Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
31, జనవరి 2022, సోమవారం
30, జనవరి 2022, ఆదివారం
29, జనవరి 2022, శనివారం
28, జనవరి 2022, శుక్రవారం
26, జనవరి 2022, బుధవారం
25, జనవరి 2022, మంగళవారం
Indian Actress Jayanathi Life Story Details & Acted Movies
జయంతి (జనవరి 6, 1945 - జూలై 26, 2021) అసలు పేరు కమల కుమారి. ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి.
శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన మొదలెట్టి కన్నడ సినీరంగంలో పేరు సంపాదించుకున్నారు.
ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించార
తెరమీద జయంతిగా వెలిగిన ఒకప్పటి కమల 06 - జనవరి -1945 న బళ్ళారిలో జన్మించింది.
తండ్రి బాలసుబ్రహ్మణ్యం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు .
కమలకు ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు .
కమల చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.
తల్లిదండ్రుల పోట్లాటలు, విడాకులు, కోర్టు గొడవల మధ్య కమల బాల్యం సాఫీగా సాగలేదు.
నాట్యప్రదర్శనలో చొరవ చూపలేకపోయింది.
ఒకనాటి ప్రఖ్యాత నటి మనోరమ కమలకు డాన్సు స్కూలులో క్లాస్‌మేట్ !
మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న గుర్తింపులేని పాత్రలు వేసింది.
అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు వై.ఆర్. స్వామి రూపంలో అదృష్టం ఆమె ఇంటి తలుపు తట్టింది. అదే కమలకు ప్రాధాన్యత నిచ్చి ఆమెను ‘జయంతి’గా సినీ వినీలాకాశంలోకి ఎగరేసిన కన్నడ సినిమా ‘జేనుగూడు’ (తేనెతుట్టె)
అందునా ఆ సినిమాలో ఆనాటి కన్నడ హీరో రాజ్‌శంకర్, ఉదయకుమార్, పండరీబాయి, చంద్రకళ వంటి హేమాహేమీలతో జయంతి పోటీ పడి నటించింది.
కన్నడంలో ‘జేనుగూడు’ విజయవంతం అవ్వడంతో జయంతికి గుర్తింపు లభించి, కన్నడంలో రామాంజనేయ యుద్ధం, తమిళంలో ‘ఎనై పాగన్’ ‘మంగైనార్ ఒళ్ళం మంగతా సెల్వం’, ‘నీపైప దర్యు నేరమిళ్ళై’ ‘యిరువర్ ఉళ్లమ్’, మంత్రి కుమారన్, అన్నై ఇళ్ళమ్.. మలయాళంలో ‘తలట్టుకోమన్’, తెలుగులో భార్యాభర్తలు, జగదేకవీరుని కథ...
జయంతి 1964లో తెలుగులో డాక్టర్ చక్రవర్తి, తోటలో పిల్ల ` కోటలో రాణి, బొబ్బిలి యుద్ధం, అగ్గిపిడుగు, కన్నడంలో చంగిల్లియతోట, కళావతి, తుంచిదకోడ, మురియాద మానె, ఆశే, పతియ్ దైవ, తమిళంలో పడగొత్తి, వజిపికాడు, కర్ణన్, కలైకోవిల్ వీరాధివీరన్ చిత్రాల్లో తన సత్తా చాటింది.
1965లో కన్నడంలో వచ్చిన ‘సతి లీలావతి’ సినిమా జయంతిని ‘లేడీ రెబల్‌స్టార్’గా చేసింది
తెలుగులో 1965లో వచ్చిన ‘సుమంగళి’లో జయంతి నటన ప్రజలకు నచ్చింది.
1966 లాల్ బంగళా, 1967లో రహస్యం, భక్తప్రహ్లాద, 1968లో బందిపోటు దొంగలు, 1972లో బడిపంతులు, కలెక్టర్ జానకి, 1973లో మాయదారి మల్లిగాడు, శారద, సంసారం ` సాగరం, గాంధి పుట్టిన దేశం చిత్రాలలో ఆమె పాత్ర పరిధిమేరకు తన అభినయ చాతుర్యాన్ని ప్రదర్శించింది.
1974లో వచ్చిన కృష్ణగారి ‘దేవదాసు’లో జయంతి చంద్రముఖి పాత్రను పోషించింది. అమ్మ మనసు, దేవుడు చేసిన పెళ్ళి చిత్రాలలో జయంతి పాత్రలు మరపురానివి.
రామారావుగారి స్వంత చిత్రం ‘కులగౌరవం’లో కూడా జయంతిది మంచిపాత్రే. 1975లో వచ్చిన చల్లని తండ్రి, రామయతండ్రి, చిననాటి కలలు, రామాంజనేయ యుద్ధం ఆమెలోని నటిని ప్రేక్షకులకు చూపెట్టాయి.
రామాంజనేయ యుద్ధంలో పాత్రను జయంతి బాగా ఆవిష్కరించింది. 1978లో వచ్చిన బొమ్మరిల్లు, కుమార రాజా, 1979లో వచ్చిన బొట్టు కాటుక, కమలమ్మ కమతం, అంతులేని వింతకథ జయంతి క్రేజును పెంచేశాయి.
1980లో వచ్చిన తల్లి బాధ్యత, 1981లో వచ్చిన అగ్నిపూలు, పార్వతీ పరమేశ్వరులు, జస్టిస్ చౌదరి ఆమె నటనా సామర్థ్యాన్ని తెలియజేశాయి.
బంగారుబాబులో అక్కినేని చెల్లెలు ‘చంద్ర’ పాత్రలో ఆమె అభినయం అద్భుతం. 1984లోని రక్తసంబంధం, 1986లోని శాంతినివాసం, ధైర్యవంతుడు, కలియుగ పాండవులు ఎంతో బాగా నడిచాయి.
కొండవీటి సింహంలో జయంతి పాత్ర ప్రజాదరణకు పాత్రమైంది. 1987లో దొంగమొగుడు, అల్లరి కృష్ణయ్య, మావూరి మొనగాడు సినిమాల్లో జయంతి పాత్రోచితంగా నటించింది.
1990లో వచ్చిన కొదమ సింహం, రాజా విక్రమార్క, 1991లో విడుదలైన తల్లిదండ్రులు, 1992లో నిర్మించబడిన స్వాతికిరణం చిత్రాలు జయంతిని ప్రజలు గుర్తుపెట్టుకొనేలా చేశాయి.
1995లో ఘరానా బుల్లోడు, పెదరాయుడు, 1996లో వంశానికొక్కడు, రాముడొచ్చాడు, 1997లో రౌడీ దర్బార్, 1998లో కంటే కూతుర్నే కను సినిమాలలో జయంతి అభినయం ప్రేక్షకులకు నచ్చింది.
21వ శతాబ్దంలో కూడా జయంతి విజృంభించింది. 2000లో రాఘవయ్య గారి అబ్బాయి, 2002లో గర్ల్‌ఫ్రెండ్, 2003లో నీకే మనసిచ్చాను, 2005లో 786 ఖైదీ, ప్రేమకథ, 2011లో సునీత ఐ లవ్యూ వంటి సినిమాల్లో జయంతి పరిణితి చెందిన నటనను చూపింది.
అల్లూరి సీతారామరాజులో పడాలు భార్యగా నటించడం కన్నా జీవించిందనే చెప్పాలి
లాల్‌బంగళా (1966), తీన్ బహురాణియా (1968) గూండా (1970) తుమ్‌సే అచ్ఛా కౌన్ హై (1969) ఓం శాంతి ఓం (2007)లో వంటి హిందీ భాషలో నటించి ఉత్తర భారతీయులకు దగ్గరైంది.
2016లో జయంతి ‘బ్రౌన్ నేషన్’ అనే ఇంగ్లీషు సినిమాలో నటించి అంతర్జాతీయ నటి అయింది.
బుల్లితెరను కూడా ప్రేమించి తమిళంలో 2009,2010లో ధారావాహికగా ప్రసారమైన ‘వసంతం’ లో మంగళంగా జీవించింది.
మలయాళంలో ‘పలట్టుకోమన్’ (1962), తర్వాత జయంతి పట్టుపుక్కల్ (1965) కాళియోగం (1965) లక్ష్య ప్రభు (1968), కారుత పౌర్ణమి (1968), విలకప్పెట కాని (1974) వంటి అనేక చిత్రాల్లో నటించింది.
తమిళంలో, కన్నడంలో లెక్కకు మిక్కిలిగా చిత్రాలలో నటించి, తెలుగు హాస్యనటుడు, కన్నడ దర్శకుడు అయిన ‘పేకెటి శివరామ్’ను వివాహం చేసుకున్నది.
ఎయిడ్స్ నియంత్రణ ప్రచారం కోసం తయారు చేయబడిన డాక్యుమెంటరీలకు జయంతి స్వరదానం చేసింది.
ఆమె సినిమా జైత్రయాత్రలో ఆనాటి దక్షిణాది అగ్రహీరోలైన శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, యంజీఆర్, జయశంకర్‌లతో తమిళంలో, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో తెలుగులోను, ఉదయకుమార్, రాజ్‌కుమార్‌లతో కన్నడంలోనూ నటించింది.
ఒక్క రాజ్‌కుమార్‌తోటే కన్నడంలో 30 పై చిలుకు చిత్రాల్లో నటించింది.
లెక్కలేనన్ని ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, కర్ణాటకరాష్ట్ర పురస్కారాలు, డా॥ రాజ్‌కుమార్ జీవన సాఫల్యం పురస్కారం, బి.సరోజాదేవి జాతీయ పురస్కారం ఆమె పొందిన పురస్కారాలలో కొన్ని
దాదాపుగా 60 సం॥లుగా దక్షిణాది సినిమాలలో తన పటిమను, గరిమను నిరూపించుకున్నది జయంతి
దాదాపు 500 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి పురస్కారాలు అందుకున్నది జయంతి
జయంతి నటించిన సినిమాలు
****************************
స్వాతి కిరణం (1992)
తల్లిదండ్రులు (1991)
రాజా విక్రమార్క (1990)
కొదమ సింహం (1990)
దొంగ మొగుడు (1987)
శ్రీ దత్త దర్శనం (1985)
జస్టిస్ చౌదరి (1982)
పార్వతీ పరమేశ్వరులు (1981)
అగ్నిపూలు (1981)
కొండవీటి సింహం (1981)
కమలమ్మ కమతం (1979)
ఆడవాళ్లు అపనిందలు (1976)
ఉత్తమురాలు (1976)
శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)
దేవదాసు (1974)
అమ్మ మనసు (1974)
అల్లూరి సీతారామరాజు (1974)
మాయదారి మల్లిగాడు (1973)
శారద (1973)
బొబ్బిలి యుద్ధం (1964)
డాక్టర్ చక్రవర్తి (1964)
జగదేకవీరుని కథ (1961)
భార్యాభర్తలు (1961)
Ghayal Sherni (1988)
Oridathoru Phayalwan (1981)
Naya Anubhav (1986)
Aaj Ke Sholey (1985)
Tumse Achha Kaun Hai (1969)
Ethir Neechal (1968)
Mehrban (1967)