మొత్తం పేజీ వీక్షణలు

5, అక్టోబర్ 2025, ఆదివారం

అక్టోబర్ మాసంలో జరిగిన సంఘటనలు #importanteventsinoctober #october month ...

Calendar festivals #March Calendar #2026 #Festivals 2026 #calendarhinduf...

nagar karnool cheruvu | mahabubnagar history | telanagana

నాగర్‌ కర్నూల్‌ చెఱువు 

దీనికి కేసరి సముద్రమని పేరు. దీన్ని కందసాని అనే ఆనాటి ప్రభువు గారి భోగపత్ని వేయించింది. ఆమె దీన్ని వేయించే అపుడు లెక్కల కోసమై వెల్దండ నుండి ఒక కరణం గారిని పిలిపించింది. చెఱువు తరువాత అతడిక్కడనే నిలిచిపోయినాడు. అతనికి చెఱువు వారు అని పేరేర్పడిరది. ఆ వంశంలోని చెఱువు రామారావుకు చరిత్ర అంతా హృత్కవిలెగా ఉండేది. ఆయన ఈ చెఱువును గురించి వేయేండ్ల నాటిది అనేవాడు. ఇప్పుడు మనం వేయేండ్ల పైది అనవలసి ఉంది. 

జానపదులు దీన్ని కాకతీయులు వేయించినారని నమ్ముతారు. కాని వారు వేయేండ్ల లోపలి వారేగాని పైవారు గారు. రామారావు గారి మాటలను బట్టి యిది చాళుక్యుల కాలం నాటిది. ఆ వంశంలో అరికేసరి నామాంకితులు ముగ్గురున్నారు. మనకు గడిచిన వేయేండ్లకు దగ్గర దగ్గరగా మూడవ అరికేసరి నిలుస్తాడు. కనుక ఇది అతని కాలం నాటిది అనవలె. చాళుక్యుల కాలంలో కేసరి సముద్రాలు రెండు మూడు వేయించబడినవి. 

చెఱువు వేయించే అపుడు ఆనాటి ప్రభువులు మొదట దానికట్టపై ముందు భాగంలోనే తమ యిష్ట దైవం యొక్క ప్రతిష్ఠ ప్రధానమైన తూముపై విష్ణు పాద ప్రతిష్ఠ చేసేవారు. కాకతీయులు శివ-విష్ణు-బ్రహ్మ, సూర్య గణపతి, కుమారస్వామి, సరస్వతి, సప్తమాతృకలు అనే బహుదేవతారాధకులు. పైగా వారు తమను పరిపాలితులమని చెప్పుకున్నారు. చెఱువులు వేయించే అపుడు దేవతా ప్రతిష్ఠ చేసే అపుడు అక్కడొక శాసనం తమ రాజకీయ చిహ్నంతో ప్రతిష్ఠించటం పరిపాటి. కాని యిక్కడ ఒక్క శాసనం గాని లేదా వారి రాజ లాంఛనమైన గుర్తు గాని యింతకాలం నుండి ఎక్కడా బయలు పడలేదు. అయితే ఈ చెఱువు మూడు నాలుగు తడవలు భారీగా తెగి సింహభాగమే కొట్టుకుపోయింది కాబట్టి ఆ ప్రళయంలో ఇక్కడ చెఱువు వేయించిన వారి చిహ్నం ఏదీ మిగులకుండ కొట్టుకుపోయి ఉండవచ్చు. అయినప్పటికి చెఱువు ఉత్తరం గట్టున నృసింహస్వామి దక్షిణం కొమ్మున ఈశ్వరుడు, కట్టపై మధ్యన మశమ్మ దేవత వున్నారు. ఆనాటి చెఱువు కొమ్ము శివాలయం ఈనాడు పోస్టాఫీసు వెనుక శిథిలమైపోయి అవశేషంగా మిగిలింది. చాళుక్యులు మాతృగణ పరిపాలితులు కనుక చెఱువు కట్టపై గల మశమ్మ వారి మాతృగణంలో ఒకతె అనుకోవలె. 

నేటి మైసూరు పూర్వం మహిషాసురుని రాజ్యమట. అతని తల్లి మహిషీదేవి ఇపుడు మైసూరులో చివరన కనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్క రవ్వంత ఆధారాన్ని బట్టియే అదిపుడు మనం చాళుక్యుల కాలానిని చాముండు దేవి ప్రసిద్ధం. ఆమె ఆ మహిషీ దేవికి ప్రతిరూపం. మనకు సప్తమాతృకలలో ఈ చాముండి 

ఈ చెఱువుకు కేసరి సముద్రం అని వ్యవహారం చాళుక్యుల యొక్క కేసరి సముద్రాలు వ్యక్తి వాచకాలే కాలేదు. గత శతాబ్దంలో ఎండవెట్లలో బలిజ సలేశ్వరం అనే గుమాస్తా పట్వారి ఉండేవాడు. అతనికి గూడ అతనితో మాట్లాడినాను. చెఱువు వేయి సంవత్సరాల నాటిదని అతడు గూడ అన్నాడు. ఈ చెఱువులో ఈ చెఱువు చరిత్రపై మంచి అవగాహన ఉండేది. నేను దీన్ని గుఱించి రెండుసార్లు అనుకోకుండా కలసి తిరుమలాపురం దారిన ఒక శిథిలాలయం ఉందట. దానికి శిఖేశ్వరాలయమని పేరట. ఈ విషయం నాతో సెట్టి నాగప్ప కూడ చెప్పినాడు కనుక ఈ చెఱువుకు మొదట శిఖేశ్వర సముద్రం అని పేరుండి కాలక్రమంలో కేసరి సముద్రమయిందా? అని సందేహం కలుగుతుంది. చెఱువు రామారావు మాత్రం యిది నృసింహ సాగరమే అన్నాడు. 

ఈ చెఱువుకు నాలుగు తూములున్నవి. మొదటిది నరసింహులు తూము, రెండవది మశమ్మ తూము, మూడవది బారుసావుల తూము, నాలుగవది కుక్కల తూము - ఇది దక్షిణం కొమ్మున ఉంది. 

నేనిక్కడికి 1954 జూన్లో వచ్చినాను. అప్పటికి కుక్కల తూము బాగా పోతున్నది. దాని వెనుక పెద్ద కతువ. ఆ కతువ నిండా తెల్ల తామరలు. తూము కాలువకు దక్షిణంగా మరొక మడుగు. ఆ మడుగులో తెల్ల కలువలు. శరదృతువు - వసంత ఋతువులు వచ్చినవంటే చెఱువెనుక ప్రదేశమంతా నయన మనోహరంగా ఉండేది. తామరలు కతువ నిండా విచ్చినపుడది దేవేంద్రుని దేహం వలె భాసించేది. 

గ్రామంలోని యువకులంతా రేపుమాపు స్నానాలకు తువ్వాలలు, బనీనులు ఉతుక్కోవటానికి చాలినంత అవకాశముండేది. నడియీడున నడుము నొప్పిగలవారు ప్రొద్దుననే వచ్చి ముఖం కడుక్కుని గ్రామంలోని యువకులకంతా రేవుమాపు స్నానాలకు తువ్వాలలు, బనీనులు ఉతుకుకోవటానికి స్నానం పేర తూముకడ్డంగా నిలిచేవారు. ఆ నీటి దెబ్బకు వారి నడుము నొప్పి సడలిపోతుండేది. ఆ తూము అలుగు పారినంతకాలం నాగర్‌ కర్నూల్‌ వారు నీటి ఎద్దడి ఎరుగరు. ఉభయ మధ్యలు ఆ తూము వెనుక కండ్ల వైభోగంగా ఉండేది. 

పల్లెటూళ్లలో చెఱువు కట్టలపై ఉండే దేవతలకు గూడ ఏటా ఒకసారి బోనాల పండుగ జరుపుతుంటారు. కాని మరి అదిక్కడ జరిపేవారో తెలియదు - కాని బార్సావుల ఉర్సు మాత్రం ఏటేటా తప్పక జరిగేది. ఈ బారావుల అసలు పేరు ‘బాలేషహీద్‌’. షహీద్‌ అనగా వీర మరణము చెందినవాడు. 

అల్లా ఉద్దీన్‌ తెలంగాణలోని కోటలపై దండెత్తుతూ గణపురంపై దాడి చేసి దాన్ని వశం చేసికొని బోదిర్సాబ్‌ - బాలెసాహెబ్‌ - అను ముగ్గురు ప్రతినిధులను అక్కడ ఉంచిపోయెను. అతడు వెళ్లిన పిమ్మట అంతవరకక్కడ ఉన్న గణపతిరెడ్డి వర్ధమానపురానికి వెళ్లిపోగా అతని వెన్నంటి వచ్చిన బాలేషహీద్‌ వర్ధమానపురంతో పాటు నాగర్‌ కర్నూల్‌ పై దండెత్తగా అక్కడ కేసరి సముద్రం యొక్క కట్ట వారికి రణరంగమై 

ఆ యుద్ధంలో బాసాహెబ్‌ హతమైనాడు. సమాధి చేసి మొదలొక చిన్న గుంబదు దాని ప్రక్కగా మినారు కట్టినారట. బాలేసాహెబ్‌ తోటివారివి గణపురంలో గుంబదులున్నవి. ఇక్కడ బాలేసాహెబ్‌ అక్కడ బోదిక్‌ సాహెబ్‌ వారివి మూడు ఒకే తీరుగా ఉన్నవట. అపుడు కొంతకాలానికి చెఱువు కట్టపై బాలేసాహెబ్డి కూలిపోగా అప్పటి తహశీల్దార్‌ సయ్యద్‌ ఎక్రమలీ గారు దానిని చదరం చేయించి ఒక అరుగు కట్టించినాడు. అప్పుడు కొన్ని దినాలకు ఆ దారిన దినదినం తిరుగుతున్న పకీరయ్యగౌడ్‌ చూసి ఆ అరుగుపై దర్గాను, అరుగు క్రింద ఒక గదిని కట్టించినాడు. ఆ తరువాత 1348 పసిలీలో ఇక్కడికి వచ్చిన సిరాజుల్‌ హసన్‌ అనే తహశీల్దార్‌ గారు ‘ఉలెహజ్‌’ నెల 22-23 తారీఖులలో బాలేషహీద్కు ఏటా ఉర్సు నిర్ణయించి ఆ యేడు జనాకర్షణ కొరకు గోపాలపేటలో సినిమా ఆడిస్తుండగా దానిని చెరువు రామారావు, నర్సింగరావులను పంపి బేరమాడిరచి ఇక్కడికి తెప్పించినాడు. దానితో 1948 నుండి ఆ సినిమా ఆడటం యిక యిక్కడనే స్థిరపడిపోయి ఏటా కట్టపై రెండు దినాలు ఉర్సు సాగడం మొదలయింది. 

అనంతరం 1958లో నాగర్కర్నూల్కు కరెంటు వచ్చింది. అపుడు దాన్ని శ్రీ కళావెంకట్రావు మంత్రి గారు వచ్చి ప్రారంభించినారు. గాంధీపార్కులో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత అది చూచి వి.ఎన్‌.గౌడు గారికి తమ గ్రామానికి గూడ కరెంటు తీసికోవలెనని సంకల్పం కలిగింది. 

అప్పటికే ఎమ్మెల్యేగా వి.ఎన్‌.గౌడు ఉన్నారు. వారు ఏది తలచితే అది అయ్యేది. దానితో చెఱువు కట్టకు చైతన్యం వచ్చింది. 1960లో ఎండబెట్లకు కరెంటు తీసుకోబడిరది. దాన్ని దామోదరం సంజీవయ్య గారు వచ్చి ప్రారంభించినారు. అపుడు చెఱువు యొక్క ఉత్తరం కొమ్ములోపల పెద్ద బహిరంగ సభ జరిగింది. సికింద్రాబాదు, హైదరాబాద్ల మధ్య ట్యాంక్‌ బండ్‌ వలె అవుతుంది. కట్టపై తారురోడ్డు పడుతుంది. దానికి రెండు వైపులా కరెంటు స్తంభాలు నిలుస్తవి. కట్ట యిక పగలే వెన్నెల, జగమే ఊయలగా మారిపోతుంది అనుకున్నారు. కాని గౌడు గారికి అప్పటికే నాగర్‌ కర్నూల్లో రాజభవనం వంటి గృహమున్నది కనుక ఆయనకు సొంత యింటి అవసరమంత అనిపించలేదు. దానితో ఆనాటి కల ప్రజలకు పగటికలనే కాగా యిపుడు దానికి మళ్లీ ముహూర్తం వచ్చింది. ఇట్లా యిది నాగర్‌ కర్నూలు ప్రజల యొక్క అర్ధ శతాబ్దం కంటె ఆవలినాటి కల. ఇపుడిక యిది మాన్యులు గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ మణ్ణి జనార్దనరెడ్డి గారితో సాకారమై ఫలిస్తుంది.