మొత్తం పేజీ వీక్షణలు

17, ఏప్రిల్ 2021, శనివారం

ఉరుకులు పరుగుల మనిషి జీవితం.. గమ్యం లేని పయనం..

 గతంలో మనిషికి ఇప్పుడున్నన్ని బాధలు, బా ధ్యతలు, ఉరుకులు పరుగులు లేకుండేది. 

పరిణామ క్రమంలో మనిషి తన ఆహారపు అలవాట్లు, వేష భాషలు, సమాజ కట్టుబాట్లు, కుటుంబ బాధ్యతలు, ఉ ద్యోగ నిర్వహణలు అన్నింటినీ ఎప్పటికప్పుడు మార్చు కుంటూ చివరికి ఇప్పుడున్న దుర్భర పరిస్థితికి చేరుకున్నాడు. 

ఒకప్పుడు మనిషికి చాలా తీరిక సమయం మిగిలేది. ఆ సమయంలో తన చుట్టుప్రక్కల ఉన్నవారి గురించి, సమాజంలో ఉన్న మంచి చెడు గురించి ఆలోచించే వాళ్లు, ఒకరి నొకరు చర్చించుకునే వాళ్లు. 

నేడు మనిషి జీవితంలో వేగం అనూహ్యంగా పెరిగిపోయింది. 

ఏ విషయం గురించైనా, ఎంత దగ్గరి వారి గురించైనా ఎక్కువ సేపు ఆలోచించడం కాని గుర్తు పెట్టుకునేంత సమయం కాని ఉండట్లేదు. 

ఏ సంఘటన జరిగినా, అది మంచైనా చెడైనా.... ఓటమైనా గెలుపైనా.... పుట్టినా చనిపోయినా దాని గురించి తెలుసుకోవడం, పరామర్శించడం, శుభాకాంక్షలు తెలపడం, ఓదార్చడం అన్నీ ఫోన్ల  ద్వారానే జరిగిపోతున్నాయి. 

ఇంత యాంత్రికంగా, ఇంత వేగంగా మనిషి ఎటు వైపుగా పయనిస్తున్నాడు... ఏమి సాధించడానికి... 

ఇతరులను ప ట్టించుకోనంతగా .. తన జీవితం పరిమితమని, ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందని తెలుసు... 

మనిషి అకస్మాత్తుగా చనిపోయినపుడు తన యొక్క ఆరాటాలు, పోరాటాలు ఏమౌతాయి.... 

తన జీవితానికి ఎవరో, ఏదో టార్గెట్ విధించినట్టుగా పరిగెత్తే మనిషి మరియు మనిషి ఆలోచనలు ఏమౌతాయి.?

ఒకవైపు అనంతమైన విశ్వాన్ని శోధించేంతగా ఎదిగిపోయిన మనిషి, మరొకవైపు జీవితాన్ని సంతోషంగా గడపదానికి కావాల్సిన

ఆలోచన మరచి  అనునిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ పోరాటాలు చేసే మనిషి. అలుపెరుగకుండా పరుగెత్తే మనిషి, గమ్యం తెలియకుండా ప్రయాణం చేసే మనిషి యొక్క ప్రాణం (గాలి) ఎప్పుడైనా పోవచ్చు. 

భూత కాలంలో జరిగిన వాటినే తలచుకుంటూ వర్తమానాన్ని నాశనం చేసుకుంటున్నాడు 

జరిగింది మన చేతిలో ఉండదు. వర్తమానాన్ని చక్కగా సరిదిద్దుకుంటే అందమైన భవిష్యత్తును చూడవచ్చు. 

పొందిన వాటితో సంతృప్తి పడడం లేదు - ఇంకా ఎదో కావాలన్నది తీరని కోరిక 

లేనిదాన్ని కోరుకోవడం, పక్కవాడికున్నది తనకు లేదని అనుక్షణం అసంతృప్తితో ఉండడం సరికాదు 

మనిషి జీవితంలో చాలా సమస్యలు ఇతరులతో పోల్చుకోవడం వల్ల వచ్చేవే.