మొత్తం పేజీ వీక్షణలు

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

నిజాయితీ అనే పట్టాలపైనే జీవితమనే రైలు బండి నిలబడుతుంది


కోపగించుకోవడం అంటే మనం విషం మింగి అవతలి వ్యక్తి మరణించాలని కోరుకోవడం లాంటిది.
మన తోటి వారిని ప్రేమించడమే భగవంతుని ప్రేమించడానికి అత్యంత ఆచరణ సాధ్యమైన విధానం.
అహింస అంటే బలవత్తరమైన ఆటుపోట్లను సహించేది,అనురాగాన్ని, మమతను పెంచేది.
మంచిగా ఉండడం గౌరవం.ఇతరులకు మంచిగా వుండమని శిక్షణ నివ్వడం మరింత గౌరవం.
మతాలన్నీ గొప్పవే వాటిలో దోషమేమి లేదు, దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంది.
పరిపూర్ణత అనేది నిస్వార్ధంగా కష్టపడటం, ఒళ్లు  దాచుకోక శ్రమించడం ద్వారానే అది సాధ్యమవుతుంది.
నీ డబ్బుగాని, నీ విజయంగాని మానవాళి మనుగడకు, శాంతిసామరస్యాలకు ఉపయోగపడాలి.
దేనినైనా ప్రేమతో చేసి చుడండి,అది మీ జీవితాన్ని సంతోషపరస్తుంది.
అస్పృశ్యులని  మనం అందరిని దూరం నెడితే మనల్ని వెనక్కి నెట్టి ప్రపంచం ముందుకు పోతుంది.
చదువు క్రమశిక్షణనను  అలవరుస్తుంది. చూపును విశాలం చేస్తుంది.చదువుకున్న పౌరులు లేకుండా  ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. 
మన్నించే స్వభావాన్ని కలిగియుండండి. మంచిని చేసేందుకు ప్రేరేపించండి.
ప్రతి నిముషాన్ని వ్యర్ధం చేయక వినియోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
వినమ్రంతో కూడిన విజయం, ఎవరిని గాయపరచకుండా, నొప్పించ కుండా సాకారమైన లక్ష్యం మన జీవితానికి అర్ధాన్నిస్తుంది.  
తప్పను ఒప్పుకుంటే మీరు చేసే తప్పు కూడా పునీతమవుతుంది.
మనము నిరుపేదగా ఉండడానికి మనమే కారణం. మొదట నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. తరువాత దీపం వెలిగించి పెట్టి భాద్యత కొరకు అగ్గిపుల్లను వెతుకుదాము.
ఏ విషయం గురించైనా సరే కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోరుకున్నది సాదించాలంటే నిరంతరం ప్రయత్నించాల్సిందే.
గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్థకం.
మనం బాధపడే దానికంటే భయపడేదే ఎక్కువ. ఎందుకంటే వాస్తవాల కన్నా ఊహలే మనకి ఎక్కువ వ్యధ కలిగిస్తాయి.
కష్టించి పని చేసేవానికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది.
దేన్నయినా మూర్ఖంగా వాదించే తత్వం వదిలేయాలి. లేదంటే అందరూ మనల్ని అంగీకరిస్తున్నట్లు భ్రమింపజేస్తునే మనల్ని తమ పరిధి నుండి బహిష్కరిస్తుంటారు.
 తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గ్రుడ్డివాడు.
భూమి మీద ఉన్నందుకు మనం కట్టవలసిన అద్దె .........పరోపకారం.
జీవితమంటే విశ్రాంతి కాదు, చైతన్యం అందుకే జీవితమంతా ఆచరణే !
పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. 
ప్రయత్నం పురుషుని వంతు అయితే ఫలం ఇవ్వడం  పురుషోత్తముని వంతు.
మనం    మనకోసం  చేసేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది
 మనల్ని మనం నమ్ముకొంటే ఎవరి మాటలూ వినాల్సిన అవసరం లేదు.
ఏ వృత్తిలోనైనా విజయాన్ని సాధించడం శక్తి,సామర్ధ్యం,తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది
మనం ఎనభై ఏళ్ల వయసులో పుట్టి పద్దెనిమిది ఏళ్ల వయసుకి ఎదిగితే అదే అంతులేని ఆనందం. 
మన లోపాలను మనం తెలుసుకోవడం కన్నా పెద్ద చదువు లేదు.
విధి నిర్వాహణకు మించిన దేశసేవ లేదు.
విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది. 
మన ఉనికి ప్రేమను బలపరుస్తుంది. మన ఎడబాటు దానికి మరింత పదును పెడుతుంది.
నిజాయితీతోనే మన జీవితం నిలబడుతుంది, అవినీతికి దిగినప్పుడే మన పతనం ప్రాంభమవుతుంది.
విశ్రాంతి అనేది మంచి విషయమే. కాని విసుగు దానికి సోదరుడు కారాదు.
ఇతరులు చెప్పిన దాన్ని ఆచరించడంలోనో, వారిని అనుకరించడంలోనో కాదు. మనం సరైనదని నమ్మిన పని చేయడంలోనే నిజమైన సంతోషం, మనఃశాంతి ఉన్నాయి.
రేపే చనిపోతున్నట్లు జీవించు, శాశ్వతంగా బ్రతికి ఉండేలా భావించి నేర్చుకో.
ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు పూర్తికానట్లే.
ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటం ఎలాగో నేర్పాలంటే మాత్రం కొన్నేళ్లు పడుతుంది.
మనకు సహాయం చేసుకోవడానికై ఇతరులను దోచుకోవడానికి బదులు, ఇతరులకు సహాయం చేయాడనికై మనలను మనం దోచుకోగలిగితే,మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే..
మెదడు, సముద్రం  రెండూ నిరంతరం అలజడిని కలిగిస్తూనే ఉంటాయి.
సత్యం, స్వచ్చత, స్వార్ధ రహిత ఆలోచనలను కలిగినవారు దేనికీ భయపడాలిసిన అవసరం లేదు.
అణిచి పెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే శక్తి సాధ్యం.
సుగుణం అనేది జీవితపు సౌందర్యం.
చిత్తశుద్ధితో ఒక పని మీద దృష్టి కేంద్రికరించ గలిగిన మానవుడు చివరకు దేన్నైనా సాధించగల శక్తిని సంపాదిస్తాడు.
సత్యం,ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది.
మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే నూతన చరిత్రను సృష్టించగలగాలి.
మన దేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించినా దాని ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి.
సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాం. అది ఆశాంతికి దారి తీస్తుంది. 
దేవుడు తనకు తోడుగా నున్నాడని భావించే వాడికి ఎన్నటికీ అపజయం ఉండదు.
కాలం వృధా చేయకు, ఎందుకంటే క్రమశిక్షణాయుత జీవితంలో కాలమే ధనం.
భయం శారీరకమైన జబ్బులా మారి  ఆత్మను చంపేస్తుంది.
కష్టాలను తప్పించుకొనే  వారికంటే వాటిని అధిగామించేవారే విజయం సాధించగలరు. 
ఆశ మానవుణ్ణీ గొప్పవాణ్ణి చేస్తుంది. దురాశ మానవుణ్ణి నీచుణ్ణి చేస్తుంది.
ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ,స్వచ్చత లేకుండా సాకారమైతే అపరాధభావానికి గురిచేస్తుంది.
మేధావులందరి కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
మనుష్యులలో తప్పొప్పులు చూస్తూవుంటే ఒకరోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు. 
ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది.
మోకరిల్లి బతకడం కన్నా,మన కాళ్లపై మనం నిలబడి మరణించడమే మేలు.  
ఇతరులకి ఉపయోగపడటం,అబద్దాలాడకుండటం, ధర్మాన్ని ఆచరించడం,ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకుండా ఉండటం, దయ కలిగి ఉండటం ,సిగ్గు పడవలిసిన పని ఏదీ చెయ్యకుండా ఉండటమే శీలం.
ఉక్కు మనిషి ఎవడో, ఊకమూట  ఎవడో కష్ట కాలమందే స్పష్టపడును.
ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులు హరించుకుపోతాయి.
చిన్న విషయాలు కదా అని అలక్ష్యం చూపకు. ధృడనిశ్చయం  అనేది అక్కడే నిద్రావస్థలో వున్నది.
మహోన్నతమైన ఆలోచనలన్ని మెదడు నుంచి కాకుండా హృదయంలోంచి పుట్టుకొస్తాయి.
చీకట్లో అడుగువేయడానికి ఎప్పుడూ భయపడొద్దు. అలాగే సుగమమైన మార్గం కోసం కూడా అన్వేషించవద్దు. నీకు కనిపించిన దారిలో నీ మనసు మాట వింటూ వెళ్లిపోవడమే!
ఆదర్శమంటూ లేని మనిషి తెడ్డులేని నావ లాంటివాడు.
యుద్ధం అనేది అనాగరికులు చేసే వ్యాపారం.
 అవకాశాన్ని సృష్తించుకోలేనప్పుడు ఎంత సమర్ధత ఉన్నా నిష్ప్రయోజనమే.
అలుపెరుగని పోరాట యోధునిదే అంతిమ విజయం.
 ప్రశ్న ప్రగతికి మూలం.
హింసాత్మక పోకడలతో సాధించిన విజయం ఓటమితో సమానం.



ఉత్సాహం, తాపత్రయం, తపన, పట్టుదల, దీక్ష ఉన్న వారికి విజయం పాదాక్రాంతమవుతుంది.

నేను సాధించిన విజయాలన్నీ అమ్మ నేర్పించిన విద్య నుంచి నేర్చుకున్నవే.
మెదడు ఎంత అద్భుతమైనది అంటే,అది ఆకాశం కంటే విసృ్తతమైనది.
తీసుకున్నదాన్ని బట్టి కాదు, ఇచ్చే దాన్ని బట్టి ఈ ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది.
కొత్త ఆలోచనలు చేయడానికి మందు పాత ఆలోచనలను వదులుకోవాలి.
నువ్వు చేసేది వివరంగా చెప్పలేకపోతే నువ్వేమి చేస్తున్నవో నీకే తెలియదని అర్ధం.
అవసరం అనేది ఎటువంటి మూర్ఖుణ్ణి అయినా వివేకవంతుణ్ణి చేస్తుంది.
పొదుపు అనేది  అన్నింటికన్నా మంచి ఆదాయం.

గొప్ప కవిత్వం యొక్క ప్రధాన లక్షణమేమిటంటే  ఎవరి తాహత్తును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతి కలిగించడం.
తుపాకీతో ఉన్న పురుషుని చేతిలోకంటే కత్తితో ఉన్న స్త్రీ చేతిలో చావడం ఉత్తమం.
పరుల కోసం చేసిన ఎంత చిన్న పనైనా అది మనలోని అంతర్‌శ్శక్తిని మేల్కొలుపుతుంది.
మానవ మూలధర్మం ఓడిపోయింది. అక్కడ పోరాటపటిమ లేదు, నాయకులు లంచగొండులు, ఒకమాటలో, అక్కడ చేయడానికి ఏమీలేదు.
ఏదన్నా సరే ప్రపంచంలో అర్థం కావాలంటే, సానుభూతితో దానిలో ఐక్యమై ఆ దృష్టి తో యోచించాలి
చెడ్డవారితో గడపడం కంటే ఒంటరిగా ఉండడమే మేలు
జీవించి ఉన్న మానవత్వం యొక్క ప్రేమ సేవచేసే చర్యల ఉదాహరణలుగా మారడానికి ప్రతిరోజూ పోరాడాలి, ఆవిధంగా ఒక చైతన్య శక్తిగా మారాలి.
మనం ప్రత్యేకమైన వ్యక్తులను తలచుకుంటూ ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరికి ప్రత్యేకమేనన్న వాస్తవాన్ని మరిచిపోతుంటాం.

ఒంటరిగా మరియు నిరాశగా ఉన్న ప్రజలమధ్య అత్యున్నతమైన మానవఐక్యత మరియు విశ్వాసం పెంపొందుతుంది.
అందరూ కలవడం శుభారంభం, కలిసి ఉండడం అభ్యుదయం, కలిసి పని చెయ్యడం విజయం.
మనతో ఏకిభవించే వాళ్లతో సౌఖ్యంగా ఉండగలం కాని ఏకిభవించని వాళ్ల వల్లే ఎదుగుతాము.
రోగికి చికిత్స మాత్రమే సరిపోదు, శుశ్రూష  కూడా అత్యవసరం.
నువ్వు నిజాయితీగా వుండి మంచి మానవ సంబంధాలు కొనసాగించినపుడే జీవితం ఆనందంగా ఉంటుంది.
జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం.
సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి.
వైఫల్యం అంటే...ప్రయత్నాన్ని మరింత సమర్ధంగా మొదలు పెట్టడానికి ఓ మంచి అవకాశం
తప్పును వెదకకు, ఆ తప్పును మాన్పే మందును వెదుకు. 
మనసు మారకుండా ఆత్మ అభివృద్ధి చెందకుండా ప్రపంచం అంటే అర్థం కాకుండానే ఏవో కొన్ని కర్మల వల్లా..
విద్య యొక్క అత్యధిక ఫలితం ఓర్పు.
మతమంటే మనసుకి కలిగే గొప్ప సందేహాలు తీర్చాలి , మన జీవనానికి నమ్మకానికి సమన్వయము కుదిరించాలి.లోకంలో కొత్త సమస్యలు బయలు దేరితే వాటిని అర్థం చెయ్యాలి. నుతనోస్థం ఇవ్వాలి జీవించడానికి.
విజయానికి సామర్ధ్యంతో పాటు..సానుకూల ధోరణి కూడా ముఖ్యమే.
తపన, పట్టుదల ఉన్న వారి దగ్గరికే విజయం వస్తుంది