకుంటూనే వుంటుంది.

మన కలలని ధైర్యంగా కన్నప్పుడే వాటిని నిజం చేసుకోగల ధైర్యం సిద్దిస్తుంది. 

మీ ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి. వాటి వ్యక్తీకరణ మాత్రం అత్యంత తేలికగా, అందరికీ అర్ధమయ్యేలా ఉండాలి.

అసలు డబ్బు అనేదే లేకపోతే  నీకు ఒక్కటే బాధ! మరి డబ్బుంటే దానితో వచ్చే బాధలు కోకొల్లలు.

కడుపు నింపే ఒక పని మంచిని చెప్పే వేయి మాటలతో సరిసమానము

ఆణి ముత్యాల్లంటి మంచి మాటలు ఎంతో విలువైనవి - అందుచే వాటిని వ్యర్ధంగా పాడు చెయ్యరాదు. 

కళ్ళు లేని గుడ్డివాళ్ళు నిన్ను చూడగలరు. నీవు వారికి చేయూతనిస్తే! 

ధనవంతుదు  పేదవాన్ని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.

పిరికివాళ్ళు చావుకి భయపడరు. వాళ్ళు ఇదివరకే దాన్ని అనుభవించి వుంటారు.

మానవత్వాన్ని మించిన గొప్ప సిద్ధాంతం ఈ భూమి మీద మరొకటి లేదు.

ప్రేమించటానికి హృదయం ఉంటే  ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండి తీరాలి !

ధైర్యసాహసాలు  గలవాళ్ళు జీవితంలో కడసారి ఒకే ఒక్కసారే చావును చూస్తారు. 

లోకమంతా నిన్నొదిలి పోతున్నప్పుడు అదేమీ పట్టకుండా నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.

సామన్యుని కోసం బ్రతకండి ! సంతృఫ్తి కోసం కాదు.  

అభివృద్ధిని ఎంతగా కోరుకుంటామో సంక్షేమము అన్నది అంతకన్నా ముఖ్యమైనది. 

అందరినీ సమంగా ప్రేమించు, అయితే గుడ్డిగా అందర్నీనమ్మకు. ఎవరికీ  పొరపాటున హాని తలపెట్టకు.

డబ్బుతో కొనలేని ఎన్నో వస్తువులను పోగొట్టు కోవడం సరి కాదు.

రాజకీయ నాయకులు ప్రజలని తడిగుడ్డతో గొంతు కోయగల తెలివి గలవారు.

వివేక శూన్యుడైన మిత్రుడు ఉన్నను నీకోరిగేదేమిలేదు.

ఎప్పుడయితే  మనం అదృష్ట దేవతను అందలమెక్కిస్తామో అదప్పుడు మన  మనను ఎక్కువగా దభాయించి మరీ చూస్తుంది.

మన జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే  అందరికీ అసలైన పండుగ రోజు. 

దేశంలో నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ సామాజిక ధర్మం.

ఈ లోకంలో దేనికి లేని ఒక గొప్ప శక్తి మంచి మాటకుంటుంది. 

మీ ఆలోచనలను, చర్యలను మార్చుకోగలిగితే మీ తలరాత  అదే మారుతుంది.

మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం మీ టాలెంట్ !

పనిని సాధించడానికి సాధనలపై గురి కుదరాల్సిందే. 

శక్తితో, బలంతో, ధైర్యంతో, భాద్యతతో జీవితంలో పోరాడడం నేర్చుకో! నీ విధికి నీవే విధాతవని తెలుసుకో.

దేనికీ వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

మీలో ఆత్మవిశ్వాసం సడలితే ఇక మీ ఓటమి ప్రారంభమైనట్లే.

మీ స్నేహితుడు మీలో  మీకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూపించగలడు. 

వాదనలు ఎందుకూ పనికిరానివి. అవి నిష్ప్రయోజనమైనవి. వాటికీ దూరంగా ఉండండి.
అనాగరికంగా ఉండే కన్నా మంచిగా ఉండటం మంచిది.

మీరు ఎవరికీ తక్కువ కాదు. ఎవరికి వారు గొప్పవారిగా, సెలెబ్రిటీగా భావించుకోవడం చాలా ముఖ్యం. 

మీ ఆలోచనలు, మీ మాటలు , మీ చేతల మధ్య ఖచ్చితంగా  పొంతన వుంటేనే ఫలితం  మీరు  కోరేలా వస్తుంది.

అధికారంలో ఉన్నవారికి పక్కవారి మాటలు  చెవిన పట్టవు. 

వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానములోనే జీవిస్తాడు. 

సోమరితనం మాననిగాయం లాంటిది.

మనమంతా ఇతరుల తప్పులను ఎత్తి చూపడంలోను , విమర్శించడంలో ఎంతో నిష్ణాతులం.

భయానికి అబద్ధమే గిట్టుబాటు అవుతుంది. 

ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్చతను బట్టి ఉంటుంది. 

ఆవేశంతో మనిషినికి అవస్థ తప్పదు . తప్పుదారి పట్టిస్తుంది.

మీలో ఎవరూ మరొకరి కష్టార్జితాన్ని మీదిగా చేసుకోవడం ద్వారా మనుగడ సాగించకండి. 

చక్కగా జీవించడం అన్నింటికంటే ఓ గొప్ప కళ.

ఊహాశక్తి కొరవడిన ప్రణాళికలు  సరైన ఫలితాలు ఇవ్వలేవు.

నీ జీవితం ఎంత చిన్నదైనా ఆదర్శానికి, మర్యాదకు ఎప్పుడూ సమయం మిగిలే ఉంటుంది. 

ఒక అబద్ధం వల్ల ఒకరి ప్రాణం రక్షించబడితే అది పుణ్యమే అవుతుంది. 

మీ ఆలోచనల కల్లోలాన్ని క్రమంగా నిరోధించడమే యోగ.

స్వార్ధ చింతన లేనప్పుడే మనం ఎన్ని ఘనకార్యాలయినా సాధిస్తాం.

కళ్లకి రెప్పలు కావాలి. పనికి విశ్రాంతి కావాలి. మనుగడకు తోడుకావాలి. 

పొగిడే వాళ్ళతో సుఖంగా జీవించేకంటే సద్విమర్శ  చేసేవాళ్ళతో కష్టంగా ఉండటం మిన్న.     

ప్రకృతి ఓ కర్మాగారం , సరైన పనిని  కోరడం మన హక్కు.

ప్రారంభించిన పనికి  సరికొత్త ముగింపు ఇవ్వడానికి వర్తమానం అవకాశం కల్పిస్తుంది.

నేను అన్న తలంపు ఎక్కడ ముగిసిపోతుందో అక్కడ ఆత్మ మొదలవుతుంది.

క్రమశిక్షణ నీకు  తోడుగా ఉంటే  ఇంకే రక్షణ నీకు అవసరం లేదు.

నిరంతరం శ్రమించేవాణ్ని  చూసి ఓటమి భయపడుతుంది.

దేవుడు సత్యమని భావిస్తే  మన జీవితం దాని నీడలాంటిది.

ధైర్యం ఒక అడుగు ముందుకు జరిగితే  విజయం పది అడుగులు ముందుకు జరుగుతుంది.

నువ్వు పుట్టిన తరువాత ఏం చేసావన్న దాంట్లో సెలెబ్రేషన్ ఉండాలి.

మన ఆత్మకు జ్ఞానమే సరైన ఆహారం లాంటిది. 

ఏ  పని జరగాలన్న చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు అత్యంత ఆవశ్యకం

మనసులో అనుకున్నదానికి, ప్రాక్టికల్ గా రావడానికి మధ్యవున్న రేఖ చాలా బలమైనది.

కడదాకా మీకు తోడుగా సహచర్యాన్ని నిర్వర్తించేది ఈ ప్రపంచంలో  మీ  భార్య మాత్రమే. ఆవిడని కాపాడుకునే ప్రయత్నం చేయండి. 

కాలాన్ని పొదుపు చేయగలిగితే అది సద్వినియోగం అయినట్లే !

భగవంతుడు  ఉన్నాడంటే అది నీలోనే... లేదంటే నీవు కూడా లేనట్లే !

నిజమైన స్నేహం అపూర్వమైనది కాగలిగితే నిజమైన ప్రేమ అరుదైన దవుతుంది.

వాదన మాని చర్చకు రండి.  అది  విజ్ఞానాన్ని పెంచుతుంది.

ఒక  విషయం గురించి పూర్తిగా తెలిసి నప్పుడు మాత్రమె పెదవి విప్పడం మంచిది. 

సంతృప్తి వంతెన విరిగిపోయిందంటే జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు లేనట్లే!

వర్తమానంలో  జీవించ లేనివారు  మరే క్కడా జీవించలేరు.

పాత విషయాలను ఇకపై పట్టించుకోవడం వృథా. పూర్తిచేయాల్సిన పనుల మీద దృష్టి పెడితేనే విజయం నీకు వరం. 

దేనికైనా సమయం మించిపోకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. 

విద్య, జ్ఞానం అనేవి  ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే వాటికి ఎక్కువ విలువ.

క్రియాశీలత, నైపుణ్యం కొరవడితే ఏదీ సాధించలేము.

అపజయం కలిగిందని నిరాశపడకు. అపజయం తుది మెట్టు కాదు. విజయమే జీవితం కాదు.

చెడును  తలచేవారు, కీడును  తలపెట్టేవారు వెలుగును చూడలేని గ్రుడ్డివారు.

విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

బాద్యతల నుండి తప్పుకోవడం వల్ల నీ ఉనికి ప్రశ్నార్ధక మవుతుంది. 

మీ అనుభవాల క్రమమే మీ జీవితం. ఆ అనుభవమే మీకు మంచి గురువు.

శ్రమ దారి ఎదగడానికి ఉపయోగపడే మెట్లలాంటిదైతే, అదృష్టం లిఫ్ట్ లాంటిది. లిఫ్ట్ ఒక్కోసారి పనిచేయకపోవచ్చు, దాన్ని నమ్మితే మరి ఇబ్బందే కదా! 

ఆరోగ్యమనేది గొప్ప బహుమతి. సంతృప్తి అనేది విలువైన గొప్ప సంపద. నమ్మకం అనేది ఓ గొప్ప సంబంధం.

ఎదురుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో గలిగితే అదృష్టం అదే కలిసొస్తుంది.

మతం సిద్ధంతాలలోనూ లేదు. రాద్ధాంతాలలోనూ, ప్రజ్ఞావాదాలలోనూ లేదు. మతం అంటే మన స్థితికి మరో రూపమే! మన పరిణతే మన మతం. 

ఓర్పు గనక అలవడితే  అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యగలం.

మనిషిని మించిన సజీవ కావ్యం వేరొకటి కలదా?

ఆకాశమంత  శాస్త్రజ్ఞానం కన్నా  ఇసుమంత అనుభవం ఎంతో గొప్పది.

మీ మనసును ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు జీవితంలో నేర్చుకోవాలి.

స్త్రీకి ఇల్లే లోకమయితే  భర్తకి లోకమంతా ఇల్లు కావాలి. ప్రజలంతా తన వాల్లే అవాలి. 

ఒక్కోక్కటిగా పడే చుక్కలతో కడవ నిండిపోయినట్లు ధర్మమైనా, ధనమైనా కొంచెం, కొంచెంగా సేకరించుకుంటూపోతే  చివరికి ఓ విశాలమైన సంగ్రహం అవుతుంది. 

ఇతరుల నిమిత్తం జీవించే వారు శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు. 

ఆత్మ బలంలో మీ బతుకుంది, బలహీనతలోనే  మీ చావుంది. 

నువ్వు స్వార్ధరహితుడవైతేనే  పరిపూర్ణుడవు కాగలుగు తావు.

క్రమానుగతమైన వికాస ఫలితమే సంప్రదాయం.

ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి ఎదుటివారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం.

కోపం మన శక్తిని హరిస్తుంది. మన శత్రువుని బలవంతుడిని చేస్తుంది.

చెప్పదలచినది తక్కువ మాటల్లో చెప్పు,లేకుంటే  పాఠకుడు  కొన్నింటిని వదిలివేస్తాడు. 

ప్రతి ఒక్కరి జీవితాలలోనూ సంతోషభరిత క్షణాలుంటాయి.దుఃఖపూరిత ఘడియలు ఉంటాయి. అయితే నువ్వు వేటిని గుర్తుంచుకున్నావన్నదానిమీదే నీ సంతోషం ఆధారపడి ఉంటుంది.

ఆచారమనే మట్టి దేవతను బ్రద్దలుకొట్టి, నూతన సత్యములను, నూతన ధర్మములను స్వీకరించినపుడే ఏ జాతి అయినా అభివృద్ధి చెందుతుంది.

అత్యంత అందమైనది నిశ్శబ్ద ప్రపంచం.

జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు,బంటూ చేరేది ఒక పెట్టెలోకే.

ఇష్టం లేని పని చెయ్యడం కన్నా వదిలివేయడమే మనసుకు సంతృప్తినిస్తుంది.

ఎదురయ్యే  ప్రతిదాన్ని మార్చలేము కాని అది ఎదురవ్వనంత వరకు ఏదీ మార్చలేము.

చిన్న చిన్న నేరాలను ఉపేక్షిస్తే అవి పెద్ద ఘోరాలకు దారి తీస్తాయి.

సాధారణంగా ధైర్యాన్ని గురించి మాట్లాడే వారు పిరికి వాళ్లుగాను, గౌరవాన్ని  గురించి మాట్లాడే వాళ్ళు దుర్మార్గులుగాను వుంటారు.

మనుషులు నువ్వు చెప్పేదాన్ని నమ్మకపోవచ్చు, కానీ నువ్వు చేసేదాన్ని మటుకు తప్పక నమ్ముతారు.

దుఃఖపడువారు ఎంతో ధన్యులు వారు ఓదార్చబడుదురు.

పొరపాట్లను గమనించు.కాని బాధపడకు,వాటిని నీ ఆస్తిగా పరిగణించి  దాచుకో.

అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక.

ఎదుటివాళ్లు మనం చెప్పిన విషయాన్ని మర్చిపోతారు.మనం వాళ్లకు చేసిన పనులను మర్చిపోతారు.కానీ మనం వారికి పంచిన అనుభూతుల్ని మాత్రం ఎప్పటికి మర్చిపోలేరు.

జనరంజకత్వం సద్గుణానికి  కొలబద్దం కాదు.

గొప్పగా ఆలోచించేవాళ్లకు   జీవితం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

శత్రువుని స్నేహితునిగా చేసుకోగలిగిన మానవుడే వీరుడు.

నిజమైన సంపూర్ణమైన దుఃఖం  లేనట్లే, నిష్కల్మమైన సంపూర్ణమైన ఆనందము వుండదు.

అనుభవంలోకి వస్తే కాని ఏదైనా నిజం కాదు. అనుభావపూర్వం కాని సూక్తి సూక్తి కాదు.

ఊహల్ని,గొప్ప అనుభూతుల్ని సంగీతమైన మాటల్లో వర్ణించడమే కవిత్వం.

చెడును ఉపేక్షించడం అంటే మంచిని నిర్లక్ష్యం చేయడమే. 

అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు  తడుతుందని  అంటారు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు. స్వంతం చేసుకో.

సృజనాత్మకత అంటే వైవిధ్యంగా చేయడం కాదు. చేసే పనిలో వైవిధ్యం చూపించడం!

ప్రజల హృదయమందు విజ్ఞానం లేకుండా, వికాసం సాధ్యం కాదు.
తప్పుల అడుగున ఎప్పుడు అహం వుంటుంది.

మనం ఓటమికి సిద్ధంగా లేనంతవరకు మనల్ని ఓడించడం ఎవరి తరం కాదు.

కొంచెం సేపు నవ్వనివ్వండి, బాధపడటానికి ఎంతో సమయం మిగులుతుంది.

చరిత్రకారులు చెవిటివారు. ఎవ్వరు అడగని ప్రశ్నలకు జవాబులు చెపుతారు.

చట్టాలను పటిష్టంగా అమలు చేసే వ్యవస్థలు బలంగా లేకపోతే అవినీతిని అడ్డుకోవడం అసాధ్యం.

నూతన తలంపులున్న  మనుషులు కష్టపడి నేర్చుకుంటారు. వాళ్లు నూతన జ్ఞానం కోసం అలమటిస్తారు.

చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో .

భవిష్యత్ విపత్తు ఉహకందదు,రాబోయే విజయాన్ని గ్రహించలేము. అందుకే ఆత్మవిశ్వాసమే ఆయుధం.

ప్రపంచాన్ని ఎలా మార్చాలా అని అందరూ తీవ్రంగా ఆలోచించి తలలు పట్టుకోనక్కర్లేదు.ఎవరికి వారు తమని తామూ మార్చుకుంటే చాలు.

నీతి కొరకు ఆకలిదప్పులు  గలవారు ధన్యులు.

కళ ఒక విశ్వజనీనమైన భాష.

నిజమైన ప్రేమ ఎక్కడలేని ధైర్యాన్నిస్తుంది.

ఏ పనినైనా నిష్ఠతో చేస్తే తప్ప, ఆశించిన ఫలితం సాధించలేరు...

నువ్వు గీసుకుంటే తప్ప నీ జీవితంకి హద్దులు ఉండవు.

ఏ పనినైన చేయడానికి మనం భయపడుతున్నామంటే..అది కష్టమైనది కావడం వల్ల కాదు.మనం భయపడుతున్నందు వల్లే అది కష్టంగా అనిపిస్తుందని తెలియకపోవడం వల్ల.

ఇతరులను అర్ధం చేసుకున్నవాడు జ్ఞాని,తనను తాను అర్ధం చేసుకున్నవాడు వివేకి 

గొప్ప పనిలో రాణించాలంటే  తప్పు చేస్తామేమోనన్న భయాన్ని వదులుకోవాలి.

మనిషి గురించి నువ్వు ఆలోచించు,దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు.

ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.

మన ఉద్దేశ్యాలను తక్కువగా వెల్లడిస్తే, వాటిని  నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.

మనం ఏదైనా చేసే ముందు, మనలో ఎంతో కొంత సామర్థ్యం ఉండి తీరాలి.

మన జీవితాల్ని అంచనా వేయాల్సింది నవ్వులతో తప్ప రాల్చిన కన్నీటి చుక్కలతో కాదు.

జీవితమంతా సమస్యలు ఎదురైనా, భయపడకుండా ఎదుర్కోవడమే పరిపక్వత.

నీ నిజాయితీ సూర్యుని వలె పగలు,రాత్రి ప్రకాశించే కాన్తివలె దేవునిపైన ఆధారపడి వుండాలి.

2, అక్టోబర్ 2012, మంగళవారం

తేనెల తేటల మాటలు

తెలుగు అణిముత్యాలు


మనుష్యుల ప్రకృతి ఒకటే. వారి అలవాట్లే భిన్నమైనవి.  

పరీక్షించుకో ఆత్మ విమర్శ  చేసుకో!  గొప్ప మనిషి ఏ అభిప్రాయం మీద తన మనస్సు లగ్నం చెయ్యడు. ఏ అభిప్రాయాన్ని వ్యతిరేకించడు.  

ఆలోచనలేని అభ్యాసం కష్టాన్ని వృధా చేసుకోవడమే.  నేర్పులేని ఆలోచన గాలిలో తేలుతుంది. ఆలోచన లేకుండా నేర్చుకోవడం నష్టదాయకం.  

భవిష్యత్తు గురించి ఆలోచించి పథక రచన చేయువాని  ఇంటి ముందే సమస్యలు ప్రత్యక్షమవుతాయి.  

శిక్షణలో వర్గ విభజన మంచిది కాదు.  

నీ ఇంటిముందు మెట్లు అపరిశుభ్రంగా వుంచుకొని నీ ప్రక్కింటి పైకప్పుపై మంచు వున్నదని పిర్యాదు చేయకు.

కుటుంబాలు నిజాయితీగా వుంటే ఆ జాతి బలంగా వుంటుంది.  

జాగ్రత్తపరులు తప్పులు చెయ్యడం అరుదు.  
ఇతరులు నీకు ఏది చెప్పనవసరం లేదని అనుకుంటున్నారో నువ్వు అదే పని ఇతరులకు చెయ్యకు.  

సరిగ్గా నిర్వహించటం చేతకానివాడు బాధపడటం తప్పదు.  

సత్యాన్వేషి అయిన పండితుడు తన ఆహార్యాన్ని, ఆహారాన్ని గురించి సిగ్గుపడితే సంభాసించడానికి అతడర్హుడు  కాడు.  

అధికుడైన మనిషి మంచేదో అర్ధం చేసుకుంటాడు. అధముడు ఏది అమ్ముడవుతుందో నేర్చుకుంటాడు.  

శత్రువులోని మంచిని, మిత్రుడిలోని చెడును సమదృష్టితో చూడగలిగినవాడు  మహాత్ముడు.  మాటల యొక్క శక్తి తెలియనివాడికి మనిషి గురించి ఏమి తెలియదు.  

జీవితమంటే తెలియదు మరి మృత్యువు ఎలా తెలుస్తుంది.  నీతో సమానం కానివారితో స్నేహం చేయకు.  

యువకులను గౌరవించాలి. అతని భవిష్యత్తు మనకు సమానం అవుతుందని నువ్వెందుకు ఆలోచించావు. 


తగిలిన దెబ్బలనైనా మర్చిపోవచ్చు కాని పొందిన మేలునెప్పుడు మర్చి పోకూడదు.  

ప్రతి వస్తువులోనూ ప్రత్యేక సౌందర్యం ఉంటుంది. అయితే అందరు దానిని చూడలేరు.  


అజ్ఞానం మనస్సుకు  రాత్రి వంటిది. ఆ రాత్రిలో మనం అంధుల కన్నా అధములం. 

సత్యం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, సత్యాన్ని కనుగోన్నవాడే గొప్పవాడు.  ఉత్తమ మానవుని లక్ష్యం సత్యం.  

శిక్షణ లేని జనాలను యుద్ధానికి పంపడమంటే వాళ్ళను విసిరి వేసినట్లే. 

స్వర్గమంటే దేవునితో సంపర్కమే.  ఇష్టమైన పనిని ఎంత చేస్తున్నా అలసట తెలియదు.  

ప్రపంచములో నీకు వేరే శత్రువులు కానీ,మిత్రులు కానీ ఉండరు. 

నీ నడవడికయే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. 


ఏది తర్కమో అదే చెపుతాడు వివేకి, ఏది అధర్మమో అదే చెపుతాడు అల్పుడు.

తప్పును సరిదిద్దుకోక పోవడమంటే  మరో తప్పు చేసినట్లే. 

అవసరాలను తీర్చమని అడగని ప్రేమ ఉందా? పొదుపు చేయకుంటే వ్యధ తప్పదు.  సుదూరంలో ఏమవుతుందో ఆలోచించుకుంటే, 

నీ దగ్గరలోనే బాధలు ఉంటాయి.  పేరు సరిగా కాకుంటే భాష ఆ వస్తువుతో సరిగా అనుసానిందించపబడినట్లు కాదు. 

గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు, గ్రంథాలయాల్లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు.  

ఏ రోజు మన ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మనం వృథా చేసిన్నట్లే.  

మందు కొడితే మీలో నిజమైన మనిషి బయటికి వస్తాడు.  

నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే, ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి.

మనిషిలో ఎదుగుదల రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సిద్దమైనది.. ఇంకొకటి ప్రయత్నంతో జరిగేది. 

యుద్ధం న్యాయాన్ని , ధర్మాన్ని, సుఖసంతోషాలను ఆఖరికి మనిషిలోని  దైవత్వాన్ని కూడా చంపేస్తుంది. 

సాహసం అనే నిచ్చెన పై నుంచే మానవ ప్రయత్నాలన్నీ శిఖరాగ్రాన్ని చేరుకుంటాయి.

జీవితంలోని ఏ సమస్యా మనం పరిష్కరించుకోలేనంత కష్టమైనది కాదు. 

మనుషులు విజయాలను మాత్రమే ఇష్టపడతారు. మరైతే విజేతలను ద్వేషిస్తారెదుకో? మనలోని గొప్పదనం అనేది మనకి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంటుంది.

ఎదుటివారి  ఆత్మగౌవరవాన్ని , అభిమానాన్ని  కించపరచనంత  కాలం  నీవు  మంచివాదివి గానే చెలామణి అవుతావు. 

మీరు మీ కాలాన్ని, డబ్బుని, ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని పరాన్నభుక్కులైన మిత్రుల తేనె మాటల కోసం, స్తుతుల కోసం త్యాగం చేయకండి.

శత్రువును క్షమించు. అది అతనికి అంతకంటే బాధాకర విషయం మరొకటి వుండదు. 

ఎప్పటికప్పుడు నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.... ఇక ఆ తప్పు పునరావృతం కారాదు. 
మనుషుల మనసుల్ని పాలించే కళ ఉపన్యాసం.

సుఖ సంతోషాలు వికసించిన సుమాలు. వాటి తీపి జ్ఞాపకాలు ఎన్నటికి వాడిపోని సుమగంధాలు.

కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువుల కన్నా బరువైనవి.  అవి ఎక్కువైతే పయనం కష్టమే కదా !

అగచాట్లే  వద్దనుకుంటే ఆశలనన్నిటిని  గంగలో కలిపేయి! 

స్వార్ధంతో  నిండిన  ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం  కలిగిస్తుంది. 

ఆశావాదికి ప్రతిరోజు, ప్రతి గంటా, ప్రతి క్షనం అవకాశాలని ఆరబెడతాయి. 

జీవితంలో మీరు వేసే ప్రతి అడుగూ ఓ కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది. 

ఆత్మీయులు ఆకాశంలోని నక్షత్రాల్లాంటి వాళ్ళు.

నువ్వెంత  విజ్ఞానం  సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే అదంతా నిష్ప్రయోజనం. 


చెలిమిని మించిన కలిమి లేదు, తృప్తిని మించిన బలిమి లేదు.

ఈ ప్రపంచం, జీవాత్మ, భగవంతుడు అన్నీ ఆత్మ లోని విభిన్న దృశ్యాలు. 

ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేడమే గొప్ప విజయ రహస్యం.

కదలిక లేకుండా  గుండె బతకదు. అలజడి లేకుండా సముద్రం పలుకదు. రాపిడి లేకుంటే వజ్రం మెరవదు. ప్రతి మనిషికి కృషి ఎంతైనా అవసరం. 

మీ ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే! మీ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగా ఉండి  తీరాలి.

నీలో ఎన్ని లోపాలున్నా ఇప్పటికి, ఎప్పటికి  నిన్ను అమితంగా ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే.

అవరోధాలుగా కనిపించేవన్నీ సమర్ధులకు చక్కని అవకాశాలుగా కనిపిస్తాయి.

వేధనతో నిరాశ చెందిన ప్రేమకు, స్నేహం అనేది ఉపశమనం కలిగించే చక్కని ఔషధం.

వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే  నిజమైన కళ.

ఎదురవుతున్న పరిస్థితులను బట్టే వ్యక్తిత్వంలోని లోతులు బయట పడుతుంటాయి!

మీరు కనే కలలనేవి... రేపటి మీ ప్రశ్నలకు నేటి సమాధానాలు.