బంగారం - భారతీయుల నమ్మకాలు !
బంగారం ఎప్పుడు ధరించాలి ?
బంగారం ఆసక్తికర సంగతులు
బంగారం లాభనష్టాలు - సంప్రదాయాలు
పుత్తడి నగలు నాభికి పైస్థానంలో ఉండాలి గాని నీచ స్థానంలో ఉండకూడదంటారు . అందు చేతనే చాలామంది కాలికి బంగారు ఆభరణాలని వాడరు
గురువారం పుష్యమీ నక్షత్రం (గురు పుష్యామృత యోగం) వచ్చే రోజున బంగారం కొంటె మంచిది
శుక్రవారం పూర్వాషాఢ లేదా పూర్వ ఫల్గుణీ నక్షత్రం వచ్చే రోజున బంగారం కొంటె మంచిది
గురు హోరా, శుక్ర హోరా లలో కొంటె మంచిది.
మిథున, మీనా, తులా, ధనుర్ వంటి లగ్నాలలో కొంటె మంచిది
శని, అది వారాలు మంచివి కావు
సోమవారం, బుధ, గురు, శుక్ర వారలు మంచివి
మంగళవారం (కుజవారం ) కొంటె అమ్మడం కష్టతరం
సుభ్రమణ్య స్వామి పుట్టుకకు ముందు బంగారం పుట్టిందని అంటారు కొందరు
సుభ్రమణ్య స్వామి ప్రతిమ ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిదంటారు
బంగారాన్ని తీసుకునేటపుడు కుడిచేత్తో తీసుకోవాలి
శుక్రవారం నాడు బంగారాన్ని వొంటిమీదినుండి తీయకూడదు
బంగారాన్ని ఆగ్నేయ మూలన పెట్టరాదు
అసుర సంధ్య వేళలో బంగారాన్ని కొనరాదు
అసుర సంధ్య వేళలో బంగారాన్ని వొంటిమీదినుండి తీయకూడదు
రాత్రివేళల్లో బంగారాన్ని ఎవరికీ అరువు లేదా కానుకగా ఇవ్వరాదు
బంగారాన్ని మంచపైన గాని నేలపైన గాని ఉంచరాదు
బంగారాన్ని చీపురుకు గానీ మసిగుడ్డకు తాకించరాదు
చాపని నేలపై పరచి దాని మీద పుత్తడిని ఉంచాలి
మీ జన్మ నక్షత్రం కలిసిన రోజున స్వర్ణాన్ని కొనరాదు
మీ జన్మ నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం కలిసిన రోజున (సంపత్తార) స్వర్ణాన్ని కొంటె మంచిది
బుధ, గురు, శుక్ర వారాల్లో మాత్రమే స్వర్ణాభరణాలని ధరిస్తే మంచిది
బంగారాన్ని కొన్న వెంటనే ఆవుపాలతో ముంచి తీస్తే మంచిది
వనితలు శుక్రవారం నాడు ఆవుపాలతో ముంచిన స్వర్ణాభరణాలని ధరిస్తే మంచిది
అరటి చెట్టు వద్ద లక్ష్మి నారాయణుల ప్రతిమను, బాధాము ఆకుని ఉంచి దానిపై నగని ఉంచి దీపారాధన చేస్తే మంచిది
వనితలు ఆభరణాలు తీసేటప్పుడు ముందుగా చెవులవి తీశాకే చేతులవి తీయాలి
బంగారు గాజులు ఉన్నవారు తప్పకుండ మట్టి గాజులని కూడా ధరించాలి
బంగారాన్ని ఎప్పుడూ కూడా డబ్బులకు దగ్గరలో దాచిపెట్ట కూడదు -
చిన్న వెండి పెట్టెలో ఉంచి దాచాలి
బంగారాన్ని తీసేటప్పుడు ముందుగా అరటి ఆకుపైగాని లేదా వెండి పళ్లెంలో గాని ఉంచి దాచిపెట్టాలి
బంగారాన్ని మగవారు మంగళ గురు వారాల్లో తాకట్టు పెట్టరాదు
పిల్లల ఒంటిపైనున్న గొలుసుల్ని అది, సోమ వారాల్లో తీయరాదు
గురు, శుక్ర వారాల్లో మాత్రమే గుళ్లో దేవుళ్ళకి ఆభరణాలని ఇవ్వాలి
రాగిపాత్రలో నీరు పోసి అందులో బంగారు నగని ఉంచి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే అభీష్ట సిద్ది లభిస్తుంది
జాతక నవ గ్రహదోషాలు పోవాలంటే జన్మనక్షత్రం రోజున జీవ నదీ తీరంలో బ్రాహ్మణుడికి బంగారం దానంగా ఇవ్వాలి
నల్ల గుర్రంకి వాడిన గుర్రపునాడాని లక్ష్మి పాదాల చెంత నుంచి నాడాకి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి, పూలతో పూజించి గుమ్మానికి కడితే ఆ ఇంట్లో బంగారం వృద్ధి పొందుతుంది
మంగళ , శుక్ర వారాల్లో 21 గురువింద గింజల్ని ఎర్రటి బట్టలో కట్టి ఈశాన్యమూలన ఉంచి పచ్చని పూలతో పూజించి నైవేద్యం పెట్టి ఆమూటని బీరువాలో, గళ్ళ పెట్టెలో పెడితే ఇంట్లోకి బంగారం, సంపద ప్రవేశిస్తాయి
మగవారికి కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే కష్టాలు వస్తాయని నమ్ముతారు
దొరికినట్లు కల వస్తే సమోటా తరిగిపోతుందని భావిస్తారు
ధరించినట్లు కల వస్తే అది రోగానికి సూచనగా భావిస్తారు
బంగారు పట్టీలు (పాయల్) వేసుకున్నట్లు కల వస్తే అవమానం, నిందలు పడే దానికి సూచికగా భావిస్తారు
ఆడవారికి కలలో బంగారు ఆభరణాలు కనిపిస్తే కష్టాలు వస్తాయని నమ్ముతారు
దొరికినట్లు కల వస్తే మంచి లాభం కలుగుతుందని నమ్ముతారు
ధరించినట్లు కల వస్తే అది సుఖానికి, లాభముకు సంతాన ప్రాప్తికి సూచనగా భావిస్తారు
బంగారు పట్టీలు (పాయల్) వేసుకున్నట్లు కల వస్తే ధనప్రాప్తికి సూచికగా భావిస్తారు
బంగారం అనేది గురుడికి సంబంధించిన లోహం - ఈ లోహాన్ని ధరించే వారికి గురుబలం అధికంగా ఉంటుంది
ఆభరణాలలో దుద్దులు, ముక్కు పుడకలు, మాటీలు, లోలకులు, హారాలు, గాజులు, కమ్మలు, వంకులు, చంప స్వరాలు, ఉంగరాలు, అరవంకి, నెక్లెస్, వడ్డాణం, పాపిడి బొట్టు, చైన్, నాగరం , చామంతి పువ్వు, సూర్యుడు, చంద్రుడు, జడ కుచ్చులు వనితలకు వాడుకలో ఉన్నవి
మగవారు సైతం దండె కడియాలు, సింహ తలాటాలు, చెవి కుండలాలు (మకర కుండలాలు), గండ పెండేరాలు, బంగారు మొలత్రాడు, సువర్ణ యజ్నోపవీతం, ఉంగరాలు, కిరీటాలు, కలికితురాయి ... మున్నగు ఆభరణాలను ధరించేవారు
పెళ్లిళ్లలో వధువుకు ముక్కుపుడక, అడ్డబాస, నత్తు వంటి వాటిని పెట్టనిదే కన్యాదాన ఫలితం ఉండదని చెబుతారు
ముక్కుపుడక వనితలనుండి వెలువడే చెడు వాయువులని శుద్ధి చేసి వరుడికి ఆయుక్షీణత నుండి రక్షిస్తుందని చెబుతారు
చెవి కుండలాలు, దుద్దులు ధరించడం వల్ల చెవిలో ఉండే జ్ఞాన నాడులు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది
పూర్వీకులు గ్రహాల అనుగ్రహం కోసం , ఆరోగ్యం కోసం నగలను ధరించేవారు
ఆదివారం మొదలు శనివారం వరకు రోజుకు ఒక్కో రకమైన ఆభరణాలని ధరించేవారు - అవే ఏడువారాల నగలు
కంఠ హారాలు, గాజులు, కమ్మలు, పాపిట బిళ్ళ, ముక్కు పిడకలు, వంకీలు, ఉంగరాలు వంటి ఏడువారాల నగలని వేసుకునేవారు
ఆదివారం రోజున (సూర్యుడు) కెంపులతో చేసిన నగలను ధరిస్తే మంచిది
సోమవారం (చంద్రుడు) రోజున ముత్యాల ఆభరణాలని ధరిస్తే మంచిది
మంగళవారం రోజున (కుజుడు) పగడపు నగలను ధరించాలి
బుదవారం రోజున (బుధుడు) పచ్చలను పొదిగిన నగలను వేసుకోవాలి
గురువారం రోజున (బృహస్పతి) కనక పుష్యరాగంతో చేసిన వాటిని ధరిస్తే మేలు జరుగుతుంది
శుక్రవారం నాడు (శుక్రుడు) వజ్రాలని పొదిగిన వాటిని ధరిస్తే మంచిది
శనివారం రోజున (శని) నీలాలతో పొదిగిన ఆభరణాలు ధరిస్తే మంచిది
వనితలు నవరత్నాలని కలిగిన నగలను ధరించడం వల్ల శుభం కలుగుతుంది
ఏడువారాల నగలను ధరించే పద్ధతులకు సంపదలు, ఆరోగ్య సిద్ది కలుగుతాయని విశ్వసిస్తారు
ఏడువారాల నగలు సంపద, ఆరోగ్యం, వైభవం, తేజస్సు, గ్రహబలం (గురుబలం), ధైర్యం, సాహసం, ఉత్సాహం, ఆకర్షణ శక్తి, అందం, ఆనందం పెంచి, గ్రహ దోషాలని తొలగించడంలో సహకరిస్తాయి